Snt. భాష్యకార శతకము.

Snt. భాష్యకార శతకము.

Share

ఈ శతకము తమరి కాలక్షేప సేవార్థమే ఏలాం? భక్తి శతకములు సంబంధితుల భక్తి కాలక్షేపముగా ఉత్పత్తి సామాజిక సేవ!

16/04/2022

100-108/2️⃣/సమతమూర్తి /తే.గీ.
101*(సంపూర్ణం)
కృష్ణ శైలాద్రి యాదాద్రి కీర్తి గుట్ట
యాద గిరి గుడి శిఖరాల యత్నఫలము
లక్ష్మి నృహరి దర్శన శుభ లబ్ధి గలిగె!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
102*
జనులు తరతమబేధాలు సరకుగొనక
సామి శరణాగతిగ జాత్ర సాగు వేళ
మూడు చింతల వెలయు నీ మూర్తి పిలిచె!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
103*
ఉడయ వరుడవు నాదిశేషుడవు నీవు
కదలి వాదాలు గెల్చిన కాలగురుడ!
సంస్కరణజేసి చూపిన సామ్య భావ
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
104*
జగతి నాచార్య త్రయమున సాగు చివరి
గురుడ జియ్యరు సాముల గొప్ప వరుస
ప్రథమ పరమగురుండవో పరమహంస!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
105*
సకలమెఱుక బొందెను తత్వ సారమెఱిగె
మోక్ష దాయక తిరుమంత్ర మొందె జగతి
దైవమును మెచ్చె నీసేవ ధన్య గురుడ!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
106*
ఎంత బాధ్యత చేగొని వింత జగతి
నవతరించితి వో శేషనాగమూర్తి!
ఎంత సాధన భోధవేదాంత ప్రజ్ఞ!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
107*
సామ్య వాదము జవ సత్వగమ్యమునకు
సాగె జీవకారుణ్యమే జగతి పొంగె
శుచియు శుభ్రత పౌష్టిక సూచి వెలసె!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
108*
ఆత్మ వృత్తాన పరమాత్మ యలరుచుండ
శుభము సుఖశాంతి పాఠక శ్రోతలకును
శుభము గురులకు శిష్యశశ్రూషలకును!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
***
*16-4-2022. సమతమూర్తి శతకము సంపూర్ణం...
***🙏***✍️💫

16/04/2022

91-100/2️⃣/సమతమూర్తి /తే.గీ.
91*
ప్రజలు వటవృక్ష మైతేను రాజ కీయ
మార్థిక సమాజిక సేవలు మాములగును!
వెరసి సంక్షేమ ఫలితాలె యెంచి చూడ!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
92*
అన్నిటను దేవ దానవ తత్వముండు
ఉసురు గొనదు యెన్నటి కైన యూడయొకటి!
మంచియాధార మూలముల్ పెంచు వృద్ధి!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
93*
మంచి చెడులనుందురు విశ్వమానవాళి
మంచి శాశ్వతమీధర కొంచమైన!
అదియె చరితపుటల జేరు పసిడిరుచుల!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
94*
చేరి యవ్వాకు చెవ్వాకు లేర్చి కూర్చి
నిందితులజేయ సమతెట్లు నిల్చు, సేవ
జేయగను వేయు వెనకంజ జెప్పు నిజము!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
95*
ఇతర ధర్మంబు వలదనె గీతగురువు
మేలగు స్వధర్మమె పోటి మేలుకొఱకె
చెట్టు మ్రోడైన కాలమై చిగురు దొడుగు!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
96*
సహన గుణనిధుల్ కంభముల్ చట్రమెత్తి మోయు మౌనము తమసేవ మోదమందు
నట్లు కార్యార్థి కొనసాగు నమ్రతగను!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
97*
దలప జనసేవలు వివాదాస్పదములు!
కీర్తి ఖండూతి తత్కాల క్రియలయందె
దాన ధర్మములవివేరు ధరను దరచ!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
98*
అందరూ మహాన్ భావులే అధిక పోటి
ప్రజల సేవకేగ తెలుగు వారి తీరు
చోద్యమందురు పొరుగులు సోది వినుచు!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
99*
ఐకమత్యంబునొన గూర్చు సఖ్య భక్తి
కలిసి యభివృద్ధి సాధించు కర్తలుగను
జేసి గురుశిష్యలోకాళి చేవగూర్చు!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
100*
ప్రజల సేవకే నేతలు పరితపింప
గురుల సేవకే శిష్యులు తరలు చుండ
సామరస్యంబు దయచేయు సత్య కీర్తి!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
***
*16-4-2022.
***🙏***✍️💫🕉️

15/04/2022

81-90/2️⃣/సమతమూర్తి/తే.గీ.
81*
భక్తి విశ్వాసపాత్రుని పాలి సొమ్ము!
మోదమున రాక పోకలు మ్రొక్కు శ్రద్ధ
సాగు నాపదన్ మరుపులు సంపదలను!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
82*
ఎన్ని మెట్లైన యెట్లైన ఎక్కి దిగగ
వెడలు బలగంతొ వెనుకంజ వేయకుండ
కష్టమెంతైన భక్తుడు నిష్ట పడును!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
83*
చూచునా తళుకు బెళుకు చోద్య పడున
మెఱుగు లెన్నైన వసతియే మేలు చాలు
దైవ దర్శనమే గొప్ప దైన కోర్కె!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
84*
శాంతి సంతృప్తి కైయార్త జనుల పరుగు
దానికనుగుణ మగు గుడి దాపు ప్రాపు
గొడవలిట చెల్లినను శాంతి గోలుపోవు.
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
85*
సమత గల్గిన పెద్దల సమ్మతమున
వెలయు నారామములు వేడ్క సాగు
తీర్థమూ స్వార్థమును గల్సి తీరు కోర్కె!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
86*
దైవమే భక్తిగలిగించు దరికి బిలుచు
కోర్కెలడిగించు పలితమ్ము గూర్చు మరల
మరల బుట్టించు గిట్టించు మంచి నింపు!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
87*
మంచి జన్మ జన్మలనిధి మనిషి యాత్మ
జ్ఞాన విజ్ఞాన దోవలో నాత్మ గాంచి
మంచియను పుణ్యనిధి ముక్తి మార్గి జీవి!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
88*
మంచి వటవృక్షమును బోలు మనుజు వృద్ధి
వేరు నుండి మారాకులు విరులు పండ్లు
విత్తనములుగా తనపుణ్య విత్తమలరు!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
89*
పుట్టి గిట్టుదాకను మంచి పెట్టె నింపు
మార్గమే సనాతన ధర్మ మయ్యె నందు
నెచట తరతమ బేధాలు నెంచి చూడ!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
90*
అన్నిటను జీవాత్మ గలదన్న నదియె సమత
గోడ గట్టి గూల్చుచరిత గుట్టు నెఱుగ
పెద్ద పాము మింగిన కోతి వద్ద పద్దు!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
***
*15-4-2022.
***🙏***✍️💫🕉️

14/04/2022

71-80/2️⃣/సమతమూర్తి/తే.గీ.
71*
జ్ఞాన విజ్ఞాన శోధన జాతి సొమ్మె
దైవ సహకారమాశించు ధరణి మంచి
గుణమె దీపించె దానవుల్ గూలి చనగ!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
72*
భువి సురాసుర యద్ధమే పూర్వ పరము
మంచి చెడులకు కొనసాగు మనసునందె!
మంచి గెలచు సదా దైవ మార్గమందు!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
73*
ఏది మంచినిర్ధిష్ట మై వెలసె భువిని
కానిదంతయు చెడుగుగా గాసియయ్యె!
మంచి వారికైక్యతమేలు మహిని జూడ!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
74*
సూక్ష్మములకు నాశించి సూటిపోటి
మాట పట్టింపు లన్యాయ మార్గ గతులు
పెద్దల పలుకు పాటింప పెరుగు శాంతి!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
75*
శాంతి లేకున్న మనుగడ చప్పిడగును
స్వస్థతయు సున్న మదిని ప్రశాంతి లేక
నోమి యైక్యతఁ జెఱచగా నేమి ఫలము?
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
76*
లోకమును గల్సి బతుకగా లోప రహిత
దారి దైవీయ మార్గము ధర్మ మదియె!
వ్యక్తి భక్తుడై దేవునాసక్తి గొలుచు!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
77*
నల్గురితొ దైవ సేవయు నాణ్యమగును
దాని తోముడివడియుండు ధర్మ కర్మ
సూత్ర సూక్తి సమష్టిగా సుళువు భక్తి!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
78*
భక్తి యోగమే సుళువైన బాటయంద్రు
భక్తి తానె కర్తగ సాగు దైవభారమనుచు
ఫలితమెవరిది వారిదే వాగు పలుకు వృధయె!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
79*
కర్త కర్మయు క్రియ దైవ కార్యములకు
జరుగ నున్నది జరుగును జగతియందు
తగవులాటలు రిత్తయే తగని పనులె!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
80*
సమత పిదపను మమతయే జనత యందు
తల్లి వలెబిడ్డ తప్పులు దైవ మోర్చు
కొనడ!
జరుగు జతనము కొనసాగ చాలమేలు!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
***
*4-4-2022.
***🙏***✍️💫🕉️

14/04/2022

61-70/2️⃣/సమతమూర్తి /తే.గీ.
61*
ఆది కాలమునాటి నివాసులందు
ఐక్యతయు గానవచ్చును అన్య జీవ
సఖ్యతయు రక్ష తమధర్మ సరణి దోచు!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతామూర్తి!
62*
పిదప ప్రాణ భీతి మదిని బెరిగె తిండి
దాచు కొనితినంగవలసె తరతమాల
బేధముప్పతిల్లెను గూడెముల్ బెరిగె వనిని!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
63*
స్వార్థమున జనసంఖ్యయు సన్నగిల్లె
తరచు దాడుల జాతులు తరుగ సాగె
గూడెములు నగరాలుగ గూర్చె శోభ!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
64*
ఎన్ని మార్పులు చేర్పులు వెలసె విద్య
వేదమై వెలసె పరబ్రహ్మ మోదమయ్యె!
జ్ఞాన విజ్ఞాన దీప్తులు జగతిమెరిసె!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
65*
గూడెమలు రాజ్యమై నాయకుండు రాజు
నాగరికతల రచనలు సాగె నవని
వీర భోజ్యమయ్యెను నీతి విరిసె మదిని!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
66*
ఆది శక్తి యే త్రైమూర్తులైన విధము
ముగురు మాతలై త్రిగుణ మూలకముగ
సృష్టి సుస్థితి లయకార చేష్టలమరె!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
67*
తెలివి కలిమియు బలిమిని తేజరిల్లె
దత్త మయ్యె దైవీయ గుణోత్తమముగ
సృష్టి కాలానుగుణ విస్ఫష్ట ఫణితి!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
68*
మంచి చెడులుగ రూపించె మనుగడందు
మంచియే నీతి ధర్మ సన్మార్గ బోధ
మానవీయమై దైవీయ మార్గమొదవె!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
69*
ఐకమత్యము దైవీయమైన గుణము
సఖ్యతను గూర్చు సద్భోధ సమత మమత
భువి పరోపకారమె పుణ్య పూర్వకమ్ము!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
70*
మంచి పణ్యంబు చెడుపాపమగును మహిని
భక్తి సన్మార్గ మగు నీతి సూక్తియుతము
తిరుగు కాలచక్రము దైవ తీర్పు మార్పు
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
***
*4-4-2022.
***🙏***✍️💫🕉️

17/03/2022

51-60/2️⃣/సమతమూర్తి /తే.గీ.
51*
ఆది శక్తిముమ్మూర్తుల నవతరించె
అదియె త్రైమూర్తి గాసృష్టియవని వెలసె
అంతరార్థ పరబ్రహ్మమయము జగతి!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
52*
వేద వేదాంత పరమార్థ వేత్తలైన
జ్ఞాన విజ్ఞాన నిధులైన జన్మ దరచి
తేల్చినది పుణ్ణెమే యను పులకరింత!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
53*
ఒకరు తేజంటె పాజి నింకొకరి వాదు
తేలనివ్వరు నాగరి తేజులెపుడు
అక్కరమురాని వారినే మ్రొక్క మేలు!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
54*
జీవి గొట్టిన వాడె విజేతయయ్యె
దాని పెంచిన వాడేమొ తక్కువయ్యె
జీవమిచ్చె పరాశక్తి దేవతయ్యె!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
55*
పెద్ద అక్కరాలెడపక దిద్ది మురియు
చిన్నయక్కరాలను నేర్చి జిద్దుజేయు
మనుజులదుపున పొదుపున మనగ మేలు!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
56*
మార్పు సహజము కాలము మారుచుండు
మనిషి మారకమార్పుల నలమటించు
ఏక శల్యమాహారమై వేపి మురియు!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
57*
జగతి జెప్పగ కప్పల జారు బోలు
యెగను బ్రాకిన దిగలాగు వెనకకప్ప
మంచిని విమర్శించుట రాజమార్గమయ్యె!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
58*
కీర్తి యపకీర్తి సమమమౌను కిరిమి యంటు
వైరసుల పేర టీకయే వైరుగాగ
తగు నిరోధక శక్తియై తరిగి పోవు
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
59*
దాచిపెట్టట చెడు డబ్బు దానవిధుల
విస్తరించుట తగు మెత్కు విస్తరందు
మెతుకు లెన్నిమిగిల్చిన నేమి మేలు జరిగె!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
60*
విశ్వమై పుట్టి సుస్థితి విస్తరించి
భస్మమై లయమగు విజ్ఞ ప్రభలవెనుక
ముగురు మూర్తులు శక్తులు మనిషి మరుపు!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
***
*16-3-2022.
***🙏***✍️💫🕉️

17/03/2022

41-50/2️⃣/సమతమూర్తి/తే.గీ.
41*
రాజు సమ్మతి వెంటనే ప్రజల భవిత
నడవడియును మారక నడువదెందు
మనుగడెల్లను తద్రీతి మార్గమందె!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
42*
నైతిక విలువ కర్మగ నడువ మేలు
గాక నిస్వార్థ రహితమై కదల పుడమి
బతుకు సామాన్యు గుదిబండ భవిత యందు!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
43*
పనియు శక్తికి మించిన పైగ పస్తు
కడుపు మంట నాకలికేక గానెయుండు
కనుల మంట నిర్గుపొర్గుల గనగ గలుగు!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
44*
పస్తు పథ్యము లొక్కటే పనులకడ్డు
పడగ పైపెచ్చు మతిమర్పు ప్రభల మగును
పనుల సాధన కష్టంబు నినుమడించు!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
45*
ఉన్న నాడు నిర్లక్ష్యమై మిన్న ఖర్చు
ఊడ్చుకొనిపోవ దు:ఖంబునుబుకు బుగ్గ
బావిచందమై జీవితం పరిణమించు!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
46*
కలిమి యొక్కటి చాలునా గట్టుకెక్క
బుద్ది బలముచే సౌష్ఠవ వృద్ధి యశము
గాంచు మానవాళి సమత కవచముగను
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
47*
ఆది కాలమునాడంత అటవి బతుకె
పల్లె విశ్వనగరమయ్యె ప్రగతి బాట
నాగరికతల కెల్ల ధర్మమే నడకనర్పె!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
48*
కాలికేస్తె వేలికి వేయు కల్లబొల్లి
మాట లందరికి సాధ్యమే మానవత్వ
పరిధి లోపలె ధర్మంబు పాదుకొనును!
సాధు సజ్జన విస్ఫూర్తి! సమతమూర్తి!
49*
ఒక్క వేలున జూపిన చక్కినాల్గు
వేళ్ళు తననుజూపించు వివేకియెరుగు
తనది యన్యాయమనియును తాల్మి వెంట
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
50*
నాల్క గూసిన దెల్లయు నాణ్యమగున
చేయు చేష్టలన్నియు ధర్మ చేతనముల
మంచిచెడు కర్మకటు నిటు పొంచి సాగు!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
***
*17-3-2022.
***🙏***✍️💫🕉️

13/03/2022

31-40/2️⃣/సమతమూర్తి /తే.గీ.
31*
ఆది శేష! ఆచార్య రామానుజాయ!
విశ్వ గురు వేదవేదాంగ వేత్త ప్రణతి!
సాత్విక వినయ సంపన్న స్వామి శరణు!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
32*
మండపమునెక్కి గురుమంత్ర మహిమ చాటి
శిక్షగా శాపమును భరించు చిత్తమొప్ప
గురుని తోవాదు జేసిన గొప్ప శిష్య!
సాధు సజ్జన విస్ఫూర్తి సమత మూర్తి!
33*
ఇంత మందివైకుంఠమ్ము వెళ్ళు వేళ
తాను నొక్కడే నరకంబు తరలితేమి?
యనగ దాసోహమనె గురు వినయమొప్ప!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
34*
భారత సమరము పిదప పలువిధాల
పాప ఫలమనుభవమయ్యె ప్రజలకెల్ల
కలియుగారంభమయ్యెను కర్మ భువిని
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
35*
స్వామి భూదేవి మొరవిని సరియు దిద్ధ
హరియుబంపెఁ రామానుజ గురునిగాను
జనుల గుణగణముల మార్పు జగతియందు
సాధు సజ్జన విస్ఫూర్తి సమత మూర్తి!
36*
సంస్కృత పద నానార్థముల్ చాటు పటిమ
తమకు నైచ్ఛికార్థము విరుద్ధంబు జేసి
హరిహరుల పరస్పర నింద హఠము సాగె!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
37*
కరము హింసాత్మక చరుల కాలమయ్యె
రాజుననుసరించిరి జనుల్ రగిలె పగలు
వాది వాదోపవాదాలు వట్టి నటన
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
38*
బాహ్య సౌందర్య ప్రాధాన్య బాటలందు
దైవమును నిరసించెడు ధైర్యమొదవె
కామమోహిత నాయకుల్ కలుశమతులు
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
39*
పడతి సౌందర్య దాసులు ప్రభులుగాగ
దైవ దూషణ కొనసాగె దనుజులైరి
దారి జను ధనుర్ధాసుడు తమరినడిగె
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
40*
స్వామి రంగనాథుని కనుల సౌరు జూచి
విగ్రహము నవ్వగా గర్వ విజితుడయ్యె
తమరి చరణాలపైబడి దాసుడయ్యె!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
***
*14-3-2022.
***🙏***✍️💫🕉️

13/03/2022

21-30/2️⃣/సమతమూర్తి/తే.గీ.
21*
విద్య సాధన సంపద పెంచు దీక్ష
గాగ విజ్ఞాన ఝరి కొనసాగె నాత్మ
తత్వ సుజ్ఞాన సాధన తప్పుకొనియె!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
22*
కొడుకు చదువు సంపాదన కోరి మొదట
సాగు విధము వేళ్లూనె విశాల దృష్టి
తరము దాటక తత్కాల తర్కమాయె!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
23*
తండ్రి సందేహ పడెనీదు తాత్వికమ్ము
భయము గలిగించె సన్యాసి పథము నెంచి
మది సమస్యగా మారెను మాట వినవు!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
24*
పది దినమ్ములె కొనసాగె పదియు నెలల
పాఠ్య భాగ కృతార్థత పాఠ శాల
మార్పు గురుమార్పు మిగలని తీర్పు తుదకు!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
25*
గుక్క తిప్పుకోనీయవు గురులనైన
ఎవరు నేర్పు వారలు ప్రశ్నకేజవాబు
గురులు చేతులెత్తిరి మరొక గురుని జూపి!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
26*
విజ్ఞ గురువులాధ్యాత్మిక ప్రజ్ఞ పరులు
పండితులు శాస్త్ర సారథుల్ స్ఫష్ట పరచి
నీదు ప్రజ్ఞగనియు శిష్య పదవి గొనిరి!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
27*
విద్య చాలిక నద్వైత విషయ చర్ఛ
సాగవలెనన్న మహనీయ సద్గురాళి
చేరి శుశ్రూషచేపొంద గోరినావు!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
28*
దైవమేపంపె వైష్ణవ దారి యందు
అడ్డ దిడ్డపు వాఖ్యాన జిడ్డునెల్ల
బాపితివి పరులను గెల్చి పటిమజూపి!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
29*
పెండ్లి ఇల్లాలు యిల్లును పెరుగు సంతు
మకర సమబంధనము కరి మాడ్కి హరిని
వేడుకొంటివి సంసృతి వీడ నెంచి!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
30*
వరద రాజగుడిని దీక్ష గురుడొసంగె
దైవయానతిగా సాగె దారిదొరికె
వైష్ణవాన్వయ పరిశుద్ధి వసుధ వెలసె!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
***
*13-3-2022.
***🙏***✍️💫🕉️

13/03/2022

11-20/2️⃣/సమత మూర్తి/తే.గీ.
11*
కలిసి జీవించు తత్వమే కనగ జీవ
విశ్వశాంతికే మతరాజి వేద సూక్తి
లోక కళ్యాణ కారకాలోచనమ్మె!
సాధు సజ్జన విస్ఫూర్తి సమత మూర్తి!
12*
విశ్వమున దుర్గుణ దానవీయ చరిత
నిలిచె మారణ హోమమే నిందితముగ ప్రేమ రహితమై మతబోధ పెరుగ సాగె!
సాధు సజ్జన విస్ఫూర్తి సమత మూర్తి!
13*
శాశ్వతాశాశ్వతమరయ శాస్త్ర పటిమ
దెలియు మంచి చెడుగులు విద్వేష ఫలము
దాని సూచింప నీరాక తప్పదయ్యె!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
14*
కాంతి మతి కేశవుల యాగ కాంక్ష దీరె
పుత్ర కామేష్టి ఫలముగ చిత్రముగను
రాత్రి కలగనిరి వరదరాజగుడిని!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
15*
స్వామి యోచన మతహింస బాపుకొఱకె
ఉడయ వరగురుడ తిరుమంత్రోపదేశ
మెల్ల జనులకు మోక్షమై మేలుజేసె!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
16*
శేషునాంశ సంభూత విశేష జన్మ
వైష్ణవాదర్శ సిద్ధాంత విస్తరణకె
శ్రీశుడయ్యెనీ శిష్య కూరేశ ప్రభువు!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
17*
దుష్టమతి దురితకులో త్తుంగునెదుట
నీదు పేరున వాదించి నేత్రములను
కోలుపోయి నీరక్షణే కోరె తుదకు!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
18*
తమరి గురు మహాపూర్ణులు తగుగ నట్లె
కనులు తొలగింప నీక్షేమ కాంక్ష జనియె
నీ జనోద్ధరణమె వారి నేమమయ్యె!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
19*
ముగురు పూర్ణులు గురులైరి ముందుగానె
వారి విద్యలు తమవశం వాద జయము
చివరి గురుదీక్షయె మతవిశిష్టమయ్యె!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి!
20*
బ్రహ్మ సూత్రపారంగత భాష్యకార
భారతైక్యత సద్బోధ భావ చతుర!
మానవాదర్శ జీవన మార్గ దర్శి!
సాధు సజ్జన విస్ఫూర్తి సమతమూర్తి
***
*13-3-2022.
***🙏***✍️💫🕉️

12/03/2022

1-10/2️⃣/సమత మూర్తి/తే.గీ.
1*
శ్రీహరిహర నాథమై సిరులు జిందె
ద్వైత మద్వైతమై శిష్ట దారి సాగ
శ్రేయమొసగు బోధలను విశిష్టమయ్యె
సాధు సజ్జన విస్ఫూర్తి సమత మూర్తి!
2*
వైష్ణవము సరిహద్దు వాదు తొలగె
సామ్యతగ శైవములు సాగె సత్య నిష్ఠ
హింస నిరసించె జనమంత వినయగతుల
సాధు సజ్జన విస్ఫూర్తి సమత మూర్తి!
3*
ప్రాంతము కులోపకులముల రగులు బేధ
భావ కీలలు చల్లారె భక్తి సకల
జీవ కారుణ్యభావమున్ జిలికె జగతి!
సాధు సజ్జన విస్ఫూర్తి సమత మూర్తి!
4*
సకల ధర్మ సమన్వయ జవము సత్వ
ములను పుంజుకొనగ శాంతి మోదములకు
దారి యేస్ఫురియించె మేధావులందు
సాధు సజ్జన విస్ఫూర్తి సమత మూర్తి!
5*
సూచనలు జేసి మౌలిక సూత్రములకు
బాష్యమును జేసి వాస్తవబాటనడుప
అవతరించిన లక్ష్మణ రామ యనుజ!
సాధు సజ్జన విస్ఫూర్తి సమత మూర్తి!
6*
పుట్టి నప్పుడె నీమేనీ పూర్ణ తేజ
దీప్తి గాంచియు దైవమె దిగెనటంచు
నామము నిడెనునీమేన మామ గారు!
సాధు సజ్జన విస్ఫూర్తి సమత మూర్తి!
7*
కఠిన నృపతులు హిరణ్యకశిపు రీతి
భక్తి శాసించిరట బలవంతముగను
ఇష్ట రాజ్యపాలన చేత దుష్టు లైరి!
సాధు సజ్జన విస్ఫూర్తి సమత మూర్తి!
8*
మతములరిషడు వర్గమాతృకలుగ
జేయబూని పురాణముల్ చెప్పు గురులు
వేదముల దాచి తత్కాల వేడ్క గనిరి
సాధు సజ్జన విస్ఫూర్తి సమత మూర్తి!
9*
తగవులాటల యలనాటి తత్వములను
అసుర తత్వంబు జృభించె విసురుగాను
పదము వేరు పదార్థము పలుకు వేరు
పరులగాజూడ బడిరిట భరతజనులు!
సాధు సజ్జన విస్ఫూర్తి సమత మూర్తి!
10*
వైష్ణవము నీదు కృషిచేత విస్తరించె
శైవమును బసవాదులు సంస్కరింప
నవ్య నిర్వచనమునసాగె నరులగొప్ప!
సాధు సజ్జన విస్ఫూర్తి సమత మూర్తి!
***
*12-3-2022.
***🙏***✍️💫🕉️

12/03/2022

1-108/1️⃣/భాష్యకార శతకము /తే.గీ.
సమర్పణము. ధన్యవాదములతో...

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address

Hyderabad