Telugu Desam Party: Nellore Rural

Call Website Contact the organization

Telugu Desam Party: Nellore Rural Official Page of TDP Nellore Rural

30/09/2026

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. విశాఖ, మంగళగిరి, విజయవాడలో మొత్తం 60 వేల మంది పేదలకు పట్టాలు ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మార్కెట్లో వీటి విలువ రూ.52 వేల కోట్లు. కూటమి ప్రభుత్వంలో పేదలకు జరుగుతున్న పట్టాభిషేకం ఇది.




•ప్రజలకు సేవ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, తాము ప్రజల సేవకులమే తప్ప పెత్తందారులు కాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు•...
30/09/2026

•ప్రజలకు సేవ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, తాము ప్రజల సేవకులమే తప్ప పెత్తందారులు కాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు

•ఉదయగిరి నియోజకవర్గంలోని కాకొల్లువారిపాలెంలో నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా రూ.11,085 కోట్ల విలువైన గ్రామీణ అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు

•తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన సింగపూర్ హోంమంత్రి కె. షణ్ముగంను విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వాగతించి, గౌరవ మర్యాదలతో శ్రీవారి దర్శనానికి తీసుకెళ్లారు

•దేశాభివృద్ధికి రాబోయే 20 ఏళ్లు అత్యంత కీలకమని, ఈ కాలంలో ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థల్లో విప్లవాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు

•కేరళలోని కొచ్చిలో స్థానిక తెలుగు ప్రజలు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు తెలుగువారి ఆప్యాయత, అభిమానం వెల్లివిరిసాయి

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/oBJi8


విజయవాడలో దశాబ్దాల నాటి ఇళ్ల స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు సీఎం చంద్రబాబు గారు. రూ. 9800 కోట్ల విలువైన ప్రభు...
30/09/2026

విజయవాడలో దశాబ్దాల నాటి ఇళ్ల స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు సీఎం చంద్రబాబు గారు. రూ. 9800 కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై 24057 నిరుపేద కుటుంబాలకు సర్వాధికారాలు కల్పిస్తూ పట్టాలు అందజేశారు.




30/09/2026

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కాకొల్లువారిపాలెంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహించారు. సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా గ్రామీణ ప్రాంత అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. పల్లెల సర్వతోముఖ అభివృద్ధికి రూ.11,085 కోట్ల నిధులు మంజూరు చేశారు.

#పల్లెపండుగ


30/09/2026

మాది పేదలకు పట్టాభిషేకం. జగన్ ది రక్తాభిషేకం. మా అభిమతం అభివృద్ధి. అడ్డొస్తే ఎవ్వరినీ ఉపేక్షించం.


29/09/2026

ఉదయగిరి నుంచి పల్లెల్లో నవోదయానికి అడుగులు వేస్తున్నాం. మన గ్రామాల్లో అద్భుతమైన మార్పునకు నాంది పలుకుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పల్లె పండుగ 1.0, 2.0 లాగే 3.0 కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది.

#పల్లెపండుగ


29/09/2026

సీఎం చంద్రబాబు నాయుడు గారు తన దార్శనికతతో, ఆర్థిక పరిపక్వతతో అప్పులపాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నారు - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు

#పల్లెపండుగ



29/09/2026

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో నిర్వహించిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రూ.11,085 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ కండువాలను గాల్లో ఊపుతూ సభికులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం పలికారు.

#పల్లెపండుగ


నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కాకొల్లువారిపల్లెలో ‘పల్లెపండుగ 3.’0 కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాస...
29/09/2026

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కాకొల్లువారిపల్లెలో ‘పల్లెపండుగ 3.’0 కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగలో పాల్గొంటారు.

#పల్లెపండుగ


29/09/2026

దేశంలో అపారమైన సామర్థ్యం ఉన్నా.. మనం దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయాం. మొదటిసారిగా మన ప్రధాని నరేంద్ర మోదీ ‘మిషన్ కర్మయోగి’, ‘కెపాసిటీ బిల్డింగ్ కమిషన్’, ‘ఐగాట్ (iGOT) కర్మయోగి’, ‘ఉన్నతి’ ద్వారా ఒక సమగ్ర సామర్థ్య నిర్మాణ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దీని వల్లనే, ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ ఇప్పటివరకు 4,200 కోర్సులను పూర్తిచేసి; ఆల్ ఇండియా స్థాయిలో 14,500 క్రెడిట్లను సాధించారు.

Address

Nellore Rural
Nellore
524004

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Nellore Rural posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Nellore Rural:

Shortcuts

Share