17/04/2026
అందరికీ నమస్కారం, అస్సలామువాలైకుమ్ �
రాష్ట్ర ప్రభుత్వ విప్ & కడప శాసనసభ్యులు గౌ. శ్రీమతి R. మాధవి రెడ్డి మేడం గారు మరియు టిడిపి రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు గౌ. R. శ్రీనివాస రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు, కడప మునిసిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్ పరిధిలో ఈ రోజు అనగా 17/04/2026 (శుక్రవారం) డోర్ టు డోర్ క్యాంపెయిన్ విజయవంతంగా నిర్వహించబడింది.
� ఈ కార్యక్రమంలో భాగంగా 42వ మరియు 57వ బూత్‌లను సందర్శించి, స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నాము.
� ప్రతి ఇంటి సమస్యను నమోదు చేసి, వాటి పరిష్కారానికి ప్రత్యేక ఫాలోఅప్ టీమ్ ఏర్పాటు చేయబడింది.
� 43వ డివిజన్ అభివృద్ధి కోసం శుభ్రత, నీటి పారుదల, రోడ్లు మరియు ప్రజా సేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.
� ప్రజలతో నేరుగా కలుసుకోవడం ద్వారా ప్రభుత్వం పట్ల నమ్మకం పెంపొందించడం మా ప్రధాన లక్ష్యం.
� ప్రజలకు తెలియజేయడమైనది (43వ డివిజన్):
� ఉదయం నిర్వహించిన డోర్ టు డోర్ క్యాంపెయిన్ సందర్భంగా, చెత్త సేకరణ వాహనం కొన్ని వీధుల్లోకి ప్రవేశించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గమనించాం.
� రోడ్లపై అధికంగా వాహనాలు పార్క్ చేయడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతోంది.
� ఈ విషయాన్ని స్థానిక ప్రజలకు తెలియజేసి, వాహనాలను సక్రమంగా పార్క్ చేయాలని సూచనలు ఇవ్వడం జరిగింది.
� ప్రజల సహకారంతో చెత్త సేకరణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు కొనసాగుతున్నాయి.
� స్ట్రీట్ లైట్స్ & పోల్స్ సమస్యలు:
� పనిచేయని స్ట్రీట్ లైట్స్ మరియు దెబ్బతిన్న ఎలక్ట్రిక్ పోల్స్ సమస్యలను గుర్తించి, సంబంధిత అధికారులకు సమాచారం అందించడం జరిగింది.
� త్వరితగతిన ఈ సమస్యలు పరిష్కారం అయ్యేలా ఫాలోఅప్ కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో ఐటిడిపి కడప నగర ఉపాధ్యక్షులు ఫయాజ్ బాషా గారు, కడప నగర ఐటిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ అలీ గారు మరియు బూత్ ఇంచార్జి అబిద్ గారు పాల్గొన్నారు.
ఇట్లు,
మీ
సయ్యద్ యూనుస్
43వ డివిజన్ ఇంచార్జ్
.official