01/05/2026
141వ మే డే వర్ధిల్లాలి...
LBNagar Constituency Committee
01/05/2026
141వ మే డే వర్ధిల్లాలి...
25/04/2026
ప్రపంచ కార్మికులారా ఏకం కండి.. మే డే వర్ధిల్లాలి!
రాబోయే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని AITUC హయత్ నగర్ మండల సమితీ ఆధ్వర్యంలో 141వ మే డే ఉత్సవాల పోస్టర్‌ను ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు.
ఎన్నో త్యాగాలతో సాధించుకున్న మన హక్కులను కాపాడుకోవడానికి కార్మికులంతా ఒకటై.. రాబోయే మే డే ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఏఐటియూసి హయత్ నగర్ మండల గౌరవ అధ్యక్షులు గోల్కొండ నాగరాజు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు దాసరి కిరణ్, ప్రధాన కార్యదర్శి పట్టేటి శేఖర్, సిపిఐ హైకోర్టు కాలనీ డివిజన్ అధ్యక్షులు సి.హెచ్. వెంకట్, DHPS నియోజకవర్గ కార్యదర్శి పి. సురేందర్, హయత్ నగర్ అడ్డా బాధ్యులు శ్రీను తో పాటు నాయకులు వీరస్వామి, రవి, కృష్ణ మరియు కార్మిక శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
శ్రమజీవుల ఐక్యత వర్ధిల్లాలి.. ఇన్‌క్విలాబ్ జిందాబాద్!
ప్రశ్నించే గొంతుకలను అరెస్టులతో ఆపలేరు!
ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మెకు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఎల్బీనగర్ నియోజకవర్గం సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది.
ఈ క్రమంలోనే, సమ్మె చేస్తున్న కార్మికులకు అండగా నిలిచేందుకు హయత్‌నగర్ డిపో వద్దకు వెళ్లిన సీపీఐ ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి గారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి అబ్దుల్లాపూర్మెట్ స్టేషన్‌కు తరలించారు.
శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ కనీసం నాయకులను శాంతియుతంగా మాట్లాడనివ్వకుండా, గొంతు నొక్కేలా పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణం అన్నారు.
నిర్బంధాలు, అరెస్టులు చూసి ఎర్రజెండా ఎప్పుడూ భయపడదు, ఇలాంటి అణచివేత చర్యలు మా పోరాట స్ఫూర్తిని మరింత రగిలిస్తాయి తప్ప ఆపలేవు అని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు సీపీఐ వారికి అండగా ఉండి పోరాడుతూనే ఉంటుందని కార్మికుల పక్షాన నిలబడటం నేరమైతే, ఆ నేరం చేయడానికి మేమెప్పుడూ సిద్ధమే అని స్పష్టం చేశారు.
పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నాం.. విప్లవం వర్ధిల్లాలి
24/04/2026
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వెళ్లి అరెస్టైన సిపిఐ నాయకులను పరామర్శించేందుకు అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి గారు, అనంతరం హయత్‌నగర్‌లో ఆర్టీసీ కార్మికులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్బంగా హయత్నగర్ మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో బాగంగా......
10/04/2026
వీరన్నగుట్ట వద్ద ప్రారంభమైన ఇంటింటికి సిపిఐ
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర సమితి పిలుపుమేరకు ఎల్బీనగర్ నియోజకవర్గం లెక్చరర్స్ కాలనీ డివిజన్‌లోని వీరన్నగుట్ట వద్ద 'పోరాటాల సీపీఐకి చేయూతనివ్వండి' అనే నినాదంతో శుక్రవారం 'ఇంటింటికి సీపీఐ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఆందోజు రవీంద్ర చారిగారు , ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ కాలనీ డివిజన్ కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బొంగు అరుణ్ కుమార్ గౌడ్, సీపీఐ హయత్‌నగర్ మండల కార్యదర్శి శేషరాజుపల్లి శ్రీదేవి, మండల సహాయ కార్యదర్శులు కర్నె సుజాత, మర్రి శోభన్ తదితర నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
ఈరోజు(9-4-2026)సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపుమేరకు ఇంటింటి సిపిఐ కార్యక్రమంలో భాగంగా హైకోర్టు కాలనీ డివిజన్లోని రైతు బజార్ లో...