18/02/2025
https://youtu.be/ex0bRLFlM7s
CM Revanth Reddy SPeech | Cyber Security Conclave-2025 at HICC,Hyderabad | Ytv Digital Media
ప్రపంచంలో నేరాల రూపు విధానం చాలా వేగంగా మారుతుంది ఈ వేగంగా మారే విధానంలో మన యొక్క పరిపాలన విధానాలను మార్చుకొని...
13/07/2024
తెలంగాణ ఆల్ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ (TAUTA), తేదీ: 13.07.2024, విషయం: గౌరవనీయ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి
తెలంగాణ ఆల్ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ (TAUTA) ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ. ఎ. రేవంత్ రెడ్డి గారికి మరియు శ్రీ బుర్ర వెంకటేశం , ఐఏఎస్ , ప్రిన్సిపాల్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వం- ఎడ్యుకేషన్ , అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో ఉన్న ప్రధాన సమస్యలు వాటి సాధ్యమైన పరిష్కారాలతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకరావటం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రధానమైన సమస్యలు....
* ఉద్యోగ పదవి విరమణ వయోపరిమితి వయస్సును 65 సంవత్సరాలకు పెంచడం (UGC మార్గదర్శకాల ప్రకారం)
* అన్ని విశ్వవిద్యాలయాలకు RSP - 2016 (UGC) పెండింగ్ బకాయిల చెల్లింపులు.
* అన్ని యూనివర్సిటీలలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్
* యూనివర్సిటీ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డు ప్రయోజనాలను అందజేయాలి
* ఇవి కాకుండా, వివిధ విశ్వవిద్యాలయాల సమస్యలు (CAS, తెలంగాణ విశ్వవిద్యాలయాలలో పెండింగ్‌లో ఉన్న CAS ప్రమోషన్లు, OU CPS/OPS, AICTE/ UGC మార్గదర్శకాల క్రమబద్ధీకరణ వంటివి) కూడా సూచించబడ్డాయి. అన్ని సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని కోరగా, గౌరవ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
కార్యక్రమంలో టౌటా అధ్యక్షులు ప్రొఫెసర్ జి. మల్లేశం, ప్రొఫెసర్ సిహెచ్. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు (వర్కింగ్), ప్రొఫెసర్ సరస్వతమ్మ (TMV), ప్రొఫెసర్ బి. మంగు (OU), డాక్టర్ వనజ ఉదయ్ (PSTU), ప్రొఫెసర్ సైదా నాయక్, ప్రొఫెసర్ మాధవి కుమారి (JNTUH), డాక్టర్ ప్రశాంతి , డాక్టర్ ఎం. మధు (MGU), తదితరులు పాల్గొన్నారు
13/07/2024
కాంగ్రెస్ లోకి శేరిలింగంపల్లి బీఆరెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ
జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
13/07/2024
Chief Minister Sri A Revanth Reddy participated in interaction programme on Quality Engineering Education in Telangana, organized at JNTU , Hyderabad campus today ( Saturday)
CM Revanth Reddy’ speech points
The programme has been conducted to explain the government policies in promoting technical education. Former Chief Minister of the erstwhile united Andhra Pradesh YS Rajashekhara Reddy introduced fee reimbursement program aiming to provide free education to the poor children.
The arrears of fee reimbursement accumulated due to the change of priorities under various circumstances. IT and Industry minister D Sridhar Babu is entrusted with the responsibility of addressing the issue of clearance of fee reimbursement.
The government will put all efforts into the timely payment of fee reimbursement from this academic year. There is no need to worry about the release of fee reimbursement funds. My government adopted a three pronged strategy in the implementation of fee reimbursement.
All the great structures in the country and in the world are the creation of the engineers. Engineers invented all man-made wonders.
Engineering colleges should not become a factory of generating unemployed youth. The Colleges should strive hard to provide employment and build the country’s future . State government is ready to extend all possible help to the institutions.
The engineering colleges should not confine to only creating jobs but also intellectuals for the country. Apart from computer science, the colleges should also promote all types of courses like Civil and mechanical engineering.
As part of a skill development programme, the government has already taken up a project to upgrade the government owned ITIs in collaboration with Tata company at the cost of Rs 2400 crore. The State Government will also launch Skill development University for youth soon.
Artificial intelligence is set to dominate the world after IT and Pharma. The Telangana state will be developed to compete with the world.
My Government will take all decisions to benefit the unemployed youth. Government will conduct examinations as per the notifications issued. Unemployed youth fought for jobs in the last 10 years.
Some political parties and the management of the coaching centers are staging hunger strikes for the postponement of the exams.
The State Government will release the job calendar soon. On the lines of UPSC, the state government will issue job notifications and fill the posts every year.
The government’s policy is educational institutions should not become centers of political rehabilitation. 30,000 jobs were already filled within 30 days after coming to power in the state.
Despite facing financial constraints and other problems, my government is moving forward by addressing every issue .
13/07/2024
Naidu - Anumula Revanth Reddy Meeting : Well Begun
13/07/2024
he Hon’ble Chief Minister of Telangana Announces the Global AI Summit and Unveils the Logo
The Hon'ble Chief Minister of Telangana, Shri A. Revanth Reddy announced the much-anticipated Global AI Summit to be scheduled on September 5th and 6th, 2024, at HICC, Hyderabad.Hon'ble Minister for ITE&C, Industries & Commerce and Legislative Affairs, Shri D. Sridhar Babu, along with Special Chief Secretary of the ITE&C Industries & CommerceDepartments, Shri Jayesh Ranjan, today unveiled the logo.
During the logo launch, Hon'ble Chief Minister Shri A. Revanth Reddy said, "The Global AI Summit represents our commitment to positioning our state at the forefront of technological innovation. We eagerly welcome thought leaders and innovators from around the world to Hyderabad."
The summit, with its overarching theme "Making AI Work for Everyone", aims to explore how Artificial Intelligence can benefit and empower society. The event will feature keynote addresses and thought-provoking sessions by global AI experts, tech industry leaders, policymakers, and academicians. These discussions will delve into crucial aspects of AI, including its potential for social good, the importance of safe AI practices, AI's role in driving paradigm shifts across industries, and how it is pushing the boundaries of innovation.
Hon'ble Minister Shri D. Sridhar Babu stated, " The Global AI Summit showcases Telangana's dedication to harnessing the power of AI. This event will be a key platform for knowledge sharing, fostering innovation, and exploring AI's potential to tackle global challenges."
This summit is poised to be a must-attend event for anyone interested in the future of AI and its impact on the world. It offers unparalleled opportunities for learning, networking, and collaboration for AI enthusiasts. The event will feature an impressive lineup of over 50 speakers, attracting 2,000 delegates representing various segments such as industry, academia, startups,government and foundations. Attendees can look forward to expert keynote addresses, engaging panel discussions and fireside chats, and lightning demos showcasing cutting-edge AI technologies. The summit will also witness the launch of "Telangana's AI Compendium" and other groundbreaking announcements for the future of the state’s AI ecosystem. The summit's comprehensive agenda is further enriched by the support of 15+ partners.
The Emerging Technologies Wing of the ITE&C Department is facilitating the organization of this prestigious event. Leveraging its extensive network and partnerships in the tech ecosystem, the wing aims to bring together the brightest minds in AI and ensure a world-class experience for all participants.
The official website for the Global AI Summit will be launching soon, offering more details about the event, including speaker profiles, the complete program schedule, and registration information.
13/07/2024
ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తున్న ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సును ఈ ఏడాది సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. గ్లోబల్ అర్టిఫిషియల్ సదస్సు లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తో పాటు ఐటీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్లోబల్ అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సదస్సును హైదరాబాద్ వేదికగా నిర్వహించటం గర్వంగా ఉందని అన్నారు. సాంకేతిక ఆవిష్కరణలతో మన రాష్ట్రాన్ని మరింత ముందంజలో ఉంచేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కృత్రిమ మేథా రంగ నిపుణులు, ఐటీ ఆవిష్కర్తలెందరినీ ఈ సందర్భంగా హైదరాబాద్ కు ఆహ్వానిస్తు న్నామని చెప్పారు.
‘మేకింగ్ ఏఐ వర్క్ ఎవ్రీ వన్..’ అనే ఇతి వృత్తంతో ఈ ఏడాది సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాజానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో.. ఎలా సాధికారత కల్పిస్తుందో అన్వేషించటమే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతుంది. దాదాపు రెండు వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈ సదస్సు ఏఐ పరిజ్ఞానంతో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, ప్రపంచంలో ఉన్న సవాళ్లను పరిష్కరించేందుకు వీలుగా ఏఐ సామర్థ్యాలను అన్వేషించేందుకు ఈ సదస్సు కీలక వేదికగా ఉపయోగ పడుతుందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో జరిగే ఈ సదస్సు అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ భవిష్యత్తుకు, కొత్త ప్రాజెక్టులకు నాంది పలుకనుంది. ఈ సదస్సుకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ ను త్వరలోనే ప్రారంభించనున్నారు.
13/07/2024
జేఎన్టీయూలో క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ పై ఇంటరాక్షన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు....
ప్రభుత్వ విధానాలను వివరించాలనే ఈ కార్యక్రమం చేపట్టాం...
ప్రతీ పేదవాడి బిడ్డ గొప్పగా చదవాలని ఆనాడు వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్ మెంట్ నిర్ణయం తీసుకున్నారు.
రకరకాల పరిస్థితులలో ప్రాధాన్యతలు మారి.. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పేరుకుపోయాయి.
పాత బకాయిలపై ఎలా ముందుకెళ్లాలనే అంశాన్ని పరిష్కరించే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తున్నాం..
ఈ అకాడామిక్ ఇయర్ నుంచి ఆన్ టైమ్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించేందుకు ప్రయత్నిస్తాం..
ఫీజు రీయింబర్స్ మెంట్ పై మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు..
ఫీజు రీయింబర్స్ మెంట్ పై త్రిముఖ వ్యూహంతో మా ప్రభుత్వం ముందుకు వెళుతుంది.
దేశంలో, ప్రపంచంలో గొప్ప నిర్మాణాలన్నీ ఇంజనీర్లు సృషించినవే..
మానవనిర్మిత అద్భుతాలన్నీ ఇంజనీర్లు ఆవిష్కరించినవే...
ఇంజనీరింగ్ కాలేజీలు నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారంగా మారకూడదు...
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి దేశ భవిష్యత్తును నిర్మించేలా ఉండాలి..
అందుకు కావాల్సిన సాయాన్ని అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది...
కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాదు.. దేశానికి మేధావులను అందించే సంస్థలుగా ఇంజనీరింగ్ సంస్థలు ఉండాలి.
ఇంజనీరింగ్ లో కేవలం కంప్యూటర్ సైన్స్ పైనే కాదు... సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి అన్ని రకాల కోర్సులనూ ప్రోత్సహించాలి..
స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా టాటా భాగస్వామ్యంతో రూ.2400 కోట్లతో ప్రభుత్వం ఐటీఐల రూపురేఖలు మారుస్తోంది..
ఫార్మా, ఐటీ తరువాత ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ ప్రపంచాన్ని నడిపించబోతోంది.
యువత కోసం త్వరలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం..
ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం..
మా ప్రభుత్వానికి భేషజాలు లేవు... నిరుద్యోగులకు మేలు జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి.
నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో ముందుకెళుతోంది.
పదేళ్లు ఉద్యోగాల భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కొట్లాడింది...
కానీ.. ఇప్పుడు పరీక్షల వాయిదా కోసం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆమరణ దీక్షలు చేస్తున్నారు...
త్వరలోనే జాబ్ క్యాలెండర్ ను తీసుకురాబోతున్నాం..
యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తాం...
విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు అనేదే మా ప్రభుత్వ విధానం...
మేం అధికారంలోకి వచ్చిన మొదటి 30రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేసాం..
ఆర్ధిక భారం, ఇతర సమస్యలు ఉన్నా... ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది..
13/07/2024
జేఎన్టీయూలో స్థూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు...
సమాజంలో ఉండే సమస్యలను మనమే గుర్తించి పరిష్కరించుకుంటే దుష్ఫలితాలను నివారించుకోవచ్చు.
సమాజంలో పెడధోరణులకు టెక్నాలజీ కూడా ఓ కారణంగా మారింది...
పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచితే చాలా సమస్యలను నివారించవచ్చు.
కుటుంబ వ్యవస్థ విచిన్నం కావడమే చిన్నారుల మానసిక బలహీనతలను కారణం.
చిన్నారుల మానసిక దృఢత్వానికి ఉమ్మడి కుటుంబం తోడ్పడుతుంది..
పిల్లలను మానసికంగా సంసిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.
ఇందుకోసం పిల్లలకు సోషల్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ నేర్పించాల్సిన అవసరం ఉంది.
డ్రగ్స్ నిర్మూలనపై సీరియస్ గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది...
స్కూల్స్,కాలేజెస్ లో సబ్జెక్ట్ నేర్పించడమే కాదు... మోరల్ పోలీసింగ్ కూడా నేర్పించాలి.
పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనించే వ్యవస్థ ఉండాలని నిర్వాహకులకు సూచించాం..
స్కూళ్లు, కాలేజీల్లో ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అవసరం ఎంతో ఉంది..
పోలీసులకు సమాచారం చేరవేసేలా వ్యవస్థను తయారు చేసుకుంటే.. రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చవచ్చు.
డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేసింది.
డ్రగ్స్ పై ప్రభుత్వం యుద్ధమే ప్రకటించింది.
మీ అన్నగా పిలుపునిస్తున్నా... డ్రగ్స్ నిర్మూలనకు సహకరించండి...
ఉద్యమాల గడ్డ తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి.
అన్ని ఇంటర్ , డిగ్రీ కళాశాలల్లో కేరళ మాదిరిగా మోరల్ పోలీసింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా...
మోరల్ పోలీసింగ్ తో అన్ని రకాల సమస్యలను పరిష్కరించొచ్చు..
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలని నిర్ణయించింది.
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్టేడియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
భవిష్యత్ లో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది.
ప్రజాప్రతినిధి అనేది అత్యంత పవిత్రమైన బాధ్యత...
ప్రజా సమస్యలపై ఫోకస్ గా పనిచేయడం వల్లే నేను ఈ స్థాయికి చేరా..
సమస్యలకు భయపడి పారిపోవద్దు... నిలబడి సమస్యలపై పోరాడాలి.
జీవితంలో ఫోకస్ గా పనిచేయండి.. లక్ష్యాలను సాధిస్తారు.
నరేంద్రమోదీకైనా, బిల్ గేట్స్ కైనా, రేవంత్ రెడ్డికైనా రోజుకు 24 గంటలే..
రోజుకు 16గంటలు మీరు ఎంత ఫోకస్ గా పని చేస్తారో... అది మీ లక్ష్యాన్ని అంత చేరువ చేస్తుంది..
మన జీవితం మన చేతుల్లోనే ఉంది... మన జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలో మన చేతుల్లోనే ఉంటుంది..
గొప్ప వ్యక్తులు ఎవరూ గొప్ప కుటుంబాల నుంచి రాలేదు...
ఎవరూ ఎవరికంటే తక్కువ కాదు..