24/04/2025
కేంద్ర ప్రభుత్వం వెంటనే బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించాలి.
సిపిఐ మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలి
కేంద్ర ప్రభుత్వం వెంటనే బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించాలి,సిపిఐ మావోయిస్టు పార్టీతో చర్చల
Editor Picks ఉద్యమ వార్తలు ఏపి జాతీయం తెలంగాణ కేంద్ర ప్రభుత్వం వెంటనే బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించాలి,సిపిఐ మావోయ....
01/12/2024
తెలంగాణలో మళ్ళీ పోలీసుల ఇనుప బూట్ల చప్పుళ్ళు, తుపాకుల మోతలు!!!
ఖమ్మంలో మొన్న ఆరుగురిని పొట్టనపెట్టుకున్న ఈ ప్రభుత్వం, ఈరోజు మరో ఏడుగురు విప్లవకారులను బలి తీసుకుంది.
ఖమ్మం ఎన్కౌంటర్ రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందా లేక పోలీసుల అత్యుత్సాహంతో జరిగిందా అనే సంశయం అనేకమంది బుద్దిజీవుల మెదళ్లలో ఉండింది.
నేడు జరిగిన ఎన్కౌంటర్ ఆ సంశయాన్ని బద్దలు చేసింది.
విప్లవకారుల నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్ పార్టీకి ఇవేవీ కొత్తేమీ కాదు కానీ రేవంత్ రెడ్డి ఇంత త్వరగా నెత్తురు పూసుకుంటాడు అనుకోలేదు. ఈ ఘటనతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సహకరించిన ప్రజాస్వామికవాదులు, మేధావులు అందరూ దూరం అయినట్టే! గత ప్రభుత్వాల మాదిరిగా భారీ మూల్యం చెల్లించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధపడాలి!
జోహార్ చల్మెట అమరవీరులకు.
09/09/2024
*కాలంబు రాగానే కాటేసి తీరాలె*
మరిచి పోకుండగ గురుతుంచుకోవాలె
కసి ఆరిపొకుండ గురుతుంచుకోవాలె
కసి ఆరిపోకుండ బుసకోట్టుచుండాలె
కాలంబు రాగానే కాటేసి తీరాలె
‘సత్యమ్మహింస’యని సంకోచ పదరాదు
‘దయయు ధర్మం’ బనుచు తడుముకో పని లేదు
‘శాంతి’యని చాటినను శాంతింపగా రాదు
‘క్షమ’యని వేడినను క్షమియింపగారాదు
‘చాణక్య నీతి’ నాచరణలో పెట్టాలె
కాలంబు రాగానె కాటేసి తీరాలె.
తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలె
కన్ను గీటిన కళ్ల కారాలు చల్లాలె
కండ కండగ కోసి కాకులకు వెయ్యలె
కాలంబు రాగానే కాటేసి తీరాలె.
- ప్రజా కవి కాళోజీ (నేడు జయతి)
06/09/2024
అమరవీరులకు జోహార్లు
***
నక్సలైట్ల అజెండా అమలు చేస్తా అని అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ 2015లో శృతి-సాగర్ లను గ్రేహౌండ్స్ పోలీసులచే భూటకపు ఎన్కౌంటర్ చేయించింది. ఆ తరువాత విప్లవ పార్టీలు, ప్రజాసంఘాలపై నిషేధంతో అది ప్రజావ్యతిరేక ప్రభుత్వమని నిరూపించుకుంది. తెరాసను ఓడించాలనే బలమయిన ఆకాంక్ష నాలాంటి వ్యక్తులకు అట్లా మొదలయి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపేయగలిగాం.
నిన్న ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో కాంగ్రెస్ ప్రభుత్వం 6గురు ప్రజా ఉద్యమకారులను ఎన్కౌంటర్ పేరుతొ హత్య చేసింది. ఎవరి ఆదేశాలతో ఇది జరిగిందో కానీ ఇటువంటి అప్రజాస్వామిక విధానాలను కొనసాగిస్తే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెసుకు పట్టడం ఖాయం.
మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే వందలు, వేల సంఖ్యలో ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, మేధావులు, హక్కుల సంఘాలు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి దూరం అవుతాయి.
ఆ తరువాత రోజులు లెక్కబెట్టుకోవాల్సిందే!
***
14/12/2023
మీరు స్కాములు చేసినప్పుడు మేము వదిలేసినం.
ఇప్పుడు మేము స్కాములు చేసినం, మీరు మమ్మల్ని వదిలేయాలి - హరీష్ రావు
😀
06/12/2023
బీఆర్ఎస్ పార్టీ అతి త్వరలో కాలగర్భంలో కలవబోతుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇతర ప్రాంతీయ పార్టీల లాగా సైద్ధాంతిక పునాది, ఒక జాతి (కమ్యూనిటీ) మద్దత్తు లేదు. (కర్ణాటకలో జేడీఎస్, తమిళనాడులో డీఎంకే మాదిరిగా). బలమయిన నాయకత్వం ఉందా అని అంటే, బీఆర్ఎస్ పార్టీలో అందరూ వలసపోయిన అవకాశవాదులే. వాళ్ళెవరూ వచ్చే అయిదు ఏండ్లు కాదు కదా, ఆరు నెలలు కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇకపై ఒక చరిత్ర. కానీ భయపడాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ స్థానం ఆక్రమించడానికి మతోన్మాద బీజేపీ గుంట నక్క లాగ కాచుకు కూర్చుంది. బీజేపీ ని అడ్డుకోవాలంటే తెలంగాణాలో మరొక ప్రాంతీయ పార్టీ (టీజెస్), లేదా జాతీయ పార్టీ (బీఎస్పీ) ల ద్వారా మాత్రమే సాధ్యం. మొత్తంగా, తెలంగాణాలో ఇంకా కూడా పొలిటికల్ వ్యాక్యుమ్ ఉంది.
-ఇప్ప పృథ్వి రెడ్డి
10/10/2023
వేల ఏళ్లుగా ఒక పుట్ట కట్టుకుని చీమలు అందులో ప్రశాంతంగా బతుకుతూ ఉండేవి.ఒక నాడు ఒక తుంటరి ఆ పుట్టలోకి ఒక పామును వదిలాడు. ఆ పాముకు కోరలూ, అదనపు విషమూ ఎప్పటికప్పుడు సరఫరా చేయ సాగాడు. పైగా original గా ఆ పుట్ట పాముదేననీ, చీమలు పాముతో సహజీవనం చేయడం నేర్చుకోవాలని సుద్దులు చెప్పసాగాడు.
ఆ పాము మెల్లగా పుట్టను ఆక్రమించసాగింది.
చీమల బతుకు దుర్బరం కాసాగింది. ఎప్పుడైనా చీమలు ఈ అన్యాయం భరించ లేక కుడితే ఆ పాము దాని తుంటరి యజమాని ఇద్దరు
చీమల దౌర్జన్యం నశించాలి!
చీమల తీవ్రవాదం నశించాలి!
అని గట్టిగా అరిచి అఘాయిత్యం చేసేవారు.
చీమల పై దాడి చేసి ఆ పుట్టను మరింత ఆక్రమించే వారు.
ఈ ఘోరం కొన్ని దశాబ్దాలుగా సాగుతూనే వుంది.
ఆ చీమలు పాలస్తేనీయులు, ఆ పాము ఇజ్రాయేల్, ఆ తుంటరి అమెరికా.
Bhargava G పోస్ట్
16/09/2023
ఎర్రబెల్లి దయాకర్ రావు అరాచకాలు!