23/10/2026
•సీఎం చంద్రబాబు అధ్యక్షతన 22వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది
•రాష్ట్రంలో 100 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నవంబర్ 1న పోలింగ్ జరగనుంది. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు
•సీఎం చంద్రబాబు నివాసానికి గురువారం డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఎలాంటి భద్రతా సిబ్బంది, కాన్వాయ్ లేకుండా వచ్చిన ఆయన..సీఎంతో కీలక అంశాలపై చర్చించారు
•స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలో వైసీపీ నాయకులు సాగించిన అరాచకాలు, విధ్వంసాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు గురువారం టీడీపీ ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది
•శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, నామినేషన్ పత్రాలను చింపేసినా, పోలీసులపై దాడులకు పాల్పడినా ఎంతటివారినీ ఉపేక్షించేది లేదని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు