01/04/2026
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసన దినం – బ్లాక్ డే బాచుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది..
#నాలుగు_లేబర్_కోడ్లల_అమలును_నిరసిస్తూ_బ్లాక్_డే
#కార్మిక_హక్కులను_హరించే_4_లేబర్_కోడ్లు_రద్దు_చేయాలి. #విద్యుత్_సవరణ_బిల్లు_2022ను_వెనక్కి_తీసుకోవాలి.
#కేంద్ర_ప్రభుత్వం_తెచ్చిన_నాలుగు_లేబర్_కోడ్లను_వెంటనే_రద్దు_చేయాలి.
16/03/2026
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18,000/-ల ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి. ఇతర సమస్యల పరిష్కారం కోసం NHM కు సరిపడా నిధులు కేటాయించాలి. జనవరి, ఫిబ్రవరి రెండు నెలల పారితోషికాలు వెంటనే చెల్లించాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ వద్ద 48 గంటల నిరసన దీక్ష నిర్వహించడం జరుగుతుంది..
ఆశా వర్కర్ 48 గంటల దీక్షకు ఐద్వా మేడ్చల్ జిల్లా కార్యదర్శి వినోద గారు, ఐద్వా నాయకులు చల్ల లీలావతి, మంగ సంపూర్ణంగా మద్దతు తెలియజేశారు..
16/03/2026
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18,000/-ల ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి. ఇతర సమస్యల పరిష్కారం కోసం NHM కు సరిపడా నిధులు కేటాయించాలి. జనవరి, ఫిబ్రవరి రెండు నెలల పారితోషికాలు వెంటనే చెల్లించాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ వద్ద 48 గంటల నిరసన దీక్ష నిర్వహించడం జరుగుతుంది..
ఆశా వర్కర్ 48 గంటల దీక్షకు CPM మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం గారు సంపూర్ణంగా మద్దతు తెలియజేశారు..
16/03/2026
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18,000/-ల ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి. ఇతర సమస్యల పరిష్కారం కోసం NHM కు సరిపడా నిధులు కేటాయించాలి. జనవరి, ఫిబ్రవరి రెండు నెలల పారితోషికాలు వెంటనే చెల్లించాలని కోరుతూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ వద్ద 48 గంటల నిరసన దీక్ష నిర్వహించడం జరుగుతుంది..
ఆశా వర్కర్ 48 గంటల దీక్షకు సిఐటియు మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎర్ర.అశోక్ ప్రారంభించారు
తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు 48 గంటల దీక్షకు ఐద్వా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ నుంచి దీక్షకు ఐద్వా మేడ్చల్ జిల్లా కార్యదర్శి వినోద, కమిటీ సభ్యులు సంపూర్ణమైన మద్దతు తెలియజేసింది..
ఈ సందర్భంగా సిఐటియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఎర్ర అశోక్ మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాల నుండి పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారు. వీరంతా మహిళలు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికులున్నారు.. నేటికి వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం గ్యారెంటీ ఫిక్సిడ్ వేతనం కూడా ఇప్పటివరకు నిర్ణయం చేయలేదు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అనంతరం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది. ఈ కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అయినా నేటికి వేతనాలు పెంచలేదు. 50 లక్షల ఇన్సూరెన్స్, 50వేల మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర హామీలు ఇచ్చినా, ఇంకా అమలు చేయటం లేదు. పి.ఆర్.సి. ఎరియర్స్, లెప్రసీ, పల్స్‌పోలియో, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. వీటికి తోడు పారితోషికాలు కూడా ప్రతి నెలా రావటం లేదు. దీంతో ఆశా వర్కర్లు అనేక ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకా అనేక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరించే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో NHM కు నిధులు పెంచాలని ఆశా వర్కర్లు కోరుతున్నారు. కావున పై సమస్యలు పరిశీలించి పరిష్కరించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో
డిమాండ్స్:-
1. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18,000/-ల ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి. ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా NHM కు సరిపడా నిధులు కేటాయించాలి.
2. జనవరి, ఫిబ్రవరి రెండు నెలల పారితోషికాలు వెంటనే చెల్లించాలి.
3. ఆశాలకు కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.1500/-ల పారితోషికాలను వెంటనే అమలు చేయాలి.
4. 2021 జూలై నుండి డిసెంబర్ వరకు 6 నెలల పి.ఆర్.సి. ఎరియర్స్ వెంటనే చెల్లించాలి.
5. 2022 నుండి 2025 వరకు నాలుగు సంవత్సరాల లెప్రసీ సర్వే డబ్బులు, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ పెండింగ్ డబ్బులు చెల్లించాలి. ఎగ్జామ్ డ్యూటీలకు డబ్బులు చెల్లించాలి.
6. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం 50 లక్షల ఇన్సూరెన్స్, 50వేల మట్టి ఖర్చులకు వెంటనే జి.ఓ. లు ఇవ్వాలి.
7. పి.ఎఫ్. ఇ.ఎస్.ఐ., సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలి.
8. ఎ.ఎన్.ఎం.జి.ఎన్.ఎం. ట్రైనింగ్్పూర్తి చేసిన ఆశా వర్కర్లకు ప్రమోషన్ సౌకర్యం వెంటనే నిర్ణయించాలి.
9. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఆదివారం మరియు పండుగలకు సెలవులు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి.
10. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎ.ఎన్.సి., పి.ఎన్.సి. తదితర టార్గెట్సను రద్దు చేస్తూ సర్క్యులర్ జారీ చేయాలి.
11. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలి. ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ నిర్ణయించాలి.
12. సంవత్సరానికి 20 రోజులు వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు, 6 నెలలు వేతనంతో కూడిన మెడికల్ సెలవులివ్వాలి.
13. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి.
14. ఆశాలతో NCD ఆన్లైన్ పని చేయించకూడదు. స్పూటమ్ డబ్బాలు మోయించకూడదు.
15. పూనమ్ క్లాత్ తో కూడిన క్వాలిటీ యూనిఫాం సప్లై చేయాలి.
16. ఆశాలు చేస్తున్న పారితోషికం లేని పనులన్నింటిని గుర్తించాలి.
17. ప్రభుత్వ అన్ని ఆస్పత్రుల్లో ఆశాలకు ప్రత్యేకంగా రెస్టు రూమ్‌లు ఏర్పాటు చేయాలి.
18. ఆశాలకు పనిభారం తగ్గించాలి. పారితోషికం లేని పనులు చేయించకూడదు.
19. ఆశాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని అమలు చేయాలి