13/10/2026
గౌరవనీయులైన ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులందరికీ నమస్కారం. 🙏
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గారి తరఫున, స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీలో భాగస్వాములైన మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు మరియు స్వాగతం.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అందరి భాగస్వామ్యం, సమన్వయం ఎంతో కీలకం. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, సమర్థవంతమైన అభ్యర్థుల ఎంపికలో మీరందరూ ముఖ్యమైన పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నాము.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల దరఖాస్తుల ప్రక్రియను మూడు దశలుగా విభజించడం జరిగింది.
*ఫేజ్ - 1: పట్టణ స్థానిక సంస్థలు
*మున్సిపల్ కార్పొరేషన్:
* మేయర్
* డిప్యూటీ మేయర్
* కార్పొరేటర్లు
* స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్
* స్టాండింగ్ కమిటీ సభ్యులు
*మున్సిపాలిటీ:
* చైర్‌పర్సన్
* వైస్ చైర్‌పర్సన్
* కౌన్సిలర్లు
*నగర పంచాయతీ:
* చైర్‌పర్సన్
* వైస్ చైర్‌పర్సన్
* కౌన్సిలర్లు
*ఫేజ్ - 2: మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు
* ఎంపీటీసీ (MPTC)
* జెడ్పీటీసీ (ZPTC)
*ఫేజ్ - 3: గ్రామ పంచాయతీ ఎన్నికలు
* గ్రామ సర్పంచ్
* వార్డు సభ్యులు
దరఖాస్తు లింక్: jsplocalbodyelections.com
ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు తమ పరిధిలోని ఆయా పదవులకు పోటీ చేయాలనుకునే ఆశావహుల వివరాలను సేకరించి, వారి తరఫున దరఖాస్తులను పై లింక్ ద్వారా నమోదు చేయవలసిందిగా కోరుతున్నాము.
సమర్పించిన ప్రతి దరఖాస్తును జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలిస్తారు. అభ్యర్థుల తుది ఎంపిక అధ్యక్షుల వారి నిర్ణయం మేరకు జరుగుతుంది.
పార్టీ విజయమే లక్ష్యంగా, ప్రతి స్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాము.
ఇట్లు,
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం