Women Protection Force -WPF

Women Protection Force -WPF

Share

sosciol work

17/08/2024

కొనసాగుతూనే ఉంది అత్యాచార పంరంపర!.
లోపాన్ని వెతికి సరిచేసే నూతన సమాజం ఎప్పుడు ఆవిర్భవిస్తుందో?

20/09/2021

#అక్షరం

ఒక్క సిరాచుక్క లక్షల మెదల్లకు కదలిక!..

మీ కోట గుమ్మంలో తెగిపడిన గుత్తుకల ఆనవాల్లను పదిలంగా భావి తరాలకు అంధించాను నేను!

మీ తెగబలిసిన దేహాలకు చిద్రమైన శరీరాలను చెరిత్రకు తెలిపే సజీవ సాక్షాన్ని నేను!

మా ఎండిన గుత్తుకల దప్పికకోసం మైల్లకొలది పయనించామని తెలిపే ఆ చరిత్ర మూలాన్ని నేను!

మీ దేవుళ్ల మొలతాల్లకు మా వాడ ఆడపడుచుల మెడలు వేలాడేసారని తెలిపే ప్రత్యక్ష సాక్షాన్ని నేను!

మీ అర్థం లేని మంత్రాలతో ఎందరో సంసార జీవితాలను సర్వనాశనం చేసారని తెలిపే నిర్జీవ సాక్షన్ని నేను!

బిడ్డలపాలకై మీ పక్కను పంచుకోమని కోరినట్టి విషయాన్ని బహిర్గతం చేసే నిజాన్ని నేను!

మీ గడి ఉరికొయ్యలకు ఉయ్యాలలూగిన మా తాతల తలరాతను తరతరాలుగా మోసుకొస్తున్నాను నేను!..

మాబతుకుల చరితను తెలుసుకుని తెగబడి తిరగబడేందుకు తెగువను మోసుకొస్తున్న దాన్ని నేను!

మా రాతల యతలను మీ గడీలలో బందీ గాకుండజేసిన స్వేచ్చాయుత గీతాన్ని నేను!

అణిచివేతను దిక్కరిస్తూ అనగారిన బతుకుల్లో వెలుగును నింపుతూ అంతకంతకు ఆకాశమే నీ హద్దు అనే విధంగా పయనిస్తున్న నల్లని పతాకపు చాయను నేను!

నన్ను బందించాలని యత్నించిన వారందరి చరిత గతిని భద్రపరుస్తున్నాను నేను!.

నన్ను చేరుకో నీ అజ్ఞానాంధకారాన్ని వదులుకో అని తెలియపరిచే అక్షరాన్ని నేను మహోజ్వలిత ప్రజ్వలను నేను!..
అక్షర అభినేత్రిని నేను!...
నీ ఆత్మగౌరవ విప్లవ కెరటానికి ఆయుధాన్ని నేను!..


✊ #ప్రసాద్_నాస్తిక్

16/09/2021

ఉన్నాడు ఓ మనిషున్నాడు!.
నిత్యనూతనంగా ఆవిర్బవించే ఓ మనిషున్నాడు!.
ప్రజాపంథే తన ధ్యేయమనే మనిషున్నాడు!.
స్పందిస్తాడు తనదైన శైలిలో స్పందిస్తాడు!.
వ్యక్తుల స్వేచ్చను కాదు వ్యవస్థ మార్పును కోరతాడు!.

మనిషనే పదానికి సిసలైన నిర్వచనం అతడు!.
భావోద్వేగాల భాటసారి, ప్రేమానురాగాల విహారి!
విమర్శకుల రహదారి!.
గుండెల్లో వేదనతో మనసునిండ రోదనతో పయనమై దరిచేరగ ఆ బికారి!..

నైతిక విలువలు నడయాడిన నేలనంబు నేడుకొరవడగ చేరుకున్న ధరిద్రినంబు!.
చెరిచిన చెరితలు చూడబోగ ముద్దుగుమ్మ బొమ్మై కదలకున్న , కంటతడి ఆగునా ఈ సమయమ్మున!

చెరిచెనా చేతులారా చిన్నారిని చీడపురుగు!.
వణుకుతుండె నా హృదయము వేగనంబు!.

ఓ నరహంతకుడా నీ నరనరమున కారుచున్న కామమ్మును కాటికి పంపెదనుగ కాసుకొమ్ము!..
✊ నాస్తిక్ ప్రసాద్

16/09/2021

#బాబోయ్_మేం_బిజీ!.

మేం చాలా బిజీ అండీ బాబు!
అవును మేం చాలా బిజీ!
ఆఫీసులో అరనిమిషం లేటవుద్దేమో మేం బిజీ!.
అమ్మో మా ఇంట్లో వాల్లు ఎదురుచూస్తుంటారు మేం బిజీ!.
డబ్బులు సంపాదించాలి మేము చాలా బిజీ!.
కఠం తెగుతున్నా! శిరస్సులు తెగిపడుతున్నా మేం బిజీనే! మనవి కాదు కదా తెగేదీ!
పసిమొగ్గలు మొగ్గలోనే మనిషనే మృగానికి బలవుతున్నా మేం బిజీ (నా ఇంట్లో బానే ఉన్నారు కదా!)

ఓ పసిపాపను మానవ మృగం మచ్చుకైనా కనికరం లేకుండా కొరికి కొరికి తన కామాన్ని వెల్లగక్కుతుంటే కదలలేని కనుపాప ఏం జరుగుతుందో తెలియని చినపాప ఏడవడానికి నోరైనా రాకుందని తల్లడిల్లిందే ఓ పశువు మీదపడి ఉంటే కదల్లేక మెదల్లేక నరకయాతన అనుభవించిందే నోటినిండా దూదితో ఒంటి నిండా గాయాలతో తల్లడిల్లుతున్న ఆ చిన్నారి రక్తంతో స్నానమాడిన ఆ పశువును పట్టుకొనేందుకు ఈ మానవ సమాజం కాలు కదపలేనంత బిజీగా బతుకు వెల్లదీస్తుంది!..
కనీసం కండించే టైం లేనంత బిజీ బతుకు వెల్లగక్కుతోందీ మానవ సమాజం!.

భావితరాల బావుట మెల్లిమెల్లిగా ఈ లోకపు అంచులను దాటుకుని వెలుతుంటే ఆ దాష్టికానికి దారితీసిన ప్రేరణాభూతాలను పన్నెత్తు మాటనేంత తీరిక లేని బిజీ బతుకులు మనవి!.

టివీ సీరియల్ల,సినిమా సోయగాల,హొయలులతో బిజీ లైఫ్ ని అనుభవిస్తున్నాం!
బంగారు భవిత కాలి భూడిదవుతుంటే కాపాడుకునేందుకు కనీసయత్నం చేయలేకున్నాం!
సినీతారల బికినీలను,పురాణ పుంగవుల వెకిలి చేష్టలను మనసార అస్వాదించే మనుస్మృతి కదా మనది!.
అందుకే అందుకే ఆడదంటే ఆటబొమ్మవలె చూస్తున్న పులుషాహంకార సమాజాన్ని పెంచిపోషిస్తున్నాం!
మెలుకువతోనే పాలకై ఏడ్చే రేపటి అమ్మను కామానికి ఆహుతిచేస్తున్నాం!.

ఎవరెన్ని చెప్పినా ఏం చేసినా మేం బిజీ ఫేసుబుక్కులో డుగ్గు డుగ్డు పాటకు రివ్యూలిచ్చే టైం మాకుందికానీ చైత్రలాంటి చెల్లెల్లను చెరుస్తున్నా క్షణం తీరిక లేకుండా బిజీగా బతుకుతున్నాం!

మేం బిజీ మీరెన్ని చెప్పినా ప్రత్యామ్నాయం మా ఇంటివరకు వస్తే గానీ ఆలోచించలేం ఎందుకంటే మేం బిజీ!..
✊ నాస్తిక్ ప్రసాద్

14/09/2021

రాస్తున్నాం రాస్తున్నాం రాస్తున్నాం!.
వేళ్లు అరిగిపోయేలా ఫోన్లు పగిలిపోయేలా రాస్తూనే ఉన్నాం!.
ఆచరణలో లేని ఆలోచన ఎంత ఉంటే ఏం లాభం
పసిపిల్లలపై ప్రతాపాలు చూపే మృగాలను పన్నెత్తు మాట అనలేని మగ మృగతనం ఉంటే ఏం లాభం?.

నేరాలు చేసే మృగాలను ముప్పూటలా మేపి మూడుదినాలకే బయటకు వదులుతున్నారు!
క్షణికావేశమే కారణమంటు కితాబులిస్తున్నారు!.
ఆ ఆవేశానికి కారణమవుతున్న నేరప్రవృత్తిని ప్రేరేపిస్తున్న మారకద్రవ్యాలపై మాటేసే రక్షక భోజకులు లంచాలకు మరుగుతున్నారు!.

చట్టం తనపనే చేస్తుంది తప్పు జరిగిపోయాక చూద్దాం అంటుంది! ఆ తప్పు జరగకుండా ఆపగలిగే యువతరం అనే ఆయుధం ప్రమిదలై వెలగాలి!.
మూర్ఖపు బావజాలంలో మునిగితేలుతున్న మోడులు చైతన్యం అవ్వాలి!.

ప్రతినిత్యం కామకాటుకు బలవుతున్న బాల్యాన్ని కాపాడుకునేందుకు కర్శకులమై ఆ కర్కోటకుల కదలికలను అంచనా వేద్దాం!
ఆపద అని ఆడపడుచులకు అన్నా తమ్ముల్లమై అక్కా చెల్లెళ్ళమై అండగా నిలబడదాం!!.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Hyderabad
500001