01/05/2026
DrSeshagiri Rao
President Aadhar party
Supreme Court Lawyer
01/05/2026
10/04/2026
*వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పాటు పడదాం*
*42% బీసీ రిజర్వేషన్ల అమలుకోసం ఐక్యంగా పోరాడుదాం*
*ఆదార్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు*
*ఉప్పెన / ఖమ్మం* : పేదల అభ్యున్నతకై పాటుపడదామని, 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం అన్ని సంఘాలతో ఐక్యంగా పోరాడుదాం అని గౌడ సంఘం జెఎసీ రాష్ట్ర నాయకులు అమరగాని వెంకన్న గౌడ్, ఆదార్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంబోజి బుడ్డయ్య, బీసీ ఐక్యవేదిక నాయకులు పొడగంటి రాంబాబు లు అన్నారు. గురువారం నగరంలోని జ్యోతిరావు పూలే ఐక్యవేదిక కార్యాలయంలో ఆదార్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుక్కల నాగేశ్వరరావు గౌడ్ ఆధ్వర్యంలో బూర సైదారావు గౌడ్,నక్క అజయ్ పద్మశాలి ల అధ్యక్షతన జరిగిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ పాలకులు ఎస్సీ, ఎస్టీ,బీసీ లును కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగా వాడుకున్నారని, ఏలాంటి రాజ్యాంగబద్ధమైన పదవులు ఇవ్వలేదని, తమకు అన్యాయం జరిగిందని, కేవలం తమ స్వప్రయోజనాల కోసం తమ పదవుల కోసమే తమను వాడుకొని విస్మరించారని, అణగారిన వర్గాల హక్కుల సాధనకు జ్యోతిరావు పూలే, అంబేద్కర్ ల స్ఫూర్తితో పనిచేయాలన్నారు
పార్టీలన్నీ కుటుంబ పాలనకే ప్రాధాన్యమిస్తున్న తరుణంలో వాటిని నిరోధించేదుకు అందరం ఐక్యం కావాలని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల అమలులో అందరికీ న్యాయం జరిగేలా, నిజమైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందేలా మనం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొవాలన్నారు. పేదలకు అన్యాయం జరిగినప్పుడు పార్టీలకతీతంగా బీసీ,ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు అండగా నిలిచేందుకు సమిష్టిగా పయనం చేద్దామని వారు పిలుపునిచ్చారు. అనంతరం చదువుతోపాటు వివిధ రంగాల్లో ప్రావీణము కనబరిచిన సాధనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదార్ పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ చైర్మన్ అలెం వెంకటేశ్వర్లు, ఆదార్ పార్టీ రాష్ట్ర నాయకులు తల్లాడ వెంకన్న,ఆదార్ పార్టీ కొత్తగూడెం ఇంచార్జ్ ప్రేమ్ దయ్యాల్, జాగృతి జిల్లా అధ్యక్షురాలు గట్టు కరుణ, పెరుగు వెంకటరమణ యాదవ్, తీరాల సాధన, అపర మేధావి గుగ్గిల దివ్యమూర్తి, బహుజన ముక్తి పార్టీ అధ్యక్షులు మట్టి ప్రసాద్, అడ్వకేట్ నరేందర్, లెనిన్ ముదిరాజ్, దుర్గాప్రసాద్,సునీల్, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు
05/04/2026
05/04/2026
ఉద్యోగ నియామకాలు చేపట్టాలి - ప్రేమ్
25/03/2026
రాష్ట్రంలో మిగతా రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నయం ఆదార్ పార్టీయే........
24/03/2026
మంచిర్యాలకార్పొరేషన్* *23వ డివిజన్ అధ్యక్షురాలిగా గురుండ్ల అమృత..
మంచిర్యాల
ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు మధు మాట్లాడుతూ, గురుండ్ల అమృత కష్టపడి పనిచేసి డివిజన్ లో పార్టీని బలోపేతం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ లక్ష్యాలు, ఆశయాలు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
22/03/2026
*ముఖ్య అతిథిగా DR. ESR గారు విచ్చేస్తున్నారు*.....
22/03/2026
*మంచిర్యాలలో ఆదార్ పార్టీకి కొత్త శక్తి*
*– 34వ డివిజన్ అధ్యక్షుడిగా రెడ్డి వినయ్ నియామకం*
పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు మధు నెండుగూరి ఆకాంక్ష
*మంచిర్యాల:* అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ (ఆదార్ పార్టీ)లో భాగంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్ అధ్యక్షుడిగా రెడ్డి వినయ్‌ను నియమిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు మధు నెండుగూరి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం 2026 మార్చి 21 నుండి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మధు నెండుగూరి మాట్లాడుతూ... పార్టీ ఆశయాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రెడ్డి వినయ్ కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. డివిజన్ లో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నలుమూలలకు విస్తరించేందుకు కృషి చేయాలని సూచించారు.
తాజాగా నియమితులైన రెడ్డి వినయ్ వెంటనే బాధ్యతలు స్వీకరించి, పార్టీ కార్యకలాపాలను చురుకుగా కొనసాగించడంతో పాటు వాటి వివరాలను రాష్ట్ర కార్యాలయానికి సమయానుకూలంగా అందజేయాలని పార్టీ ఆదేశించింది.
పార్టీ బలోపేతానికి ఈ నియామకం కొత్త ఊపును తీసుకురానుందని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు.
22/03/2026
*ఆదార్ పార్టీ అధ్యక్షులు DR. ESR గారికి స్వాగతం- సుస్వాగతం*....
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Hyderabad
500001
