28/05/2026
తాడేపల్లిగూడెం 2026 మే 1:-
*కార్మిక,కర్షక, ఉద్యోగ,కౌలు రైతు సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే శరణ్యమని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.బలరాం పిలుపునిచ్చారు* తాడేపల్లిగూడెం లో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిఐటియు తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎన్.కె.గ్రౌండ్ వద్ద శుక్రవారం నిర్వహించిన మేడే బహిరంగ సభ అత్యంత ఉత్సాహంగా, పోరాట స్ఫూర్తితో జరిగింది. పట్టణంలో స్థానిక యూనియన్ పని ప్రదేశాలలో నివాస ప్రాంతాలలో జెండా ఆవిష్కరణలు చేశారు.కార్మికులు, కౌలు రైతులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సభకు సిఐటియు పట్టణ కన్వీనర్ జవ్వాది శ్రీను అధ్యక్షత వహించారు.*ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. బలరాం గారు మాట్లాడుతూ* మేడే అంటే కార్మికుల రక్తంతో రాసిన చరిత్రని, 8 గంటల పనిళదినం కోసం చికాగోలో కార్మికులు ప్రాణాలు అర్పించారని, కానీ ఈరోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నీరుగారుస్తూ, 12-14 గంటలు పనిచేయించే విధానాలకు తెరలేపుతున్నాయని,ఇది చికాగో అమరవీరులకు చేస్తున్న ద్రోహం” అని ధ్వజమెత్తారు.“రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని,పట్టాదారు పాస్‌పుస్తకాలు లేక, పంట రుణాలు రాక, గిట్టుబాటు ధర లేక కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఒకవైపు కార్పొరేట్ కంపెనీలకు వేల ఎకరాలు కట్టబెడుతూ,మరోవైపు సాగు చేసే కౌలు రైతును గాలికి వదిలేస్తున్నారని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల పై ధ్వజమెత్తారు. కార్మికుడి సమస్యకు, కౌలు రైతు సమస్యకు మూలం ఒక్కటే - కార్పొరేట్ విధానాలు. అందుకే కార్మిక, కర్షక ఐక్యతతోనే ఈ విధానాలను ఓడించగలం” అని పిలుపునిచ్చారు.*సిఐటియు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ...* తాడేపల్లిగూడెంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, షాపు వర్కర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పేరుతో శాశ్వత ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని,పెట్రోల్ రూ.110,గ్యాస్ రూ.1130 అయిందని,కానీ కనీస వేతనం మాత్రం రూ.26,000 ఇవ్వడానికి ప్రభుత్వాలకు చేతులు రావడం లేదు” అని విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్‌లు కార్మికులను మళ్లీ బానిసలుగా మార్చే కుట్ర జరుగుతోందని, 44 చట్టాలను రద్దు చేసి యజమానులకు ‘హైర్ అండ్ ఫైర్’ అధికారం ఇస్తున్నారని దీన్ని సిఐటియు తీవ్రంగా ప్రతి ఘటిస్తుందని తెలిపారు. జిల్లాలోని ప్రతి మండలంలో,ప్రతి పరిశ్రమలలో పోరాటాలు ఉధృతం చేస్తాం” అని హెచ్చరించారు. కనీస వేతనం రూ.26,000 వెంటనే అమలు చేయాలని,కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేయాలని,కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని,పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను సగానికి తగ్గించాలని,కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు, పంట రుణాలు, గిట్టుబాటు ధర కల్పించాలని, 8 గంటల పని దినం చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని,అందరికీ ESI, PF, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. *సిఐటియు జిల్లా కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ మాట్లాడుతూ* బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా తయారుచేసి కార్మికులను యజమానులకు కట్టు బానిసలుగా తయారు చేసే ప్రక్రియ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేపట్టిందని ధ్వజమెత్తారు. కార్మిక చట్టాలు మార్పును వ్యతిరేకిద్ధామనే అనే నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. మతోన్మాదాన్ని వ్యతిరేకిద్దాం హిందూ ముస్లిం అని కొట్టుకుంటే లాభపడేది అంబానీ అదానీ మాత్రమే నష్టపోయేది మనమే అని తెలిపారు. మే డే స్ఫూర్తితో ప్రతిజ్ఞ చేద్దామని తల తెగిన మెడవంచమని, హక్కుల సాధించే వరకు పోరాటం ఆపమని ఇది సిఐటియు ఘనతని కొనియాడారు. హక్కులు అడిగితే ఎవరూ ఇవ్వలేదని పోరాడి సాధించుకోవాలని 1886లో చికాగో కార్మికులు తూటాలకు ఎదురొడ్డి నిలబడ్డారని కాబట్టి ఈరోజు మనం 8 గంటల పని దినాన్ని సాధించుకున్నామని తెలిపారు. ఈరోజు మనం రోడ్డు ఎక్కకపోతే మన పిల్లలు రేపు 16 గంటల పని చేయాల్సి వస్తుందని అందుకే ప్రతి కార్మికుడు సిఐటియు లో చేరాలని ప్రతి ప్యాక్టరీ గేట్ ముందు ఎర్రజెండాతో నిలబడాలని సూచించారు. మీ చెమటచుక్క తో ఈ పట్టణం తడిసిందని మీ రక్తంతో ఈ రోడ్లు తడవనివ్వకండని హక్కుల కోసం లేవండని,పోరాడాలని, గెలవాలని, మీ వెనుక సిఐటియు ఎర్రజెండా ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సభ ప్రారంభంలో ప్రజానాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన “కార్మిక గీతాలు” అందరినీ ఆకట్టుకున్నాయి. “ప్రపంచ కార్మికులారా ఏకంకండి”, “కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి” అనే నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమానికి ధనాల వెంకటరావు,సిఐటియు కన్వీనర్ జవ్వాది శ్రీను, కో కన్వీనర్ అల్లు సుబ్బారావు, మడకా రాజు,బి.యశోద, సత్తి కోదండ రామిరెడ్డి,చల్లా చంద్రరావు, చిటికిన రాము, పబ్బాని సురేష్ కుమార్,పైలు చిన్నా,నరమాల కృష్ణ, మరుకుర్తి గంటల రావు, దేశంశెట్టి సతీష్,ఏపూరి శ్రీను,వడిసెల శ్రీనివాసరావు, ముత్యాల సుబ్బారావు,నెల్లి ఆదినారాయణ, సిరపరపు రామారావు,గట్టిం కాశీ తదితరులు పాల్గొన్నారు.
*కరెడ్ల రామకృష్ణ*
*సిఐటియు జిల్లా కార్యదర్శి*
*9492606900*