Nizamabad Balagam

Nizamabad Balagam

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nizamabad Balagam, Nizamabad.

01/06/2026
30/05/2026

🚩 జై శ్రీరామ్! జై హనుమాన్! 🚩

ఈ పవిత్ర శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నాము.

నిజామాబాద్ ప్రజల సంక్షేమం, అభివృద్ధి మరియు శాంతి కోసం కృషి చేస్తున్న నాయకులందరికీ బుద్ధి, జ్ఞానం, ధైర్యం మరియు సత్ప్రేరణ ప్రసాదించాలని హనుమంతుడిని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను.

🙏 "ప్రజా సేవే పరమో ధర్మః"

శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపాకటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ...


30/05/2026

“అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి,
అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి.
అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు.”

— ప్రజాకవి కాళోజీ నారాయణరావు

అన్యాయానికి ఎదురు నిలబడే ప్రతి గొంతుకే మా వందనం.
ప్రజల హక్కులు, ప్రజల గౌరవం, ప్రజల భవిష్యత్తు కోసం పోరాటమే మా ధ్యేయం.

#నిజామాబాద్బలగం

30/05/2026

జన్మదిన శుభాకాంక్షలు Jagan Mohan Bajareddy బాజిరెడ్డి జగన్మోహన్ గారికి.

ప్రజా ప్రతినిధి అంటే ప్రజల మధ్య ఉండాలి. ప్రజల ఫోన్ కాల్స్‌కు స్పందిస్తూ, వారి సమస్యలపై గళం విప్పుతూ, ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ నాయకత్వాన్ని నిరూపించండి.
Bajareddy Jaganmohan

29/05/2026

సర్కారు బడి.. వసతులు కొరవడి
జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు కరవయ్యాయి . కొన్ని ఐనుల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. మరికొన్ని బడుల్లో తర గతి గదులు శిథిలావస్థకు చేరాయి.

29/05/2026

క్రీడా ప్రాంగణం.. ఆటలకు దూరం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడానికి జిల్లాలోని కొన్ని మండలాలకు గ్రీన్ ఫీల్డ్ స్టేడియాలను మంజూరు ఇచ్చింది. ఇందులో భాగంగా జక్రాన్ప ల్లిలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రూ.2.10 కోట్లతో స్టేడియం నిర్మించారు. కానీ గ్రామానికి దూరంగా ఉన్న స్టేడియంలో క్రీడాకారులకు కావాల్సిన వసతులు, కోచ్లను నియ మించలేదు. దీంతో ఆకతాయిలకు అడ్డాగా మారి స్టేడియం ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. తలుపులు ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలు పగలగొట్టారు. విలువైన పరి కరాలు దొంగల పాలయ్యాయి. జక్రాన్పల్లి మండ లంలో వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడల్లో జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులు ఉన్నారు. కానీ వారికి ఈ స్టేడియం వినియోగించుకునే వీలులేకుండా ఉంది. దీనిపై జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పవ నను 'న్యూస్టుడే' వివరణ కోరగా.. ఇటీవలే స్టేడి యాన్ని పరిశీలించానని.. వినియోగంలోకి తీసుకొ చ్చేందుకు సీనియర్ క్రీడాకారులతో కలిసి ప్రణాళిక తయారు చేస్తామన్నారు.

29/05/2026

మత్తు వదిలిస్తున్నారు...
మాదక ద్రవ్యాల కేసుల్లో పట్టుబడుతున్న యువత
* కౌన్సెలింగ్ అనంతరం డీ-అడిక్షన్ కేంద్రాల్లో చికిత్స

28/05/2026

మన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిజంగా నెరవేరుస్తున్నారని మీరు భావిస్తున్నారా? 🤔

📍 మీ ప్రాంతంలో అభివృద్ధి కనిపిస్తోందా?
📍 ప్రజా సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తోందా?
📍 మీరు ఆశించిన మార్పు వచ్చిందా?

మీ అభిప్రాయం ఎంతో విలువైనది.
కామెంట్‌లో మీ స్పందన తెలియజేయండి 👇

28/05/2026

మన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిజంగా నెరవేరుస్తున్నారని మీరు భావిస్తున్నారా? 🤔

📍 మీ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందా?
📍 ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతోందా?
📍 మీరు ఆశించిన మార్పు కనిపిస్తోందా?

మీ అభిప్రాయం మాకు ఎంతో ముఖ్యం.
కామెంట్‌లో మీ స్పందన తెలియజేయండి 👇

Want your business to be the top-listed Government Service in Nizamabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address

Nizamabad