టిఆర్ఎస్ పార్టీ వార్తలు

టిఆర్ఎస్ పార్టీ వార్తలు

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from టిఆర్ఎస్ పార్టీ వార్తలు, Political organisation, Hyderabad.

25/08/2022

భూమిపూజ చేసిన మన్నెం రంజిత్ యాదవ్ దంపతులు

హాలియా పట్టణ కేంద్రంలో 25-08-2022 గురువారం నాడు ఉదయం 05:00 గంటల సమయంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీమతి శ్రీ మన్నెం తేజస్విని రంజిత్ యాదవ్ దంపతులు నూతన గృహ నిర్మాణానికి భూమిపూజ చేసి ప్రారంభించడం జరిగింది..

31/03/2022
02/03/2022

*💥నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం పేరూరు గ్రామానికి ప్రజాశ్రేయస్సు పిలుపుమేరకు శ్రీ స్వయంభు సోమేశ్వర ఆలయ పుణ్యక్షేత్రనకి భారీ కాన్వాయ్ తో... హాలియా సరిహద్దు నుండి పేరూరు గ్రామానికి బయలుదేరిన గౌ||శ్రీ|| ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి గారు.💥*

19/02/2022

*_💥ఆహ్వానం💥_*

తేదీ: 21-02-2022 సమయం 10:00 గంటలకు తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చాంబర్లో *_ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి గారి_* ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగును. కావున నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీ చైర్మన్ లు, వార్డు కౌన్సిలర్ లు, సర్పంచులు, రైతుబంధు కోఆర్డినేటర్లు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు,ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులు, మహిళా నాయకులు, యువజన, విద్యార్థి నాయకులు టిఆర్ఎస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు తప్పకుండా అందరూ హాజరు కావలసిందిగా కోరుచున్నాం.

*_మీ_*
*_యం.సి కోటిరెడ్డి గారు_*
*_ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ_*

05/02/2022

ఆ వాగ్దేవి కృపతో సంతోషం, విజయం, శాంతి, శ్రేయస్సు ఎల్లప్పుడూ మీతోనే ఉండాలని, మీ జీవితంలో నవ వసంతం వెల్లివిరియాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు వసంత పంచమి శుభాకాంక్షలు.

03/02/2022

జానారెడ్డి కంచుకోటను ఎం సి కోటిరెడ్డి గారి సహాయంతో బద్దలు కొట్టిన స్వర్గీయ మహానేత కర్నాటి భాస్కర్ రెడ్డి గారు నడి లింగయ్య గారు

30/01/2022

ఉమ్మడి నల్లగొండ జిల్లా MLC నాగార్జునసాగర్ ప్రజలు అభిమానులు ఘన స్వాగతం ... ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి గారి చరిత్ర లో మరుపురాని రోజుగా.ఉద్వేగంగా #ప్రసంగిస్తూ గుర్తు చేసుకున్న సంఘటన...
పల్లె వాడ జన నీరాజనాలతో ఘన స్వాగతం పలికిన వేళ

29/01/2022

నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొందరగా పూర్తి చేయాలని కేటీఆర్ ని కోరిన వస్తాపూరి ఏడుకొండలు యాదవ్

28/01/2022

‘ఉన్నత విద్య’ తెలంగాణకేది?

ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి వందల విజ్ఞప్తులు
ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌, ఐఐఐటీ, నవోదయ,
మెడికల్‌ కాలేజీల కోసం ఢిల్లీలో ఎక్కని గడప లేదు... ఒక్క విద్యాసంస్థనూ మంజూరు చేయని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా సంస్థలను పరిశీలిస్తే..

దేశంలో ఏడేండ్లలో కొత్తగా 7 ఐఐఎంలు కేటాయిస్తే అందులో
తెలంగాణకు కేటాయించినవి సున్నా!

ఐఐటీలు 7 ఏర్పాటు చేస్తే తెలంగాణకు ఇచ్చినవి సున్నా!
ఐఐఎస్‌ఈఆర్‌లు రెండు నెలకొల్పితే.. తెలంగాణలో నెలకొల్పినవి సున్నా!

ఐఐఐటీలు దేశవ్యాప్తంగా 16 ఏర్పాటు చేస్తే.. తెలంగాణలో ఏర్పాటుచేసినవి సున్నా!

ఎన్‌ఐడీలు దేశంలో నాలుగు పెడితే.. తెలంగాణలో పెట్టినవి సున్నా!

వివిధ రాష్ర్టాల్లో మొత్తం 157 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటుచేస్తే.. తెలంగాణలో ఏర్పాటు చేసినవి సున్నా!

నవోదయ పాఠశాలలు కొత్తగా 84 నెలకొల్పితే.. తెలంగాణలో సున్నా!

వీటిని తెప్పించేందుకు రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు చేస్తున్న కృషి.. పెద్ద గుండు సున్నా!

కేంద్ర ప్రభుత్వం అంటే పెద్దన్న పాత్ర పోషించాలి. బీజేపీ ప్రభుత్వం అయినవారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో అన్నట్టు వ్యవహరిస్తున్నది. స్వార్థ రాజకీయ ప్రయోజనాలే తప్ప, కేంద్రంలో అధికార పార్టీగా ఏనాడూ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదు. విద్యాసంస్థల కేటాయింపులో ఏడేండ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నది.

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని ఉదారంగా ఆదుకోవాలని.. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కేంద్రం పాలసీ ప్రకారం నవోదయ విద్యాలయాలు, మెడికల్‌ కాలేజీలు, ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌, ఐఐఐటీ, ఎన్‌ఐడీ వంటి విద్యాసంస్థలు, పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయాలని ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం వందలసార్లు విజ్ఞప్తి చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్కటీ మంజూరు చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా టీఆర్‌ఎస్‌ ఎంపీలు, మంత్రులు అనేకసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఫలితం లేకుండా పోయింది...https://bit.ly/3HaMfIj

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address

Hyderabad