NaaTelangana

NaaTelangana

Share

తెలంగాణ కోసం ✊✊

08/05/2026

హిందుత్వం - దేశభక్తి అనే పేర్లతో సామాన్య ప్రజలలో కుళ్ళిన బత్తాయిలు విద్వేషాలను రెచ్చగొడుతున్నారు

ప్రజలకు తప్పుడు వార్తలు అలవాటు చేసి వాటిని ఓట్ల కోసం వాడుకుంటున్నారు .. జర జాగ్రత్త ✊

07/05/2026

తలపతి విజయ్ దే ప్రభుత్వం??

06/05/2026

వరంగల్‌ను ముంచుతున్న రెండు పార్టీలు!
కవితక్క చెప్పినట్టే… పాలక పక్షం నిద్రపోతుంది, ప్రధాన ప్రతిపక్షం పట్టించుకోవడం లేదు అన్నది ఈ రెండు పార్టీలు రోజూ నిరూపిస్తున్నాయి.
10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో వరంగల్ అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారు. ఒక్క సీటుకే పరిమితం చేసి కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. కానీ ఈరోజు కాంగ్రెస్ కూడా అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తోంది.
ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కూడా ఇప్పటివరకు ఒక్కసారి సరిగ్గా ప్రశ్నించలేదు. ప్రశ్నిస్తే గత పాలనలో చేసిన తప్పులు బయటపడతాయనే భయమా?
దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ప్రజల సమస్యలు పక్కన పెట్టి ఒకర్ని ఒకరు తిట్టుకుంటే ప్రజలకు జరిగే లాభం ఏంటి ?

06/05/2026

బీఆర్ఎస్ నాయకులకు ఈ వీడియోల పడాలి అనే తాపత్రయం ఎందుకు 😂😅..... వీడియోలో ఎలివేషన్ వీడియో వేసుకోవడానికి తెలిసినవాళ్ళని మళ్ళీ పరిచయం చేస్తున్న నేతలు

Photos from NaaTelangana's post 04/05/2026

ప్రకాష్ రాజ్ మాటలు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను.... ఇది ఒక్కటే కాదు కేసీఆర్ గారు కూడా తనకు మందులు ఇచ్చే మనిషిని సంతోష్ రావు నీ ఎంపీ గా చేశారు .. ఈరోజు అయిన అనుమతి లేనిదే ఎవరు కేసీఆర్ గారి గేట్ ను కూడా టచ్ చెయ్యలేరు

04/05/2026

విజయ్ తలపతి – కల్వకుంట్ల కవిత

విజయ్‌ను ఆపేందుకు ఆయనపై ఎన్నో విధాలుగా ప్రయత్నాలు జరిగాయి. వ్యక్తిత్వ హననం నుంచి వ్యక్తిగత జీవితంపై దాడుల వరకు వివిధ రకాల ఇబ్బందులు సృష్టించారు. అయినప్పటికీ, ఈరోజు ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అదే విధంగా, కల్వకుంట్ల కవిత గారి విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. భారీ మొత్తంలో ఖర్చు చేసి వ్యక్తిత్వ హననం చేయడం, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విమర్శలు చేయించడం, మీమ్ పేజీల ద్వారా నెగటివ్ ప్రచారం చేయించడం వంటి చర్యలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

ఈ పరిస్థితుల మధ్య కూడా కవిత గారికి మంచి భవిష్యత్తు ఉందని, ఇలాంటి రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారని, త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి తగిన సమాధానం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారు అవతరించే అవకాశాలున్నాయని కూడా వారు పేర్కొంటున్నారు.

02/05/2026

మా నాన్న కెసిఆర్ గారిని నేను ఏమి అనలేదు కేవలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ గారిని చేసిన పనుల మీద విమర్శించాను, ఇక ముందు కూడా విమర్శిస్తాను - కల్వకుంట్ల కవిత గారు

01/05/2026

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)లోకి మాజీ మంత్రి బోడ జనార్దన్

టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారితో భేటీ

త్వరలోనే అనుచరులతో కలిసి పార్టీలో చేరనున్న మాజీ మంత్రి

హైదరాబాద్ :
మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బోడ జనార్దన్ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) లో చేరనున్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరుతానని తెలిపారు. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో టీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. బోడ జనార్దన్ ప్రస్తుత మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసన సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్ టీ రామారావు ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address


Telangana
Hyderabad
500001