15/10/2026
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పైలా లక్ష్మికి అవకాశం కల్పించాలి
టీడీపీ అధిష్ఠానానికి వినతిపత్రం అందజేత
అనకాపల్లి, అక్టోబర్ 15, 2026:
అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం పైలా ప్రసాదరావు తరఫున ఆయన వదిన పైలా లక్ష్మికి అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి కేటాయించాలని కోరుతూ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు.
అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ స్థానిక సంస్థల పరిశీలకులు కొండపల్లి అప్పలనాయుడు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, మాడుగుల నియోజకవర్గ స్థానిక సంస్థల పరిశీలకులు దాసరి శ్రీనివాస్, శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి సమక్షంలో ఈ వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పైలా ప్రసాదరావు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలను పార్టీ అధిష్ఠానం గుర్తించాలని కోరారు. గత శాసనసభ ఎన్నికల్లో మాడుగుల నియోజకవర్గం నుంచి బండారు సత్యనారాయణమూర్తి విజయానికి సహకరించేందుకు తనకు కేటాయించిన టికెట్‌ను త్యాగం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా అంకితభావంతో పనిచేసిన పైలా ప్రసాదరావు సేవలను, పార్టీ పట్ల ఆయన చూపిన నిబద్ధతను అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పైలా ప్రసాదరావు కుటుంబానికి తగిన గుర్తింపునిస్తూ, పైలా లక్ష్మికి అనకాపల్లి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకుల సేవలను గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపినట్లవుతుందని వారు అభిప్రాయపడ్డారు.