06/02/2023
రైతులకు గుడ్‌న్యూస్.. రుణమాఫీకి రూ.6385కోట్లు! ఏ పథకానికి ఎంతంటే!
రైతులకు గుడ్‌న్యూస్.. రుణమాఫీకి బడ్జెట్‌లో రూ.6385కోట్లు! ఏ పథకానికి ఎంతంటే! | Vidhaatha | Latest Telugu News
ts budget-2023-24 | తెలంగాణ ప్రభుత్వ రైతులకు శుభవార్త చెప్పింది. రుణమాఫీ కోసం ప్రభుత్వం బడ్జెట్‌ను నిధులు కేటాయించింది. తె...
06/02/2023
TS Budget-2023-24 | రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీశ్‌రావు
TS Budget-2023-24 | రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీశ్‌రావు | Vidhaatha | Latest Telugu News
నన్ను మద్దిలో ఒగ్గేత్తారా! TDP అధిష్టానంపై గుణుస్తున్న పతివాడ!
06/02/2023
వైభవంగా మొదలైన పెద్దగట్టు (లింగమంతుల) జాతర
వైభవంగా మొదలైన పెద్దగట్టు (లింగమంతుల) జాతర | Vidhaatha | Latest Telugu News
నన్ను మద్దిలో ఒగ్గేత్తారా! TDP అధిష్టానంపై గుణుస్తున్న పతివాడ!
13/10/2022
https://vidhaatha.com/news/ktr-had-a-meal-at-hamsala-swami-house
అంశాల స్వామి ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్ | Vidhaatha | Eveready Latest Telugu News
Home latest అంశాల స్వామి ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్ అంశాల స్వామి ఇంట్లో భోజనం చేసిన కేటీఆర్ Share WhatsApp Facebook Twitter Telegram 10/13/2022 విధా.....
13/10/2022
మునుగోడును దత్తత తీసుకుంటా.. 3 నెలలకో సారి వస్తా: కేటీఆర్
మునుగోడును దత్తత తీసుకుంటా.. 3 నెలలకో సారి వస్తా: కేటీఆర్ | Vidhaatha | Eveready Latest Telugu News
Home latest మునుగోడును దత్తత తీసుకుంటా.. 3 నెలలకో సారి వస్తా: కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటా.. 3 నెలలకో సారి వ...
30/06/2022
https://vidhaatha.com/anointing-for-flexi
సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డి ఫ్లెక్షీలకు క్షీరాభిషేకం | Vidhaatha | Latest Telugu News
తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ జాతీయం అంతర్జాతీయం ఉన్నమాట పాలిటిక్స్ క్రీడలు సినిమా Home Latest news సీఎం కేసీఆర్, మంత్రి జగదీ...
09/02/2022
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సూర్యాపేట ,ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పోటెత్తిన నిరసనలు
నియోజకవర్గ కేంద్రం తో పాటు మండల కేంద్రాలలో దిష్టి బొమ్మలు దహనం ,
నల్ల చొక్కాలు,రిబ్బన్ లు ధరించి నిరసన
పట్టణ కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ
మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశాల తో వేలాది గా కదిలిన టి.ఆర్.ఎస్ శ్రేణులు
*సూర్యాపేట*
ప్రధాని మోదీ అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. మోదీకి వ్యతిరేకంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా తో పాటు సూర్యాపేట నియోజకవర్గం లో నిరసనలు మిన్నంటాయి. నిన్న పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మంత్రి జగదీశ్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రం అయిన సూర్యాపేట పట్టణం తో పాటు పెన్ పహాడ్, చివ్వేంల,ఆత్మకూర్ ఎస్ ,సూర్యాపేట రూరల్ మండలాల్లో తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు.భారీ ఎత్తున మోదీకి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. మోదీ దిష్టి బొమ్మలకు శవయాత్రలు నిర్వహించి దహనం చేశారు. వెంటనే ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.బీజేపీ తన తీరు మార్చుకోకుంటే గ్రామాల్లో తిరగనివ్వమన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రంలోని బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని నేతలు హెచ్చరించారు. మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. తెలంగాణ ప్రగతిని కోరాల్సిన ప్రధాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇలాంటి కక్ష సాధింపు చర్యలు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు.
విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వంపై లేదా అని నేతలు ప్రశ్నించారు. విభజన హామీలను పరిష్కరించకుండా ఈ విధంగా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను ప్రధాని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
28/08/2021
తెలంగాణా రాష్ట్రంలో అలజడికి తెర లేపిన నారా చంద్రబాబు:మంత్రి జగదీశ్ రెడ్డి
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రం నుండి....*
తెలంగాణా రాష్ట్రంలో అలజడికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుట్రలకు తెర లేపారంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం నల్లగొండ జిల్లా శాలిగౌరరం మండల కేంద్రంలో జరిగిన వ్యవసాయ గోడౌన్, రైతు వేదికల ప్రారంభం తో పాటు తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కుర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన సహచర మంత్రి జగదీష్ రెడ్డి తో కలసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు గాధరి కిశోర్ అధ్యక్షత వహించిన శాలిగౌరరం సభలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై విరుచుకుపడ్డారు.
26/08/2021
సూర్యాపేట నియోజకవర్గం లో మరో మైలు రాయి.. అంతర్జాతీయ పాఠశాలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి జగదీష్ రెడ్డి...
22/08/2021
*@సూర్యపేట జిల్లా కేంద్రం నుండి*
_*సూర్యపేట జిల్లా కేంద్రంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు*_
_* #మంత్రి జగదీష్ రెడ్డికి రాఖీలు కట్టిన మహిళా ప్రజాప్రతినిధులు*_
_* #సంతోషి మాత జన్మదిన వేడుకలకు హాజరు*_
_* #బంగారు కిరీటాన్ని అమ్మవారికి అలంకరించిన మంత్రి జగదీష్ రెడ్డి*_
_* #బంగారు రాఖిని మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా అమ్మవారికి అలనుకరింప జేసిన పాలకవర్గం*_
సూర్యపేట జిల్లా కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్యపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డికి పట్టణానికి చెందిన పలువురు మహిళలు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అదే విదంగా సంతోష్ మాత దేవాలయంలో జరిగిన సంతోషిమాత జన్మదిన వేడుకలలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సహకారంతో ఆలయ పాలకమండలి తయారు చేయించిన బంగారు కిరీటాన్ని మంత్రి జగదీష్ రెడ్డి అమ్మవారికి అలంకరించారు.దానితో పాటుగా రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన బంగారు రాఖీ ని మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా అమ్మవారికి అందజేశారు. మంత్రి జగదీష్ రెడ్డికి రాఖీలు కట్టిన వారిలో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు,మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉప్పల లలితా ఆనంద్,మంత్రి జగదీష్ రెడ్డికి వరుసకు సోదరి అయిన కడారి సరళ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సల్మా మస్తాన్ లతో పాటు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రాఖీలు కట్టారు.
19/08/2021
" *రైతన్న" సినిమా ను ఆదరించి ..వీక్షించిన మంత్రి జగదీష్ రెడ్డి కి ధన్యవాదాలు*
*రైతన్న సినిమా చూసిన మంత్రి జగదీష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పడానికే సూర్యాపేట వచ్చిన..*
*నేటి తరం రాజకీయ నాయకుల లో జగదీష్ రెడ్డి గారి శైలి ప్రత్యేకం*
*జగదీష్ రెడ్డి వంటి కమిట్ మెంట్ ఉన్న నాయకుడు ఉన్న సూర్యాపేట ప్రజలు అదృష్టవంతులు*
*టి.ఆర్.ఎస్ ప్రభుత్వం,మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి లు ఇచ్చిన ప్రోత్సాహం తో మరోసారి రైతన్న సినిమా ను విడుదల చేయబోతున్నాం..*
*నూతన చట్టాల ద్వారా టి.ఆర్.ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్ వంటి పధకాలకు ముప్పు*
.. *ఆర్. నారాయణ మూర్తి*
నేను దర్శకత్వంలో వహించి నిర్మించిన రైతన్న సినిమా ను తాను చూడటమే కాకుండా తనతో పాటు ఎంతో మందికి చూపించిన మంత్రి జగదీష్ రెడ్డి అసలైన రైతు బిడ్డ అని ఆర్. నారాయణ మూర్తి కొనియాడారు. రైతన్న సినిమా ను ఆదరించి వీక్షించిన మంత్రి కి నారాయణ మూర్తి ధన్యవాదాలు తెలిపారు.మంత్రి గారిని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలుపడానికే సూర్యాపేట కు వచ్చానని నారాయణ మూర్తి తెలిపారు.నేటి తరం రాజకీయ నాయకులలో జగదీష్ రెడ్డి గారి శైలి ప్రత్యేకమని అన్న ఆయన జగదీష్ రెడ్డి గారి వంటి నాయకులు దొరకడం సూర్యాపేట ప్రజల అదృష్టం అని కొనియాడారు..వారు ఇచ్చిన ప్రోత్సాహాం తో మరోసారి రైతన్న సినిమాను రిలీజ్ చేస్తామని తెలిపారు.. నూతన వ్యవసాయ, విద్యుత్ సవరణ చట్టాలు అమలు అయితే తెలంగాణ ప్రభుత్వం ..ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడి రైతుల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి పధకాలకు ముప్పు వాటిల్లుతుందని తెలిపారు.. ప్రధాని మోదీ ఇప్పటికైనా రైతుల సంక్షేమం ను దృష్టిలో ఉంచుకుని చట్టాలను ఉపసంహరించుకోవాలని నారాయణ మూర్తి కోరారు..