12/05/2024
ఓటమి అంచుల్లో ఉన్నా వైసీపీకి బుద్ధి రాలేదు. ఇంకా ఫేక్ వీడియోలు, ఆడియోలు, పోస్టులతో జనాన్ని మోసం చేయాలనే చూస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డీప్ ఫేక్ ఆడియోలు, ఫేక్ లెటర్లు సృష్టింస్తున్నారు. ప్రజలెవరూ ఈ ఫేక్ ప్రచారాలను నమ్మకండి. కుట్రలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు, ఎన్నికల అధికారులు తక్షణం కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి.
16/04/2024
సంతమాగులూరు మండలంలోని, నెహ్రూ నగర్ నందు ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ గారికి మద్దతుగా తనయుడు హర్షవర్ధన్ సూపర్ సిక్స్ పధకాలను వివరిస్తూ ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
15/04/2024
సంతమాగులూరు మండలం, సజ్జాపురం గ్రామంలో గొట్టిపాటి రవికుమార్ గారికి మద్దతుగా స్థానిక నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన గొట్టిపాటి హర్ష వర్ధన్...
08/04/2024
ఎన్నికల ప్రచారంలో భాగంగా సంతమాగులూరు మండలం పరిటాలవారిపాలెం గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారి తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ బాబు..
08/04/2024
సంతమాగులూరు మం 07.04.2024:- సంతమాగులూరు గ్రామంలో తెదేపా బాపట్ల పార్లమెంటు అభ్యర్థి టి కృష్ణ ప్రసాద్ గారితో కలిసి ఉమ్మడి కూటమి అద్దంకి నియోజకవర్గ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ గారు 9వరోజు ఇంటింటా ప్రచారం నిర్వహించారు, ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి సూపర్-6 పథకాలతో ముద్రించిన కరపత్రాలు పంచారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తాగు నీరు, డ్రైనేజీ, రోడ్లు తదితరాలను వారు ఆయన దృష్టికి తెచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓట్లేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.సీఎం జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా సార్వత్రిక ఎన్నికల తర్వాత చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని అన్నారు.
03/04/2024
జై పంగులూరు మండలం బుధవాడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శాసన సభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారు తెలుగుదేశం ప్రభుత్వం ఆధికారంలో వచ్చాక చెప్పటపోయె అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరించి కర్రపత్రాలు అందించిన ఎమ్మెల్యే గారు
Gottipati Ravikumar గారు.
03/04/2024
దళితుల ఓట్లతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి -అదే దళితులపై దమనకాండ.- గొట్టిపాటి హర్షవర్ధన్
సంతమాగులూరు మండలం 02.04.2024:- గురిజేపల్లి గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ మద్దతుగా తనయుడు గొట్టిపాటి హర్షవర్ధన్ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈసందర్భంగా మాట్లాడుతూ నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ ల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకై వారికి కేటాయించిన నిధులను మళ్లించకుండా కేవలం వారికే ఉపయోగపడే విధంగా రూపొందించిన చట్టాలను తెదేపా తూచా తప్పకుండా అమలు చేసిందని నేటి వైసిపి ప్రభుత్వం ఇతర పధకాలకు మళ్ళించిందని.తెదేపా హయాంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఇతర దేశాలలో విద్యను అభ్యసించేందుకు డా|బి అంబేద్కర్ విదేశీ విద్య పధకాన్ని అమలు చేస్తే, వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే డా|బిఆర్ అంబేద్కర్ గారి పేరును జగనన్న విదేశీ విద్యగా మార్చడం బలహీన వర్గాలపై జగన్ రెడ్డి కపట ప్రేమ కాదా అని ప్రశ్నించారు,దళితుల హక్కుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందని..... అంబేడ్కర్ ఆశయాలను తుంగలో తొక్కుతున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ప్రతి ఒక్క దళిత సోదరుడు సిద్దం అవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశంపార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
02/04/2024
పెన్షన్లు ఇవ్వడానికి డబ్బుల్లేక నంగాకబుర్లు ఆడుతున్నాడు జగన్ మామయ్య