Ramnath kampamalla

Ramnath kampamalla

Share

I am doing analysis on political, economical social issues as well as policies and burnig topics

I wanted to respond on all social and political issues and to awareness of citizens.

Photos from Ramnath kampamalla's post 07/03/2026

త్వరలో మూడో విడత SIR (Special Intensive Revision) ప్రక్రియ దేశంలోని 22 రాష్ట్రాల్లో మొదలు కాబోతుంది అనేటువంటి వార్తల నేపథ్యంలో.

గతంలో మొదట బీహార్ రాష్ట్రంలో తర్వాత రెండో విడత దేశంలోని 12 రాష్ట్రాల్లో SIR ప్రక్రియను ECI నిర్వహించడం మనందరికీ తెలిసిందే.

ఈ SIR ప్రక్రియ మొదలైనటువంటి రోజు నుంచి కూడా దేశంలో ఈ SIR ప్రాక్టీస్ పైన అనేక రకాల చర్చలు భిన్నభిప్రాయాలు వాదనలు చూస్తున్నాం వాటిని నేపథ్యంలో ఈ ప్రక్రియ గురించి నా కోణంలో మీ ముందుకు.

ఈ SIR ప్రక్రియ అనేటువంటిది దేశంలో ఇప్పటివరకు 1951 నుంచి 2024 ఎన్నికల వరకు దాదాపుగా 8సార్లు ఈ SIR ప్రక్రియను ECI(Election Commission of India )నిర్వహించడం జరిగింది
అనే సమాచారం చివరిసారిగా ఈ SIR ప్రక్రియ 2002 - 2004 మధ్యలో కూడా జరిగింది.

ఈ SIR ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకున్నటువంటి ఎలక్టరోల్ రోల్స్ రివిజన్ లేదా ఆడిట్ చేయడం. .

ఎలక్టరోల్ రోల్స్ లో ఉన్నటువంటి ఎంట్రీస్ అన్ని
ఖచ్చితమైనటువంటివా? లేక ఏమైనా లోపాలు ఉన్నాయా ? అనేటువంటి కోణంలో జరిగే ప్రక్రియనే ఈ SIR ప్రాక్టీస్.

దాదాపు దేశంలో ఇప్పటివరకు నిర్వహించినటువంటి ఈ SIR ప్రక్రియ ద్వారా 50 కోట్ల పైగా ఓటర్లు ఈ సార్ ప్రక్రియ లో ఆడిట్ జరిగింది వాటి నుంచి దాదాపుగా మూడున్నర కోట్ల వరకు ఓట్లను తొలగించారు అనేటువంటిది మనకున్నటువంటి సమాచారం(దాదాపు 7 శాతం).

ఆ తొలగించినటువంటి ఓట్లలో అనేక ఓట్లు డూప్లికేట్ ఓట్లు లేదా చనిపోయిన వారి ఓట్లు లేదా విదేశాల్లో ఉన్నటువంటి వారు లేదా ఇతర డాకుమెంట్స్ లేని కారణాల ద్వారా తొలగించడం జరుగుతున్నది.

ఏప్రిల్ నెలలో తమిళనాడు మరియు పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో జరగబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ మధ్యనే అక్కడ SIR ప్రక్రియ జరిగింది అక్కడ కూడా దాదాపుగా తమిళనాడులో 97 లక్షల ఓట్లు, పశ్చిమ బెంగాల్లో 63 లక్షల ఓట్లను ఈ ప్రక్రియ ద్వారా తొలగించడం మనందరికీ తెలిసిందే.

ఈ మూడో విడతలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ SIR ప్రక్రియ నిర్వహించబోతున్నారు దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.3 కోట్ల పైన ఓటర్లు ఉన్నారు.

ఈ SIR ప్రక్రియ ద్వారా దాదాపుగా ఎంత లేదనుకున్న ఒక 10% వరకు ఓట్లు తొలగించేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి అంచనాలు మనకు కనపడుతున్నాయి అంటే దాదాపుగా రెండు రాష్ట్రాల్లో కలిపి 70 లక్షల ఓట్ల పైననే తొలగించేటువంటి అవకాశాలు ఉన్నట్లు ఒక ప్రాథమిక అంచనాగా మనకు తెలుస్తుంది.

ఇంకా రాజకీయంగా ఈ SIR ప్రక్రియ పైన దేశంలో అనేక ఆరోపణలు అనేక విమర్శలు కూడా చూస్తున్నాం SIR ప్రక్రియకు మేము వ్యతిరేకం కాదు కానీ ఇంత తొందరగా SIR ప్రక్రియ చేపట్టాల్సినటువంటి అవసరం ఏముంది ?

ఈ ప్రక్రియ చాలా సున్నితంగామైంది కనుక
పారదర్శకంగా, ఒక క్రమ పద్ధతిలో జరగాలి
కానీ ఇంత హడావుడిగా చేయాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది? అంటూ ప్రధాన ప్రతిపక్ష అయినటువంటి కాంగ్రెస్ మరియు ఇతర విపక్షాలు మాట్లాడడం చూస్తున్నాం.

మరొకవైపు ఈ SIR ప్రక్రియ ద్వారా అనేకమంది అర్హులైనటువంటి ఓటర్లను కూడా తొలగించడం జరుగుతుంది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఈ ప్రాక్టీస్ లో మనకు బిఎల్వోలు మరియు బిఎల్ఏలు, ఈఆర్వోలు తర్వాత డిస్టిక్ ఎలక్ట్రిక్ ఆఫీసర్ మరియు రాష్ట్రా సీఈఓ లు ఇలా చాలామంది పర్యవేక్షణలో జరుగుతూంది.

ఈ SIR ప్రక్రియలో ముఖ్యంగా కీలకపాత్ర BLO లది అంటే ఈ బిఎల్ఓ ల ద్వారా మనకు EF (Enumeration Form ) ఇస్తారు ఆ ఫామ్స్ లో మనము మన గత సమాచారాన్ని ఫిల్ చేసి తిరిగి వాళ్లకి ఇవ్వడం వాళ్ల ద్వారా ఆడిట్ జరిగి కొత్తగా ఎలక్ట్రోరల్ రోల్స్ అనేవి ప్రిపేర్ చేయబడతాయి.

మొదట డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ రోల్స్ మనకు స్థానికంగా ఉన్నటువంటి ERO గారు మనకు అందుబాటులో ఉంచుతారు అందులో మనకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మనము పైన డిస్టిక్ ఆఫీసర్ కి అప్పీల్ చేయవచ్చు తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా అప్పీల్ చేయవచ్చు ఇలా ఈ ప్రాసెస్ ఉంటుంది.

ముఖ్యంగా ఇక్కడ BLO తో పాటు స్థానికంగా మనకు BLA లు కూడా ఉంటారు అంటే BLA అనేటువంటి వ్యక్తి రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇతను కూడా ఈ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ఏవైనా ఈ యొక్క SIR ప్రాక్టీస్ లో లోపాలు ఉంటే కచ్చితంగా ఈ BLA లు అధికారులును ప్రశ్నిస్తూ ఎలక్ట్రోరల్ రోల్స్ లో లోపాలు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత వీళ్లకు ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ BLO ,BLA ల సమన్వయం చాలా కీలకము అనేది నా భావన.

ఇంకా ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్లు కచ్చితంగా ఈ SIR ప్రాక్టీస్ జరిగేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా లేదా వాళ్ళ బంధువుల ద్వారా లేదా వాళ్ళ గ్రామస్తుల ద్వారా మన సమాచారాన్ని ఆ ఫామ్స్ లో నింపి ఆ ఫామ్స్ ను వాళ్లకు సరైన సమయంలో అందించాల్సి ఉంటుంది లేనియెడల కచ్చితంగా వాళ్ళు మనల్ని మైగ్రేటర్ ఓటర్ లేదా అందుబాటులో లేరని లేదా ఇతర కారణాలతో మన ఓటు తొలగించేటువంటి అవకాశాలుంటాయి కనుక ఈ SIR ప్రక్రియ మొదలైన తర్వాత కచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని తమ ఓటును కాపాడుకోవాలని మరియు కొత్త వారు నమోదు కూడా చేసుకోవాలి అని నా సూచన.

మనదేశంలో మొదటిసారి 1951 లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన రోజు మన దేశ జనాభా దాదాపుగా 36 కోట్లు మరియు ఓటర్ల సంఖ్య 17 కోట్లు ఉండేవి ఆ రోజుల్లో మన దేశంలో అక్షరాస్యత శాతం కేవలం 15 శాతమే అలాంటి సందర్భంలోనే ఎన్నికలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించినటువంటి నేపథ్యం మన సొంతం.

నేడు దాదాపుగా దేశంలో 96 కోట్ల మంది ఓటర్లు దేశ జనాభా 140 కోట్లు, ఎంతో సాంకేతికత అభివృద్ధి చెందింది మరియు అక్షరాస్యత 78 శాతం ఉన్నా కూడా ఎన్నికల నిర్వహణ పైన అనేక నీలి నీడలు అనేక అనుమానాలు వ్యక్తం చేయడం చూస్తున్నాం కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా ఆ కార్యక్రమాలను ఎంతో నిజాయితీగా మరియు నిబద్దత తో నిర్వహించాల్సి ఉంటుంది.


సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్నికల కమిషన్ పైన ఆరోపణలు నిత్యం చూస్తున్నాం ముఖ్యంగా 2024 ఎన్నికల ఫలితాలు తర్వాత ఈ అంశాలు తారాస్థాయికి చేరడం ఒకవైపు తెల్సిందే కాబట్టి ఎన్నికల కమిషన్ ఏ కార్యక్రమాలు తీసుకున్న వాటిని ఎంతో నిబద్ధతగా మరియు నిజాయితీగా చేయాలి అనేటువంటి చర్చ ఒకవైపు ఉంది కనుక ఇలాంటి సమయంలో SIR ప్రక్రియ చాలా కీలకము అనే భావన.

సాధారణంగా ఎవరైతే ఓటు హక్కు ఉంటుందో వాళ్ల పేరు ఖచ్చితంగా ఎలక్ట్రోరల్ రోల్స్ లో ఉంటేనే వాళ్ళు ఓటు హక్కుకు అర్హులు కనుక ఇలాంటి అంశాలు చాలా సున్నితమైనవి ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా కీలకం కాబట్టి ఈ ప్రక్రియ చాలా నిజాయితీగా జరగాలి మరియు ఇతర రాజకీయ పక్షాల నుంచి గాని సమాజం నుంచి ఏవైనా అనుమానాలు వచ్చినప్పుడు వాటిని కచ్చితంగా ECI ఆన్సర్ చేయాలి అన్నీ డాకుమెంట్స్ సరైన సమయంలో పబ్లిక్ డోమైన్ లో పెట్టాలి అనేది నా భావన.

వ్యవసాయంరంగంపై అంత నిర్లక్ష్యమా ? Analyst ramnath reacts On Union Budget 2026 | 99TV 02/02/2026

#99టీవీ మార్నింగ్ బిగ్ డిబేట్లో కేంద్ర బడ్జెట్ మీద నా భావన క్లుప్తంగా. .

వ్యవసాయంరంగంపై అంత నిర్లక్ష్యమా ? Analyst ramnath reacts On Union Budget 2026 | 99TV వ్యవసాయంరంగంపై అంత నిర్లక్ష్యమా ? బడ్జెట్‌ పై అనలిస్ట్ రియాక్షన్

Photos from Ramnath kampamalla's post 28/12/2025

కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ సందర్బంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీ దిగ్విజయ్ సింగ్ గారు చేసిన ట్విట్ మరియు పిక్ మీద రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా చర్చ..

బీజేపీ లో ఎవరైనా ఉన్నత స్థాయిలోకి రాగలరు అనే కోణంలో మోడీ గారు సామాన్య కార్యకర్తగా ఉన్ననాటి పిక్ జాతచేశారు. .(క్రింద చూడగలరు ).

RSS BJP సంస్థగతంగా చాలా బలంగా ఉంది అనే కోణంలో. .

చరిత్ర చెబుతున్న నిజం. .

RSS BJP సుదీర్ఘ ప్రయాణంలో వాళ్ళునమ్మిన సిద్ధాంతల ద్వారా ఒక వ్యవస్థ నిర్మించుకోవడంలో విజయం సాధించారు అనుకోవాలి. (రాజ్యాధికారం అనే లక్ష్య సాధనలో మెజారిటీ కోణంలో )

అదే స్థాయిలో సుదీర్ఘ చరిత్ర ఉన్నా కాంగ్రెస్ పార్టీ కూడ ఎందుకు అలాంటి బలమైన వ్యవస్థ నిర్మించుకోలేకపోయిందో ?ఎక్కడ లోపాలు ఉన్నాయో? ఇన్ని ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్నా ఆయనకు తెలియనిందా?

డిగ్గి రాజా. .కు అన్నీ తెలుసు..

ఇలా బహిరంగంగా చర్చకు పెట్టడం అంటే. .

లోగుట్టు ఏంటో? ? అనే చర్చ మరోవైపు. .

కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కనుక ఇలా ఓపెన్ గా మాట్లాడగలరు అనే కోణంలో చూడలా? లేక పూర్తిస్థాయిలో కాంగ్రెస్లో కూడా బలమైన వ్యవస్థ నిర్మాణం సమంతరంగా జరగాలి అనే సూచన?

నిర్మాణంత్మక చర్చలు సంఘర్షణ జరగాలి అప్పుడే మంచి విధానాలు వస్తాయి అనేది నిజం అది ప్రభుత్వమైన లేదా పార్టియినా? ?

ఈ చర్చ కూడా మంచిదే అనేది నా భావన. .

Photos from Ramnath kampamalla's post 20/12/2025

ఈరోజు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చవాన్ గారు VB G RAM G చట్టం మీద రాసిన కథనం పత్రికలో చదివిన అనంతరం నా ఆలోచనలు. .

పార్లమెంట్లో మరియు పార్లమెంటు బయట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి ఏ స్థాయిలో చర్చలు జరిగాయో మనందరికీ తెల్సిందే.

ఎవరు ఎలాంటి గందరగోళాలు చేసిన ఎవరు ఎలాంటి అభ్యంతరాలు చెప్పినా ఎవరికైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళు అనుకున్న విధంగా బిల్లులు పాస్ అవుతూ అవి చట్టాలుగా మారడం అనేటువంటిది మనకు ఉన్నా పార్లమెంటరీ ప్రక్రియ..

స్తులంగా విపక్ష సభ్యుల అభిప్రాయాలు ఇలా..

మహాత్మా గాంధీ పేరు తొలగింపు: పథకం నుండి గాంధీ పేరు తీసేయడం ఆయన వారసత్వానికి అవమానం అని ప్రతిపక్షం విమర్శించింది.

MGNREGA రద్దు: ఈ బిల్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) “చంపేస్తుంది” అని అన్నారు.

రాష్ట్రాలపై ఆర్థిక భారము: కొత్త చట్టం వల్ల ఖర్చు బాధ్యత రాష్ట్రాలపై పడుతుందని, కేంద్రం బాధ్యత తప్పించుకుంటుందని విమర్శించారు.

చర్చ లేకుండా తొందరగా ఆమోదం: బిల్లును రాత్రి వేళల్లో, తగినంత చర్చ లేకుండా ఆమోదించారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

పేదలకు, రైతులకు వ్యతిరేకం: ఈ బిల్లు పేదలు, రైతులు, గ్రామీణ కార్మికుల జీవనోపాధికి హానికరమని ప్రతిపక్షం ధర్నాలు, వాక్‌అవుట్లు చేసింది.

స్తులంగా అధికార సభ్యుల అభిప్రాయాలు ఇలా..

MGNREGA లోపాలను సరిచేయడం: పాత పథకంలో చెల్లింపుల ఆలస్యం, అవినీతి, ఉత్పాదకత లోపాలు ఉన్నాయని, కొత్త బిల్లు వాటిని సరిచేస్తుందని ప్రభుత్వం చెప్పింది.

125 రోజుల ఉపాధి హామీ: MGNREGAలో 100 రోజులు మాత్రమే ఉండగా, కొత్త చట్టం 125 రోజుల గ్రామీణ ఉపాధి హామీ ఇస్తుందని చెప్పారు.

వికసిత భారత్ 2047 దృష్టికోణం: ఈ బిల్లు దేశ దీర్ఘకాల అభివృద్ధి ప్రణాళికలో భాగమని, గ్రామీణ ఉపాధి దేశ వృద్ధికి తోడ్పడుతుందని వాదించారు.

జీతాలకే కాకుండా జీవనోపాధి అభివృద్ధి: ఇది కేవలం రోజువారీ వేతనాలకే కాకుండా, స్వయం సహాయక సంఘాలు, నైపుణ్యాభివృద్ధి, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు.

బాధ్యత మరియు సమర్థత పెంపు: కొత్త వ్యవస్థ నిధుల లీకేజీలను తగ్గించి, పర్యవేక్షణను మెరుగుపరచి, నిధులు సక్రమంగా వినియోగించబడతాయని ప్రభుత్వం వాదించింది.

నాకు ఉన్నా ఆలోచనలు. ..

వ్యక్తిగతంగా నాకు ఉన్నటువంటి అవగాహన ఏంటంటే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద చాలా రాష్ట్రాలలో ఎక్కువ అనుకూలతలు ఉన్నప్పటికీ అక్కడక్కడ రైతులలో గ్రామాలలో పనిచేసేటువంటి వాళ్ళల్లో ఒక వ్యతిరేకత ఉంది. .

ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయం యొక్క అవసరాలకు మరియు అనుబంధ పనులకు వాడాలి అనే డిమాండ్. .

అనేక గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద కేవలం ఏదో ఉదయం కాసేపు అలా వెళ్లి మట్టి తీసి ఇంటికి వస్తున్నారు ఎంతో కొంత వచ్చిన కాడికి అనేటువంటి కోణంలోనే ఈ పథకం ఉంది తప్ప నిర్మాణాత్మకమైనటువంటి మార్పు
కానీ ఒక శాశ్వతమైనటువంటి పనుల అమలు లేదు అనేటువంటిది కూడా చాలామంది అభిప్రాయం..

ఈ పథకం అక్రమాలు అంటే అసలైన అర్హులే పనులు చేస్తున్నారా? లేకుంటే కొంత ఆర్థికంగా బాగున్న వాళ్ళు కూడా ఇందులో లబ్ధి పొందుతున్నారా ?అసలు పని చేయకుండా కూడా కొందరు బిల్లులు పొందుతున్నారా? ఇలాంటి ఆరోపణలు కూడా అనేక చోట్ల వింటున్నాము ..

ఈ పథకం లో అక్రమాలు లేదా నిర్మాణాత్మక అంశాలను మనం కాసేపు పక్కన పెడితే దేశంలో ప్రతి పథకంలో కూడా అవినీతి ఏ స్థాయికి చేరింది అనేటువంటిది రాజకీయ నాయకుల ఆరోపణలు మనం చూసినప్పుడు తెలుస్తుంది వాళ్లు వీళ్ళ మీద 30% కమిషన్లను అని మాట్లాడుకోవడం తిరిగి మీరు మీ ప్రభుత్వం లో 40% కమిషన్లను అంటూ నిత్యం వింటూనే ఉన్నాం.

ఆన్లైన్ సిస్టం ద్వారా చెల్లింపులు వర్క్ kజరుగుతున్నాయి కాబట్టి కచ్చితంగా అమౌంట్ ఎవరైతే రిజిస్టర్ లో ఉంటారో వాళ్ళకి చేరుతున్నట్టుగా మనం భావించాలి ఇక్కడ పెద్ద స్థాయిలో అవినీతి జరిగేటువంటి అవకాశం చాలా తక్కువ..(కాకపోతే వర్క్ చేయకుండా కూడ చేసినట్లు ఆన్లైన్ లో ఫొటోస్ మార్పింగ్ చేయడం ద్వారా కూడ కొన్ని జరగడం ఆలా అవినీతి మరియు ఉత్పధాకత లేకపోవడం తెల్సిందే ).

సోషల్ సెక్యూరిటీ డేటా మీద పనిచేసిన వాడిగా నాకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే గ్రామీణ అభివృద్ధిలో ఆర్థిక భద్రత ఆర్థిక భరోసా చాలా ముఖ్యం ఇప్పటికీ కూడా మన దేశంలో దాదాపుగా 52 శాతం మందికి ఉపాధిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం.

అలాంటి వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి రైతులు లేదా రైతు కూలీల కు అనుబంధంగా ఒక ఉపాధి ఏర్పరచడం అనేటువంటిది చాలా మంచి పథకంగా చూడాలి ఈ పథకం ద్వారా వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరగడం ఆ రకంగా వాళ్ళ యొక్క జీవనశైలిలో ఎంతో కొంత మార్పుకు ఉపయోగకరమైనది నా భావన.

స్థూలంగా ఈ పథకం ఎందుకు ఎక్కువ శాతం ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి అనేది చూస్తే కాసేపు గాంధీ మహాత్ముడి పేరు అనేటువంటి అంశాన్ని మనం పక్కన పెడితే..

ఈ పథకంలో 60 :40నిధుల కేటాయింపు విభజన ఏదైతే ఉందో దానివల్ల రాష్ట్రాల పైన ఎక్కువ భారం పడి ఈ పథకాన్ని రాష్ట్రాలు రేపొద్దున అమలు చేయడానికి ఎన్నో ఆటంకాలు ఉంటాయి ..

సహజంగా ఒక సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి అన్నీ సమయంలో సబ్మిట్ చేస్తూ ఒక మెకానిజం ద్వారా మాత్రమే నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తాయా? లేదా అనేటువంటి అంశాల్లో కొంత ఛాలెంజెస్ ఉన్నాయి?

ఈ చట్టం వలన పనిలో పారదర్శకత పెరిగి మంచి మార్పులు వస్తాయా లేక పథకం అమలులో రాష్ట్రాలు విఫలం చెందుతాయా లేక కేంద్ర విధించిన కఠిన నిబంధనలు అమలు చేసి విజయం సాధిస్తాయా అంటే కాలమే సమాధానం? ?

https://prsindia.org/billtrack/the-viksit-bharat-%E2%80%93-guarantee-for-rozgar-and-ajeevika-mission-gramin-vb-%E2%80%93-g-ram-g-bill-2025

12/11/2025

ఈ మధ్యన ECI మీద ఆరోపణలు ఎక్కువ సార్లు వార్తల్లో నిలవడం చూస్తున్నాం కానీ నాకు ఉన్నా అవగాహనలో ECI మీద ఆరోపణాలు కొత్తకాదు అనే కోణంలో మరియు రాహుల్ గాంధీ గారి ఓటు చోరీ ఆరోపణ అంశాల్లో (BLO లోపాలు Electoral Rolls మీద ) ఈ రోజు ఉదయం బిగ్ డిబేట్ లో చాలా సూటిగా నా భావన..

12/11/2025

బీహార్ లో మళ్ళీ నితీష్ కుమార్ గారికే ఎగ్జిట్ ఫలితాలు అనుకూలత మీద నా భావన రెండు మాటల్లో..

ఈ రోజు ఉదయం కొంత విరామం తరువాత వాసుదేవన్ గారితో బిగ్ డిబేట్ లో. .

నితీష్ కుమార్ యూ టర్న్ సీఎం.. కాంగ్రెస్ అస్త్రాలు పనిచేయలేదు | Analyst Ramnath On Nitish Kumar | 12/11/2025

బీహార్ లో మళ్ళీ నితీష్ కుమార్ గారికే ఎగ్జిట్ ఫలితాలు అనుకూలత మీద నా భావన రెండు మాటల్లో..

ఈ రోజు ఉదయం కొంత విరామం తరువాత వాసుదేవన్ గారితో బిగ్ డిబేట్ లో. .


https://youtu.be/ZVoT46gc7fM?si=tb351Tt4cajilfSe a

నితీష్ కుమార్ యూ టర్న్ సీఎం.. కాంగ్రెస్ అస్త్రాలు పనిచేయలేదు | Analyst Ramnath On Nitish Kumar | నితీష్ కుమార్ యూ టర్న్ సీఎంకాంగ్రెస్ అస్త్రాలు పనిచేయలేద...

Photos from Ramnath kampamalla's post 11/11/2025

10వ సారి ప్రమాణ స్వీకారం ఆయనేనా? ?. . #ఎగ్జిట్ పోల్ తరువాత నా ఆలోచనలు..

ఆలా ఆయన 9 సార్ల గురించి మీ ముందుకు. .

నితీశ్ కుమార్ గారు తొమ్మిది సార్లు బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రాజకీయ ప్రయాణం తరచుగా కూటమి మార్పులు, ఎన్నికల ఫలితాలు, మరియు అంతర్గత సంక్షోభాలతో నిండిపోయింది.

1వ సారి (2000 మార్చి 3): NDA మద్దతుతో మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు, కానీ మెజారిటీ లేకపోవడంతో కేవలం ఏడు రోజుల్లో రాజీనామా చేశారు.
2వ సారి (2005 నవంబర్ 24): JD(U)-BJP కూటమి విజయం తర్వాత స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

3వ సారి (2010 నవంబర్ 24): NDA భారీ విజయంతో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.

4వ సారి (2014 ఫిబ్రవరి 22): BJPతో విడిపోయిన తర్వాత JD(U) అంతర్గత సంక్షోభం కారణంగా ముఖ్యమంత్రి అయ్యారు.

5వ సారి (2015 నవంబర్ 20): మహాగఠ్‌బంధన్ (RJD-JD(U)-Congress) విజయం తర్వాత పదవిలోకి వచ్చారు.

6వ సారి (2017 జూలై 27): RJDతో విభేదాలు, అవినీతి ఆరోపణల కారణంగా కూటమి విడిచి BJPతో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.

7వ సారి (2020 నవంబర్ 16): NDA విజయం తర్వాత ఏడోసారి ప్రమాణం చేశారు.

8వ సారి (2022 ఆగస్టు 10): BJPతో విడిపోయి RJDతో కూటమి చేసి ఎనిమిదోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
9వ సారి (2024 జనవరి 28): మహాగఠ్‌బంధన్ విడిచి BJPతో మళ్లీ కూటమి చేసి తొమ్మిదోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

ఈ విధంగా నితీశ్ కుమార్ గారు తొమ్మిది సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతి సారి ఆయన పదవిలోకి రావడానికి కారణం కూటమి మార్పులు, ఎన్నికల ఫలితాలు లేదా రాజకీయ సంక్షోభం. అందుకే ఆయనను తరచుగా “U-turn CM” అని పిలుస్తారు

09/11/2025

ఒక రాజకీయ పార్టీ సామాన్య కార్యకర్త మరణ వార్త చదివిన తరువాత ఇలా ఈ సమయంలో మీ ముందుకు. .(క్రింద ఆ వార్త నేపధ్యం ఇమేజ్ లో చదవగలరు. .)

ఇన్సూరెన్స్ వలన కలిగే ఆరోగ్య మరియు ఆర్థిక
భద్రత గురించి తెలియడం చాలా అవసరం మరియు అందరికి అలాంటి భద్రత ఇచ్చే విధానాలు రావాలి.

ఈమధ్యనే ఇన్సూరెన్స్ మీద కూడా తొలగించడం చూసాం. .

ఏదోక సంస్థలో ఉద్యోగం చేసే వారికి ఇన్సూరెన్స్ సౌకర్యాలు ఉంటాయి కానీ రాజకీయలో పని చేసే సామాన్య కార్యకర్తకు ఏదైనా జరిగితే ఎవరు భరోసా ఇవ్వగలరు ?? అదే ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటే ఎంతో కొంత ఆ కుటుంబంకు భరోసా..

గతంలో ఇదే అంశం మీద నా భావన రాసాను అన్నీ గుర్తింపు ఉన్నా రాజకీయ పార్టీలు ఇన్సూరెన్స్ స్కీం అమలు చేసేలా ఒక విధానం నిబంధనలో ఉండాలి అని రాసాను.

ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం ఇస్తున్న రాజకీయ పార్టీలకు మనస్ఫూర్తిగా అభినందనలు,ఇంకా ఇలాంటి సౌకర్యం ఇవ్వని రాజకీయ పార్టీలు అదిశగా అడుగులు వేయాలి అనే సూచన.

గమనించగలరు :ముందు మీ పార్టీ కార్యకర్తకే భరోసా ఇవ్వని వాళ్ళు సామాన్యులకు ఏమి చేయగలరు అనే కోణంలో నా ఆలోచనలు స్వీయ అనుభవాలు గతంలో రాసాను ఇంకా ముఖ్యంగా ఇలాంటి నిర్ణయాలు బలమైన సంస్థగత పార్టీ నిర్మాణానికి చాలా అవసరం అనే సూచన.

09/11/2025

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మూగబోనున్న ప్రచార కార్యక్రమలు. .

గత రెండు మూడు వారాలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు మాత్రమే కాకుండా నగర జీవులందరూ ఎదో ఒక సమయంలో ఆ ప్రచారహోరులో తడవలసిందే అనేలా ఉంటుంది ఈ నియోజకవర్గం అవసరం మరియు స్వరూపం.

ఇంకా నా వరకు వస్తే ఈ నియోజకవర్గంలో నివాసం కారణంగా ఆ ప్రచారాలు హోరులో ఇంకా కాస్త ఎక్కువే తడవల్సిన పరిస్థితి..

ఏ పార్టీ తీసుకున్న ఒకే గొంతులో ఒకే విధమైన పాటలు నినాదాలు ఇలా ఉన్నాయి “పేదలపాలిట పెన్నిది బడుగుబలహీన వర్గాల ఆశజ్యోతి పిలిస్తే పలికే మా అన్న ఇలాంటి విశేషణాలు అనేకం ”..

ఉప ఎన్నికలు లేదా సాధారణ ఎన్నికలు లేదా స్థానిక ఎన్నికలు ఇలా ఏ ఎన్నికలైన గెలుపు ఓటమి అంశాలతో నిమిత్తం లేకుండా రాజకీయ పార్టీలు అన్నీ ఆశ్ర శాస్ర లు వాడాల్సిందే కారణం పార్టీలకు రాజకీయ భవిష్యత్ ఉండాలి అంటే ప్రతి ఎన్నిక కీలకమే అనే కోణంలో..

ఈ రెండు వారాలుగా అన్నీ పార్టీల కార్యక్రమలకు నాకు ఉన్నా సమయం ప్రకారం హాజరు అయ్యాను, నిన్న సాయంత్రం మిత్రుడు రాజేష్ వచ్చి మధురనగర్ లో బీజేపీ మీటింగ్ అంటే వెళ్ళాను బీజేపీ లో కీలక నాయకుల ప్రసంగాల్లో అన్నీ రకాల కోణాలు పార్టీ యొక్క దీర్ఘకాళికలక్ష్యం ముఖ్యంగా ఎన్నికలు మరియు 2028 సాధారణ ఎన్నికల్లో అధికారం రావాలి అనే కోణంలో ప్రసంగాలు కనపడ్డాయి (ఇంకా ఎంపీ రఘునందన్ గారి ప్రసంగం లో మత కోణం రాజకీయ కోణం మరియు కేటీర్ గారి అరెస్ట్ అంశాల్లో సెక్షన్ 17A లోఉన్నా న్యాయపరమైన అంశాలతో పాటు సీఎం గారి మాట్లాడిన కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అనే వ్యాఖ్యలకు కౌంటర్ గా మాటల దాడి కాంగ్రెస్అంటే తురక తురక అంటే కాంగ్రెస్ అనే స్థాయిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనము ఏమి చేయాలి శివాజీ విగ్రహం బోరబండలో మనం పెట్టాలి అంటే ఇక్కడ MIM ఉండరాదు కాబట్టి ఇక్కడ మీరు కమలంకు ఓటువేయాలి లేదు అంటే రేపు ఇక్కడ #మేయర్ MIM నుంచి వస్తే మన గలీల్లో పనులు కావు అంటూ బైంసాలోని ఉదాహరణ చెప్పడం ఆలా మతం కోణంలో ఓట్లనూ పోలారైజ్ చేయాలి అనే కోణం కనపడింది).

ఇంకా గత కొన్ని నెలలుగా కాంగ్రెస్లోని కీలక నాయకులు అందరు గల్లీ గల్లీ తిరిగి అభివృద్ధి సంక్షేమం అనే కోణంలో ఇచ్చిన హామీలు మొదలు పెట్టిన పనులు లిస్ట్ చాలా పెద్దగానే ఉంది ఇంకా సీఎం గారు కుడా ఆయన ప్రసంగలల్లో బీజేపీ భారస ఒక్కటే భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసిపోతాయి అంటూ చేసిన మాటల దాడి ఇంకా ముఖ్యంగా కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అనే వ్యాఖ్యలు ఇలా అనేకం చూసాం, బలహీన వర్గాలు మరియు కొత్తగా ఇచ్చిన రేషన్ కార్డులు రెండు మూడు నెలలుగా ప్రారంభం చేసిన రోడ్లు డ్రైన్ పనులు MIM తో దోస్తీ మరియు బీసీ అభ్యర్థి ద్వారా వాళ్ళ సమీకరణలు కనపడ్డాయి.

ఇంకా భారాస ఏమో కాంగ్రెస్ బాకీ కార్డు అనే పేరుతొ మరియు ఆరు గ్యారెంటీల అమలులో వైపల్యం ఇలా అధికార పార్టీని ప్రశ్నిస్తూనే గతంలో వాళ్ళు హైదరాబాద్ నగరంలో కట్టిన ఫ్లైఓవర్ నిర్మాణాలు జరిగిన అభివృద్ధి ఇలా అనేకం ప్రదర్శన ద్వారా ఓట్లు అడిగే ప్రయత్నం కనపడింది.

ఇంకా మూడు పార్టీల్లో కామన్ పాయింట్ గా ఎన్టీఆర్ గారి విగ్రహం చర్చ కనపడింది, ఆయన విగ్రహం గురించి చర్చకు కారణం ఇక్కడ మైత్రివనము దగ్గర విగ్రహం పెట్టాలి అని కొన్ని కుల సంఘాలు అడగటం. .(నాకు తెల్సి అయనకు కొత్తగా మరో విగ్రహం పెట్టడం వలన ఆయనకు కొత్తగా వచ్చే కీర్తి ఏమి ఉండదు అనే స్వియ భావన).

రాజకీయాల్లో ఎన్నికల సమయాల్లో ఆరోపణలు ప్రతిఆరోపణలు చాలా సాధారణం అనే భావన ఉన్నా ఎక్కవ శాతం మతాల చుట్టూ వ్యక్తుల చుట్టూ ప్రసంగాలు జరగటం దీర్ఘకాలంలో మంచిది కాదు అనే స్వీయ భావన.

నాకు ఉన్నా అనుభవంతో ఒక మాట చెప్పాలి అనే భావన ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రయుధం కనుక ఓటు ఉన్నా అందరు ఈ ఉపఎన్నికల్లో పాల్గొని మీ ఓటు మీకు నచ్చిన పార్టీ లేదా అభ్యర్థి వేయండి అనే సూచన.

ఎవరి సమీకరణాలు లేదా మాటలదాడి ఎలా ఉన్నా అంతిమంగా ప్రజానిర్ణయమే ప్రజాస్వామ్యంలో కీలకం. .

నవంబర్ 14 న వెలువడే ప్రజాతీర్పు కొరకు అందరం ఎదురుచూద్దాం ఫ్రెండ్స్..

గమనిక : అన్నీ పార్టీల మరియు నాయకులు ప్రసంగాల దాడి అంతవరకే చూడండి తప్ప వ్యక్తిగతంగా తీసుకోకుండా కాస్త సంయమనంగా మరియు మతసమరస్యంగా ఆలోచనలు ఉండాలి అనే సూచన ఫ్రెండ్స్. .🙏).

Photos from Ramnath kampamalla's post 06/11/2025

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో నవంబర్ 6న 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.

మొత్తం ఓటింగ్ శాతం సుమారు 64.66%గా నమోదైంది, ఇది ఇప్పటివరకు బీహార్‌లో మొదటి దశలో నమోదైన అత్యధిక శాతం. మహిళలు విస్తృతంగా పాల్గొన్నారు. కొన్ని చిన్న సంఘటనలు తప్ప, పోలింగ్ శాంతియుతంగా జరిగింది.

ప్రధాన అభ్యర్థులు: తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, సమ్రాట్ చౌధరి, ఒసామా షాహాబ్ వంటి నేతలు పోటీ చేశారు.

తదుపరి దశలు: రెండో దశ పోలింగ్ నవంబర్ 11న, ఫలితాలు నవంబర్ 14న వెలువడతాయి.

Photos from Ramnath kampamalla's post 03/11/2025

వరుస ప్రమాదల వార్తల నేపథ్యంలో నాలో ఒక సంఘర్షణ. .

రెండు దశాబ్దాల నిరంతర పత్రికల పాఠకునిగా మరియు కొన్ని ఏళ్లుగా వివిధ టీవీ మరియు సోషల్ మీడియా డిబేట్లో పాల్గొన్న అనుభవంతో ఒక ఆలోచన...

ఎన్నీ ప్రభుత్వలు మారిన క్రైమ్ రేట్ మరియు ప్రమాదాలు అనే అంశాల్లో పెద్ద మార్పులు వెంటనే కనపడవు కారణాలు అనేకం కానీ వాటిని అలానే విస్మరించరాదు అంటే బలమైన వ్యవస్థ మరియు అవగాహన అనేది చాలా అవసరం.

అవగాహన అనేది శాఖల పరంగా ఒకవైపు చూస్తూంటం రోడ్డు వారోత్సవాలు లేదా మధ్యపాన నిషేధం ఇలా కానీ అనుకున్న మార్పులు రావడం లేదు అంటే ఇంకా ఎక్కడో లోపాలు ఉన్నాయి అనేది నిజం.

ఆ లోపాలు ఏంటి ? బడ్జెట్ అంశాల? వ్యవస్థల నిర్మాణమా? శిక్షణ లోపమా? అనే కోణంలో. .

ఉదయం పత్రికల్లో అప్పుల గురించి రెండు వార్తలు చూసాను నాకు ఉన్నా అవగహన ప్రకారం అప్పులు అనేది ఏ ప్రభుత్వలైన చేయవల్సిందే ఇంకా అభివృద్ధి చెందిన దేశాల్లో రేషియో 100 లేదా 200 శాతం పైన ఉంటుంది అంటే అక్కడ అప్పులు చేసిన ఎక్కువ శాతం మౌలిక రంగాల్లో మూలధనవ్యయం చేస్తారు కనుకేఅక్కడ వ్యవస్థల పనితీరు బాగుంటుంది కనుకే వలస ప్రజలు కూడ అక్కడే స్థిరపడటం కూడ ఒక కారణం. .

ఇంకా మన దేశంలో కూడ 1992 తరువాత నుంచి అప్పులు ఎక్కువ చేయడం ప్రారంభం తరువాత వచ్చిన ప్రభుత్వలు కూడ కొనసాగింపు ఆలా నేడు మన రేషియో కుడా దాదాపు 81 శాతం అనేది సమాచారం.

ఈ రోజు చేవెళ్ల వద్ద జరిగిన ప్రమాదం మొదలు కాదు చివర కాదు కనుక. .

కేంద్రం ప్రభుత్వమే ఈ రహదారుల నిర్మాణ అంశాల్లో మరియు ప్రమాదల పరిహారం అంశాల్లో దేశంలో One Nation One Tax లాగా ఎక్కడ ప్రమాదం జరిగిన ఒకే విధానం అమలు చేయాలి. .

రోడ్డు భద్రత మరియు నిర్మాణం కోసం కూడ దేశలో ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఎర్పాటు చేసి (GST కౌన్సిల్ లాగా ) సెంట్రల్ స్టేట్ భాగస్వామ్యం తో ఒక విధానం తీసుకొని నిరంతరం సమావేశాలు చర్చలు ద్వారా ఎక్కడ ఎలాంటి మౌలిక నిర్మాణలు అవసరం అనే వాటి మీద పని చేసినప్పుడే కొన్ని ఏళ్లల్లో మన సమాజంలో మార్పులు సాధ్యం తప్ప లేదంటే ఇంకా ఎన్నో మనలాంటి అమాయక ప్రజల ప్రాణాల పోవాల్సిందే అనే భావన.

ఒక ఫైనాన్స్ గ్రాడ్యుయేట్గా నా అవగాహన అప్పులు చేయడం తప్పు కాదు వాటిని మూలధన వయ్యంగా మౌలిక నిర్మాణాల మీద ఖర్చు చేయాలి ఆలా ఒక విధానం ఉంది మన దేశంలో కానీ అమలులో లోపాలున్నాయి కనుకే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక ఒక ప్రత్యేక బడ్జెట్ మరియు ఒక కార్పొరేషన్ ద్వారా దేశమంతా ఓకే విధానం ఉండాలి అప్పుడే మార్పు సాధ్యం. (ఒకే గొడుగు క్రింద ఉంటే అనుమతులు మరియు ఆర్థిక క్రమశిక్షణ కూడ సాధ్యం ఉదాహరణ GST కౌన్సిల్ ద్వారా మరియు NHAI ద్వారా మార్పులు చూసాం కదా ).



Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address

Hyderabad
500073