Sonu BRS

Sonu BRS

Share

Always With KCR And KTR

28/04/2026

రైతులు ఆరుగాలం శ్రమించి పంట కోసి కుప్పలు పోస్తే.. ఆ ధాన్యాన్ని కొనే నాథుడే లేడు!

ఓ వైపు ధాన్యం కొనుగోళ్లు లేక, మరోవైపు అకాల వర్షాలతో కల్లాల్లోనే తడుస్తున్న రైతన్న కష్టం.

రాష్ట్రంలో ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకుండా, ధాన్యం కొనుగోలు చేయకుండా మొద్దు నిద్రపోతున్న రేవంత్ సర్కార్😡

28/04/2026

*కాంగ్రెస్ అవినీతికి కాదేది అనర్హం..!*
*ఆఖరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఇచ్చే*
*మందు గోళీల కొనుగోళ్లలోనూ రూ. 150 కోట్ల స్కామ్ కు పాల్పడ్డది కాంగ్రెస్ సర్కార్.*

తప్పుడు ఇండెంట్లతో అవసరానికి మించి భారీగా మందుల కొనుగోలు చేసి.. గడువు లోగా వినియోగించకపోవడంతో ఎక్స్‌పైరీ.. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 150 కోట్ల మేర గండి.

ఎక్స్‌పైరీ అయిన మందులను ధ్వంసం చేసేందుకే ఓ కంపెనీకి రూ.5 కోట్ల కాంట్రాక్ట్

రూ. 150 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి
తమ జేబులు నింపుకున్న కాంగ్రెస్ పంది కొక్కులు!


28/04/2026

ప్రైవేట్ ఆసుపత్రులకు పెద్దపీట.. ప్రభుత్వ వైద్యానికి పాతర!

గత రెండున్నరేళ్లుగా ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఇది!

మరో రెండేళ్లలో 100వ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభం కావాలని రేవంత్ రెడ్డి ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించడం.. కార్పొరేట్ ఆసుపత్రులపై ఆయనకున్న ప్రేమను తేటతెల్లం చేస్తోంది. కాంగ్రెస్ గద్దెనెక్కిన నాటి నుండి ప్రభుత్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేస్తూ, ప్రైవేట్ శక్తులకే కొమ్ముకాస్తోంది.

నిరుపేదల కోసం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ప్రారంభించిన వరంగల్ ఆధునిక సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిని, హైదరాబాద్‌లోని 4 టిమ్స్ (TIMS) ఆసుపత్రులను సకాలంలో పూర్తి చేయకుండా గాలికొదిలేసిన కాంగ్రెస్ సర్కార్.. పేదల ప్రాణాలతో చెలగాటమాడుతోంది! 😡

27/04/2026

రాష్ట్రంలో చేపట్టబోయే ఎస్ఐఆర్‌పై బీఆర్ఎస్ నాయకులు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ గారు సూచించారు.

కాంగ్రెస్ పార్టీ చేసే ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది.

- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

27/04/2026

నల్గొండ జిల్లా రైతు బైరెడ్డి రాంరెడ్డి,
సమైక్య రాష్ట్రంలో 30 ఎకరాలు ఉన్నా, నీళ్లు లేక 100కు పైగా బోర్లు వేసి, బోర్ల రామయ్యగా పేరు తెచ్చుకున్నడు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ గారు ‘మా తెలంగాణ రైతు ఇంత బాధపడాల్సిన అవసరం ఏంటని’.. అప్పటి ప్రభుత్వాన్ని నిలదీసిండు.

ఈరోజు బీఆర్‌ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో ముఖ్య నాయకులతో జరిగిన సమావేశం అనంతరం తిరిగి వెళ్తూ,బోర్ల రాంరెడ్డి గారిని చూసి ఆప్యాయంగా పలకరించిన బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు.

23/04/2026

ఆర్టీసీ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ సర్కార్.. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట బస్టాండ్ ఎదుట ఒక ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. సమ్మెకు దిగిన కార్మికులను ఈ ప్రభుత్వం చర్చలకు పిలిచి మాట్లాడిల్సింది పోయి, అధికారులను అడ్డం పెట్టుకుని వారిని వేధింపులకు గురిచేయడం నిజంగా సిగ్గుచేటు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని.. వారి న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నాను. దయచేసి ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లు సాధించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. కానీ ప్రాణాలు తీసుకునే నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దని నా విజ్ఞప్తి.

20/04/2026

జగిత్యాలలో కేసీఆర్ సభ ఉంది అంటే.. రెండో విడత రైతుబంధు ఇస్తున్నారు.
మూడవ విడత ఇవ్వాలంటే కేసీఆర్ ఇంకో సభ పెట్టాల్నా?

- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 🔥

20/04/2026

కాంగ్రెస్ ప్రభుత్వానికి యూరియా బస్తాలు ఇవ్వడానికి చేతనైతలేదా?

యూరియా కావాలంటే.. యాప్ లో బుక్ చేసుకోండి అంటున్నరు. దుకాణాల్లో లేని యూరియా యాప్ లో ఉంటదా?

యూరియా బస్తా కోసం రైతులు ఇంత గోస పడాల్నా?
ఇది అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం.

- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address

Hyderabad