Siva Reddy

Website

Siva Reddy YSRCP Youth Leader Jammalamadugu Constituency | Son Of Ponnapureddy Ramasubbareddy MLC, Jammalamadugu YSRCP Incharge |

YSR కడప జిల్లా YSRCP జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన జిల్లా కోర్ కమిటీ సమావేశానికి హాజరై...
27/09/2026

YSR కడప జిల్లా YSRCP జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన జిల్లా కోర్ కమిటీ సమావేశానికి హాజరైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ,ఎంపీ అవినాష్ రెడ్డి గారు మరియు నియోజకవర్గ సమన్వయకర్తలు , నాయకులు పాల్గొనడం జరిగింది.

20K ఫేస్‌బుక్ ఫాలోవర్ల కుటుంబంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ❤️నా మీద మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, ఆదరణకు నా హృదయపూర్వక...
24/09/2026

20K ఫేస్‌బుక్ ఫాలోవర్ల కుటుంబంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ❤️

నా మీద మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, ఆదరణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏❤️

మీ ప్రతి ఒక్కరి ప్రోత్సాహం నాకు మరింత బాధ్యతను, మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది.

ఇలాగే మీ ప్రేమాభిమానాలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ❤️

మీ పి. శివారెడ్డి
20K కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

Like this page for more updates on P Sivareddy ❤️

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గుండ్లకుంట గ్రామంలో వినాయకుడిని దర్శించుకున్న యువనాయకుడు పి. శివారెడ్డి గారు.ఆ...
17/09/2026

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గుండ్లకుంట గ్రామంలో వినాయకుడిని దర్శించుకున్న యువనాయకుడు పి. శివారెడ్డి గారు.

ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు కలగాలని ఆకాంక్షిస్తూ...

🌺 గణపతి బప్పా మోరియా 🌺

🕉️ వినాయక చవితి శుభాకాంక్షలు 🙏

🇸🇱 **జమ్మలమడుగులో YSRCP నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం**రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జమ్మలమడుగు నియోజకవర్...
11/09/2026

🇸🇱 **జమ్మలమడుగులో YSRCP నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం**

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో నేడు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి **MLC రామసుబ్బారెడ్డి గారు** ముఖ్య అతిథిగా హాజరై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా MLC రామసుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ.. **వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీ జారీ చేసిన ఐడీ కార్డు విశిష్టతను నాయకులు, కార్యకర్తలకు వివరించారు.** రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ వైఫల్యాలను ప్రజలకు స్థానికంగా వివరించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జమ్మలమడుగు నియోజకవర్గంలో **YSRCP నాయకులు, కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారని** ప్రశంసించిన ఆయన.. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాము **కొండంత అండగా ఉంటామని** హామీ ఇచ్చారు.

అనంతరం YSRCP శ్రేణులతో కలిసి **“వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన”** పోస్టర్‌ను MLC రామసుబ్బారెడ్డి గారు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో MLC రామసుబ్బారెడ్డి గారితో పాటు **SEC మెంబర్ గిరిధర్ రెడ్డి గారు, జమ్మలమడుగు పట్టణ పరిశీలకులు శ్రీమతి ఇందిరమ్మ గారు, నియోజకవర్గ పరిశీలకులు పోరెడ్డి నరసింహారెడ్డి గారు, యువ నాయకులు శివారెడ్డి గారు**, పలువురు YSRCP నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

** **

10/09/2026

📌 **మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్‌సీపీ నాయకులపై బైండోవర్ చర్యలు చేపట్టడం సరికాదు**

మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై పోలీస్ స్టేషన్‌లలో బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ **రామసుబ్బారెడ్డి గారు** ఆందోళన వ్యక్తం చేశారు.

📌 ఎలాంటి నేర చరిత్ర లేని, ఒక్క కేసు కూడా నమోదు కాని, వైఎస్సార్‌సీపీ పార్టీలో చురుకుగా పనిచేస్తున్న నాయకులపై బైండోవర్ కేసులు తెరిచి వారిని భయభ్రాంతులకు గురి చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

📌 **బైండోవర్ చర్యలు చట్టప్రకారం, నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని** జిల్లా ఎస్పీ గారిని, జమ్మలమడుగు డీఎస్పీ గారిని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు కోరారు.

📌 ఎన్నికల సమయంలో పోలీసు వ్యవస్థను రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా న్యాయబద్ధంగా నిర్వహించి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రజల కోసం.. ప్రజల మనిషి!జీవితంలో ఆఖరి గంటలు కూడా ప్రజా సంక్షేమం గురించే అలోచించిన మహానేత వైయస్ఆర్ గారు. తెలుగు నేల మరువ...
02/09/2026

ప్రజల కోసం.. ప్రజల మనిషి!

జీవితంలో ఆఖరి గంటలు కూడా ప్రజా సంక్షేమం గురించే అలోచించిన మహానేత వైయస్ఆర్ గారు. తెలుగు నేల మరువలేని మహానేతకు 17వ వర్ధంతి సందర్భంగా నివాళులు

జోహార్ వైయస్‌ఆర్! 🙏🏻



గౌరవ పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు......
27/08/2026

గౌరవ పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు......

❤️
25/08/2026

❤️

Address

Jammalamadugu

Alerts

Be the first to know and let us send you an email when Siva Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share