31/05/2026
*134వ మన్ కి బాత్ విక్షించిన*
*బిజెపి నాయకులు*
షాద్ నగర్ బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారి కార్యాలయంలో మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి 134వ మన్ కి బాత్ కార్యక్రమాన్ని విక్షించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు పసుల నర్సింహ్మ యాదవ్, ఉపసర్పంచ్ గంగాదర్, అనిల్ కుమార్ గౌడ్, కిట్టు యాదవ్, వేణు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు..
26/05/2026
*కొనుగోలు దారులకు, సెక్రటరీ, మరియు మార్కెట్ పాలకవర్గానికి ధన్యవాదములు తెలిపిన*
*బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి*
షాద్ నగర్ మార్కెట్ లో గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు దాదాపు గా 30 వేల బస్తాల తడిసిన వడ్లకు, 2400
డ్రై వడ్లకు 2600 వందలు ధర వెచ్చించి కొన్నందుకు కొనుగోలు దారులకు,మార్కెట్ పాలకవర్గానికి, సెక్రటరీకీ బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ధన్యవాదములు తెలపడం జరిగింది.
మున్ముందు కూడ రైతుల పక్షాన బిజెపి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు..
25/05/2026
*కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి*
*డంపింగ్ యార్డ్ ప్రతిపాదనపై గ్రామస్తులు, రైతుల తీవ్ర వ్యతిరేకత*
*ప్రజల ఆరోగ్యం, భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది*
*బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి*
షాద్నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామం మరియు పరిసర గ్రామాల్లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా గ్రామ ప్రజలు, రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హాజరు కావడం జరిగింది.
ఆయన మాట్లాడుతూ,
“పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని, ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావించి రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. కానీ ఇప్పుడు అదే భూముల్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ప్రయత్నించడం బాధాకరం. చెత్త డంపింగ్ వల్ల ప్రజల ఆరోగ్యం, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటాయి అని అన్నారు.
సిద్దాపూర్ గ్రామానికి వచ్చి చూస్తే ప్రతి ఒక్కరిలో భయం, ఆందోళన కనిపిస్తోందన్నారు.
“మా పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చిన భూముల్లో కాలుష్యాన్ని తీసుకువస్తున్నారు” అనే భావన ప్రజల్లో ఉందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ యార్డు రానివ్వమని రైతులు స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ అంశంపై స్థానిక పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ గారితో మాట్లాడినట్లు తెలిపారు. ఆమె ఢిల్లీ పర్యటన అనంతరం తిరిగి
వచ్చాక ఈ సమస్యపై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పారు..
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఇస్నాతి శ్రీనివాస్, చేగు సుధాకర్ అప్పమండల అధ్యక్షులు అత్తాపురం మహేందర్ రెడ్డి , నల్లవోలు ప్రతాప్ రెడ్డి,కుడుముల బాల్ రాజ్,కిట్టు యాదవ్,శ్రీధర్ చారి,కొండల్ చారి,క్యామ మహేష్, మంగ విజయ్, నర్సింహ్మ, వెంకటేష్ నరేందర్ రెడ్డి, జైపాల్ కాంత రెడ్డి, నవీన్, నార్య నాయక్, గోవర్ధన్ రెడ్డి, వంశీ చారి, వేణు మహేందర్, భరత్, అక్బర్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు..
25/05/2026
*షాద్ నగర్ మార్కెట్ యార్డులో భారీ వర్షాల ప్రభావం – రైతులకు భరోసా ఇచ్చిన బీజేపీ బృందం*
*తడిసిన వడ్లను రైతులకు ఇబ్బంది కలగకుండా స్థానిక రైస్ మిల్లర్ల ద్వారా లిఫ్ట్ చెయండి*
*మార్కెట్ యార్డులో షెడ్ల నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలి*
*మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గానికీ వినతిపత్రం అందజేసిన*
*బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి*
షాద్ నగర్, మే 25: మూడు రోజులుగా కొనసాగుతున్న భారీ వర్షాల ప్రభావంతో షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) బృందం మార్కెట్ యార్డును సందర్శించి రైతుల పరిస్థితిని పరిశీలించింది.
ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని ధైర్యం చెప్పారు.
విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గత మూడు రోజులుగా వర్షాల కారణంగా ఇప్పటికే మార్కెట్కు వచ్చిన వడ్ల బస్తాలు భారీగా తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
మార్కెట్కు నిన్నటి వరకు చేరిన సుమారు 20 వేల వడ్ల బస్తాలకు అదనంగా ఇవాళ మరో 10 వేల బస్తాలు చేరడంతో మొత్తం వడ్ల నిల్వలు భారీగా పెరిగాయి అయితే కురిసిన కుంభవృష్టి కారణంగా సుమారు 20 నుండి 30 వేల బస్తాలు తడిసిపోయినట్లు సమాచారం. ఈ పరిస్థితుల వల్ల టెండర్ల ప్రక్రియ కూడా తాత్కాలికంగా నిలిచిపోవడం బాధాకరం అని అన్నారు.
ఈ సమస్యల పరిష్కారం కోసం విష్ణువర్ధన్ రెడ్డి గారు మార్కెట్ సెక్రటరీ, చైర్మన్, వైస్ చైర్మన్ మరియు పాలకవర్గానికి వినతిపత్రం సమర్పించారు.
అందులో తడిసిన వడ్లను రైతులకు ఇబ్బంది కలగకుండా స్థానిక రైస్ మిల్లర్ల ద్వారా వెంటనే లిఫ్ట్ చేయాలని, నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని, మార్కెట్ యార్డులో షెడ్ల నిర్మాణాన్ని ఒక నెలలోపు పూర్తి చేయాలని కోరారు.
ఈ విషయాలపై మార్కెట్ పాలకవర్గం సానుకూలంగా స్పందించినట్లు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
అదేవిధంగా తడిసిన వడ్ల కొనుగోలుకు స్థానిక రైస్ మిల్లర్లు, కొట్ర రాజు గారు మరియు ఇతరులు అంగీకరించినట్లు వెల్లడించారు.
రైతుల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని విష్ణువర్ధన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి ఇస్నాతి శ్రీనివాస్, వంశీకృష్ణ, చేగు సుధాకర్ అప్ప, అత్తాపురం మహేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ గంగాదర్, కుడుముల బాల్ రాజ్, కిట్టు యాదవ్, మంగ విజయ్,బాల్ రెడ్డి,అందెల సందీప్, మరియు తదితరులు పాల్గొన్నారు..
21/05/2026
*వృద్దాశ్రమంలో చీరలు పండ్లు పంపిణి*
*పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవం*
*వార్షికోత్సవంలో పాల్గొన్న బిజెపి నాయకులు మరియు పీవీఆర్ అభిమానులు*
షాద్ నగర్ పట్టణంలోని నవోదయ సేవ సంఘం వృద్ధాశ్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, రమాదేవి దంపతుల పెళ్లి రోజు సందర్బంగా షాద్ నగర్ బిజెపి నాయకులు సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలోని మహిళలకు ఉచితంగా చీరలు, పురుషులకు పంచెలు, అరటిపళ్ళు పంపిణీ చేసి వారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆశ్రమ వాసులు మాట్లాడుతూ, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజల సేవలో ముందుంటారని, సమాజానికి ఆయన చేస్తున్న సేవలు ఎంతో ఆదర్శనీయమని కొనియాడారు. పేదలు, వృద్ధులు మరియు అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తాయని ఆశీర్వదించారు.
అలాగే వృద్ధులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారికి వివాహ వారోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తమ పట్ల చూపుతున్న సేవాభావానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీవీఆర్ అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి ఇస్నాతి శ్రీనివాస్ , లష్కర్ నాయక్, పసుల నర్సింహ్మ యాదవ్,చేగు సుధాకర్ అప్ప,హాజీపల్లి ఉపసర్పంచ్ గంగాధర్, మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మిద్దె గణేష్, అనిల్ కుమార్ గౌడ్, కుడుముల బాల్ రాజ్, కిట్టు యాదవ్, క్యామ మహేష్, కుమ్మరి మహేష్, కరెడ్ల నరేందర్ రెడ్డి, శ్రీధర్ చారి, వనం శ్రీనివాస్,గణేష్ నాయక్, ప్రశాంత్ గౌడ్, కావలి ఆంజనేయులు,చెవుల బాస్కర్,శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు..