30/09/2026
*వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి!*
30.09.2026
*గౌ॥ శాసన సభ్యులు మరియు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలకు నమస్కారం...*
*పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పార్టీ కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో వివిధ పార్టీ కమిటీలలో నియమితులై, పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు ప్రమాదవశాత్తు మృతి చెందిన సందర్భంలో, వారి కుటుంబానికి పార్టీ తరఫున రూ.5,00,000/- (ఐదు లక్షల రూపాయలు) ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించడం జరిగింది.*
ఆర్థిక సహాయం కోసం క్రింది వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి:
1. మృతుడు పార్టీ కమిటీలో నియమితులై ఉండటంతో పాటు, పార్టీ ఐడీ కార్డు పొంది ఉండాలి.
2. FIR కాపీ/ పోస్ట్ మార్టం రిపోర్ట్/ పంచనామా తప్పనిసరిగా సమర్పించాలి.
3. సంబంధిత గ్రామ/ వార్డు అధ్యక్షులు మరియు మండల పార్టీ అధ్యక్షుల సిఫార్సుతో, ఎమ్మెల్యే / అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మృతునికి సంబంధించిన పూర్తి వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలి.
4. మృతుని కుటుంబానికి చెందిన నామినీ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు ఆధార్ కార్డు తప్పనిసరిగా జత చేయాలి.
మీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి వివరాలను త్వరితగతిన పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించవలసిందిగా కోరుతున్నాము.
నోట్:
అక్టోబర్ 1, 2026 తరువాత చనిపోయిన నాయకుల కుటుంబాలకు ఈ కార్యక్రమం వర్తిస్తుంది.
పూర్తి వివరాలతో ఫార్మాట్ పంపించడం జరుగుతుంది.
పార్టీ కేంద్ర కార్యాలయం వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
తాడేపల్లి
కాపీ టు: గౌ|| పార్టీ రీజినల్ కో- ఆర్డినేటర్లకు, జిల్లా పార్టీ అధ్యక్షులకు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో-ఆర్డినేషన్) మరియు రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శులకు (కో-ఆర్డినేషన్)
YS Jagan Mohan Reddy YSR Congress Party - YSRCP YSRCP Social Media A.S PETA YSRCP Mekapati Goutham Reddy Kakani Govardhan Reddy Mekapati Vikram Reddy Peddireddy Midhun Reddy Malem Sudheer Kumar Reddy