12/04/2025
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని జెండా చౌరస్తా వద్ద గల హనుమాన్ దేవాలయం వద్ద హనుమాన్ విజయోత్సవ ర్యాలీ ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు...
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సకల పీడలను తొలగించే ఆ అభయాంజనేయడు సమస్త భూ ప్రపంచానికి ఎదురైన విపత్తును పాలద్రోలాలని ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది...
12/04/2025
రేపు 13th April మధ్యాహ్నం 12:30కి మైలార్‌దేవ్‌పల్లి లోని కాటేదన్ అమ్మ గార్డెన్స్ లో మన రాజేంద్రనగర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నిరంతరం ప్రజల క్షేమమే ధ్యేయంగా శ్రమించేటువంటి నాయకులు గౌరవ శాసనసభ్యులు
శ్రీ టి ప్రకాష్ గౌడ్ గారు న్యాజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని సమయపాలన పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము..
01/01/2025
2025 నూతన సంవత్సరం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ టీ. ప్రకాష్ గౌడ్ గారు....
03/11/2024
సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈరోజు వారి నివాసంలో
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో శంషాబాద్ మున్సిపల్, గొల్లపల్లి కి చెందిన వెయిట్ లిఫ్టర్ మల్లికా రాఘవేందర్,
నార్సింగ్ మున్సిపల్ వట్టినాగులపల్లి కి చెందిన రెజ్లర్ ప్రతాప్ సింగ్ గారు సీఎం గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
వెయిట్ లిఫ్టర్ మల్లికా రాఘవేందర్ రెజ్లర్ ప్రతాప్ సింగ్ నా నియోజకవర్గంలో ఉండడం చాలా గర్వకారణమని వారు రాష్ట్ర స్థాయిలో ఎన్నో విజయాలు, పతకాలు సాధించారని ఈ సందర్భంగా సీఎం గారికి ప్రకాష్ గౌడ్ గారు వివరించారు.
వారికి మెరుగైన అవకాశాలు కల్పిస్తే మన రాష్ట్రానికి ఎంతో పేరు ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తారని తెలిపారు.
అలాగే వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని సీఎం గారిని కోరినట్లు తెలిపారు.
కార్యక్రమంలో వెయిట్ లిఫ్టర్ మల్లికా రాఘవేందర్ రెజ్లర్ ప్రతాప్ సింగ్ ఉన్నారు.
03/11/2024
రాజేంద్రనగర్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించడం జరిగింది.
29/07/2024
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, లోని ప్రజా నాయకులు మాజీ మంత్రివర్యులు కీ. శే శ్రీ ముఖేష్ గౌడ్ గారి 5వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్....
29/07/2024
గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిసి శాలవతో సన్మానించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారు...
28/07/2024
ఆషాడ బోనాలు సందర్భంగా మైలార్దేవపల్లి డివిజన్ లోని గణేష్ నగర్ కాటేదాన్ లోని బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారు..
అనంతరం ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే గారు కోరారు...
28/07/2024
మన తెలంగాణ సంస్కృతి, ఆచార సంప్రదాయాలకు ప్రతీక.. ఉరూర, వాడ వాడల అమ్మవార్లకు సమర్పించే కనుక బోనం..!!
రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు..
26/07/2024
రాజేంద్రనగర్ నియోజకవర్గం,వట్టినాగులాపల్లి లో నిర్వహిచిన
తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అండ్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో ఫైర్ మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ కు సీఎం రేవంత్ గారితో కల్సి MLA ప్రకాష్ గౌడ్ గారు హాజరైయ్యారు.
కాగా ఫైర్‌మెన్ అభ్యర్థులు నాలుగు నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సంద ర్భంగా మాట్లాడిన రేవంత్.. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
యువత ఆకాంక్షలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. కొలువుల కోసమే తెలం గాణ ఉద్యమం జరిగింద న్నారు.
బడ్జెట్‌లో విద్య, వ్యవసా యానికి అత్యంత ప్రాధా న్యం ఇచ్చామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు.
గడిచిన పదేళ్లలో ఉద్యోగాల కోసం యువత ఎదురు చూసిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 31 వేల మందికి నియామక పత్రాలిచ్చాం..
మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామ న్నారు. రేవంత్ రెడ్డి ఏ విప త్తు జరిగినా ముందుండేది ఫైర్ సిబ్బందేనన్నారు సీఎం రేవంత్.