Jangareddygudem Municipality

Website Contact the organization

Jangareddygudem Municipality Jangareddigudem is a Town in Jangareddigudem Mandal in West Godavari District of Andhra Pradesh State, India. It belongs to Andhra region.

స్వచ్ఛతా హి సేవలో భాగంగా ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం..జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం...
07/10/2026

స్వచ్ఛతా హి సేవలో భాగంగా ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం..

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారులు, బహిరంగ ప్రదేశాలు, కాలువలు మరియు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ప్రజలకు తడి, పొడి మరియు ఇతర వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ సిబ్బందికి అందించాలని అవగాహన కల్పించారు.

అలాగే బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ “స్వచ్ఛతే సేవ – పరిశుభ్రతే ఆరోగ్యం” అనే సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ సిహెచ్. దుర్గాప్రసాద్, శానిటేషన్ సెక్రటరీలు, మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ నందు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చెరువులు, కాలువలు, డ్రైన్లు, పరిసరాల పరిశుభ్...
05/10/2026

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ నందు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చెరువులు, కాలువలు, డ్రైన్లు, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం ...

03/10/2026

చెరువులు, కాలువలు, డ్రైన్లు, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం

చెరువులు, కాలువలు, డ్రైన్లు, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంస్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా జంగారె...
03/10/2026

చెరువులు, కాలువలు, డ్రైన్లు, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం

స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో గుర్తించిన చెరువులు, కుంటలు, కాలువలు, డ్రైన్లు మరియు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నీటి వనరుల పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఇతర వ్యర్థాలను తొలగించారు. నీటిపై తేలియాడుతున్న వ్యర్థాలను కూడా సేకరించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.

అనంతరం ప్రజలకు చెరువులు, కాలువలు, డ్రైన్లు మరియు నీటి వనరుల్లో చెత్తను వేయకూడదని, వ్యర్థాలను తడి, పొడి వ్యర్థాలుగా వేరు చేసి మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి అందించాలని అవగాహన కల్పించారు. నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే వెంకటరమణ గారు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సిహెచ్.దుర్గాప్రసాద్ గారు, శానిటేషన్ సెక్రటరీలు, శానిటేషన్ సూపర్‌వైజర్లు మరియు పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా స్థాయి స్వచ్ఛత అవార్డులు అందుకున్న జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీజిల్లా స్థాయిలో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమాల్లో...
02/10/2026

జిల్లా స్థాయి స్వచ్ఛత అవార్డులు అందుకున్న జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ

జిల్లా స్థాయిలో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి మూడు ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి.

1.స్వచ్ఛ కాలనీ గా సాయి బాలాజీ టౌన్షిప్,
2 . స్వచ్ఛ డ్వాక్రా గ్రూప్ (ఎస్‌ఎల్‌ఎఫ్) గణేష్ ఇందిరా క్రాంతి పదం ,
3 . స్వచ్ఛ వారియర్ గా పారిశుద్ధ్య కార్మికురాలు పొడుదోలు గొయ్యమ్మ .

ఈ అవార్డులను ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి గారి చేతుల మీదుగా అందుకున్నారు.

పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, చెత్త సేకరణ మరియు వేరు చేయడం, ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నందుకు ఈ అవార్డులు గుర్తింపుగా నిలిచాయని అధికారులు తెలిపారు.

ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛత కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి, జంగారెడ్డిగూడెం పట్టణాన్ని పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని మున్సిపల్ కమిషనర్ కె .వెంకటరమణ గారు తెలిపారు. ఈ సందర్భంగా అవార్డులు సాధించడంలో భాగస్వాములైన పారిశుద్ధ్య కార్మికులు, డ్వాక్రా మహిళలు, స్వచ్ఛత సిబ్బంది, అధికారులు మరియు పట్టణ ప్రజలకు అభినందనలు తెలిపారు.

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ...
02/10/2026

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ ప్లెడ్జ్, ప్లాంటేషన్ మరియు పరిసరాల శుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు మరియు పారిశుద్ధ్య కార్మికులు స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేసి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, చెత్తను తడి–పొడి చెత్తగా వేరు చేసి సక్రమంగా అందించడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం మొక్కలు నాటడంతో పాటు వాటి చుట్టూ ఉన్న ప్రాంతాలను శుభ్రపరిచారు. పచ్చదనం పెంపొందించడం, పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు సూచించారు.

మహాత్మా గాంధీ స్వచ్ఛతకు ఇచ్చిన ప్రాధాన్యతను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె. వెంకట రమణ, శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్, మున్సిపల్ సిబ్బంది మరియు పట్టణ కూటమి నాయకులు పాల్గొన్నారు..

"మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు"మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాల...
02/10/2026

"మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు"

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కె.వెంకట రమణ గారి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన అహింస, సత్యం, శాంతి, పరిశుభ్రత మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. గాంధీజీ కలలుగన్న పరిశుభ్రమైన భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం కొనసాగుతున్న స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతను ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా చేసుకోవాలని, మున్సిపల్ పరిసరాలతో పాటు ఇళ్లు, వీధులు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ *స్వచ్ఛత హి సేవా* కార్యక్రమంలో భాగంగా సాయి బాలాజీ టౌన్షిప్ నందు క్లీన్ లైన్ యాక్టివిటీస్ మర...
01/10/2026

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ *స్వచ్ఛత హి సేవా* కార్యక్రమంలో భాగంగా సాయి బాలాజీ టౌన్షిప్ నందు క్లీన్ లైన్ యాక్టివిటీస్ మరియు క్లీన్ లైన్ కాంపిటేటివ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా క్లీన్ లైన్ కాంపిటేటివ్‌లో భాగంగా రోడ్లు, పార్కు లు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. పరిశుభ్రమైన పరిసరాలు, చెత్త రహిత ప్రాంతాలు మరియు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.

తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా చూడడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.

ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్. దుర్గాప్రసాద్ గారు మాట్లాడుతూ స్వచ్ఛత హి సేవా కార్యక్రమం ద్వారా ప్రజల్లో పరిశుభ్రత పట్ల బాధ్యతను పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. సీనియర్ సిటిజన్లు, అధికారులు, ప్రజలు సమిష్టిగా భాగస్వాములై స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పట్టణ నిర్మాణానికి సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్ దుర్గ ప్రసాద్ గారు సెక్రెటరీ లు, సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.

_ కమిషనర్ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ..

పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ చెకప్ క్యాంప్..జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ "స్వచ్ఛత హి సేవ" కార్యక్రమంలో భాగంగా  పారిశుద...
30/09/2026

పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ చెకప్ క్యాంప్..

జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ "స్వచ్ఛత హి సేవ" కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రత్యేక హెల్త్ చెకప్ క్యాంప్ పేరంపేట రోడ్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్ దగ్గర నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అవసరమైన వారికి వైద్యుల సూచనలు, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన సలహాలు అందించారు.

పారిశుద్ధ్య విధుల్లో భాగంగా ప్రతిరోజూ ప్రజారోగ్యం, పరిశుభ్రత కోసం సేవలందిస్తున్న కార్మికులు తమ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులు సూచించారు. విధి నిర్వహణ సమయంలో వ్యక్తిగత రక్షణ పరికరాలను తప్పనిసరిగా ఉపయోగించాలని, పరిశుభ్రత మరియు ఆరోగ్య భద్రతా ప్రమాణాలను పాటించాలని తెలిపారు.

అలాగే పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న అర్హతకు సంబంధించిన సంక్షేమ పథకాలు, ఆరోగ్య సేవలు, సామాజిక భద్రతా ప్రయోజనాలు తదితర అంశాలపై అవగాహన కల్పించి అర్హులైన కార్మికులు సంబంధిత పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

కార్మికుల సంక్షేమం, ఆరోగ్య భద్రతకు మున్సిపాలిటీ ప్రాధాన్యత ఇస్తుందని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్.దుర్గాప్రసాద్ గారు, వైద్య సిబ్బంది, శానిటరీ సెక్రటరీలు మరియు పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

_కమిషనర్
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ

వేస్ట్ టు వండర్‌పై విద్యార్థులకు మున్సిపల్ అధికారుల అవగాహన...జంగారెడ్డిగూడెం:స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా జంగారెడ...
29/09/2026

వేస్ట్ టు వండర్‌పై విద్యార్థులకు మున్సిపల్ అధికారుల అవగాహన...

జంగారెడ్డిగూడెం:
స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు “వేస్ట్ టు వండర్” కార్యక్రమంపై మున్సిపల్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్. దుర్గాప్రసాద్ గారు మాట్లాడుతూ ఇంటి నుంచి, పాఠశాల నుంచి వెలువడే వ్యర్థాలను నిర్లక్ష్యంగా పారవేయకుండా వాటిని తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. పనికిరాని వస్తువులను సృజనాత్మకంగా ఉపయోగించుకుని అలంకరణ వస్తువులు, కళాకృతులు వంటి వాటిని తయారు చేయవచ్చని విద్యార్థులకు వివరించారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పునర్వినియోగం మరియు రీసైక్లింగ్‌పై విద్యార్థులు అవగాహన పెంపొందించుకుని తమ కుటుంబ సభ్యులు, పరిసర ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని అన్నారు.

“వ్యర్థాలను చెత్తగా కాకుండా వనరులుగా చూడాలి – వేస్ట్‌ను వండర్‌గా మార్చాలి” అనే సందేశంతో ప్రతి విద్యార్థి స్వచ్ఛతలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్ గారు, గర్ల్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు జి. ప్రశాంతి గారు, శానిటరీ సెక్రటరీలు, మున్సిపల్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

_కమిషనర్,
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ.

Address

Jangareddygudem
Jangareddygudem

Alerts

Be the first to know and let us send you an email when Jangareddygudem Municipality posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jangareddygudem Municipality:

Shortcuts

Share