Mekala SuneethaRamu yadav

Call Website Contact the organization

Mekala SuneethaRamu yadav Goutham Nagar - 141 Division Corporator (GHMC) From Malkajgiri Constituency Hyderabad | TRS Party

🔷 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 🔷ఓటరు నమోదు, తాగునీటి సమస్య...
29/10/2026

🔷 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి 🔷

ఓటరు నమోదు, తాగునీటి సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లపై పార్టీ నాయకులతో సమీక్ష

రానున్న మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మల్కాజ్‌గిరి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎంబీసీ చైర్మన్ శ్రీ నందికంటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.

పట్టభద్రుల ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి

ఈ సందర్భంగా నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటరు నమోదు పురోగతి, అర్హులైన పట్టభద్రులను గుర్తించడం, ఓటరు నమోదు నిబంధనలపై అవగాహన కల్పించడం, అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకునేలా సహకరించడం, నాయకులు–కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు.

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుగానే ఓటరుగా నమోదు చేసుకోవడం ముఖ్యమని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ తమ డివిజన్ల పరిధిలోని పట్టభద్రులను గుర్తించి, వారికి నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని, ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోగా దరఖాస్తు చేసుకునేలా సహకరించాలని పిలుపునిచ్చారు.

పట్టభద్రు లు జాబితాలో పేర్లు నమోదు చేసుకోండి మహబూబ్ నగర్, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు త్వరలో జరగబోయే పట్టభద్ర...
25/10/2026

పట్టభద్రు లు జాబితాలో పేర్లు నమోదు చేసుకోండి

మహబూబ్ నగర్, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు ఓటరు జాబితాలో తమ ఓటును నమోదు చేసుకోవాలని గౌతమ్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మేకల సునీత రామ యాదవ్ పిలుపునిచ్చారు.

మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, పట్టబద్రుల ఎమ్మెల్సీ ఇన్చార్జి నందిపంటి శ్రీధర్ ఆదేశాల మేరకు శనివారం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ గ్రౌండ్ సమీపంలో ఓటర్ నమోదు కేంద్రాన్ని ఆమె ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పట్టబద్రులు ఓటు నమోదు చేసుకోవాలని పత్రాలను సైతం పంపిణీ చేశారు.

గోపాల్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోపాల్ నగర్ లో జరిగిన బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్ర...
20/10/2026

గోపాల్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోపాల్ నగర్ లో జరిగిన బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి సతీమణి మర్రి మమత రెడ్డి గారు గౌతమ్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ హాజరై బతుకమ్మ ఆటపాట ఆడి పాడారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాము యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు – అన్నదాన కార్యక్రమం ప్రారంభం! 🙏🌺దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ...
19/10/2026

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు – అన్నదాన కార్యక్రమం ప్రారంభం! 🙏🌺

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున నగర్ కాలనీలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బైరు అనిల్ కుమార్ ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాన్ని మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

అనంతరం భక్తుల సమక్షంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తి, సేవ, ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సానుకూలతను పెంపొందించడంతో పాటు, ప్రజల మధ్య సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.

అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, శాంతి, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. 🌺🙏

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

జై మాతా దీ! 🚩🌺

17/10/2026
అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేయాలిమల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు, గ...
15/10/2026

అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేయాలి

మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు, గౌతమ్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో గురువారం మల్కాజిగిరి జోనల్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. జూనియర్ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో ఏఎంసీ శాంతి ప్రియకు వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ మాట్లాడుతూ, ఇళ్లు లేక ఎంతోమంది నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి న్యాయం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్, ఇతర సీనియర్ నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.

గౌతమనగర్ డివిజన్ 182 పరిధిలో జూపల్లి బాలయ్య (50) గారు తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో మృతి చెందడం జరిగింది.దుర్గాభవాని రజక ...
05/10/2026

గౌతమనగర్ డివిజన్ 182 పరిధిలో జూపల్లి బాలయ్య (50) గారు తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో మృతి చెందడం జరిగింది.

దుర్గాభవాని రజక సంక్షేమ సంఘం సభ్యుడైన బాలయ్య గారి మృతి విషయం తెలుసుకున్న సంఘం సభ్యులు, ఈ విషయాన్ని మాజీ కార్పొరేటర్ సునీతా రామ్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్లారు.

విషయం తెలుసుకున్న సునీతా రామ్ యాదవ్ గారు తక్షణమే స్పందించి, బాలయ్య గారి కుటుంబానికి ₹10,000 ఆర్థిక సహాయం అందజేశారు.అంతేకాకుండా, వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు

మహాత్మా గాంధీ ఆశయాల సాధనకు నేటి యువత కృషి చేయాలి: మేకల సునీత రాము యాదవ్మహాత్మా గాంధీ ఆశయాల సాధనకు నేటి యువత కృషి చేయాలని...
02/10/2026

మహాత్మా గాంధీ ఆశయాల సాధనకు నేటి యువత కృషి చేయాలి: మేకల సునీత రాము యాదవ్

మహాత్మా గాంధీ ఆశయాల సాధనకు నేటి యువత కృషి చేయాలని గౌతమ్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ అన్నారు.

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి సమాజానికి కూడా ఎంతో ఆదర్శప్రాయమని అన్నారు. గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత సామాజిక బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

27/09/2026

Attended various Ganesh Nimmajjanam celebrations across Goutham Nagar Division along with Malkajgiri MLA Sri Marri Rajashekar Reddy Garu and BRS Party leaders, cadre.

✨ Seeking the blessings of Vighnaharta, and praying for peace, prosperity, and happiness for everyone.

Ganpati Bappa Morya! 🙏🚩


Address

#1-32, Sanjay Nagar, Brundhavan Colony, Beside Hero Showroom
Malkajgiri

Alerts

Be the first to know and let us send you an email when Mekala SuneethaRamu yadav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mekala SuneethaRamu yadav:

Shortcuts

Share