01/06/2026
మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం విజయవంతం
ఘట్కేసర్ మండలం పరిధిలోని అన్నోజీ గూడ లోని తుల్లిప్ హోటల్లో జరిగిన పోచారం, ఘట్కేసర్, ఎదులాబాద్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించబడింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా * *మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ &*మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి గారు*BRS పార్టీ నాయకుడు చామాకురా మహేందర్ రెడ్డి గారు* హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా *రాగిడి లక్ష్మారెడ్డి గారు*
మాట్లాడుతూ, పార్టీ కష్టకాలంలో సైతం మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేస్తూ, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలిపారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, వారి సేవలను పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు.
ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయడం, అలాగే SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సమిష్టిగా ముందుకు సాగాలని *రాగిడి లక్ష్మారెడ్డి గారు* నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్/ డివిజన్/వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, యువజన విభాగం నాయకులు - సభ్యులు, పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు - సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
31/05/2026
ఈ రోజు మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ & జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా *మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ &*మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి గారు*BRS పార్టీ నాయకుడు చామాకురా మహేందర్ రెడ్డి గారు* హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయడం, అలాగే SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సమిష్టిగా ముందుకు సాగాలని *రాగిడి లక్ష్మారెడ్డి గారు* నాయకులు పిలుపునిచ్చారు.
సభ్యత్వ రుసుములు: సాధారణ సభ్యత్వం – రూ.10/- క్రియాశీలక సభ్యత్వం – రూ.50/-
ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు.
రాబోయే రోజుల్లో బి ఆర్ ఎస్ పార్టీని మరింత బలపర్చేందుకు కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేయాలని నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్/ డివిజన్/వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, యువజన విభాగం నాయకులు - సభ్యులు, పార్టీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు - సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
28/05/2026
మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ తులిప్స్ గ్రాండ్ హోటల్,చెంగిచెర్ల X రోడ్ లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ సన్నాహక సమావేశానికి *, *మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ &*మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు* *BRS పార్టీ నాయకుడు శ్రీ చామాకురా మహేందర్ రెడ్డి గారు* ** ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని *మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ & *మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జ్ శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు* ఆయన పిలుపునిచ్చారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని , *రాగిడి లక్ష్మారెడ్డి గారు* సూచించారు. పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను మరింత పెంచేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు మంద సంజీవ్ రెడ్డి గారు పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి గారు బోడుప్పల్ మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు, మాజీ డిప్యూటీ మేయర్ కొత్త రవి గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
28/05/2026
త్యాగానికి ప్రతిరూపంగా నిలిచే ఈ పండుగ రోజున సమస్త మానవాళికి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. ముస్లింసోదర, సోదరీమణులందరికీ
బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు
25/05/2026
ఈ రోజు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం లో పాల్గొన్న *తలసాని శ్రీనివాస యాదవ్ గారితో* కలసి పాల్గొన్న *మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి గారు*
రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ కేలండర్ కోసం రెండున్నరేళ్లుగా యువత ఎదురు చూస్తోంది
ఫీజు రీయింబర్స్ మెంట్, విదేశీ విద్య కింద ఆర్థికసాయం ఇంకా పెంచుతామని అన్నారు
యువ డిక్లరేషన్ ప్రకటించిన సరూర్ నగర్ స్టేడియంలోనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం
వచ్చే నెలలో చలో సరూర్ నగర్ కార్యక్రమం చేపడతాం
విద్యా కమిషన్ చైర్మన్ రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది
అందరి గుర్తులు చేరిపోయాలన్న ఆలోచనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వకుండా వైఎస్సార్, కేసీఆర్ పేర్లు చెరిపేయాలని అనుకుంటున్నారు
యూత్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల అమలు కోసం యువత ఎదురు చూస్తున్నారు... వారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు?
ప్రియాంక గాంధీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ను సీఎం ఒక్కసారి చూడాలి
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభం అయ్యాక... చుట్టు పక్కల ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తారా?
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఫైల్ కేసీఆర్ ప్రభుత్వంలో నేనే ఫైల్ మూవ్ చేశాను, ఆ తరువాత ఎన్నికలు వచ్చాయి
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం
ఈ కార్యక్రమంలో వారితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరియు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
25/05/2026
కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని NKNR హాల్లో *కూకట్పల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన బి.ఎల్.ఏ (BLA)ల శిక్షణ కార్యక్రమానికి *బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ *కేటీఆర్ గారు ఎంఎల్సీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు,*మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు*, *ఎమ్మెల్యే వివేకానంద గారు,*ఎమ్మెల్సీ నవీన్ రావు గారు*,*మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి గారు*, మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ గారు,మాజీ చైర్మన్ గజ్జెల నాగేష్ గారు,ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ, పార్టీ బలోపేతం మరియు ఓటరు జాబితా పరిరక్షణలో BLAల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. బి.ఎల్.ఏల ప్రధాన బాధ్యతల్లో భాగంగా ఓటరు జాబితాను పరిశీలించడం, కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టడం, తప్పులు మరియు డూప్లికేట్ పేర్లను గుర్తించడం, ఓటర్ల వివరాలను సరిచేయించేందుకు సహకరించడం, ఎన్నికల కమిషన్ నిర్వహించే ప్రత్యేక సర్వేలు మరియు రివిజన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని సూచించారు. పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను మరింత పెంచేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు.
కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమమని తెలిపారు. అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించి, ప్రతి అర్హుడైన ఓటరుకు న్యాయం జరిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు, వివిధ విభాగాల కమిటీ మాజీ చైర్మన్లు, పలు డివిజన్ల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, పలు విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు, అనుబంధ కమిటీ సభ్యులు మరియు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.