Team JanaSena Adoni

Team JanaSena Adoni

Share

ఎలుగెత్తు,ఎదిరించు,ఎన్నుకో...

15/10/2025

✨ “స్వాగతం – సుస్వాగతం” ✨



🇮🇳 భారతదేశ 150 కోట్ల జనాభా ఆశాసనం…
ప్రపంచ దేశ నాయకులందరిలో తనదైన ప్రత్యేక శైలిలో దేశాన్ని 🌏 ప్రపంచ పటంలో సురక్ష దేశంగా నిలబెట్టిన యుగపురుషుడు, ప్రపంచ దేశాలతో అభివృద్ధిలో పోటీ పడుతూ “మేమేం తక్కువ కాదు” అన్న ధైర్యంతో పరిపాలన కొనసాగిస్తున్న ప్రజా నాయకుడు — మన దేశ గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారు 🙏💪

ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రాయలసీమకు ముఖద్వారం అయిన కర్నూలు జిల్లాలో 🚩 అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంగా…
Adoni Janasena హృదయపూర్వకంగా
✨ “స్వాగతం – సుస్వాగతం” ✨ చెబుతుంది 🙌💐

Mallikarjuna Nyayakar Pawan Kalyan JanaSena Party
🇮🇳🔥
#మల్లప్పన్న_జనసైన్యం #జనసైనికులు

15/10/2025
15/10/2025

భారత దేశ “మిసైల్ మాన్”
A. P. J. Abdul Kalam గారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకుంటూ 🙏
విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక రంగం, జాతీయ అభివృద్ధి పట్ల ఆయన చూపిన అచంచలమైన నిబద్ధత అనేక తరాలను ప్రేరేపిస్తోంది.
భారత అంతరిక్ష, రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసిన శాస్త్రవేత్తగా… యువతలో దేశ సేవా స్పూర్తిని రగిలించిన మహానుభావుడు. 🇮🇳
— Team JanaSena Adoni

#మిసైల్‌మాన్‌ఆఫ్‌ఇండియా #ప్రేరణ #భారతగర్వం
#మల్లప్పన్న_జనసైన్యం #జనసైనికులు || ll

Photos from JanaSena Party's post 14/10/2025
Photos from Team JanaSena Adoni's post 14/10/2025

ఈ నెల 16న గౌరవ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి కర్నూలు పర్యటనను పురస్కరించుకొని ఆదోని నియోజకవర్గంలో కూటమి ముఖ్య నాయకులు డా. Dr. Parthasarathi (ఆదోని MLA), Telugu Desam Party (TDP) ఆదోని ఇంచార్జి గారు మరియు ఆదోని JanaSena Party ఇంచార్జ్ Mallikarjuna Nyayakar గార్లతో సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో జన సమీకరణ, రవాణా సదుపాయాలు, భోజన వసతి వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ప్రధానమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు కూటమి నాయకులు సమన్వయంతో పని చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రధాన నాయకులు పాల్గొన్నారు.











Photos from Team JanaSena Adoni's post 13/10/2025

భారతదేశ గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ Nara Chandrababu Naidu గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారు కర్నూల్ జిల్లా పర్యటనకు రానున్న శుభ సందర్భంగా, జిల్లా వ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో సభ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా సందర్శించి పరిశీలించిన ఆదోని JanaSena Party ఇంచార్జ్ Mallikarjuna Nyayakar గారు — అధికారుల నుండి వివరాలు తెలుసుకొని, సభ విజయవంతం కావడానికి అవసరమైన సూచనలు చేశారు.

🇮🇳


✡️
#జనసేన_ఆదోని
#మల్లప్పన్న_జనసైన్యం #జనసైనికులు

11/10/2025

మన ప్రియతమ దేశ ప్రధాన మంత్రి
గౌరవనీయులు శ్రీ Narendra Modi గారు ఈ నెల 16వ తేదీ (గురువారం) Kurnool కు విచ్చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే 🇮🇳

ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu గారు మరియు మన జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ
Pawan Kalyan గారు కూడా పాల్గొననున్నారు 💪🔥

ఆదోని నియోజకవర్గం నుండి జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున సభకు హాజరయ్యే విధంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయబడినాయి 🚌

👉 ప్రతి గ్రామం, ప్రతి వార్డులోని జనసేన కార్యకర్తలకు ఈ సమాచారాన్ని చేరవేసి
👉 భారీ ఎత్తున తరలి వెళ్లి
👉 సభను ఘనవిజయవంతం చేద్దాం 💥

జనసేన గళం కర్నూల్ లో ఘనంగా మార్మోగాలి : Mallikarjuna Nyayakar
Adoni JanaSena Party Incharge..✊

08/10/2025

🛑 ఆదోనిలో రైతుల సబ్సిడీ భోజన పథకం ప్రారంభోత్సవంపై జనసేన పార్టీ తీవ్ర ఖండన

ఈరోజు ఆదోనిలో నిర్వహించిన రైతుల సబ్సిడీ భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో, పోట్రోకాల్ ప్రకారం సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ఆదోని జనసేన పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు.

👉 ముఖ్యంగా కార్యక్రమానికి జనసేన పార్టీకి చెందిన డైరెక్టర్లకు సమాచారం ఇవ్వకపోవడం…
👉 ఆదోని JanaSena Party ఇంచార్జ్ Mallikarjuna Nyayakar గారి ఫోటోను అధికారిక బ్యానర్లలో ఉంచకపోవడం…
👉 మార్కెట్ యార్డ్ డైరెక్టర్లను పక్కన పెట్టి కార్యక్రమం జరపడం…

ఈ చర్యలను ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారి వైఖరిగా పరిగణించి, ఆదోని జనసేన పార్టీ నాయకులు M Puliraju Raju గారు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గారు తీవ్రంగా ఖండించారు.

⚠️ “ప్రజా ప్రతినిధులను అవమానించే ఈ తరహా నిర్ణయాలను ఇక భవిష్యత్తులో సహించం” అంటూ హెచ్చరించారు.
📢 “రైతుల కార్యక్రమం రాజకీయ పక్షపాతం లేకుండా జరగాలి. పోట్రోకాల్‌కి గౌరవం ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు.
Pawan Kalyan Nadendla Manohar Naga Babu JanaSena Shatagni

07/10/2025

🌼 ప్రజలందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు 🌼

ఆదికావ్యం రామాయణ మహాగ్రంథాన్ని రచించి, యుగయుగాల పాటు శ్రీరామచంద్రుని దివ్య చరిత్రను మనకు అందించిన మహనీయుడు ఆదికవి వాల్మీకి మహర్షి గారికి వందనాలు.

ఈ పావన సందర్భంలో ఆయన చెప్పిన ధర్మం – సత్యం – సేవా మార్గంలను మన జీవితాల్లో ఆచరణలో పెట్టుకుందాం.

— Team JanaSena Adoni


🙏
🕉️

Want your business to be the top-listed Government Service in Adoni?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Skd Colony
Adoni
518301