ఈరోజు ఉదయం సోమయ్య నగర్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో నిర్వహించినటువంటి జోనల్ మీటింగ్ లో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ జి. సృజన గారు జగద్గిరిగుట్టలోని కాలనీలో ఉన్నటువంటి సమస్యల గురించి ఆరా తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన రాజీవ్ గృహకల్ప నుండి గౌరవ అధ్యక్షులు అంజన్న ధర్మారపు, ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి గారు, ఉపాధ్యక్షులు వంగాల పరశురాం గారు, సహాయ కోశాధికారి ఎస్ ఎన్ రెడ్డి గారు, పాల్గొని గౌరవ జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ గారికి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారికి ,రాజీవ్ గృహకల్ప కు సంబంధించినటువంటి త్రాగునీటి సమస్య పైన వారికి వివరించడం జరిగింది. రాజీవ్ గృహకల్ప లోని ప్రజానికం గత 18 సంవత్సరాల నుండి త్రాగునీరు కోసం గోసపడతా ఉన్నారు ,దయచేసి తమరు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన త్రాగునీరు సమస్యను తీర్చాలని, అదేవిధంగా త్రాగునీరు శాతాన్ని పెంచాలని రాత్రి వేళలో త్రాగునీరు సరఫరా చేయడం వలన కాలనీలో ఉన్నటువంటి మహిళలమ్మ తల్లులు చాలా ఇబ్బంది పడుతున్నారని, దానితోపాటు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పనిచేయడం లేదని, డ్రైనేజీ వ్యవస్థను తక్షణమే పునర్వ్యవస్థకించా లని, ప్రారంభమైనటువంటి పార్కుల పనులు త్వరితగతన పూర్తి చేయాలని గృహకల్ప లోని వీధులలో ఉన్నటువంటి రోడ్లను మంజూరు చేయాలని ,రాజీవ్ గృహకల్ప కు సంబంధించినటువంటి మహిళా సంక్షేమ సంఘం స్థలాన్ని సంక్షేమ సంఘం స్థలాన్ని పరిశీలించి వెంటనే మహిళా బిల్లింగ్ సంక్షేమ సంఘం బిల్డింగు మంజూరు చేయాలని ,వీధి దీపాలను కొత్తవి మంజూరు ఇవ్వాలని, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఈరోజు జరిగిన కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అంజన్న .ధర్మారపు గారు మాట్లాడడం జరిగింది
RGK Colony
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from RGK Colony, Social service, Rajiv Gruhakalpa, Jagathgirigutta, Hyderabad.
అంజన్న ధర్మారపు (అధ్యక్షుడు),
ముచ్చెంతుల భూపతి రెడ్డి (ప్రధాన కార్యదర్శి)
"జగద్గిరిగుట్ట, రాజీవ్ గృహకల్ప - కాలనీ అభివృద్ధికి నిబద్ధత. మెరుగైన మౌలిక సదుపాయాలు, సురక్షితమైన వాతావరణం, ఆదర్శ జీవనం మా ప్రథమ లక్ష్యం" అంజన్న ధర్మారపు (అధ్యక్షుడు),
ముచ్చెంతుల భూపతి రెడ్డి (ప్రధాన కార్యదర్శి)
"జగద్గిరిగుట్ట, రాజీవ్ గృహకల్ప - కాలనీ అభివృద్ధికి నిబద్ధత. మెరుగైన మౌలిక సదుపాయాలు, సురక్షితమైన వాతావరణం, ఆదర్శ జీవనం మా ప్రథమ లక్ష్యం"
02/06/2026
ఈరోజు ఉదయం సోమయ్య నగర్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో నిర్వహించినటువంటి జోనల్ మీటింగ్ లో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఐఏఎస్ జి. సృజన గారు జగద్గిరిగుట్టలోని కాలనీలో ఉన్నటువంటి సమస్యల గురించి ఆరా తీయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన రాజీవ్ గృహకల్ప నుండి గౌరవ అధ్యక్షులు అంజన్న ధర్మారపు, ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి గారు, ఉపాధ్యక్షులు వంగాల పరశురాం గారు, సహాయ కోశాధికారి ఎస్ ఎన్ రెడ్డి గారు, పాల్గొని గౌరవ జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ గారికి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గారికి ,రాజీవ్ గృహకల్ప కు సంబంధించినటువంటి త్రాగునీటి సమస్య పైన వారికి వివరించడం జరిగింది. రాజీవ్ గృహకల్ప లోని ప్రజానికం గత 18 సంవత్సరాల నుండి త్రాగునీరు కోసం గోసపడతా ఉన్నారు ,దయచేసి తమరు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన త్రాగునీరు సమస్యను తీర్చాలని, అదేవిధంగా త్రాగునీరు శాతాన్ని పెంచాలని రాత్రి వేళలో త్రాగునీరు సరఫరా చేయడం వలన కాలనీలో ఉన్నటువంటి మహిళలమ్మ తల్లులు చాలా ఇబ్బంది పడుతున్నారని, దానితోపాటు కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పనిచేయడం లేదని, డ్రైనేజీ వ్యవస్థను తక్షణమే పునర్వ్యవస్థకించా లని, ప్రారంభమైనటువంటి పార్కుల పనులు త్వరితగతన పూర్తి చేయాలని గృహకల్ప లోని వీధులలో ఉన్నటువంటి రోడ్లను మంజూరు చేయాలని ,రాజీవ్ గృహకల్ప కు సంబంధించినటువంటి మహిళా సంక్షేమ సంఘం స్థలాన్ని సంక్షేమ సంఘం స్థలాన్ని పరిశీలించి వెంటనే మహిళా బిల్లింగ్ సంక్షేమ సంఘం బిల్డింగు మంజూరు చేయాలని ,వీధి దీపాలను కొత్తవి మంజూరు ఇవ్వాలని, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఈరోజు జరిగిన కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అంజన్న .ధర్మారపు గారు మాట్లాడడం జరిగింది
18/05/2026
🚨 రాజీవ్ గృహకల్ప, జగద్గిరిగుట్టలో తీవ్రమైన నీటి సమస్యపై ధర్నా 🚨
ఈ రోజు రాజీవ్ గృహకల్ప నివాసితులమంతా కలిసి, మా కాలనీలో కొనసాగుతున్న తీవ్రమైన త్రాగునీటి సమస్యపై శాంతియుతంగా“హైదరాబాద్ మెట్రోపాలిటన్ జలమండలి కార్యాలయం” వద్ధ ధర్నా నిర్వహించాము.
నెలలుగా సరిపడా త్రాగునీరు అందక, కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు ఈ సమస్య వల్ల ఎంతో కష్టపడుతున్నారు. ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు తెలియజేసినా, ఇంకా శాశ్వత పరిష్కారం లభించలేదు.
ఈ ధర్నాలో గౌరవ శాసనసభ్యులు (MLA) కే.పి. వివేకానంద గారు మరియు మాజీ కార్పొరేటర్ కే. జగన్ గారు పాల్గొని, మా సమస్యలను ప్రత్యక్షంగా వినిపించుకుని, తక్షణ పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడుతామని హామీ ఇచ్చారు.
👉 మా ప్రధాన డిమాండ్లు:
1.రాజీవ్ గృహకల్పకు త్రాగునీటి సరఫరా శాతం పెంచాలి.
2.రాజీవ్ గృహకల్పకు త్రాగునీటిని జలమండలి అధికారులు స్వయంగా సరఫరా చేసి, నీటి బిల్లులను కూడా వారు స్వయంగా వసూలు చేయాలి.
3.ప్రధాన నీటి పైప్‌లైన్‌కు అనుసంధానించిన అక్రమ నీటి కనెక్షన్లను తొలగించాలి.
4.2026 జనాభా నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుని త్రాగునీటి సరఫరా చేయాలి.
5.త్రాగునీటి సరఫరాను రాత్రివేళలలో కాకుండా ఉదయం లేదా మధ్యాహ్న సమయంలో అందించాలి.
6.రాజీవ్ గృహకల్పలో ఉన్న నీటి పైప్‌లైన్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలి.
ఈ కార్యక్రమంలో మన కాలనీ అధ్యక్షులు అంజన్న ధర్మారపు గారు, ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి గారు ,ఉపాధ్యక్షులు వంగాల పరశురాం గారు ,సహాయ కోశాధికారి నరసింహారెడ్డి గారు , పాండు గారు ,బీరప్ప గారు, కాలనీ కార్యవర్గ సభ్యులు, కాలనీ పెద్దలు, మహిళలు , పాల్గొన్నారు
✊ నీరు మా హక్కు – మా జీవనాధారం ✊
✊ ప్రజల సమస్యలను పట్టించుకోండి ✊
11/05/2026
అదేవిధంగా మన కాలనీలో ఉన్నటువంటి నీటి సమస్యను గౌరవ శాసనసభ్యులు కుత్బుల్లాపూర్ వివేకనంద గారికి గౌరవ పెద్దలు 280 డివిజన్ మాజీ కార్పొరేటర్ కొలుకుల జగనన్న గారిని కలిసి మా కాలనీ కున్నటువంటి నీటి సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కోరడం జరిగింది ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు నేను అనేక దఫాలుగా మరి చర్చలు జరుపుతూనే ఉన్నాము ఈ యొక్క నీటి సమస్య అతి త్వరగా పరిష్కరిస్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది అయితే మనకు వస్తున్నటువంటి త్రాగునీరు శాతాన్ని తక్షణమే పెంచాలని వారికి తెలియజేయడం జరిగింది కాలనీలో త్రాగునీరు మనకు ఉన్నటువంటి నీటి బ్యాంకులోనికి నీరు సక్రమంగా సరఫరా అవుతుందా లేదా అని పరిశీలించేందుకు చాలా బ్లాక్స్ లోని నీటి ట్యాంకులను కాలనీ అధ్యక్షులు అంజన్న ధర్మారావు గారు పరిశీలించడం జరిగింది
11/05/2026
ఈరోజు రాజీవ్ గృహకల్ప కు సంబంధించినటువంటి స్థలంలో అక్రమ నిర్మాణాన్ని తొలగించడానికి గౌరవ పెద్దలు కుత్బుల్లాపూర్ తాసిల్దార్ ను కలవడం జరిగింది వారికి రాజీవ్ గృహకల్ప లో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణం గురండి వివరించగా వారు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు గౌరవ పెద్దలు అంజన్న ధర్మారపు గౌరవ పెద్దలు ముచ్చంతల భూపతి రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి కాలనీ సీనియర్ నాయకులు రాజుగారు కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు
14/04/2026
సమసమాజ నిర్మాణకర్త
దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి,
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న
బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేడ్కర్ గారి
135వ జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు
28/03/2026
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Hyderabad
500037