Team Valavala Babji

Contact the organization

Team Valavala Babji Fan Page of Telugu Desam Party Tadepalligudem Incharge Valavala Mallikarjunarao (Babji).

18/08/2026

గొడ్డలి పార్టీ మాజీమంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు బైక్‌తో ఢీ కొట్టి నిరుపేద గొర్రెల కాపరి దానయ్య యాదవ్ మరణానికి కారణమయ్యాడు. వృద్ధురాలైన తల్లి, ఇద్దరు పిల్లలు, భార్యను పోషించే దానయ్య మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆదుకోవాల్సిన గొడ్డలి పార్టీ అధినేత దానయ్య యాదవ్ చచ్చిపోతే నష్టం ఏంటి అంటూ అమానవీయంగా ప్రవర్తించారు. సీదిరి అప్పలరాజు అయితే దానయ్య భార్యను తన ఇంట్లో పనికి పెట్టుకుంటానంటూ అవహేళన చేశాడు. గొడ్డలి పార్టీ వల్ల అన్ని విధాలా అన్యాయానికి గురైన దానయ్య యాదవ్ కుటుంబానికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, స్థానిక శాసన సభ్యురాలు గౌతు శిరీషా, మంత్రి పార్థసారథి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు పార్టీ తరఫున రూ.10.50 లక్షలు ఆర్థిక సహాయం అందించారు.



18/08/2026

సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోవడం కాకుండా... ధైర్యముంటే గొడ్డలి పార్టీ నాయకుడు వచ్చి చర్చలో పాల్గొనాలి

~ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్

18/08/2026

మా ప్రజా ప్రభుత్వం ప్రతి సంవత్సరం మెగా డీఎస్సీ నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కూడా 3 వేల టీచర్ పోస్టులతో భర్తీ చేస్తున్నాం

~ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్

18/08/2026

రాత్రింబవళ్లు కష్టపడి చదివి, ప్రతిభతో టీచర్ ఉద్యోగాలు సాధించిన మాపై తప్పుడు ఆరోపణలా? వైకాపా స్వార్థ రాజకీయాల కోసం తమపై ఫేక్ ప్రచారం చేయడం తగదంటూ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.




01/08/2026

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం మొదలైంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభమయ్యింది.







01/08/2026

ఉత్తరాంధ్ర కలల రూపం భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసింది, నిర్మించింది, ఇప్పుడు ప్రారంభిస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారే. ఈ వాస్తవం రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇది కేవలం విమానాశ్రయం కాదు. ఉత్తరాంధ్ర భవిష్యత్తును వెలిగించే మణిహారం.






01/08/2026

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదనల నుంచి ప్రారంభోత్సవం వరకు ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి కృషి ఎనలేనిది. భోగాపురం విమానాశ్రయం కల సాకారం కావడం కూటమి ప్రభుత్వ విజయానికి నిదర్శనం.






27/07/2026

రాష్ట్రంలో 11 వేలమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పోలీసులకు పాత పెన్షన్‌ను పునరుద్ధరించిన సీఎం చంద్రబాబు గారు.. రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని ఉద్యోగులు తమ ఆకాంక్షను వెలిబుచ్చారు.


రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి సమానమే. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు అందించాలన్నదే...
27/07/2026

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వానికి సమానమే. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు అందించాలన్నదే చంద్రబాబు గారి అభిమతం. ఈ రెండేళ్లలో అభివృద్ధి వికేంద్రీకరణ, సర్వజన సంక్షేమం అన్నిటినీ మించి ప్రజల్లో ఏర్పడిన నమ్మకం... వీటికి నిదర్శనం ఈ వివరాలు. ఒకసారి చూడండి.




Telugu Desam Party (TDP) తాడేపల్లిగూడెం నియోజకవర్గం సమాచారం :- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి...
22/07/2026

Telugu Desam Party (TDP) తాడేపల్లిగూడెం నియోజకవర్గం సమాచారం :-

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తాడేపల్లిగూడెం టీడీపీ ఇంచార్జ్ వలవల బాబ్జి మరియు గోరెల శ్రీధర్

తాడేపల్లిగూడెం / అమరావతి (21 జూలై 2026):

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఒక ప్రాముఖ్యత కలిగిన రాజకీయ భేటీ జరిగింది.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ శ్రీ వలవల మల్లికార్జునరావు (బాబ్జి) గారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ గోరెల శ్రీధర్ గారు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రితో వారు చర్చించారు.

కీలక ముఖ్యాంశాలు:
ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) పై సానుకూల స్పందన:
తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన పలువురు బాధితులు, అర్హులైన ప్రజల కోసం దరఖాస్తు చేసుకున్న ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నిధులను త్వరితగతిన విడుదల చేయాలని వలవల బాబ్జి గారు ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించి, నిధుల విడుదలకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహాత్మక చర్చ:
రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, బూత్ స్థాయి కమిటీల బలోపేతం మరియు ప్రస్తుత రాజకీయ పరిణామాలను ముఖ్యమంత్రికి నేతలు వివరించారు.

టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి విజయం కోసం నియోజకవర్గంలో శ్రేణులన్నీ కలిసికట్టుగా ప్రయాణం చేయాలని తెలియజేశారు.

కార్మిక సంక్షేమం - నియోజకవర్గ అభివృద్ధి:

భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ హోదాలో వలవల బాబ్జి గారు బోర్డు ద్వారా కార్మికులకు చేకూరబోయే ప్రయోజనాలు, భవిష్యత్తులో చేపట్టబోయే పలు కార్యక్రమాల కార్యాచరణను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

అలాగే నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం:

నేతల నుంచి వివరాలు సేకరించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులందరినీ స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, రాబోయే ఎన్నికల్లో పార్టీ ఘనవిజయానికి బాటలు వేయాలని వలవల బాబ్జి మరియు గోరెల శ్రీధర్ గార్లకు సీఎం దిశానిర్దేశం చేశారు.

Valavala Babji
Nara Chandrababu Naidu

Address

Tadepalligudem

Website

Alerts

Be the first to know and let us send you an email when Team Valavala Babji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Team Valavala Babji:

Shortcuts

Share