Prajaseva welfare society

Contact the organization

Prajaseva welfare society Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Prajaseva welfare society, Mandamarri, Mancherial.

ప్రజా సేవ వెల్ఫేర్ సొసైటీ – మంధమర్రి 💚
“మీ చిన్న సహాయం… ఎవరో ఒకరి పెద్ద ఆశ” ✨
🍲 ఆకలితో ఉన్నవారికి ఆహారం
📚 పిల్లల విద్యకు తోడ్పాటు
🙌 కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా
👉 మీరు కూడా పేదలకు సహాయం చేయాలనుకుంటే వెంటనే సంప్రదించండి!

17/09/2026

ప్రతి ఒక్కరి బాధ్యత – పర్యావరణ పరిరక్షణ! 🌍
మన భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, పచ్చని ప్రకృతిని అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేందుకు బాధ్యతగా ముందుకు రావాలి.

*మట్టి గణనాథుల విగ్రహాల పంపిణీ విజయవంతం*మందమర్రి: మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్...
14/09/2026

*మట్టి గణనాథుల విగ్రహాల పంపిణీ విజయవంతం*

మందమర్రి: మంచిర్యాల జిల్లాలోని మందమర్రి పట్టణంలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మట్టి గణనాథుల విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

*ఈ కార్యక్రమానికి మందమర్రి పట్టణ ఎస్సై జి .నరేష్ గారు ముఖ్య అతిథిగా హాజరై, తన చేతుల మీదుగా భక్తులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.*

*అనంతరం ఎస్సై జి . నరేష్ గారు మాట్లాడుతూ* మట్టి గణపతులను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని అన్నారు.రసాయనిక రంగులతో తయారు చేసిన విగ్రహాలను చెరువులు, నదులు, ఇతర నీటి వనరుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై జలచరాలకు, జీవరాశులకు హాని కలిగే అవకాశం ఉందన్నారు.

వినాయక చవితి పండుగను పర్యావరణహితంగా జరుపుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. మట్టితో తయారు చేసిన వినాయకుడిని పసుపు, కుంకుమ, పూలు, వివిధ రకాల పత్రాలతో భక్తిశ్రద్ధలతో పూజించి, అనంతరం సహజ పద్ధతిలో నిమజ్జనం చేయాలని ప్రజలకు సూచించారు.

“మట్టి వినాయకుడిని పూజిద్దాం – మన ప్రకృతిని కాపాడుదాం” అనే సందేశాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని, ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మరియు రసాయనిక రంగుల విగ్రహాలను నివారించి మట్టి గణనాథులనే ప్రోత్సహించాలని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ విజ్ఞప్తి చేసింది.

*ఈ కార్యక్రమంలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నందిపాట రాజ్ కుమార్, కార్యదర్శి గాండ్ల సంజీవ్, ఎండి జావిద్ పాషా, సుందర్, చిలుముల రాజు, చందు, దిలీప్, నాగరాజు , రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.*

14/09/2026

వినాయకుడిని పూజిద్దాం – మన ప్రకృతిని కాపాడుదాం

*మట్టి వినాయకులను పూజిద్దాం – ప్రకృతిని కాపాడుదాం**ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం*మందమర్రి పట్టణం...
13/09/2026

*మట్టి వినాయకులను పూజిద్దాం – ప్రకృతిని కాపాడుదాం*

*ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం*

మందమర్రి పట్టణంలోని 11వ వార్డులో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో “మట్టి వినాయకులను పూజిద్దాం – మన ప్రకృతిని కాపాడుదాం” అనే సందేశంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.*

ఈ సందర్భంగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్ మాట్లాడుతూ*l

వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా సహజమైన మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించాలని ప్రజలకు సూచించారు.
మట్టి వినాయకుడిని పూజించడం ద్వారా నిమజ్జనం అనంతరం విగ్రహం సహజంగా మట్టిలో కలిసిపోతుందని, తద్వారా నీటి కాలుష్యం తగ్గడంతో పాటు జలచరాలు, పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలకు “ఒక్క కుటుంబం – ఒక్క మట్టి వినాయకుడు” అనే సంకల్పాన్ని తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, పొరుగువారికి మట్టి వినాయకుడి ప్రాముఖ్యతను వివరించి, పర్యావరణహిత వినాయక చవితి నిర్వహించేలా ప్రోత్సహించాలని కోరారు.
అలాగే వినాయక చవితి సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, పూజా సామగ్రిని నీటిలో వేయకుండా తగిన విధంగా నిర్వహించాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు.

*“మన భక్తి ప్రకృతికి హాని చేయకూడదు. మట్టి వినాయకుడిని పూజిద్దాం – నీటి కాలుష్యాన్ని అరికడదాం – పర్యావరణాన్ని కాపాడుదాం – భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందిద్దాం” అని పిలుపునిచ్చారు.*

*ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నందిపాట రాజకుమార్, జిల్లా కార్యదర్శి గాండ్ల సంజీవ్ పటేల్, గోపాల్, చిలుముల రాజు తదితరులు పాల్గొన్నారు.*

11/09/2026

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ
విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ, విద్యార్థులు పుస్తకాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యకు తమ వంతు సహకారం అందించడం సొసైటీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు.

🟡 ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ 🟡ఆహారాన్ని పారవేయకండి… ఆకలిని తీర్చండి! 🍚🤝మందమర్రి: పట్టణంలోని 1వ జోన్‌లో జరిగిన ఆకరి  అమ్మక ...
06/09/2026

🟡 ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ 🟡

ఆహారాన్ని పారవేయకండి… ఆకలిని తీర్చండి! 🍚🤝

మందమర్రి: పట్టణంలోని 1వ జోన్‌లో జరిగిన ఆకరి అమ్మక గారి దశదిన కర్మ కార్యక్రమంలో మిగిలిన ఆహారం వృథా కాకూడదనే మంచి ఉద్దేశంతో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీకి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన సొసైటీ సభ్యులు మిగిలిన ఆహారాన్ని సేకరించి, మందమర్రి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు ప్రేమతో పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నాదిపాటి రాజ్ కుమార్ మాట్లాడుతూ,

«“అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆహారం ఎప్పటికీ వృథా కాకూడదు. ఎక్కడైనా మిగిలిన ఆహారం ఉంటే ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీకి సమాచారం అందించండి. మేము వెంటనే స్పందించి, ఆ ఆహారాన్ని అవసరమైన పేదలకు చేరవేస్తాము.” అని తెలిపారు.»

ఈ సేవా కార్యక్రమంలో సీహెచ్ రాజు, గోపాల్ పాల్గొన్నారు.

🌾 ఆహారాన్ని వృథా చేయకుండా… ఆకలితో ఉన్న వారికి అందించడం మనందరి సామాజిక బాధ్యత.

💛🙏 ప్రజాసేవే పరమోద్దేశం… సేవే మా సంకల్పం!

📝 ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ 📝మందమరి కళ్యాణి కని పాఠశాల విద్యార్థులకు ప్రజాసేవ వెల్...
29/08/2026

📝 ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ 📝
మందమరి కళ్యాణి కని పాఠశాల విద్యార్థులకు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీలత ఇంచార్జ్ రజిత గారి సమక్షంలో జరిగింది.
ఈ సందర్భంగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీమోద్దీన్ మాట్లాడుతూ...

“విద్యార్థుల భవిష్యత్తుకు పరీక్షలు ఎంతో ముఖ్యమైనవి. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, మా వంతు సహాయంగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మందమరి కళ్యాణి కని పాఠశాల విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేయడం జరిగింది.
విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాము.”
అలాగే, ఇలాంటి సేవా కార్యక్రమాలకు సహాయం చేయాలని ఆసక్తి ఉన్న దాతలు, సేవాభిమానులు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీని సంప్రదించాలని కోరారు. వారి సహకారాన్ని అవసరమైన వారికి చేరేలా సద్వినియోగం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నందిపాటి రాజ్ కుమార్, కార్యదర్శి గాండ్ల సంజీవ్ పటేల్, ఎండి జావిద్ పాషా, అన్వేష్, సూర్య, ఇమామ్ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🌿 ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ
🤝 సేవే మా లక్ష్యం – సమాజమే మా కుటుంబం

24/08/2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రసిద్ధి గారు

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ 🌿🎉 ప్రసిద్ధి గారి పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర వస్తువుల పంపిణీ 🎉ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్...
24/08/2026

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ 🌿

🎉 ప్రసిద్ధి గారి పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర వస్తువుల పంపిణీ 🎉

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రేగుంట సాయి పూజిత దంపతుల కుటుంబానికి నెల రోజుల పాటు సరిపడే నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

💬 ఈ సందర్భంగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్ మాట్లాడుతూ—

రేగుంట సాయి పూజిత దంపతులు వృత్తిరీత్యా టైర్ పంక్చర్ షాప్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న క్రమంలో గుండెకు చిల్లు పడటంతో అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో స్థానికులు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీని సంప్రదించారు.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్పందించిన సొసైటీ సభ్యులు రాందేవ్ ట్రేడర్స్ నిఖిల్ గారిని సంప్రదించగా, ఆయన ఆ కుటుంబానికి నెల రోజుల పాటు సరిపడే నిత్యావసర సామాగ్రిని స్వయంగా కొనుగోలు చేసి అందించారు.అనంతరం ఆ సామాగ్రిని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ బాధ్యులు ఆ కుటుంబానికి అందజేశారు.
భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి తమ సొసైటీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.

🙏 ప్రత్యేక ధన్యవాదాలు:
ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రసిద్ధి గారికి, రాందేవ్ ట్రేడర్స్ నిఖిల్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

👥 ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నందిపాటి రాజ్ కుమార్, జావిద్ పాషా, పృద్వి, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
🤝 ప్రజాసేవే మా లక్ష్యం – సేవే మా సంకల్పం.

Address

Mandamarri
Mancherial
504231

Website

Alerts

Be the first to know and let us send you an email when Prajaseva welfare society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Prajaseva welfare society:

Shortcuts

Share