02/10/2023
ఒకే రోజు జడ్చర్ల మరియు అబ్దుల్లాపూర్మెట్ లోని మానసిక దివ్యాంగుల మరియు అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
నిన్న మన శ్రీ సత్యేశ్వర సేవా ఆశ్రమం జడ్చర్ల లో నిత్యం జరుగుతున్న నిత్య అన్నదాన యజ్ఞానికి ఎంతో ఉదార స్వభావంతో నిన్న
అన్నదానానికి విశేషమైన ఆర్ధిక సహకారం అందించిన దాతలు, దయామయులు , ఉదార స్వభావులు , సమాజ సేవా తత్పరులు శ్రీమతి & శ్రీ Dr జ్యోతి - జైపాల్ నాయక్ ( Jyothi Helping Hands Foundation, Hyderabad ) గార్లు మరియు వారి కుటుంబ సభ్యులు R/o హైదరాబాద్. గోత్రం : భూక్య. వీరి వివాహ వార్షికోత్సవము సందర్బంగా ఇక్కడి అనాధ మానసిక దివ్యంగులకు నిన్న అన్నదానం చేయడం జరిగినది. వారికి వారి కుటుంబ సభ్యులకు మరియు బందు మిత్రులకు ఆ భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు, ఆయుః ఆరోగ్యాలు నిండుగా మెండుగా ప్రసాదించాలని ఆ భగవంతుడిని హృదయ పూర్వకముగా ప్రార్థిస్తున్నాము.
ఈనాడు ఈ అభాగ్యులకు మీరు చేసిన అన్నదానం ద్వారా మీరు పొందిన మహదానందాన్ని మీ బంధుమిత్రులతో సోషల్ మీడియాలో పంచుకోగలరని మనవి.
"శతమానం భవతి"
" దీర్ఘ సుమంగళీ భవ "
" లక్ష్మీ సరస్వతీ మాతల
అనుగ్రహ సిద్ది రస్తు "
"ఆయుః ఆరోగ్య ప్రాప్తి రస్తు "
"అన్నదాత సుఖీభవ "
"ధన్యవాదములు "

05/12/2022