30/10/2026
•అర్నబ్ తుఫాన్ వల్ల రాష్ట్రానికి ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గురువారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు
•సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం వర్చువల్‌గా జరిగిన క్యాబినెట్ సమావేశంలో 45కు పైగా అంశాలపై చర్చించి, 48 కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు
•అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ రెండో విడత నిధులను శుక్రవారం విడుదల చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది
•స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఖరారు చేసిన అభ్యర్థులే పోటీలో ఉంటారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తు ధర్మాన్ని పాటించాలని, అభ్యర్థిని కాకుండా ఎన్డీఏను చూసి ఓటు వేయాలని కోరారు
•నవంబర్ 1న జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/k02Lr