Katasani Rambhupal Reddy

Katasani Rambhupal Reddy 2019,2009,2004,1994,1989,1985 PANYAM MLA,Rayalaseema Senior Politician,
YSRCP State General Secretary

07/10/2026

“కల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని మేము ప్రభుత్వానికి నివేదిక పంపాం.. నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే. మా పరిధిలో తప్పు లేదు” అంటూ అధికారులు చెబుతున్నారు.కాబట్టి కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులకి న్యాయం చేయాలి..

గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు ఎల్లారెడ్డి గారి మాతృమూర్తి నాగేశ్వరమ్మ గారు మృతి చెందడం...
07/10/2026

గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు ఎల్లారెడ్డి గారి మాతృమూర్తి నాగేశ్వరమ్మ గారు మృతి చెందడంతో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి గారు పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కల్లూరులో వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా ఎస్టీ సెల్ సెక్రటరీ చెంచు వెంకటస్వామి గారి మనవడు దేవాన్ష్ జన్మదిన వేడుకల్లో వైఎస్...
07/10/2026

కల్లూరులో వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా ఎస్టీ సెల్ సెక్రటరీ చెంచు వెంకటస్వామి గారి మనవడు దేవాన్ష్ జన్మదిన వేడుకల్లో వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారి దేవాన్ష్‌ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఎదగాలని ఆకాంక్షించారు.

కల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్...
07/10/2026

కల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కల్లూరు మండల రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు బిర్లాగేట్‌లోని జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతులకు బీమా, నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి సహాయం అందేలా కల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఉల్లిందకొండ, చెట్లమలాపురం, పెద్దటేకూరు, చిన్నటేకూరు, తడకనపల్లి, బస్తిపాడు, కొంగనపాడు తదితర గ్రామాలకు వెళ్లి రైతుల పరిస్థితిని అధికారులు స్వయంగా పరిశీలించాలని సూచించారు. ఆ గ్రామాల్లో పంటలు బాగా పండాయని, రైతులు నష్టపోలేదని నిరూపిస్తే తమ కరువు మండల డిమాండ్ తప్పని ఒప్పుకుంటామని, కానీ క్షేత్రస్థాయిలో రైతులను అడగకుండా కార్యాలయాల్లో కూర్చొని లెక్కల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. రైతుల సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని కాటసాని స్పష్టం చేశారు.

కర్నూలులో దసరా సందర్భంగా కల్లూరు 33వ వార్డు ఆధ్వర్యంలో నిర్వహించనున్న లైట్ టెన్నిస్ క్రికెట్ లీగ్ KPL సీజన్–1 పోస్టర్‌ను...
06/10/2026

కర్నూలులో దసరా సందర్భంగా కల్లూరు 33వ వార్డు ఆధ్వర్యంలో నిర్వహించనున్న లైట్ టెన్నిస్ క్రికెట్ లీగ్ KPL సీజన్–1 పోస్టర్‌ను వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రామభూపాల్ రెడ్డి గారు, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు కాటసాని శివ నరసింహారెడ్డి గారు ఆవిష్కరించారు. అక్టోబర్ 10 నుంచి జోహరాపురం రోడ్ MIPER కాలేజ్ గ్రౌండ్‌లో టోర్నమెంట్ ప్రారంభం కానుంది. విజేతలకు ₹22,222, రన్నరప్‌కు ₹11,111 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందించనున్నారు.


స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో నెలకొన్న సాంకేతిక సమస్యలను వెంటనే ...
06/10/2026

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో నెలకొన్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రామభూపాల్ రెడ్డి గారు నంద్యాల జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సర్వర్ సమస్య పరిష్కారమయ్యే వరకు మాన్యువల్‌గా దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన అభ్యర్థులకు సకాలంలో సర్టిఫికెట్లు జారీ చేయాలని కోరారు.


ఓర్వకల్లు మండలం హుస్సేనాపురం గ్రామంలో ఇటీవల పదవీకాలం పూర్తి చేసుకున్న పాణ్యం నియోజకవర్గ మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు,...
06/10/2026

ఓర్వకల్లు మండలం హుస్సేనాపురం గ్రామంలో ఇటీవల పదవీకాలం పూర్తి చేసుకున్న పాణ్యం నియోజకవర్గ మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలకు YSR Congress Party - YSRCP నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతూ అవసరమైన పత్రాలు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు Katasani Rambhupal Reddy గారు సూచించారు. పదవులు పూర్తయినా ప్రజా జీవితంలో మాజీ ప్రజాప్రతినిధుల పాత్ర కొనసాగుతుందని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ

కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి గారు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

YS Jagan Mohan Reddy
Katasani Shiva Narasimha Reddy


కల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 7, బుధవారం ఉదయం 10 గంటలకు బిర్లాగేట్‌లోని మహాత్మా జ...
06/10/2026

కల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 7, బుధవారం ఉదయం 10 గంటలకు బిర్లాగేట్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కల్లూరు మండల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతున్నాము.


గడివేముల మండల ఎంపీపీగా పదవీకాలం ముగిసిన సందర్భంగా మాజీ ఎంపీపీ మద్దమ్మ దంపతులు నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప...
05/10/2026

గడివేముల మండల ఎంపీపీగా పదవీకాలం ముగిసిన సందర్భంగా మాజీ ఎంపీపీ మద్దమ్మ దంపతులు నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాటసాని రామభూపాల్ రెడ్డి గారు, శ్రీమతి కాటసాని ఉమామహేశ్వరమ్మ గారు, కాటసాని శివ నరసింహారెడ్డి గారిని ఘనంగా సన్మానించారు.


ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామంలో DRDO కోసం సేకరించిన భూములకు చట్టబద్ధంగా రావాల్సిన పరిహారం విషయంలో గ్రామస్థులు న్యాయపోర...
05/10/2026

ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామంలో DRDO కోసం సేకరించిన భూములకు చట్టబద్ధంగా రావాల్సిన పరిహారం విషయంలో గ్రామస్థులు న్యాయపోరాటం చేపట్టారు. నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రామభూపాల్ రెడ్డి గారి సూచనలు, సలహాలతో హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు గ్రామస్థులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో న్యాయపోరాటానికి విజయం లభించింది. దీంతో సంతోషించిన గ్రామస్థులు కాటసాని రామభూపాల్ రెడ్డి గారిని సన్మానించి, కేక్ కట్ చేసి కృతజ్ఞతలు తెలిపారు.

YSR Congress Party - YSRCP
YS Jagan Mohan Reddy
Katasani Rambhupal Reddy
Katasani Shiva Narasimha Reddy




Address

Panem
518112

Website

Alerts

Be the first to know and let us send you an email when Katasani Rambhupal Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share