Information & Public Relations Dept, Telangana

Information & Public Relations Dept, Telangana

Share

Official Page of Information and Public Relations Department, Govt of Telangana

04/06/2026

దేశంలో ఉత్తమ ప్రాజెక్ట్ అధికారి రాహుల్

✅ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన జాతీయ POs కాన్ఫరెన్స్ లో దేశంలోని ఉత్తమ ప్రాజెక్ట్ అధికారిగా అవార్డు అందుకున్న ITDA భద్రాచలం PO శ్రీ బి. రాహుల్ గారు.

✅నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ అశోక్ కుమార్ గారు , ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ సెక్రటరీ శ్రీ రంజన చోప్రా గారు 5లక్షల ప్రోత్సాహక పురస్కారాన్ని PO రాహుల్ మరియు APO డేవిడ్ రాజ్ లకు అందజేశారు.

✅గిరిజన మ్యూజియం , భద్రగిరి మార్ట్ , ఉద్దీపకం, కెరీర్ గైడెన్స్, ఇలవేల్పుల చరిత్ర, క్రీడల ప్రోత్సాహం తదితర కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలుచేసినందుకు ఈ పురస్కారం లభించింది.

✅కాగా ఇప్పటికే 'బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డును' గవర్నర్ గారి చేతుల మీదుగా, 'బెస్ట్ రూరల్ టూరిజం అవార్డును' ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, ఆదివాసీ వికాస రత్న బిరుదును ఆదివాసీ ఐక్య వేదిక తరుపున అందుకున్న రాహుల్ , ఇప్పుడు జాతీయ స్థాయిలో ఈ అవార్డును అందుకోవడం విశేషం.

03/06/2026

మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్

బీసీ గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్‌లాగ్ రెండవ దశ సీట్ల జాబితా విడుదల

ఇంటర్ ఫస్ట్ లిస్ట్ లో సీట్లు వచ్చిన విద్యార్థులు ఈనెల 4 వ తేదీలోగా రిపోర్ట్ చేయాలి

- ఎం జె పి ఇన్ ఛార్జ్ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు

మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 6, 7, 8 , 9 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాల రెండో జాబితా ఈ రోజు (జూన్3) విడుదల చేశామని సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు(FAC) తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ గురుకుల పాఠశాలల్లో బ్యాక్‌లాగ్ సీట్లు కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ ఫలితాలను సోసైటీ అధికారిక వెబ్ సైట్ •

https://tgcet.cgg.gov.in/TGCETWEB/ #/home , • https://mjptbcwreis.telangana.gov.in లో పరిశీలించవచ్చు అని ఆయన పేర్కొన్నారు.

ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు సంబంధిత గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారని, విద్యార్థులు ఏ తేదీన పాఠశాలకు హాజరు కావాలి అన్న వివరాలు తెలియ చేస్తారని ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. సీట్ల కేటాయింపు,భర్తీ ప్రక్రియ ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది అని ఆయన తెలిపారు.

బీసీ గురుకుల ఇంటర్ కోర్సుల్లో ఫస్ట్ లిస్ట్ లో సీట్లు వచ్చిన విద్యార్థులు ఈనెల 4వ తేదీ లోగా సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాలని డాక్టర్ మల్లయ్య భట్టు తెలిపారు.

mjptbcwreis.telangana.gov.in

Photos from Information & Public Relations Dept, Telangana's post 03/06/2026

✅Vikarabad district's Mothukupally Gram Panchayat in Kotepally Mandal has achieved national recognition by securing the 3rd rank at the National Panchayat Awards.

✅The award was presented today in New Delhi by Union Minister for Panchayati Raj, Fisheries, Animal Husbandry and Dairying Shri Rajiv Ranjan Singh (Lalan Singh) and Union Minister of State Shri S.P. Singh Baghel.

✅The award was received on behalf of the Gram Panchayat by Vikarabad District Collector Shri Deepak Tiwari and Mothukupally Gram Panchayat Sarpanch Smt. Baindla Amruthamma.

✅The National Panchayat Awards recognize outstanding and sustainable local governance by Panchayati Raj Institutions across the country. Under the theme "Panchayat with Good Governance," Mothukupally Gram Panchayat was conferred the prestigious Deen Dayal Upadhyay Panchayat Satat Vikas Puraskar (DDUPSVP) National Panchayat Award.

✅The award recognizes excellence in the localization and implementation of the Sustainable Development Goals (SDGs), reflecting the Gram Panchayat's commitment to effective governance, inclusive development, and sustainable rural progress.

03/06/2026

- తెలంగాణ విత్తన రంగ అనుభవం నైజీరియా యువతకు ఉపయోగపడాలి

- తెలంగాణలో శిక్షణ పొందిన టరాబా రాష్ట్ర యువతకు సర్టిఫికెట్ల ప్రదానం

- వ్యవసాయం, విత్తన రంగాల్లో తెలంగాణ – టరాబా రాష్ట్రాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం

- శామీర్‌పేట్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్‌లో అంతర్జాతీయ విత్తన విద్య, పారిశ్రామిక అభివృద్ధి శిక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమం

- మంత్రి వివేక్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల

శామీర్‌పేట్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ (IPE)లో నిర్వహించిన "అంతర్జాతీయ విత్తన విద్య మరియు పారిశ్రామిక అభివృద్ధి శిక్షణ కార్యక్రమం" బుధవారం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి మరో మంత్రి వివేక్ తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే విత్తన రంగానికి కేంద్రంగా గుర్తింపు పొందిందని, ఆ అనుభవాన్ని నైజీరియాలోని టరాబా రాష్ట్ర యువతతో పంచుకోవడం సంతోషకరమన్నారు. ఈ శిక్షణ ద్వారా యువత విత్తన ఉత్పత్తి, హైబ్రిడ్ సీడ్ టెక్నాలజీ, విత్తన శుద్ధి, ప్రాసెసింగ్, వ్యవసాయ వ్యాపార నిర్వహణ వంటి అంశాల్లో ప్రాయోగిక పరిజ్ఞానం పొందారని తెలిపారు.

టరాబా రాష్ట్ర ప్రభుత్వం తమ యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ కల్పించేందుకు చూపుతున్న చొరవ అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా టరాబా రాష్ట్రంతో వ్యవసాయం, విత్తన సాంకేతికత, రైతు శిక్షణ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

తెలంగాణ మరియు టరాబా రాష్ట్రాల మధ్య "సిస్టర్ స్టేట్" భాగస్వామ్యానికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని, ఇది ఇరు ప్రాంతాల మధ్య పరస్పర అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఈ రెండు సంవత్సరాలలో సాధించిన ప్రగతిని మంత్రి వివరించారు. టరాబా రాష్ట్ర యువత ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలను తమ ప్రాంత అభివృద్ధికి వినియోగించి వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, సీడ్ కార్పోరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, నైజీరియాలోని టరాబా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ అగ్బు కెఫాస్, టరాబా సీడ్స్ లిమిటెడ్, ప్రసాద్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ ప్రతినిధులు, శిక్షకులు, అధికారులు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసిన యువతకు సర్టిఫికెట్లు అందజేశారు.

Photos from Information & Public Relations Dept, Telangana's post 03/06/2026

More Employment Opportunities Through Partnership with Germany: Labour Minister Dr. G. Vivek Venkatswamy

ATCs, TOMCOM Playing a Key Role in Expanding Employment for TG Youth

German Delegation Visits State to Strengthen Bilateral Cooperation

Labour, Employment, Mines and Geology Minister Dr. G. Vivek Venkatswamy said that stronger coordination and collaboration between Telangana and Germany would create significant opportunities for both regions, particularly in the areas of skill development, employment generation and industrial cooperation.
Addressing a high-level delegation from the German state of Thuringia at the Telangana Secretariat, the Minister stressed the need for institutional cooperation and proposed the formation of a dedicated coordination group between Telangana and Germany to identify and explore new avenues of partnership in skill development, workforce mobility, industry and economic cooperation.

The delegation comprised Thuringia Minister-President Mario Voigt, Labour Minister Mrs. Schenk, State Secretary Suckert, State Secretary Dr. Teichert, public representatives, industry leaders, journalists and other officials from Germany. Earlier in the day, the delegation met Chief Minister A. Revanth Reddy as part of its visit to Telangana. The visit was coordinated by the Telangana Overseas Manpower Company (TOMCOM).

During the interaction, the Minister and the German delegation held detailed discussions on matters of mutual interest, including overseas employment opportunities, skilled workforce development, workforce mobility and industrial collaboration. Dr. Vivek Venkatswamy highlighted the state government’s initiatives through TOMCOM to create overseas employment opportunities for Telangana youth across various sectors in Germany.

The Minister said the State Government has undertaken major reforms in skill development by upgrading Industrial Training Institutes (ITIs) into Advanced Technology Centres (ATCs) and introducing industry-oriented courses aligned with global standards and emerging job market requirements. He noted that the ATCs are producing a highly skilled workforce capable of meeting the demands of both domestic and international industries.

He further stated that TOMCOM has been providing language training, including German language courses, to enhance the employability of Telangana youth and prepare them for global career opportunities.

The German delegation appreciated the efforts of the Telangana Government, particularly the Labour Department and TOMCOM, in equipping young professionals with industry-relevant skills and facilitating international employment opportunities.

A group of nurses trained under TOMCOM also interacted with the Minister and the visiting delegation. The nurses shared their experiences regarding language training and overseas placement programmes. Having successfully completed advanced-level German language certification, they are set to travel to Germany for employment opportunities facilitated by TOMCOM.

On the occasion, LETF Secretary Dasari Harichandana explained the technical and operational aspects of the training programmes being implemented through TOMCOM and highlighted the State’s efforts to build a globally competitive workforce.

The interaction reflected the growing partnership between Telangana and Germany in the fields of skilled workforce development, international mobility and employment generation.
Director of Employment and Training Kanthi Wesley, TOMCOM officials Nagabharti, Anil Kumar and other senior officials were present on the occasion.

Photos from Information & Public Relations Dept, Telangana's post 03/06/2026

Hyderabad being positioned as hub for advanced medical research, says Sridhar Babu

Telangana Minister for Information Technology and Industries D. Sridhar Babu on Wednesday said the State government was taking steps to position Hyderabad as a major hub for advanced medical research, including biologics, vaccines, cell and gene therapies, and treatments for cancer and rare diseases.

Speaking after inaugurating the ₹1,200-crore Theranym Biologics manufacturing facility at Borpatla village in Hatnoora mandal of Sangareddy district, the Minister said a comprehensive roadmap was being prepared to create a world-class ecosystem supporting the entire value chain, from research and development to commercial-scale manufacturing.

Mr. Sridhar Babu said Hyderabad, already recognised as the country's pharmaceutical capital, was being further strengthened as a global biotechnology destination. He said emerging technologies such as robotics, artificial intelligence and advanced genetics would reshape the biotechnology sector, and that the State was taking strategic measures to attract investments and leverage future opportunities.

Highlighting key initiatives such as the Life Sciences Policy, One Bio Hub, Green Pharma City and Life Sciences Hub, the Minister said these projects would enhance the global presence of the “Made in Telangana” brand in the life sciences sector.

He said the government was focusing not only on creating world-class infrastructure but also on developing an industry-ready workforce to meet the growing demands of the sector. He urged pharmaceutical and biotechnology companies to partner with the State government in skill development initiatives aimed at creating a future-ready talent pool.

Describing the Theranym Biologics facility as a significant milestone in Telangana’s efforts to emerge as a global life sciences hub, Mr. Sridhar Babu reiterated the government's commitment to supporting industrial investments and fostering innovation-driven growth.

According to the company, the facility will manufacture advanced therapeutics for the treatment of cancer and other life-threatening diseases and export them to several countries, including the United States. The project is expected to generate employment for more than 1,500 people.

Health Minister Damodar Rajanarsimha, TGIIC Chairperson Nirmala Jagga Reddy, and representatives of Theranym Biologics were present on the occasion.

Photos from Information & Public Relations Dept, Telangana's post 03/06/2026

➡️హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు.
హైదరాబాద్ సిపి సజ్జనార్


➡️రోడ్డు భద్రతపై సమీక్ష సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం

✅హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ), బంజారాహిల్స్‌లో బుధవారం ఉన్నతస్థాయి రోడ్డు భద్రత సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా పాల్గొన్నారు.

✅సమావేశంలో నగరంలోని రోడ్లు, జాతీయ రహదారుల వారీగా ప్రమాదాల గణాంకాలు, ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్లు, బ్లైండ్ స్పాట్లు, పాదచారుల ప్రమాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, హిట్ అండ్ రన్ ఘటనలు, బాధితులకు అందిస్తున్న పరిహారం తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించారు. గత ప్రమాదాల ఆధారంగా ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి చేపట్టాల్సిన చర్యలపై పూర్తిస్థాయిలో సమీక్షించారు.

✅ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ వి.సి. సజ్జనార్ మాట్లాడుతూ రోడ్డు భద్రత విషయంలో సంబంధిత శాఖలన్నీ జవాబుదారీతనం, బాధ్యతతో పనిచేయాలని సూచించారు. సమీక్ష సమావేశాలు కేవలం చర్చలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో చర్యలు, ఫలితాలుగా మారాలని అన్నారు. నగరంలో తగిన రోడ్డు సూచికలు, రహదారి గుర్తులు, జీబ్రా క్రాసింగ్‌లు, ఫుట్‌పాత్‌ల ఏర్పాటుతో పాటు ఆక్రమణల తొలగింపు చేపట్టాలని సూచించారు. అక్రమ రహదారి దాటివేతలను నిరోధించేందుకు సెంట్రల్ మీడియన్లు, డివైడర్ల ఎత్తు పెంచి గార్డ్ రైలింగ్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రమాదాల చరిత్ర ఆధారంగా గుర్తించిన ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

✅అదేవిధంగా వీధి దీపాల ఏర్పాటు, స్పీడ్ కంట్రోల్ చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థల మెరుగుదల, శాస్త్రీయంగా యూ-టర్న్‌లు, ఫ్రీ లెఫ్ట్‌ల రూపకల్పన, ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, లేన్ క్రమశిక్షణ అమలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

✅జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్ నగరంలోని ప్రధాన బ్లాక్ స్పాట్లు, బ్లైండ్ స్పాట్లు మరియు ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలపై వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణం, బస్ షెల్టర్ల తొలగింపు లేదా స్థాన మార్పు, బస్ బేల నియంత్రణ తదితర చర్యలను ప్రతిపాదించారు.

✅జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు, మరణాలను నివారించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. సంబంధిత శాఖలకు అప్పగించిన పనులపై నిర్దిష్ట గడువులోగా యాక్షన్ టేకెన్ రిపోర్టులు సమర్పించాలని ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో కార్యాచరణను వేగవంతం చేయాలని సూచించారు.

✅తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) డ్రైవర్లకు రోడ్డు భద్రతా నిబంధనలు, ప్రవర్తనా నైపుణ్యాలపై సమగ్ర శిక్షణ అందించాలని సమావేశంలో సూచించారు. ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

✅రోడ్డు భద్రతకు సంబంధించిన కార్యక్రమాల అమలులో వివిధ శాఖల మధ్య సమన్వయం, పర్యవేక్షణ, అనుసంధానం కోసం ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ (పీఎంయూ) ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కూడా సమావేశంలో చర్చించారు.

✅ఈ సమావేశంలో ఆర్టీఏ సభ్యుడు నేతికార్ సురేష్ లాల్, అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్, టీజీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్ రీజినల్ మేనేజర్ సుధా పరిమళ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), రోడ్లు భవనాల శాఖ, రవాణా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, స్వచ్ఛంద సంస్థలు మరియు ఇతర భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Photos from Information & Public Relations Dept, Telangana's post 03/06/2026

Telangana, South Africa to cooperate in Skilled Workforce & Medical Tourism

CM Revanth Reddy holds key bilateral meeting with delegation headed by South Africa Deputy President Paul Mashatile

- Chief Minister invites South African delegation of industrialists and entrepreneurs to Telangana Rising Global Summit 2026 to be held in December this year
- Would be honoured to attend along with a delegation: South African Deputy President
Hon'ble Telangana Chief Minister Shri A. Revanth Reddy, along with Hon'ble Ministers D. Sridhar Babu and C. Damodar Raja Narsimha, held a key bilateral meeting with a high-level delegation from South Africa led by Deputy President Paul Mashatile. Both sides agreed to cooperate in the fields of education, medical tourism and investments, with the aim of strengthening educational exchanges, promoting medical tourism and attracting investments for mutual benefit.

The CM explained that Hyderabad's robust educational and skill training ecosystem is serving as a backbone for creating a knowledge hub and a premier hub for engineering talent across IT, Pharma, Defence and Aerospace sectors. The city is already placed as one of the leading global destinations for setting up of Global Capability Centers (GCCs) of Fortune-500 companies.

He also highlighted the world-class medical and healthcare facilities in Hyderabad, attracting a huge number of people from various countries including from the Middle East for availing cost-effective medical treatments. The government is working on further strengthening Hyderabad's position as a global hub for skilled workforce and medical tourism, he emphasised.

Recalling the massive success of Telangana Rising Global Summit 2025, the Chief Minister said the event drew global dignitaries, diplomats, and industry leaders, marking an unprecedented economic and developmental success for the state. He invited the South African leadership to attend this year's Global Summit to be held in December 2026 to enable opening of wider transformative opportunities for businesses and industries on both sides.

The CM also explained plans for building a net-zero, global standard, greenfield infrastructure in 30,000 acres in Bharat Future City, located close to the international airport.

Hon'ble IT & Industries Minister D. Sridhar Babu invited top South African industrialists to further explore opportunities and engage in dialogue for mutual cooperation.

Hon'ble Minister for Health, Medical & Family Welfare, Science and Technology, C. Damodar Raja Narsimha said Hyderabad is globally known for massive production of bulk drugs and vaccines. Our government is building mega hospitals in Hyderabad to cater to the healthcare needs of our people, he added.

Speaking on the occasion, South Africa Deputy President Paul Mashatile said South Africa and India share a long history of experiences and cultural ties. South Africa provides a platform from which Indian companies can enjoy preferential market access into the rest of Africa through the African Continental Free Trade Area, he stated, adding that it paves way for establishing pharmaceutical companies in South Africa.

The South African delegation included T. Moraka, Deputy Minister of International Relations and Cooperation, Ambassador A Sooklal, Ambassador of the Republic of South Africa to the Republic of India, Dr A. Motsoaledi, Minister of Health, S. Ndabeni, Minister of Small Business Development, N Gina, Deputy Minister of Science, Technology and Innovation, M. Gungubele, Deputy Minister of Communications and Digital Technology.

Chief Secretary K. Ramakrishna Rao, Principal Secretary to CM V. Seshadri, Special Secretary to CM B. Ajith Reddy, Special CS, Energy, Navin Mittal, Principal Secretary, HM&FW, Dr Christina Z Chongthu, Secretary, Planning, Gourav Uppal, MD, TGIIC, K. Shashanka, Joint Secretary, ITE&C, D. Anudeep and other senior officials attended the meeting.

Photos from Information & Public Relations Dept, Telangana's post 03/06/2026

రూ. కోటి ప్రమాద బీమా చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

​విధి నిర్వహణలో మృతి చెందిన ఎన్పీడీసీఎల్ లైన్‌మెన్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి లభించిన భారీ ఆర్థిక భరోసా

​ప్రజాభవన్‌లో మృతుడి భార్య స్వప్నకు చెక్కు అందజేత

​ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన లైన్‌మెన్ శ్రీ సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్ సతీమణి (నామినీ) శ్రీమతి సోన్కాంబ్లే స్వప్నకు రూ. 1 కోటి విలువైన ప్రమాద బీమా చెక్కును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క బుధవారం ప్రజాభవన్‌లో అందజేశారు.

​యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎన్పీడీసీఎల్‌కు గతంలో కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) ప్రకారం.. USSA-2/ USSA-3 పథకాల కింద శాలరీ ఖాతాలు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రూ. 1 కోటి విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నారు. ఈ పథకంలో భాగంగానే ఎన్పీడీసీఎల్ బాసర పరిధిలో లైన్‌మన్‌గా పనిచేస్తున్న శ్రీ సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్, 23 సెప్టెంబర్ 2024న బాసర శాఖలో తన 'USSA-2' శాలరీ ప్యాకేజీ ఖాతాను ప్రారంభించారు.

​అయితే, దురదృష్టవశాత్తు ఆయన 24 మార్చి 2025న విధి నిర్వహణలో ఉండగా జరిగిన ప్రమాదంలో మరణించారు. ఆయన అకాల మరణం తర్వాత, మృతుని నామినీ అయిన శ్రీమతి సోన్కాంబ్లే స్వప్న క్లెయిమ్ దరఖాస్తును బాసర శాఖలో సమర్పించారు. ఈ క్రమంలో రూ. 1 కోటి బీమా మొత్తం మే 30, 2026 నాడే శ్రీమతి స్వప్న సేవింగ్స్ ఖాతాలో జమ అయింది. ఈ క్లెయిమ్ వేగంగా పరిష్కారం కావడం అనేది ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వానికి, బ్యాంకింగ్ రంగానికి ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తోంది.

అలాగే USSA శాలరీ ప్యాకేజ్ పథకాల కింద అందిస్తున్న బీమా ప్రయోజనాల ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తోంది.
​ప్రజాభవన్‌లో జరిగిన ఈ అధికారిక చెక్కు పంపిణీ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఫైనాన్స్ డైరెక్టర్ తిరుపతిరెడ్డి, యూనియన్ బ్యాంక్ సీఈవో అశిష్ పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమరేష్ ప్రసాద్, చీఫ్ జనరల్ మేనేజర్ రవీంద్రబాబు, నిజామాబాద్ రీజినల్ హెడ్ అరుణ సవిత, చీఫ్ మేనేజర్ వై.వి రాఘవ, బ్రాంచ్ మేనేజర్ విజయ్ కుమార్, తదితర ఉన్నతాధికారులు పాల్గొని బాధిత కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.

Photos from Information & Public Relations Dept, Telangana's post 02/06/2026

Palamuru Irrigation Tour of CM Revanth, Uttam to be a Landmark Exercise

Major push Expected to Fast-Track Completion of Long-Pending Projects

Uttam Holds High-Level Preparatory Meeting

Extensive Ground Review of Ongoing and Proposed Projects Planned

Telangana Irrigation Minister N. Uttam Kumar Reddy on Tuesday described the upcoming two-day inspection of irrigation projects in the erstwhile Mahabubnagar district by Chief Minister A. Revanth Reddy as a landmark exercise that would shape the future course of irrigation development in the Palamuru region.

Chairing a high-level preparatory meeting with senior officials st Jala Soudha, Uttam Kumar Reddy said the visit was expected to provide strategic direction for the completion of several long-pending irrigation projects and unlock fresh funding for their accelerated ex*****on.

He said the Chief Minister's tour would focus on reviewing the status of ongoing and proposed irrigation works across the region, assessing bottlenecks, and identifying measures required for their early completion.

According to Uttam Kumar Reddy, the inspection is likely to be followed by major policy decisions, sanctions and the release of substantial funds for key irrigation projects, aimed at maximising irrigation potential and benefiting lakhs of farmers in the drought-prone Palamuru region.

The Minister described the proposed visit as a historic and unprecedented exercise, reflecting the State Government's commitment to transforming the irrigation landscape of the erstwhile Mahabubnagar district.

Deputy Chief Minister Mallu Bhatti Vikramarka and several senior ministers are expected to accompany Chief Minister Revanth Reddy during the tour.

The preparatory meeting was attended both physically and virtually by senior officials from the Irrigation Department and other concerned departments.

Ministers Jupally Krishna Rao and Vakiti Srihari also joined in the detailed discussions on the itinerary, project-wise presentations, field inspections and logistical arrangements for the two-day visit.

Officials were directed to ensure comprehensive project briefs and updated progress reports so that the Chief Minister could undertake an extensive ground-level review of ongoing works, pending components and future expansion plans during the tour.

Uttam Kumar Reddy said the State Government was determined to complete all viable irrigation projects in the Palamuru region at the earliest and ensure that every project contributed effectively to expanding irrigation coverage.

Detailed presentations would be made on major irrigation projects, including Palamuru-Rangareddy Lift Irrigation Scheme, Kalwakurthy Lift Irrigation Scheme, Koilsagar, Bheema, Nettampadu and other key irrigation works in the region.

A major presentation session is proposed at Somashila on the evening of June 4, where senior engineers will brief the Chief Ministet on the status, challenges and future roadmap of various projects.

The review meeting also discussed logistics, accommodation, security arrangements, transportation and aerial inspections. Two helicopters will be deployed for the tour, enabling the Chief Minister and Deputy Chief Minister to undertake extensive aerial surveys of irrigation infrastructure and project sites across the region.

Uttam Kumar Reddy said the visit would help the State Government take on-the-spot decisions regarding funding requirements, project completion schedules and measures needed to accelerate irrigation development in the region.

The Minister directed all departments to maintain close coordination and ensure that every aspect of the programme is executed smoothly, saying the visit would play a crucial role in shaping the future irrigation roadmap of the region.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address

10-2-1, Samachar Bhavan, AC Gaurds, Masabtank
Hyderabad
500028

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 10:30am - 5pm
Sunday 10:30am - 5pm