మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ MSFTS

మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ MSFTS

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ MSFTS, Tarnaka, Jamia Osmania, Hyderabad.

Photos from మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ MSFTS's post 08/10/2024

సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయకుండా ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా డీఎస్సీ నియామకాలు చేపట్టడానికి నిరసనగా ఓయూ లో MSF - TG ఆధ్వర్యంలో నిరహార దీక్ష చేపట్టడం జరిగింది,దీక్షను భగ్నం చేసి పోలీసుస్టేషన్ కి తరలించారు
ప్రధాన డిమాండ్:ఎస్సీ వర్గీకరణ తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి

మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్-తెలంగాణ

17/06/2022

1 Day to Go ....
Advance...
Happy Birthday Anna

11/04/2022

మహనీయుల జయంతి ఉత్సవాలలో భాగంగా.... *మహాత్మ జ్యోతిబాపూలే 196 వ జయంతి సందర్భంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్* ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ లో *2K RUN* నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు *మేడి పాపయ్య మాదిగ* గారు ,ఓయు వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ *రవీందర్ యాదవ్* హాజరయ్యారు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 2K రన్ ప్రారంభించారు..
వీరితోపాటు MSF రాష్ట్ర అధ్యక్షులు *కొల్లూరి వెంకట్* గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ *చందు వరిగడ్డి* గారు ముఖ్య అతిధులుగా పాల్గొని రన్ లో బాగస్థులైనారు. మరియు ఎంఎస్ఎఫ్ నాయకులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు..

10/04/2022

మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి -2K RUN
🔷 *ఆర్ట్స్ కాలేజ్ నుండి NCC గేట్ వరకు* *ఉ.6గం.లకు*- ఉస్మానియా యూనివర్సిటీ

మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాలలో భాగంగా గా రేపు *మహాత్మ జ్యోతిభా పూలే గారి జయంతి* సందర్భంగా *2K RUN ( ఆర్ట్స్ కాలేజ్ నుండిNCC గేట్ వరకు )* నిర్వహిస్తున్నాము.
ప్రొఫెసర్లు, మేధావులు, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము....

*కొల్లూరి వెంకట్*
రాష్ట్ర అధ్యక్షులు

*చందు వరిగడ్డి*
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్

*మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్, తెలంగాణ -(MSF-TS)*

Photos from మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ MSFTS's post 31/03/2022

*మహనీయులను స్మరించడం మా జన్మహక్కు*
*మహనీయుల ఆశయ సాధనయే మా లక్ష్యం*
-*MSF -TS*

ఏప్రిల్ మాసంలో జరిగే మహనీయులైన బహుజనులకు రాజ్యాధికారాన్ని అందించిన మాన్యశ్రీ కాన్సిరామ్ గారు,బడుగు బలహీనవర్గాలకు విద్యనందించిన పూలే, ఈ దేశానికి మొదటి ఉప ప్రధానిగా పనిచేసిన బాబు జగ్జివన్ రావు,భారత రాజ్యాంగం నిర్మాత,ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ల జన్మదినాలు జరపడం అంటే వారి చేసిన త్యాగాలను గుర్తుచేసుకుని వారి ఆశయ సాధనకోసం కృషి చేయడమే అని,వారిని స్మరించడం మా జన్మహక్కనీ MSF రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరి వెంకట్ మాదిగ అన్నారు
ఈరోజు ఉస్మానియ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద MSF ఓయు అధ్యక్షులు యల్.నాగరాజు ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాల కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ MSF రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరి వెంకట్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బడుగు బలహీన వర్గాలకు హక్కులను,వారికి అధికారాన్ని అందించి సమానత్వ సాధన కోసం కృషి చేసిన అంబేద్కర్,పూలే, కాన్షీరాం,బాబు జగ్జీవన్ రావు లాంటి మహనీయులను వల్లే మనం ఈరోజు ఇలా సమాజంలో భాగస్వాములై విద్య,ఉద్యోగ,ఆర్ధిక,రాజకీయ హక్కులు సాదిస్తున్నమని,ప్రజాస్వామ్య ఎన్నికల విధానంలో భాగస్వామ్యులు అయి పాలకులయ్యమని అన్నారు,వారే లేకుంటే మనం ఇంకా అభివృద్ధికి నోచుకోక అదోగతి పాలవుదుమని అని అన్నారు
మాదిగ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఏప్రిల్ మాసంలో జరిగే మహనీయుల జయంతి ఉత్సవాలను ఉస్మానియా యూనివర్సిటీ వేదికగ...

🔷డాక్టర్ బాబు జగ్జివన్ రామ్ గారి జయంతిన
ఏప్రిల్ 05 న అన్నదానం కార్యక్రమాన్ని,

🔷పూలే జయంతి ఏప్రిల్ 11న 2K Run ,

🔷డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న భీమ్ ర్యాలీ

దేశం లో ఉన్న ప్రతి ఒక్కరూ వీరి జయంతి ఉత్సవాలను ఘనంగా చేసుకోవాలని,అదేవిధంగా దళితులు,బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే కాకుండా అగ్ర వర్ణల్లో పేదలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహనీయుల జయంతి ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని అని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో MSF రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వరిగడ్డి చందు, కో ఆర్డినేటర్ చింతం తిరుపతి, ఉపాధ్యక్షులు శ్యాగంటి రాజేష్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలేశు,శ్రీకాంత్, ఓయు వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్,హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంపటి శ్రీకాంత్,ఓయు కార్యదర్శి రఘు,నాయకులు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు

Photos from మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ MSFTS's post 28/03/2022

*మహనీయులను స్మరించడం మా జన్మహక్కు*
- *వంగపల్లి*
ఏప్రిల్ మాసంలో జరిగే మహనీయులైన బహుజనుల రాజ్యాధికారాన్ని అందించిన కాన్సిరం,బడుగు బలహీనవర్గాలకు విద్యనందించిన పూలే,దేశం లో మొదటి ఉప ప్రధానిగా పనిచేసిన బాబు జగ్జివన్ రావు,భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ల జన్మదినాలు జరపడం అంటే వారి చేసిన త్యాగాలను గుర్తుచేసుకుని వారి ఆశయ సాధనకోసం కృషి చేయడమే అని,వారిని స్మరించడం మా జన్మహక్కని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ గారు పిలుపునిచ్చారు
ఈరోజు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మహనీయుల జయంతి ఉత్సవాల కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... బడుగు బలహీనవర్గాలకు వర్గాలకు హక్కులను,వారికి అధికారం అందించి సమానత్వ సాధన కోసం కృషి చేసిన అంబేద్కర్,పూలే, కాన్షీరాం,బాబు జగ్జీవన్ రావు లాంటి మహనీయులను వల్లే మనం ఈరోజు ఇలా సమాజంలో భాగస్వాములై విద్య,ఉద్యోగ,ఆర్ధిక,రాజకీయ హక్కులు సాదిస్తున్నమని అని అన్నారు,వారే లేకుంటే మనం అదోగతి పాలవుదుమని అని అన్నారు
మాదిగ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఏప్రిల్ మాసంలో జరిగే మహనీయుల జయంతి ఉత్సవాలను ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా పెద్దయెత్తున బాబు జగ్జివన్ రావు జయంతి ఏప్రిల్ 05 న అన్నదానం కార్యక్రమం,ఏప్రిల్ 11 పూలే జయంతి నాడు 2k Run, భారత రాజ్యాంగం నిర్మాత,ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న మహా ర్యాలీ నిర్వహించాలని అదేవిధంగా దళితులు,బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే కాకుండా అగ్ర వర్ణల్లో పేదలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహనీయుల జయంతి ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని అని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో MRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్యామ్ రావు, MSF రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరి వెంకట్,వర్కింగ్ ప్రెసిడెంట్ వరిగడ్డి చందు, రాష్ట్రకో ఆర్డినేటర్ చింతం తిరుపతి,వర్కింగ్ ప్రెసిడెంట్ వరిగడ్డి చందు,ఉపాధ్యక్షులు శ్యాగంటి రాజేష్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలేశు,శ్రీకాంత్,ఓయు అధ్యక్షులు యల్.నాగరాజు,హైదరాబాద్ అధ్యక్షులు కానుగంటీ సురేష్, ఓయు వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్,హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంపటి శ్రీకాంత్,ఓయు కార్యదర్శి రఘు,నాయకులు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు

15/03/2022

*బహుజన రాజ్య స్థాపన కై మాదిగల విద్యార్థులు సిద్దం కావాలి*
- *MSF- TS*
పెరియార్ రామస్వామి నాయకర్,నారాయణ గురు,పూలే అంబేద్కర్ ప్రబోధాలను రాజ్యాధికారం వైపు నడిపి దేశంలో అత్యధిక శాతం ఉన్న బహుజనులు ఎస్సీ, ఎస్టీ ,బిసి, మైనార్టీలకు రాజ్యాధికారాన్ని రుచి చూపించిన మాన్యశ్రీ కాన్షీరామ్ గారి 88 వ జయంతి కార్యక్రమాన్ని MSF ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు ఎల్ నాగరాజు అధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ లో ఘనంగ జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MSF రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ #చందువరిగడ్డి మాట్లాడుతూ... మాన్యశ్రీ కాన్షీరామ్ గారు ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేస్తున్నప్పటికీ కుల వివక్షతను ఎదుర్కున్నాడు అని అన్నారు, తర్వాత ఆయన అంబేద్కర్ గురించి, కులం గురించి దళితుల గురించి, దోపిడీ వ్యవస్థ గురించి పూర్తిగా అధ్యయనం చేసి దేశంలో అత్యధిక శాతం ఉన్న బహుజనులకు రాజ్యాధికారాన్ని అందిస్తేనే బహుజనులకు న్యాయం జరుగుదని నమ్మి రాజ్య స్థాపన కోసం నిరంతరం పనిచేశాడు,
ఈయన బహుజన సమాజ్ పార్టీ నిర్మాత, రామదాసియ సిక్కు కులస్తులైన తెల్సింఘ్,బిషన్ సింఘ్ కౌర్ లకు మార్చి 15,1934 లో పంజాబ్ రాష్ట్రంలో రోపర్జిల్లా కావస్ పూర్ గ్రామంలో జన్మించాడు, ఈయన జ్యోతిబా పూలే ఛత్రపతి సాహు మహారాజ్ నారాయణ గురు అంబేద్కర్ సిద్ధాంతాలను రాజ్యాధికారం వైపు మళ్లించి విజయం సాధించాడు,
తన 31 వ ఏటనే అంబేద్కర్ ప్రబోధించిన *కుల నిర్మూలన* ద్వారా ప్రేరేపితం అయ్యాడు
తన తల్లికి 30 పేజీల ఉత్తరం రాస్తూ *ఇకనుంచి నేను కుటుంబ బాంధవ్యాలను తెంచుకుంటున్నాను, నా కోసం మీరు వెతక వద్దు అంటూ బయటకు వెళ్లి చనిపోయేవరకు తిరిగి ఇంటికి వెళ్ళలేదు* 1984 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాడు బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించినాడు
*ఒక ఓటు ఒక నోటు నినాదంతో* ప్రజల దగ్గరకు వెళ్లి వారిచ్చే డబ్బులతోనే ప్రచారం చేశాడు కులాన్ని నిర్మూలిద్దాం బహుజన సమాజాన్ని నిర్మిద్దాం అంటూ దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాడు
*నువ్వు 85 శాతం ఉండగా 15 శాతం మీద ఎందుకు ఆధారపడతారు నడుము పార్లమెంట్కి, అసెంబ్లీకి నీ కాళ్ళ మీద నిలబడు అంటూ బహుజనులను ఉసిగొల్పాడు*
పంజాబ్ ,ఢిల్లీ హర్యానా, కాశ్మీర్, బీహార్ ,ఉత్తరప్రదేశ్ లో ఇతర కులాలను కలుపుకుని పార్టీని బలోపేతం చేసి మాయావతిని ముఖ్యమంత్రి ఏం చేశాడు ప్రారంభమైన 1984 లో ఏర్పడిన బిఎస్పి పార్టీ అనేది 1996నాటికి జాతీయ పార్టీగా ఎదిగింది,2006అక్టోబర్ 09న పరమదించాడు,అతను బ్రతినంతకాలం బహుజనుల కే రాజ్యాధికారం వుండాలని కోట్లాడిన కాన్సిరం గారి ఆశయాలను సాధించడానికి మాదిగ విద్యార్థులుమా సిద్దంగా వుండాలని పిలుపునిచ్చాడు
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ నాయకులు జోగు దశరథ్, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చాగంటి రాజేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలేష్ ,శ్రీకాంత్ ,ఆల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ జీవన్, హైదరాబాద్ అధ్యక్షులు సురేష్, ఓయు వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్, ప్రధాన కార్యదర్శి దశరథ, నాయకులు కార్తీక్, వెంకటేష్, దీప్తి గీత, సుహాసిని తదితరులు పాల్గొన్నారు

15/03/2022

మహనీయుల జయంతి ఉత్సవాలు....
- MSF-TS

మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా నేటి నుండి( 15 మార్చి ఏప్రిల్ 14 వరకు ) మహనీయుల జయంతి ఉత్సవ సంబరాలు....

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘం(MRPS-TS)....మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్(MSF-TS) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ లో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది..

🔷 *మార్చి 15న మాన్యశ్రీ కాన్షీరామ్ గారి జయంతి - పోస్టర్ ఆవిష్కరణ*

🔷 *ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి - 2kRun*

🔷 *ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతిబాపూలే జయంతి - అన్నదానం*

🔷 *ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి - *భీమ్ ర్యాలీ*

*మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్(MSF-TS) - రాష్ట్ర కమిటీ*

19/02/2022

ఓయూ తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ కాశీం సార్ కి అభినందనలు
-MSF-TS

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అధ్యక్షులుగా నియామితులు అయిన ప్రొఫెసర్ కాసిం సార్ గారికి అభినందనలు తెలిపి,సన్మానించిన మాదిగ విద్యార్ది సమాఖ్య.
కనీసం బస్సు సౌకర్యం లేని,ఎక్కడో మారుమూల అభివృద్ధికి నోచుకోని పాలమూరు జిల్లా మాదిగ పల్లెల్లో పుట్టి,తన బాల్యం నుండి కులవివక్షతను ఎదుర్కుంటూ అకుంఠిత కృషితో ఉన్నత విద్యావంతుడై నిజాం కాలేజీ తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెస్సర్ గా చేరి అనతి కాలంలోనే విద్యార్థుల అభిమానాన్ని చురగొన్నాడు,అంత మాత్రమే కాదు అనేక సామాజిక విద్యార్ది ఉద్యమాలకు సపోర్ట్ చేస్తూ దేశంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మొదటగా స్పందించే వ్యక్తి,సమాజం పై తనకున్న పూర్తి అవగాహనతో అబ్దుతమైన స్పీచ్ లతో సమాజాన్ని తన ప్రజలను చైతన్యం చేస్తున్న వ్యక్తి,తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పురుడు పోసిన,ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరి,తక్కువ కాలములోనే తెలుగు శాఖ అధ్యక్షులుగా నియమితులైనారు, నిరంతరం ప్రజలను,విద్యార్థులను చైతన్యం చేస్తూ నూతన సమాజం కోసం నిరంతరం మధన పడుతూనే,ఆ సమాజం కోసం విద్యార్థులకు మార్గ నిర్దేశకులు నిలుస్తున్న మేధావి, భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాము
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరి వెంకట్,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వరిగడ్డి చందు,ఉపాధ్యక్షులు శాగంటి రాజేష్,ఓయు నాయకులు ఎల్ నాగరాజు, కిరణ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కానుగంటి సురేష్, దశరథ్,గిరి తదితరులు పాల్గొన్నారు

17/01/2022

Johar.... Rohith Vemula✊✊

Photos from మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ MSFTS's post 21/10/2021

*గెల్లు గెలుపుకు సంపూర్ణ మద్దతు*
MSF-TS

హుజురాబాద్ ఉప ఎన్నిక టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బిసి బిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి.... ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షలు మేడి పాపన్న, వంగపల్లి శ్రీన్నన్న గారి ఆదేశాల మేరకు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్(MSF TS) నుండి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము...

మాదిగ విద్యార్థి సమైక్య రాష్ట్ర కమిటీ -తెలంగాణ(MSF-TS)

28/06/2021

మలిదశ దండోరా ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నాయకుడు, చేవెళ్ల ముద్దుబిడ్డ.... మేడి పాపన్న , వంగపల్లిన్న గార్ల లక్ష్య సాధనకై దండోరా జెండాను ఎత్తిన విద్యార్థి ఉద్యమ పోరుకెరటం....
మాదిగ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు #నర్సానిరమేష్ మాదిగ* కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు🎂🎂🎂💐💐💐

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address

Tarnaka, Jamia Osmania
Hyderabad
500007