10/10/2026
తానూర్ మండలంలోని కోలూరు, హంగిర్గ, హిపెనెల్లి గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభల్లో పాల్గొన్న సందర్భంగా పంజాబ్ ల్యాండ్స్ 22/ఏ నిషేధిత జాబితాలో భూములు ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టాదారులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకొని భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించిందని, అర్హులైన రైతులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఇటీవల నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో తానూర్ మండలంలోని సుమారు 2,500 ఎకరాల భూములకు సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొనడం జరిగింది ఈ భూములకు సంబంధించిన వివరాలు, పట్టాదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరినట్లు పంజాబ్ ల్యాండ్స్ 22/ఏ నిషేధిత జాబితాలో భూములు ఉండటంతో పట్టాదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ రికార్డుల పరిశీలన కీలకమని పేర్కొని రైతులు తమ భూములకు సంబంధించిన పట్టా పత్రాలు, పాత రెవెన్యూ రికార్డులు, ఇతర ఆధారాలను సంబంధిత అధికారులకు అందజేయాలని సమర్పించిన పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, భూముల వివరాలను ధ్రువీకరించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన పట్టాదారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని భూములకు సంబంధించిన సమస్యల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించి రైతులు కూడా తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించి, విచారణకు సహకరించాలని కోరడం జరిగింది. గ్రామాల అభివృద్ధిలో పొలం బాట రోడ్లు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాన రోడ్ల నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి రహదారుల అభివృద్ధి పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రజలకు ప్రయాణ ఇబ్బందులు తగ్గుతాయని అలాగే 27వ ప్యాకేజీ కింద చేపట్టే పనులు పూర్తయితే తానూర్ మండలంలోని గ్రామాల్లో వ్యవసాయ అభివృద్ధికి మరింత తోడ్పాటు లభిస్తుందని తెలియజేయడం జరిగింది