12/09/2026
స్థానిక సంస్థల ఎన్నికలపై అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పార్వతీపురం, పాలకొండ, సాలూరు మున్సిపాల్టీల నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సదస్సులో పాల్గొని దిశానిర్దేశం చేయడం జరిగింది.
జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం నిస్వార్థంగా కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు తప్పకుండా తగిన గుర్తింపు లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశాను.
క్షేత్రస్థాయిలో జనసేన పార్టీకి బలం, పట్టు ఉన్న ప్రతి ప్రాంతంలో సమర్థవంతమైన అభ్యర్థులను బరిలో నిలిపి, వారి విజయానికి పక్కా వ్యూహంతో సమిష్టిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాను.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి జనసైనికుడు సమన్వయంతో, బాధ్యతతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చాను.
Pawan Kalyan JanaSena Party JanaSena Shatagni