23/09/2026
*పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అండగా 33 మందికి రూ.17,10,294 లక్షల సీఎం సహాయనిధి పంపిణీ చేసిన టిడిపి సీనియర్ నాయకులు Konka Umapathi Naidu అన్నగారు*
*ఈరోజు ఆదోని నియోజవర్గ ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు Meenakshi Naidu konka అన్న గారి ఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్నగారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాధితులకు పంపిణీ చేయడం జరిగింది. మాన్య శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తూ అందిస్తున్న సీఎం సహాయనిధిలో 33 మంది లబ్ధిదారులకు రూ.17,10,294/- విలువైన చెక్కులను పంపిణీ చేశారు.*
*ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు,రాష్ట్ర భవిష్యత్తు నాయకులు, మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు పేద ప్రజలను సొంత కుటుంబ సభ్యులుగా భావించి, ఆపద సమయంలో అండగా నిలిచేలా సీఎం సహాయనిధిని అందిస్తున్నారు.*
*ఇప్పటివరకు 1064 మంది లబ్ధిదారులకు సుమారు రూ.3 కోట్ల మేర CMRF ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరిగింది.*
*మన నియోజకవర్గంలో ఏ కుటుంబానికైనా అనారోగ్య సమస్య వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే సమస్యను నా దృష్టికి తీసుకురండి. మీకు వీలైనంత వరకు, ప్రభుత్వ సహాయాన్ని అందేలా చేసి ప్రతి కుటుంబానికి అండగా నిలబడేందుకు నేను ఎప్పుడూ ముందుంటాను” అని తెలిపారు.*
*సీఎం సహాయనిధి ద్వారా తమ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించిన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి, తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహాయం అందేలా కృషి చేసిన ఆదోని నియోజకవర్గం నియోజవర్గ ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు అన్నగారు లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.*
*ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జిందే శంకర్, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, మండల అధ్యక్షులు శివప్ప, శ్రీనివాస్ ఆచారి, బాలాజీ, ఐ సి రామకృష్ణ, సదుల్లా, అంజనమ్మ, తదితరులు పాల్గొన్నారు.*
Nara Chandrababu Naidu Nara Lokesh Telugu Desam Party (TDP) Dr.Nimmala Rama Naidu Tgv bharath Siddartha Naidu Konka TDP Adoni పసుపుదళం Adoni Team Konka