15/09/2025
నిన్న జరిగిన ఆదివాసీ మేధావుల మేధోమథనం కార్యక్రమం నికి సంబంధించిన వివిధ పత్రికలలో వెలువడిన కథనాలు...✍️✍️✍️
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Voice of Indigenous People News, Hyderabad.
15/09/2025
నిన్న జరిగిన ఆదివాసీ మేధావుల మేధోమథనం కార్యక్రమం నికి సంబంధించిన వివిధ పత్రికలలో వెలువడిన కథనాలు...✍️✍️✍️
13/09/2025
13/09/2025: ప్రపంచ ఆదివాసీ హక్కుల దినోత్సవం
07/09/2025
లంబాడీలు ను తొలగించాలని ఆర్ట్స్ కళాశాల ఎదుట మీడియా మిత్రులు నిర్వహించిన కార్యక్రమంలో
"ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు" బట్టా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.......
ఈరోజు "అత్యున్నత న్యాయస్థానం ఐన సుప్రీమ్ కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు షెడ్యూల్ ట్రైబ్ గా చలామణిలో ఉన్న లంబాడీలకు ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అని నోటీసు" ఇచ్చిన తరువాత ఇప్పుడు ఈ రాష్ట్రం లో ఉన్నటువంటి లంబాడి, బంజారా, సుగాలీ అనేటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడున్నటువంటి తెలుగు ప్రజలను, తెలంగాణ వాదులను, ప్రజాస్వామిక వాదులను, జాతీయ వాదులను కూడా కుట్రలు పన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం కనిపిస్తా ఉన్నది.
"ఆదివాసులు అంటే చరిత్రపుటల్లోకి ఎక్కినటువంటి చరిత్ర ఉన్నది. ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే తెలంగాణ లో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానీకం యొక్క త్యాగాల తల్లుల నుండి వచ్చినదే తెలంగాణ. ఇవ్వాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకం అయినటువంటి "నీళ్ళు, నిధులు, నియామకాలు" అనేటువంటి అంశం కూడా మా "కొమురం దాదా ఇచినటువంటి జల్, జంగిల్, జమీన్" అనే నినాదం నుండి వచ్చినదే".
ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ట్రైబల్ మినిస్టర్ గా పది సంవత్సరాల కాలం పాటు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే మంత్రి హోదాలో ఉన్నప్పుడు మేము వెళ్ళలేనటువంటి పరిస్థితి మా ఆదివాసులది.
"ఇవ్వాళ మా ఆడపడుచు, మా అడబిడ్డ, ఆదివాసీ ముద్దుబిడ్డ, సమ్మక్క సారక్క వారసురాలు మా అక్క "సీతక్క" గారు కేబినెట్ హోదాలో ఉంటే మాజీ పార్లమెంటేరియన్ సీతారామ్ నాయక్ మాట్లాడుతూ.....సీతక్క తన సొంత కానిస్టిట్యుయన్సీలో తిరిగే విషయం గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.....గతంలో BRS ప్రభుత్వాన్ని కూలగొట్టినటువంటి చరిత్ర మాది, మేము తలచుకుంటే ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి పరిస్థితిని రెచ్చగొడుతున్నాడు. అసలు ఆయన పోటీ చేసినటువంటి పార్లమెంట్ స్థానం మహబూబాద్ కానిస్టిట్యుయన్సీ, ఆయన పోటీ చేసినటువంటి పార్లమెంట్ స్థానం లో ఆదివాసుల ప్రజానీకం ఎంత ఉన్నారు అనేది ఆయన గుర్తుపెట్టుకోవాలి, మరి ఆయన ఎట్లా తిరుగుతాడు అనే విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించుకోవాలి.
"ఇవ్వాళ ఆదివాసులకు పోరాటం అంటే కొత్తేమీ కాదు, ఆదివాసులంటే ఉద్యమం, ఉద్యమం అంటే ఆదివాసులు అనేటువంటి చరిత్ర ఉన్నది". అది ఆయన గుర్తు పెట్టుకోవాల్సిన విషయంగా తెలియజేస్తున్నాము.
అయ్యా మేధావులారా, ప్రజాస్వామికవాదులారా, తెలంగాణ వాదులారా, జాతీయవాదులారా ఒక్కసారి మా గొంతుకతో మా ఈ ఆవేదన వెల్లబుచ్చుకునేటువంటి ఈ ప్రయతం, న్యాయస్థానం ద్వారా న్యాయపోరాటం ఎప్పుడైతే మేము తీసుకున్నామో ఆరోజునుండి కూడా మాకున్నటువంటి, మాతో కలిసివచచ్చేటువంటి వాళ్ళను కూడా....."మేము 40 లక్షల జనాభా ఉన్నాము, మేము తలచుకుంటే ఏదైనా చేయగల్గుతాము అని రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను ఒక తప్పుదోవ పట్టించే పరిస్థితి కనిపిస్తున్నది".
"ఒక క్రిమినల్ క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్రం లో ఏర్పడి "మా రిజర్వేషన్ను" ఉపయోగించుకొని ఉన్నతమైన అవకాశాలను అందిపుచ్చుకొని విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలలో వాళ్ళే, అదికాక రాజకీయ రంగం లో కూడా వాళ్ళే, అదీ సరిపోదు అన్నట్టు చివరికి మా "అస్థిత్వం" లో కి చొరబడ్డారు.
ఇవ్వాళ మా "సమ్మక్క సారక్క ట్రస్టు బోర్డులోకి" కూడా చేరుకుని వాళ్ళ మంత్రి ఉన్నప్పుడు మాకు కూడా వాటా కావాలి అని మాట్లాడినటువంటి దౌర్భాగ్యపు స్థితి కనిపిస్తున్నది. "మా విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలకు మేము దూరం ఐన కూడా ఇబ్బంది పడలేదు, రాజకీయం లోకి చేరి దోచుకున్న కూడా ఇబ్బంది పడలేదు కానీ ఇవ్వాళ "మా అస్తిత్వమే ప్రశ్నార్థకం" ఐన తరువాత "మేము, మా అస్థిత్వం ఏంటి అనే పరిస్థితి నెలకొన్నది" అందుకే మేము పోరాటానికి సిద్ధమయ్యము".
అయ్యా మేధావులారా, ప్రజాస్వామిక వాదులారా, తెలంగాణ వాదులారా గుర్తుపెట్టుకోండి "ఇంత అన్యాయం జరుగుతున్నది కావున మేము నిజాయితీగా, రాజ్యాంగబద్దంగా కోట్లాడుతున్నాము, రాజ్యాంగం లో మాకు ఆ హక్కు ఉన్నది, మా హక్కుల కోసం మేము కోట్లాడుతున్నాము".
ఈరోజుకి ఐన కూడా న్యాయంవైపు నిలబడాలి అని, మా గొంతులో గొంతుక అయ్యి మీరు మాతో కలిసిరావాలని కోరుకుంటున్నాము. "వాళ్ళను చట్టబద్ధంగా కలిపితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, చట్టబద్ధంగా కలపలేదు అనేదే మా వాదన".
"1956 లో తెలంగాణ మరియు ఆంధ్రా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఆంధ్రాలో ఉన్న సుగాలీలను చేర్చాలనే ప్రతిపాదనను గడి లింగన్న గౌడ్ అనే ఒక MP ప్రవేశపెట్టడం జరిగింది కానీ అది నెగెటివ్ బిల్లు అవ్వడం జరిగింది కానీ......దాని కూడా వీళ్ళు ఆసరాగా చేసుకుని మమ్మల్ని ST జాబితాలో కలిపారు అంటున్నారు, మరి 1971 లో BC A జాబితాలో ఎలా ఉన్నారు? మరియు 1976 లో ST జాబితా అని వాళ్ళే అంటారు, ఇంకొక పెద్దమనిషి మేము 1931 నుండి నిజాం ప్రభుత్వం లో ఉన్నామంటాడు", అంటే తెలంగాణ ప్రజానీకాన్ని, ప్రజాస్వామికవాదుల్ని, మేధావుల్ని, రాజకీయ పార్టీలను సైతం కుట్ర పూరితంగా
తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
కాబట్టి "ఈరోజు RTI చట్టం ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే తెలియజేసింది ఏమనగా ఆంధ్రప్రదేశ్ లో ST హోదా కల్పించబడలేదు అని కేవలం DNTsగా మాత్రమే పరిగణించబడ్డారు అని", ఐతే ఈ రాష్ట్ర గవర్నర్లను, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మా గోస, ఆవేదన వెలిబుచ్చుకున్నా కూడా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో న్యాయపోరాటం చేద్దాం అని నిర్ణయించుకోవడంతో ఈరోజు "సుప్రీమ్ కోర్టు" వరకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
"ఇప్పటికీ.....తప్పుదోవ పట్టించే కుట్రలు జరుగుతున్నాయి, తెలంగాణ ప్రజానీకాన్ని,మేధావుల్ని, రాజకీయ పార్టీలను తమ జనాభా చూపి బెదిరించడం, మభ్యపెట్టడం జరుగుతుంది".
"ఇవ్వాళ ఆదివాసి ప్రజాప్రతినిధులు మన జాతి మన అస్తిత్వ సమస్య అని ముందుకు వస్తే వాళ్ళను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు, వాళ్ళను గురిపెడుతున్నారు. ఆదివాసీ ప్రజానీకం పై, ఆదివాసీ ప్రజాప్రతినిధుల పై, ఆదివాసీ మద్దతుదారుల పై ఎలాంటి దాడులు జరిగినా పోరాటం చేయడం మాకు కొత్తకాదు. చరిత్రపుటల్లోకి చూస్తే తెలుస్తుంది ఆదివాసుల పోరాట చరిత్ర".
"ఆదివాసుల జీవితమే పోరాటం". రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీలను అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని మభ్యపెట్టే కుట్ర జరుగుత్తున్నది.
వాళ్ళు 1976లో 108 యాక్ట్ ప్రకారం కలిపారు అంటున్నారు, అసలు "108 యాక్ట్" అనేది "ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ " కదా,
‘‘ఈ చట్టంలో ఎక్కడైనా ఈ కులాలు నీ కలపండి అని కలిపినం అని చెప్పలేదు".....
అంతేకానీ మిమ్మల్ని కలపడానికి
"ఒక కమిటీ వేయలేదు",
"ఒక ఆంత్రోపాలాజికల్ సర్వే కూడా జరగలేదు", "రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ కూడా రాలేదు"
అటువంటిది ఇవ్వాళ
"మా రిజర్వేషన్ ను ఉపయోగించుకొని విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందడమే కాకుండా మా అస్థిత్వం పై దాడి చేస్తూ మమ్మల్ని తప్పుదోవ పట్టి మమ్మల్నే ఆదివాసులు కాదు అని మాట్లాడుతున్న పరిస్థితి".
కాబట్టి "తెలుగు ప్రజల్లారా, తెలంగాణ ప్రజల్లారా, విప్లవోద్యమకారులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు "మా ఆదివాసీ" సమాజానికి గొంతుక అయ్యి మీ మద్దతు తెలియజేయాలని మా ఆదివాసీ సమాజం తరపున విన్నవించుకుంటున్నాం.
"దయచేసి ఒక్కసారి ఆలోచించండి నేటికీ మా ఆదివాసుల నుండి ఒక్క IAS , IPS ఒక గ్రూప్ 1 ఆఫీసర్ లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి."
మా ఆదివాసులు ఇంకా "50 ఏళ్ళు" వెనక్కి "నెట్టివేయబడ్డారు" అని గమనించగలరు. చట్టబద్ధంగా కలిపితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ...అలా జరగలేదు.
"రాజ్యాంగబద్ధంగా మేము సుప్రీమ్ కోర్టు కి మా గోడును తెలిజేసాము అంతేకానీ మేము ఎన్నడూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు".
ఇప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుగు ప్రజలకు, తెలంగాణవాదులకు తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతున్నది అని తెలియజేస్తున్నాను.
"ఇవ్వాళ కాకపోతే రేపైనా మాకు న్యాయం జరుగుతుంది. అని ఈ రాజ్యాంగ మీద ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మీద మాకు నమ్మకం ఉంది.
"1976 లో యానాది, ఎరుకల, లంబాడీలు DNTలుగా ఉన్నారో వాళ్ళకు కేవలం విద్యాపరంగా రిజర్వేషన్ G O 149 ద్వారా కల్పించడం జరిగింది. దాన్నే పొందుపరచండి, దాన్నే ఇవ్వండి అంతకుమించి కొత్తగా ఏదైనా ఇచ్చిన కూడా అది చెల్లుబాటు కాదు సరికదా అది మీ రాజకీయలకు చెందిన ప్రోద్బలమో లేక వీళ్ళు మభ్యపెట్టినటువంటి మాటలకు మీ రాజకీయ సౌలభ్యం కోసం లేక మీ సొంత ప్రయోజనాలకోసం చేసినటువంటి తప్పిదం అవుతుంది".
ఇది దృష్టిలో పెట్టుకొని మీరు
"ఆదివాసుల పక్షమా?"
"న్యాయం పక్షమా?"
"అన్యాయం పక్షమా?"
అనేది మీరు నిర్ణయించుకోవాల్సిన బాధ్యతగా
ఈ ఆర్ట్స్ కాలేజీ వేదికగా తెలంగాణ
"ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం" విద్యార్థుల నుండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం OU కమిటీ విద్యార్థులు
కొడెం పాపారావు
బాడిషా లక్ష్మీపతి
కొమరం సాగర్
పెండకట్ల మహేందర్
హరిత
జీవన్
హరిత విద్యార్దిని విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు...
ఆదివాసుల అయ్యి ఉండి తమ సంస్కృతిని వదిలేసి ఇతరుల సంస్కృతి వెనక పరిగెడుతుంటారో, తమకి తాముగా ప్రకటించుకుంటారో, వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను "మన సంస్కృతియే మన గుర్తింపు, మన సంప్రదాయమే మన జీవన విధానం"
ఇలా పాకులాడే వాళ్లు ఎవరు అంటే...తమ తండ్రిని నాన్న అని పిలవడంకంటే పక్కోడి నాన్నను నాన్న అనడానికి ఇష్టపడే వాళ్లు, మేలుకో ఆదివాసీ మేలుకో కలిసి ఉండడమే మనకు బలం లేదంటే మనం విచిన్నమావడం ఖాయం.
జై ఆదివాసీ
జై జోహార్
✊✊✊
10/08/2025
🌳🌳🌳ప్రపంచ ఆదివాసీ దినోత్సవం🌳🌳🌳
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో
ఆధార్ సొసైటీ
ఆదివాసి ఉద్యోగుల సంక్షేమ సాంస్కృతిక సంఘం,
ఆదివాసి స్టూడెంట్స్ ఫోరం,
ఆదివాసి మహిళా చైతన్య శక్తి ఆధ్వర్యంలో నిర్వహించిన
ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు
ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్క
*మంత్రి సీతక్క*
ఆదివాసీల హక్కులు, అస్తిత్వం కోసం, ఆదివాసీలకు జరుగుతున్న మంచి చెడులను చర్చించుకునేందుకు అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ఒక మంచి వేదిక
మన మూలాలు అడవి జల్ జంగల్ జమీన్ తో ఆటపాటలతో ఉన్నప్పటికీ.. ఉన్నత విద్య అభ్యసించడం కోసం అనేక కష్టాల్లోర్చి ఇంత దూరం వచ్చిన మీరు..ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున మన హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న అందుకు సంతోషంగా ఉంది
ఎంత ఎత్తుకు ఎదిగిన మన జాతి గొప్పతనం మూలాలు మన సంస్కృతి మన జీవన విధానాలను ఎప్పుడు మర్చిపోకుండా కాపాడుకోవాలి
మన మూలాలు ఉంటేనే మనకు అస్తిత్వం
అందుకే మన మూలాలను కాపాడుకోవాలి
దేశంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో పడింది
రాజ్యాంగం లేకపోతే మనకు రాజ్యాంగ ఫలాలు అందవు
దేశవ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు అటవీ ప్రాంతాల్లో నీళ్లు నిధులు అడవులను ఆక్రమిస్తున్నాయి
దాన్ని ప్రశ్నిస్తే అనేక రూపాల్లో ఆదివాసి బిడ్డలను చంపుతున్నారు
రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కులు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు
వారికి వారి హక్కులను తెలియజేయాల్సిన బాధ్యత ఆదివాసి విద్యార్థి ఉద్యోగ సంఘాలే
నేను ఈ స్థాయిలోకి రావడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను
ఎన్ని సమస్యలున్నా నేను విద్యను ఆపలేదు
విద్య ద్వారానే విముక్తి సాధ్యమవుతుంది
అందుకే విద్యా రంగంలో ఆదివాసీలు రాణించాలి
ఎదిగి వచ్చిన ఆదివాసి బిడ్డలు తోటి సమాజం కోసం కొంత సమయాన్ని వెచ్చించండి
మీతో కలిసి నడవడానికి అప్పుడు ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉంటా
చరిత్రను తవ్వండి, పురాతన ఆనవాలను గుర్తించండి, మన చరిత్ర రికార్డ్ చేయండి
అప్పుడే మన సంస్కృతిని భవిష్యత్ తరాలకు బలంగా తెలియజేయగలము
ప్రకృతి మీద ఆధారపడి ఎదిగే జాతి మనది
ఈ ప్రత్యేకతను మనం కాపాడుకోవాలి
మన జాతులు అంతరించి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే
ఆదిమ జాతుల ఆహార అలవాట్లను కాపీ కొడుతున్నారు
ఆదిమ సమాజంలో బలమైన ప్రజాస్వామీక వ్యవస్థ ఉంది
ఆదివాసి సమాజానిది సామూహిక శ్రమైక జీవన విధానం
ఆ సామూహిక జీవన విధానాన్ని పరిరక్షించుకుందాం. ఈ కార్యక్రమంలో ఆధార్ సొసైటీ అధ్యక్షుడు గోంది వెంకటరమణ గారు మెట్ల. పాపయ్య సార్ , ఆదివాసీ ప్రొఫెసర్ కిశోర్ కుమార్ సార్, గుమ్మడి అనురాధ గారు ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బట్టా. వెంకటేశ్వర్లు ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు...
జై ఆదివాసి... ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి
✊✊✊
10/08/2025
🌳🌳🌳ప్రపంచ ఆదివాసీ దినోత్సవం🌳🌳🌳
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఆదివాసి ఉద్యోగుల సంక్షేమ సాంస్కృతిక సంఘం, ఆదివాసి స్టూడెంట్స్ ఫోరం, ఆదివాసి మహిళా చైతన్య శక్తి ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు
ముఖ్యఅతిథిగా హాజరైన అశ్వరావు పేట శాసన సభ్యులు
జారే.ఆదినారాయణ అన్న గారు
ఆదివాసీల హక్కులు, అస్తిత్వం కోసం, ఆదివాసీలకు జరుగుతున్న మంచి చెడులను చర్చించుకునేందుకు అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ఒక మంచి వేదిక
మన మూలాలు అడవి జల్ జంగల్ జమీన్ తో ఆటపాటలతో ఉన్నప్పటికీ.. ఉన్నత విద్య అభ్యసించడం కోసం అనేక కష్టాల్లోర్చి ఇంత దూరం వచ్చిన మీరు..ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున మన హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న అందుకు సంతోషంగా ఉంది
ఎంత ఎత్తుకు ఎదిగిన మన జాతి గొప్పతనం మూలాలు మన సంస్కృతి మన జీవన విధానాలను ఎప్పుడు మర్చిపోకుండా కాపాడుకోవాలి
మన మూలాలు ఉంటేనే మనకు అస్తిత్వం
అందుకే మన మూలాలను కాపాడుకోవాలి
దేశంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో పడింది
రాజ్యాంగం లేకపోతే మనకు రాజ్యాంగ ఫలాలు అందవు
నేను కూడా హైదరాబాద్ లో చదువుకోవటానికి వచ్చిన అప్పుడు అసలు మేము ఉండటానికి కనీసం వసతి గృహాలు కూడా లేకుండా ఉండే ఇప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న మీకు మీ జారే అన్న గారు అండగా ఉంటాడు అని హామీ ఇచ్చారు అదే విధంగా
నా జీవితం ఒక మీకు ఆదర్శం అని తను ఒక విద్యార్థి దశ నుండి జాతి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటునే ఉన్నత చదువులు చదివి ఉద్యోగము సాధించను.
మళ్లీ సేవ చేయాలి అని ఒక సంకల్పంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక దశబ్దా కాలం పాటు ఎన్నో అవరోధాలు ఎదురైనా అలాగే ప్రయత్నం చేస్తూనే ఉంటే నేను ఈరోజు మీ ముందు ఒక శాసన సభ్యుడి గా మాట్లాడుతున్నాను.
కనుక మీరు కూడా అలాగే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు అనుకున్న విజయాన్ని సాధిస్తారు.
ఉన్నత చదువులు కొరకు తనవంతు సహాయం ప్రతి సంవత్సరం 1,00,000/- ఆర్ధిక సహాయం చేస్తానని ప్రకటించాడు.
అలాగే ఆదివాసీ గొంతుక అరుణోదయ మిత్ర బృందం విమలక్క వారు రచించిన ఆదివాసీ పాటను ఆవిష్కరించారు.
ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆదివాసీ కళ రూపాలు తో కలిసి నృత్యము చేశారు...
ఆధార్ సొసైటీ అధ్యక్షుడు గోంది వెంకటరమణ గారు మెట్ల. పాపయ్య సార్ , ఆదివాసీ ప్రొఫెసర్ కిశోర్ కుమార్ సార్, గుమ్మడి అనురాధ గారు ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బట్టా. వెంకటేశ్వర్లు ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు...
జై ఆదివాసి... ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి
✊✊✊
07/08/2025
*ప్రపంచ ఆదివాసీ దినోత్సవం* సందర్భంగా, *ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం (ASF),* *ఆధార్ సొసైటీ* మద్దతుతో *ఉస్మానియా యూనివర్సిటీ* లో ఘనంగా క్రీడా పోటీలను నిర్వహించింది. ఈ క్రీడా సంబరాలలో నగరం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ఆదివాసీ విద్యార్ధిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొన్ని ముఖ్యమైన క్రీడలు క్రికెట్, వాలీబాల్, ఖో-ఖో, బ్యాడ్మింటన్, మరియు అథ్లెటిక్స్ వంటి వివిధ క్రీడాంశాలలో వారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమనికి గౌరవ అతిథులు డా . సీతక్క మంత్రి వర్యులు గారి తనయుడు ఆదివాసీ ముద్దు బిడ్డ*కుంజా సూర్య అన్న* గారు అదేవిధంగా *గోంధి వెంకటరమణ గారు* ( AADHAR Society ప్రెసిడెంట్) , *మెట్ల పాపయ్య గారు* (AADHAR Society జనరల్ సెక్రటరీ), ఆదివాసీ ప్రొఫెసర్లు డా *. కిషోర్ కుమార్* గారు, *డా. అనురాధ* గారు, మరియు ASF రాష్ట్ర అధ్యక్షులు *బట్టా వెంకటేశ్వర్లు** గారు కలిసి ప్రారంభించారు. *కుంజా సూర్య అన్న* గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆదివాసుల అంటేనే శారీరకంగా దృఢత్వం స్వభావం కలిగినటువంటి వాళ్ళం కనుక పట్టుదల తో ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు.ఆదివాసీ విద్యార్ధిని, విద్యార్ధులు ఉన్నత చదువులు చదవాలి, క్రీడలలో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి. ఆదివాసీ విద్యార్థులకు ఉన్నత చదువుల కొరకు తనవంతుగా ఆర్ధికంగా కూడా సహాయం చేస్తాను అన్నారు అదేవిధంగా తన నాన్న గారు ఆదివాసీ సమాజం అభివృద్ధి కొరకు నిత్యం పరితపించే వాడు.తన ఆశయాన్ని కొనసిగిస్తానని అలాగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (ఆగస్టు - 9) కార్యక్రమానికి తనవంతుగా ఆర్ధిక సాయం కూడా అందిస్తాను అని తక్షణమే అందించారు. తన చివరి శ్వాస వరకు ఆదివాసులకి తోడుగా ఉంటాను అని హామీ ఇచ్చారు .ఈ క్రీడలు ఆదివాసీ యువతలో ఐక్యతను మరియు క్రీడా స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించబడ్డాయి. ఈ రెండు రోజులపాటు జరిగిన క్రీడలు విజయవంతమైంది. ఈ కార్యక్రమం లో విద్యార్ధిని విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు...