Shiva Kumar Kolishetty

Shiva Kumar Kolishetty

Share

The official page of Sri Kolishetti Shiva Kumar, Chairman, Yuga Thulasi Foundation & Ex Member, TTD Board

19/06/2026

🚨 **అత్యవసర అభ్యర్థన: గోవుల రక్షణకై సహాయం చేయండి!** 🚨
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల యుగతులసి గో మహాక్షేత్రం లీజుకు తీసుకున్న స్థలంలోని గోశాల షెడ్డు పూర్తిగా కూలిపోయింది. భక్రీద్ సందర్భంగా మరియు వివిధ పోలీస్ స్టేషన్ల ద్వారా రక్షించబడిన ఎన్నో గోవులు ప్రస్తుతం ఇక్కడ ఆశ్రయం పొందుతున్నాయి.
షెడ్డు లేకపోవడం వల్ల ఈ మూగజీవాలు వర్షానికి తడుస్తూ అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. వాటికి పెట్టే గ్రాసం, దానా కూడా తడిసిపోతున్నాయి. గోవులు అనారోగ్యంతో చనిపోయే పరిస్థితి రాకుండా ఉండాలంటే వెంటనే ఈ షెడ్డు నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది.
గోభక్తులు, దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఈ షెడ్డు నిర్మాణానికి సహాయం చేయవలసిందిగా హృదయపూర్వక విన్నపం.
📞 **సంప్రదించాల్సిన నంబర్:** 8008318888

Photos from Shiva Kumar Kolishetty's post 17/06/2026

ఈ నెల 24 నుండి 26 వరకు శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానం, మింట్ కాంపౌండ్ ఖైరతాబాద్ బ్రహ్మోత్సవాలు - అందరికీ ఇదే ఆహ్వానం

14/06/2026

# # # 🛕 గోమాత ప్రచార రథం అమ్మబడును 🛕
ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు మరియు యాత్రలకు ఎంతో అనువైన **"గోమాత ప్రచార రథం"** విక్రయానికి సిద్ధంగా ఉంది.
📞 **సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:**
+91 94406 11564
*ఆసక్తి గలవారు పూర్తి వివరాలు, ధర కొరకు వెంటనే కాల్ లేదా వాట్సాప్ చేయండి.*

14/06/2026

**శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానంలో డిప్యూటీ సీఎం సతీమణి, కుమారుడి ప్రత్యేక పూజలు**
హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ మింట్ కాంపౌండ్‌లోని శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని మల్లు, వారి కుమారుడు సూర్య విక్రమాదిత్య శని త్రయోదశి పర్వదినం సందర్భంగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలోని శనీశ్వరునికి భక్తిశ్రద్ధలతో తైలాభిషేకం నిర్వహించారు.
అనంతరం ఆలయ చైర్మన్ కొలిశెట్టి శివకుమార్, వారి కుటుంబ సభ్యులు.. డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా సత్కరించి, వేదాశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

Photos from Shiva Kumar Kolishetty's post 13/06/2026

**శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానంలో డిప్యూటీ సీఎం సతీమణి, కుమారుడి ప్రత్యేక పూజలు**
హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ మింట్ కాంపౌండ్‌లోని శ్రీ త్రిశక్తి హనుమాన్ దేవస్థానాన్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని మల్లు, వారి కుమారుడు సూర్య విక్రమాదిత్య శని త్రయోదశి పర్వదినం సందర్భంగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలోని శనీశ్వరునికి భక్తిశ్రద్ధలతో తైలాభిషేకం నిర్వహించారు.
అనంతరం ఆలయ చైర్మన్ కొలిశెట్టి శివకుమార్, వారి కుటుంబ సభ్యులు.. డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా సత్కరించి, వేదాశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.

11/06/2026

గోరక్షణలో మరో విజయం! ✊🐂
మొన్న బక్రీద్ సమయంలో ఇందిరా పార్క్ వద్ద విజయరామ్ గారి రిలే నిరాహార దీక్ష సందర్భంగా, కళ్ళముందే కబేలాలకు తరలిస్తున్న ఆరు (6) నందులను మన గోరక్షకులు మరియు నేను స్వయంగా పోలీసుల సమక్షంలో వాహనాలను ఆపి రక్షించడం జరిగింది.
ఆ తర్వాత దోమలగూడ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేసి, వాటిని తాత్కాలికంగా పటేల్ నగర్ క్యాటిల్ పాయింట్‌కు తరలించాము.
ఈ విషయాన్ని GHMC కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లగా... వారి ఆదేశాల మేరకు ఈరోజు ఆ 6 నందులు సురక్షితంగా మన "యుగ తులసి గో మహా క్షేత్రానికి" చేరుకున్నాయి. గోరక్షణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
జై గోమాత! 🚩 హర హర మహాదేవ్! 🙏

10/06/2026

రేవంత్ రెడ్డి పర్యటనలు ఎన్ని చేసినా సరే, గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ ని ఖతం చేయాలి, కౌని (cow) గోమాతను గెలిపించుకోవాలి! ఇదే మన నినాదం! - యుగ తులసి పార్టీ, 8008318888"

09/06/2026

**గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలోని యోధులైన గోరక్షక సోదరులకు, ధర్మ రక్షకులకు బహిరంగ లేఖ!**
**విషయం:** పెట్రోల్ డబ్బుల కోసం ఎదురుచూసే పరిస్థితి నుండి... శాసించే స్థాయికి! GHMC ఎన్నికల్లో ‘యుగ తులసి పార్టీ’ తరపున మన గోరక్షకులే అభ్యర్థులుగా!
# # ప్రియమైన గోరక్షక సోదరులారా...
సొంత జేబుల్లో డబ్బులు లేకపోయినా, తోటి స్నేహితులమంతా కలిసి చందాలు వేసుకుని, బండికి పెట్రోల్ పోయించుకుని అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా ప్రాణాలు తెగించి గోమాతలను రక్షిస్తున్న మీ త్యాగం సామాన్యమైనది కాదు. ఆకలి, నిద్ర మాని, కుటుంబాలను సైతం పక్కన పెట్టి మీరు చేస్తున్న పోరాటానికి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సరైన గుర్తింపు ఇవ్వలేదు.
మన కళ్ళ ముందే, కొందరు నేతలు తమ పదవులను, అధికారాన్ని అడ్డం పెట్టుకుని గోమాతలను అక్రమంగా కబేళాలకు తరలిస్తుంటే... చట్టాలు, పోలీసులు మనల్ని కాపాడాల్సింది పోయి, రక్షించే మనపైనే అక్రమ కేసులు పెట్టడానికి చూస్తున్నారు. మనం ఇంకా ఎంతకాలం ఇలా చేతులు కట్టుకుని కూర్చుందాం?
**ఇకపై మనం యాచించే వాళ్లం కాదు... శాసించే వాళ్లం కావాలి!**
# # మీరే నాయకులు కావాలి.. ఎందుకు?
రేపు రాబోయే GHMC (గ్రేటర్ హైదరాబాద్) ఎన్నికల్లో మన **'యుగ తులసి పార్టీ'** తరపున మీరే కార్పొరేటర్లుగా బరిలోకి దిగండి. ఇది కేవలం ఎన్నికల పోటీ కాదు, గోమాత రక్షణ కోసం మనం నిర్మించబోయే ఒక బలమైన కోట!
మీరు ప్రజాప్రతినిధిగా గెలిస్తే జరిగే మార్పులు ఇవే:
* **ఆర్థిక బలం - ఆత్మగౌరవం:** గోరక్షణ కోసం ఎవరి దయాదాక్షిణ్యాల మీదో, చందాల మీదో ఆధారపడే పరిస్థితి మారాలి. ఆర్థికంగా మీరు నిలదొక్కుకుంటారు.
* **అధికార బలం:** ఒక కార్పొరేటర్ హోదాలో ఉంటే, మీపై అక్రమ కేసులు పెట్టడానికి పోలీసులు వంద సార్లు ఆలోచిస్తారు. అక్రమ రవాణా చేసేవారి గుండెల్లో వణుకు పుడుతుంది.
* **కుటుంబానికి గౌరవం:** సమాజంలో మీకంటూ ఒక బలమైన నాయకత్వ గుర్తింపు వస్తుంది. మీ కుటుంబ సభ్యులు గర్వంగా తల ఎత్తుకుంటారు.
* **గోమాతకు నిజమైన రక్షణ:** MIM లాంటి శక్తులు తమ పదవుల అండతో చేస్తున్న అక్రమాలను అడ్డుకోవాలంటే, మనకు కూడా రాజ్యాంగబద్ధమైన పదవులు, అధికార బలం అవసరం.
# # ఇప్పుడే ఏం చేయాలి? కార్యాచరణ ఇదే!
> **"ఇప్పటి నుంచే ప్రతి గడపకూ వెళ్దాం... ప్రతి ఓటరు గుండెను గెలుద్దాం!"**
>
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఆగవద్దు. ఈ రోజు నుంచే మీ పరిధిలోని ప్రతి డివిజన్‌లో, ప్రతి ఇంటికి వెళ్ళండి.
1. మీ పరిచయాన్ని పెంచుకోండి.
2. మీరు ప్రాణాలు పణంగా పెట్టి చేస్తున్న గోరక్షణ పనులను ప్రజలకు వివరించండి.
3. గోమాతను పూజించే ప్రతి ఓటరు మన వైపే ఉన్నాడు. వారి మద్దతు కూడగట్టండి.
# # # ఓటర్ల దేవుళ్లకు విజ్ఞప్తి:
మన హిందూ ధర్మానికి మూలస్తంభమైన గోమాతను రక్షించే వీరులు మీ గల్లీలోనే ఉన్నారు. అక్రమ కబేళాలను అడ్డుకునే ధైర్యం వీరికి మాత్రమే ఉంది. వీరికి అధికారం ఇస్తే, మీ డివిజన్ అభివృద్ధి చెందడమే కాకుండా ధర్మం కూడా రక్షించబడుతుంది. ఈ GHMC ఎన్నికల్లో **'యుగ తులసి పార్టీ'** కి, మన గోరక్షక అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి.
**లేవండి సోదరులారా! మన ఆత్మవిశ్వాసాన్ని చాటుకుందాం. GHMC ఎన్నికల శంఖారావం పూరిద్దాం. యుగ తులసి పార్టీ జెండా ఎగరేసి, గోమాతను రక్షించుకుందాం!**
**గోమాతా కీ జై!**
**ఇట్లు,**
**యుగ తులసి పార్టీ - గ్రేటర్ హైదరాబాద్.**

09/06/2026

తెలంగాణకు చెందిన కొలిశెట్టి శివ కుమార్ గారి గోమాత రాష్ట్రమాత సంకల్పం నేడు ఉత్తరప్రదేశ్ విధానసభలలో కూడా చర్చనీయాంశంగా మారింది.
ఫరూఖాబాద్ విధానసభ సమావేశంలో శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ గారి ఆశీస్సులతో, నాయకులు మరియు ప్రజలు కొలిశెట్టి శివ కుమార్ గారి పేరును ప్రస్తావిస్తూ గోమాత రాష్ట్రమాత ఉద్యమానికి తమ మద్దతు తెలియజేశారు.
తెలంగాణలో ప్రారంభమైన ఈ సంకల్పం నేడు ఉత్తరప్రదేశ్ ప్రజల హృదయాలను తాకుతూ ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటోంది.
"ఒక వ్యక్తి సంకల్పం... ఒక జగద్గురువు ఆశీర్వాదం... నేడు దేశవ్యాప్త ఉద్యమం!"

07/06/2026

గోవే ఆశగా
గోవే శ్వాసగా
గోవుల నడుమ
గో మహా క్షేత్రంలో

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address

Mint Compound, Khairathabad
Hyderabad
500004