Nenavath BaluNaik - MLA

Nenavath BaluNaik - MLA

Share

MLA - Devarakonda Assembly

27/01/2025

ఎమ్మెల్యే శ్రీ. నేనావత్ బాలునాయక్ గారి ప్రత్యేక చొరవతో.. అనేక సంవత్సరాలుగా నెలకొనివున్న దేవరకొండ " డబుల్ బెడ్ రూం " నివాసితులకు మౌళిక వసతులు కల్పన.

Photos from Nenavath BaluNaik - MLA's post 27/01/2025

శీలా ధర్మయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ. నేనావత్ బాలు నాయక్ గారు.

దేవరకొండ పట్టణం సుభాష్ నగర్ కాలనీకి చెందిన శీలా ధర్మయ్య అకాల మరణాన్ని చింతిస్తూ వారి భౌతిక కాయానికి నివాళులర్పించన దేవరకొండ శాసన సభ్యులు శ్రీ. నేనావత్ బాలునాయక్ గారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంలో వారితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, PACS చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డీ తదితరులు ఉన్నారు.

27/01/2025

రమావత్ మంగ్తా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ. నేనావత్ బాలు నాయక్ గారు.

కొండమల్లేపల్లి మండలం రాముని గుండ్ల తండా చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రమావత్ మంగ్తా నాయక్ గారు స్వర్గస్తులైన విషయం తెలుసుకొని నేడు వారి స్వగృహంలో రమావత్ మంగ్తా నాయక్ గారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ. నేనావత్ బాలు నాయక్ గారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంలో వారితోపాటు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, PACS చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డీ, మండల పార్టీ అధ్యక్షులు ఉట్కూరి వేమన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దిశెట్టి సుధాకర్, మాజీ ఎంపీటీసీ లాలు నాయక్, మాజీ సర్పంచ్ రమావత్ రవి నాయక్, బాల్ సింగ్, జేమ్లా నాయక్, మోహన్ తదితరులు ఉన్నారు.

27/01/2025

మహమ్మద్ అజీమ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ. నేనావత్ బాలు నాయక్

దేవరకొండ మున్సిపాలిటీ 3వ వార్డు మాజీ కౌన్సిలర్ రజియా సుల్తానా గారి కుమారుడు మహమ్మద్ అజీమ్ గారు మృతి చెందిన విషయం తెలుసుకొని నేడు మహమ్మద్ అజీమ్ గారి
భౌతిక కాయాన్ని పూల మాలవేసి నివాళులర్పించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ. నేనావత్ బాలు నాయక్ గారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంలో ఆయనపాటు...
మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, PACS చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డీ, కొండ్ర శ్రీశైలం యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రహాత్ అలీ, పట్టణ మాజీ సర్పంచ్ పున్న వేంకటేశ్వర్లు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యూనుస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తిపార్తి రుక్మా రెడ్డి, హన్మంతు వెంకటేష్ గౌడ్, పట్టణ మాజీ కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

27/01/2025

నిష్పక్షపాతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి.

Photos from Nenavath BaluNaik - MLA's post 26/01/2025

ఓలా బైక్ షోరూం ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ. నేనావత్ బాలు నాయక్ గారు.

దేవరకొండ పట్టణంలోని చారకొండ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఓలా బైక్ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, ఓలా బైక్ షోరూంను ప్రారంభించి,షోరూం యజమానికి శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ. నేనావత్ బాలు నాయక్ గారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, మాజీ సర్పంచ్ లక్పతి నాయక్, యువ నాయకులు బాబు రామ్ నాయక్, సుభాష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

26/01/2025

తమ తమ రంగాలలో విశిష్ట సేవలు అందిస్తూ, తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అత్యుత్తమ పురస్కారాలు పద్మ విభూషణ్ కు ఎంపికైన ఈ డాక్టర్ శ్రీ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గారికి,

పద్మభూషణ్ కు ఎంపికైన ప్రముఖ నటుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి,

పద్మశ్రీకి ఎంపికైన శ్రీ మందకృష్ణ మాదిగ, శ్రీ కెఎల్ కృష్ణ,శ్రీ మాడుగుల నాగఫణి శర్మ, శ్రీ మిరియాల అప్పారావు, శ్రీ వద్దిరాజు రాఘవేంద్రాచార్యుల గార్లకు నా హృదయపూర్వక అభినందలు తెలియజేస్తున్నాను.

వారు చేసిన సేవలకుగాను ఈ అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఇదే అకుంఠిత దీక్షతో వారి వారి రంగాలలో మరిన్ని విజయాలు సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Photos from Nenavath BaluNaik - MLA's post 26/01/2025

దేవరకొండ ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయంలో నేడు నిర్వహించిన కొండమల్లెపల్లి మండలానికి సంబంధించిన కల్యాణ లక్ష్మీ, షాధిముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని 40మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ. నేనావత్ బాలు నాయక్ గారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తోందని, సమాజంలోని ప్రతి వర్గానికీ ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు.

కల్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ పథకాలతో పేద కుటుంబాలాకు ఆర్థిక సాయం అందించడం ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ శిరాజ్ ఖాన్, PACs చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డీ, మండల పార్టీ అధ్యక్షులు వేమన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సలహాదారుడు యుగంధర్ రెడ్డి, తహసీల్దార్ అన్వర్ హుస్సెన్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల ముఖ్య నాయకులు, లబ్ధిదారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు..

Photos from Nenavath BaluNaik - MLA's post 26/01/2025

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు దేవరకొండ ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ. నేనావత్ బాలు నాయక్ గారు.

అనంతరం... మహనీయులను స్మరించుకుంటూ..
భారత రాజ్యాంగ స్ఫూర్తితో అంబేడ్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరుతూ దేవరకొండ నియోజక వర్గ ప్రాంత ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, RDO రమణా రెడ్డి, నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, PACs చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి, కొండ్ర శ్రీశైలం యాదవ్, సీపీఐ రాష్ట్ర నాయకులు పల్లా నర్సింహా రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Photos from Nenavath BaluNaik - MLA's post 26/01/2025

పిఏ పల్లి. మండలం మేడారం గ్రామానికి చెందిన కొండ అంజయ్య గారి కుమారుడు కొండ చింటుపై ఇటీవల జరిగిన హత్యాయత్నంలో గాయాలై దేవరకొండలోని సంజీవిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని నేడు కొండ చింటుని పరామర్శించి,వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ .నేనావత్ బాలు నాయక్ గారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నారాయణ నాయక్, సీనియర్ నాయకులు యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

26/01/2025

దేవరకొండ: పట్టణ పరిధిలోని డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలని వద్ద ఏర్పాటు చేసిన సెంట్రల్ లైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ గారితో కలిసి సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ. నేనావత్ బాలు నాయక్ గారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యుగంధర్ రెడ్డి, యువ నాయకులు బాబు రామ్ నాయక్, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు || Ma Telangana 26/01/2025

దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు, తాగు నీరును అందించే ప్రాజెక్టు " ఏదుల నుండి డిండి" వరకు నీరును అందించే పనులకు నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక దన్యవాదాలు 💐🙏

మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు || Ma Telangana మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు || Ma Telangana"Ma Telangana" న్యూస్ తెలుగు" - తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ కోసం అన్ని రకాల వా.....

26/01/2025

🇮🇳 Happy Republic Day 🇮🇳

ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ మన రాజ్యాంగానికి కట్టుబడి, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషిచేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం!





25/01/2025

నేరేడుగొమ్ము,
కొత్తపల్లి.

దేవరకొండ పట్టణంలోని వైష్ణవి ఫంక్షన్ హాల్ లో ఈరోజు జరిగిన " కొత్తపల్లి వర్ధన్, శివాణి "ల రిసెప్షన్ వేడుకకు దేవరకొండ శాసన సభ్యులు శ్రీ. నేనావత్ బాలునాయక్ గారు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంలో ఆయనతో పాటు నేరేడుగొమ్ము మండల పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య, మాజీ ఎంపీటీసీ యుగంధర్ రెడ్డి, కొండల్ రెడ్డి, గడ్డం వెంకటయ్య యాదవ్, మురళీ కృష్ణ, గిరి యాదయ్య, మాజీ సర్పంచ్ శభాష్, కుంభం రామకృష్ణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నీలం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

25/01/2025

దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 💐🙏

ఈ రోజు మన స్వేచ్ఛను కాపాడుకోవడానికి మరియు మన దేశాన్ని సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్రంగా నిర్మించడానికి మహానుభావులు చేసిన త్యాగాలను స్మరించుకుందాం.

మన దేశాన్ని రక్షించడం అంటే కేవలం సరిహద్దులను కాపాడుకోవడం మాత్రమే కాదు. మన రాజ్యాంగంలో పొందుపరచబడిన న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం యొక్క విలువలను ప్రజలందరూ తెలుసుకునేలా పాటుపడడం మన బాధ్యతని గుర్తుచేసుకుందాం.

ప్రజలందరి మధ్య సోదర భావాన్ని పెంపొందించడంలో మన బాధ్యత క్రియాశీలమైనది. మన తరువాతి తరానికి విద్యతో కూడిన సాధికారత కల్పించడం కోసం మనమంతా పాటుపడాలి.

మన దేశ పురోగతికి కట్టుబడి ఉందాం.
దేశ సమగ్రతను కాపాడుకోవడం కోసం మనమంతా కలిసికట్టుగా పురోగమిస్తూ బలమైన, సంపన్నమైన భారతదేశం కల సాకారం అయ్యేలా కృషి చేద్దాం.

భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. రాజ్యంగా విలువలను ప్రజలందరికీ పంచుదాం.

జై హింద్!



25/01/2025

🇮🇳 నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం 🇮🇳

భారత రాజ్యాంగం కల్పించిన "ఓటు" హక్కు ప్రజాస్వామ్య వ్వవస్థకు ఊపిరి. 18 సంవత్సరాలు నిండిన యువకులను నేడు ఓటరుగా పేరును నమోదు చేయిద్దాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో మనం భాగస్వాములవుదాం!.


25/01/2025

ప్రజా ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల కోసం లబ్దిదారుల ఎంపిక నిరంతరం కొనసాగుతుంది. Collector Nalgonda

Telangana CMO Bhatti Vikramarka Mallu Anumula Revanth Reddy Telangana Congress

24/01/2025

పి.ఎ.పల్లి మండలం యల్లాపురం, పెద్దగట్టు
గ్రామాలలో సుమారు 30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ. నేనావత్ బాలు నాయక్ గారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ...
నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులను మంజూరు చేయించి, అనేక రకాల అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు.

రోడ్డు పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టి వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల గోవర్దన్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోడియ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కసిరెడ్డీ శ్రీనివాస్ రెడ్డి, తెర సత్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నారాయణ, యువజన నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

#ప్రజాపాలన #ప్రజాప్రభుత్వం

Want your business to be the top-listed Government Service in Nalgonda?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address

Devarakonda
Nalgonda