06/06/2026
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారి నుండి అర్జీలు తీసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు గారు హామీ ఇచ్చారు.
Julakanti Brahmananda Reddy
06/06/2026
మాస్కోలో స్బేర్ ఆధ్వర్యంలో నడుస్తున్న విభిన్నమైన పాఠశాల స్కూల్ 21ను ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. సాంప్రదాయ విద్యావిధానానికి భిన్నంగా అక్కడ అనుసరిస్తున్న విధానాలను నిర్వాహకులు, విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. స్కూల్ 21 అనేది రష్యాలో స్బేర్‌బ్యాంక్ ప్రారంభించిన ఉచిత ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విద్యా కార్యక్రమం. ఇక్కడ విద్యార్థుల నుంచి ఎటువంటి ట్యూషన్ ఫీజు వసూలు చేయరు. ఇది ఇంటర్నేషనల్ 42 నెట్‌వర్క్‌లో సభ్యత్వం కలిగి, స్వతంత్రంగా పనిచేస్తుంది, ఫ్రెంచ్ కోడింగ్ స్కూల్ అయిన ఎకోల్ 42 రూపొందించిన వినూత్నమైన "భవిష్యత్ పాఠశాల" విద్యా పద్ధతులను అనుసరిస్తుంది.
Julakanti Brahmananda Reddy
06/06/2026
Aమెగా డీఎస్సీ 2025లో ఎంపిక కాని అభ్యర్థులను రెచ్చగొడుతూ తన రాజకీయ ప్రయోజనాల కోసం యువత విలువైన కాలాన్ని వృధా చేస్తున్నాడు జగన్. అభ్యర్థులకు, ప్రజలకు వాస్తవాలతో పాటు జగన్ కుట్రలను తెలియ చేయాలన్న బాధ్యతతో సాక్షి మీడియా ముందుకు వచ్చిన కొందరు అభ్యర్థులు ఎందుకు అనర్హత పొందారో తెలియజేస్తున్నాం.
అందులో భాగంగా మెగా డీఎస్సీ అభ్యర్థులు శ్రీదుర్గా మల్లిక, సిహెచ్. నరసింహారావు, పోలుబోయిన లక్ష్మీ భారతి,ఎరిపిల్లి శ్రావణ్ కుమార్ విషయంలో వాస్తవం ఇది.
Julakanti Brahmananda Reddy