మన గోదావరి రుచులు 😋😋😍😍
Credits: East Godavari
C/o Rajahmundry
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from C/o Rajahmundry, Eastgodavari, Alamuru.
06/08/2022
రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ నిర్వహిస్తున్న "ఆజాది కా అమ్రిత్ మహోత్సవం" సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా 3వ రోజు ఉదయం మొదలైన మోనో యాక్షన్, మూకీ మరియు నాటకాలలో సుమారు 200 కు పైగా విద్యార్థులు మరియు నగర ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
పోస్ట్ : రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్
05/08/2022
మన రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ వారు " ఆజాదీ కా అమృట్ మహోత్సవ్ " కార్యక్రమం లో భాగం గా ఆనం కళాకేంద్రం ఆవరణలో ప్రజలకోసం అనేక స్టాల్స్, సెల్ఫీ పాయింట్స్, సంతకాల సేకరణ, హ్యాండ్ పెయింట్ క్యాంపైన్, పిల్లలకోసం అనేక రకాల ఆటలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలు సందర్శకులను విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. ప్రజలందరిని కుటుంబ సమేతం గా విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయవలసినదిగా నగర పాలక సంస్థ వారు కోరుచున్నారు.
పోస్ట్ : రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్
12/11/2021
09/11/2021
వీధుల్లో
పండ్లు అమ్ముకునే వ్యక్తిని వరించిన #పద్మశ్రీ అవార్డు..
#మంగళూరు సమీపంలోని #హరెకాళ అనే గ్రామానికి చెందిన 65 ఏళ్ళ #హాజప్ప అనే వ్యక్తి ప్రతిరోజూ తన గ్రామం నుంచి బత్తాయి పండ్లను తెచ్చి మంగళూరులో అమ్ముకుని తిరిగి సాయంకాలానికి ఇళ్ళు చేరుతారు..
ఈవిధంగా ఆయన గత 55 ఏళ్ళుగా చేస్తున్నారు. అంటే తన 10వ ఏట నుండి ఆయన ఇలా పండ్లు అమ్ముతున్నారు..
ఇంత అనుభవం ఉండడంతో ఆయన పండ్ల వ్యాపారంలో తనకు వచ్చే ఆదాయాన్ని వెచ్చించి వారి గ్రామంలో ఒక పాఠశాల నిర్మించి, ఉపాధ్యాయులను కూడా తన ఖర్చుతోనే ఏర్పాటుచేసి పేద పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు..
ఎందుకంటే తనకు చదువుకోవాలని కోరిక ఉన్నా పేదరికం కారణంగా చదువుకోలేకపోయాడు. పేదరికం కారణంగా 10వ ఏట నుంచే ఆయన పండ్లు అమ్మి కుటుంబాన్ని పోషించవలసి వచ్చింది..
తనలాగా పేదవాళ్ళు చదువులేనివారిగా మిగిలిపోకూడదని ఆయన సంపాదించినదంతా స్కూలు కోసం ఖర్చుపెడుతున్నారు..
ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు #పద్మశ్రీ_2020 అవార్డు ప్రకటించింది.. నిన్న రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన తన అవార్డును రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నారు..
🙏🙏🙏🙏
Source: Asthram News
23/09/2021
కోవిడ్ ఆంక్షల తరువాత ప్రారంభానికి ఎదురు చూస్తున్న P. V. నరసింహారావు పార్క్ !
Pc: our rajamahendravaram
21/09/2021
మన రాజమండ్రి కి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ' #రత్నం_పెన్స్" ప్రస్తుత అధినేత శ్రీ కె వి రమణ మూర్తి గారు నిన్న సాయంత్రం స్వర్గస్తులయ్యారు.
రత్నం పెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికి కూడా ప్రపంచంలో 90% మంది పైగా దేశ అధినేతలు వాడే పెన్నులు సృష్టించిన కంపెనీ.
స్వతంత్ర సంగ్రామంలో గాంధీజీ పిలుపు మేరకు శ్రీ కోసూరి వెంకటరత్నం గారు మొట్టమొదటిగా ఈ యొక్క రత్నం పెన్స్ స్థాపించి స్వరాజ్య ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. వారి పెన్నులకు పరి తీరుకు ఆశ్చర్యపోయి, స్వయంగా గాంధీ గారే తన చేతివ్రాతతో ఈయనను అభినందిస్తూ లేఖ కూడా పంపడం జరిగింది. తర్వాత వీరి కుమారుడైన ప్రస్తుత అధినేత అయిన శ్రీ కె.వి రమణ గారు కూడా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రత్నం పెన్స్ ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లారు.
బాల్ పెన్ యుగం ప్రారంభమైన తర్వాత ఇంక్ పెన్స్ యొక్క వాడకం తగ్గి చాలా ఇంక్ పెన్నులు తయారు చేసే కంపెనీలు మూతపడ్డాయి, మరికొన్ని బాల్ పెన్స్ కంపెనీలు గా మారాయి. కానీ రత్నం పెన్స్ మట్టికి ఇప్పటికీ తన యొక్క ప్రభావాన్ని ఏమాత్రం కోల్పోకుండా ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఇది కేవలం ఇంక్ పెన్ యొక్క క్వాలిటీ లో రాజి పడకపోవడం వల్ల మరియు దేశం పై ఉన్న ప్రేమ వల్ల మాత్రమే సాధ్యం అయ్యింది.
అంతటి అద్భుతమైన పెన్నులని ప్రపంచానికి అందజేసిన కోసూరి వెంకట రత్నం గారికి మరియు వారి కుమారులైన శ్రీ రమణ గారికి కృతజ్ఞతలు. రమణ గారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క భగవంతుడిని ప్రార్థిస్తూ.....
ఓం శాంతి...🙏🙏🙏
17/09/2021
Mana Devi Chowk at night...
Pc - Vijay Vamsee
02/09/2020
Good evening,..
16/02/2015
Gud mng.
02/02/2015
Gud evng..
Click here to claim your Sponsored Listing.
Location
Website
Address
Alamuru
533233
