11/07/2024
Birthday greetings to Hon’ble Union Minister and BJP National General Secretary Shri Bandi Sanjay Kumar garu 🎉🎉🎉.
My prayers for your good health and long life in service of the people. ⛳
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Telangana Future, Hyderabad.
11/07/2024
Birthday greetings to Hon’ble Union Minister and BJP National General Secretary Shri Bandi Sanjay Kumar garu 🎉🎉🎉.
My prayers for your good health and long life in service of the people. ⛳
07/07/2024
మన తెలంగాణ సంస్కృతికి, ఆచార సంప్రదాయాలను ప్రతీక..
ఊరూరా, వాడవాడలా అమ్మవార్లకు సమర్పించే కానుక.. బోనం..
అమ్మవార్ల దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ.. బోనాల పండుగ శుభాకాంక్షలు.
- Eatala Rajendar , ఎంపి - మల్కాజిగిరి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు
03/07/2024
న్యూ ఢిల్లీ : భారత రక్షణ శాఖ మంత్రివర్యులు శ్రీ
Rajnath Singh
గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
కంటోన్మెంట్ భూములు, ఉద్యోగుల విషయంపై చర్చించాను.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేస్తున్న నేపథ్యంలో పలు అంశాలను మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లాను.
దేశంలో ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డులను విలీనం చేస్తున్న నేపథ్యంలో.. పలు కీలక అంశాలపై స్పష్టత కోరారు.
ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న..
1. సివిల్ ఏరియాలను విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. సివిల్ ఏరియా అంటే.. 16 సివిల్ బజార్ లు మాత్రమేనా.. మిగతా ప్రాంతం కూడానా స్పష్టత ఇవ్వాలి.
2. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న ఉద్యోగుల విలీనం, పెన్షనర్లకు జీతాలు అందించే అంశంపై స్పష్టత కోరారు. (ఉద్యోగులందరినీ GHMC లోనే విలీనం చేయాలని విజ్ఞప్తి).
3. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పనిచేస్తున్న 125 మంది ఉద్యోగులు చనిపోయారు. 2011 నుంచి కారుణ్య నియామకాలు పెండింగులో ఉన్నాయి. విలీనానికి ముందే 125 మంది కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని కోరాను.
4. B3 భూములు : (బ్రిటిష్ ప్రభుత్వం 99 సంవత్సరాలు లీజుకు ఇచ్చిన లాండ్స్) ఈ ల్యాండ్స్ అన్నీ వేరే వారి చేతుల్లోకి వెళ్లాయి. ఈ భూముల భవిష్యత్తు తేల్చాలి అని కోరాను. హోల్డర్ ఆఫ్ అక్యూపెన్సి (HOR) రైట్స్ విషయంలో ఎలాంటి నిర్ణయాలుంటాయో స్పష్టత ఇవ్వాలని కోరాను.
5. A1 ల్యాండ్స్ (మిలటరీ అధికారిక భూములు) లో ఉన్న గుడిసెలు, సాయిబాబా హట్స్, 108 బజార్ హట్స్, నందమూరి నగర్, సెంట్రల్ బ్యాటరీ, తిరుమలగిరి, పికెట్ ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని ఉన్న వారి విషయంలో ఎలాంటి నిర్ణయం ఉంటుంది.
6. 16 సివిల్ బజార్ ఏరియాలలో నివాసముంటున్న 4500 కుటుంబాల లీగల్ హైర్స్, ఓనర్ షిప్ విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరాను.
7. 30 సంవత్సరాలుగా కంటోన్మెంట్ ఎంప్లాయ్ హౌసింగ్ సొసైటీ ఇల్లా స్థలాల కోసం పోరాడుతున్న.. హస్మత్ పేటలోని 28. 29 ఎకరాలు, తుర్కపల్లిలోని 13 ఎకరాల భూముల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని. కంటోన్మెంట్ ఎంప్లాయ్ హౌసింగ్ సొసైటీవారికే ఈ భూములు కేటాయించాలని కోరాను.
8. B4 భూములు భవితవ్యం తేల్చాలని కోరారు.
9. ఎవియేషన్ భూములలో నివాసం ఉంటున్న వారి విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరాను.
10. సెక్యూరిటీ ఇష్యూస్.
పై అంశాలను కేంద్ర రక్షణ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను.. వాటిపై స్పష్టత ఇవ్వాలని, ఏ ఒక్కరూ నష్టపోకుండా చూడాలని విజ్ఞప్తి చేశాను.
కంటోన్మెంట్ బోర్డు ఎంప్లాయిస్ యూనియన్ ఇచ్చిన వినతి పత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశాను.
పే స్కేలు, సర్వీస్ కండిషన్స్ విషయంలో కంటోన్మెంట్ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరాను.
కారుణ్య నియామకాల్లో 5 % పర్సెంట్ వెకన్సీ విధానం కాకుండా.. ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న 125 కంటోన్మెంట్ ఉద్యోగుల కుటుంబాలకు అందరికీ కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరాను. వీరిలో ఎక్కువమంది సఫాయి కర్మచారి పనులు చేసే వారున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన వారు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో సేవ చేసినవారు ఉన్నారు. ఎక్కువ మంది కొవిడ్ సమయంలో సేవలు అందించి చనిపోయారు కాబట్టి మానవతా కోణంలో ఆలోచన చేసి అందరికీ ఉద్యోగాలు కల్పించాలని..
విలీనం కాకముందే నిర్ణయం తీసుకోవాలని శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారిని విజ్ఞప్తి చేశాను.
ఈ సమావేశంలో కంటోన్మెంట్ బోర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ ఆకుల మహేందర్ గారు, ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి పరుశురాం గారు ఉన్నారు.
నాతో పాటు ఢిల్లీ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో బిజెపి నేతలు మురళీ యాదవ్ గారు, సురేందర్ రెడ్డి గారు, కంటోన్మెంట్ బోర్డ్ ఉద్యోగ సంఘం నేతలు మహేందర్ గారు, పరుశురాం గారు ఉన్నారు.
భారత్ న్యాయ సంహిత చట్టంలో మొట్టమొదటి క్రిమినల్ కేసు నమోదు అయిన
ఎమ్మెల్యేగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చరిత్ర సృష్టించాడు.
29/06/2024
తెలంగాణలో కూడా బీజేపీ , జనసేన కలసి పనిచేస్తాయి - ఏపీ డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan BJP Telangana ✅⛳
28/06/2024
నితిన్ గడ్కరీ గారితో ఈటల భేటీ:
Eatala Rajendar
ఢిల్లీ : కేంద్ర రోడ్డు, రవాణా మరియు రహదారుల శాఖ మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణలో ఉన్న పలు సమస్యలను వారికి వివరించడం జరిగింది.
అనంతరం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ :
కొంపల్లి ఫ్లై ఓవర్లు అండర్ పాస్..
నత్తనడక నడుస్తున్న ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్..
శామీర్ పేట రోడ్డు..
ఎల్.బీ నగర్ అండర్ పాస్..
హుజురాబాద్ రోడ్డు సమస్యలపై చర్చించాము.
హైదరాబాద్ లో నిర్మించేవి అన్ని అండర్ పాస్ లు కాకుండా ఫ్లై ఓవర్ లు నిర్మించాలని కోరాము.
హుజురాబాద్ లో సింగాపూర్, రాంపూర్, రంగాపూర్, పెద్దపాపాయపల్లి గ్రామాలలో రైతులకు ఇబ్బంది లేకుండా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయాలని కోరాము.
సమగ్రంగా మరో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ వారు ఇచ్చారు.
15/06/2024
Eatala Rajendar
schedule on 16th June 2024, Sunday.
BJP Telangana
10/06/2024
ప్రధాన మంత్రి శ్రీ Narendra Modi గారి నాయకత్వంలో కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కరీంనగర్ ఎంపి శ్రీ Bandi Sanjay Kumar గారిని ఎంపి శ్రీ Raghunandan Rao Madhavaneni గారితో కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. Eatala Rajendar
10/06/2024
కేంద్రమంత్రివర్యులు అమిత్ షా గారితో భేటీ అయిన ఈటల రాజేందర్ గారు.
కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారిగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
09/06/2024
హృదయ పూర్వక శుభాకాంక్షలు. Narendra Modi జీ 👑⛳