Telangana State Police

Telangana State Police

Share

Interactive page to elicit feedback on modernisation and rebranding of Telangana Police. Emergency #Dial100

02/06/2026

రిలేషన్‌ షిప్‌ మేనేజర్స్, కస్టమర్ కేర్ పేరిట కాల్స్ చేస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు నేరగాళ్లు. అపరిచితులను నమ్మి ఎట్టిపరిస్థితుల్లోనూ సున్నితమైన సమాచారం పంచుకోవద్దు. సాయం చేస్తామని చెప్పి ఎవరైనా ఏపీకే ఫైల్స్ పంపితే ఇన్‌స్టాల్ చేయొద్దు.

02/06/2026

మన తెలంగాణ కోటి రతనాల వీణ. సిరులు పండే ఈ నేల ఖ్యాతిని పెంచేలా నడుచుకుందాం. మన తెలంగాణ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేద్దాం. సాటివారిపట్ల ప్రేమ, సహనాన్ని కలిగి ఉంటూ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలి.

01/06/2026

We Stand With Every Woman Who Raises Her Voice.
Your safety is our priority.
Contact SHE Teams anytime on 1091 for assistance and support.

01/06/2026

పెట్టుబడుల విషయంలో సోషల్‌ మీడియాను అస్సలు నమ్మకండి. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో వచ్చే టిప్స్‌ను నమ్మి ఇన్వెస్టిమెంట్స్ చేయకండి. పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించండి. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆశ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయొచ్చు.

01/06/2026

Receiving threats on video calls?
Being forced to share money or personal details?
This is not an investigation. This is a scam. Report it immediately.

01/06/2026

మాట్రిమోని వెబ్‌సైట్లు, యాప్స్‌లో పరిచయాలతో జాగ్రత్త. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులకు మీ వ్యక్తిగత వివరాలు చెప్పొదు. వారితో చనువు పెంచుకొవద్దు. ఒకవేళ భారీ లాభాలు వస్తాయని చెప్తే అస్సలు పెట్టుబడులు పెట్టొద్దు.

31/05/2026

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ డీజీపీ శ్రీ సి.వి.ఆనంద్, ఐపీఎస్ డీజీపీ పరిధిలోని అన్ని విభాగాల ఎస్‌ఐ మరియు అంతకంటే పై స్థాయి అధికారులతో మెగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుమారు 6,500 మంది అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రభుత్వానికున్న అభిప్రాయాలుమరియు రాష్ట్ర పోలీసు శాఖపై ఉన్న అంచనాల గురించి ప్రారంభోపన్యాసం చేసిన అనంతరం, గతంలో మావోయిస్టు సమస్యలు మరియు సాధారణ నేరాల నియంత్రణ నుంచి ప్రస్తుతం ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నార్కోటిక్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ సమస్యలు వంటి కొత్త సవాళ్ల దిశగా పోలీస్ శాఖ దృష్టి మళ్లాల్సిన అవసరాన్ని డీజీపీ వివరించారు. ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధికారుల ఆలోచనా విధానం, పనితీరు కూడా మారాలని సూచించారు.

ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత కోసం ప్రత్యేక విభాగం, ఆధునిక సాంకేతికతలను అందిపుచ్చుకునేలా టెక్ టీమ్ బృందం, ఆదాయ నష్టాలను అరికట్టేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్ ఫోర్స్, అలాగే తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆహార కల్తీని అరికట్టేందుకు ప్రత్యేక యాంటీ ఫుడ్ అడల్టరేషన్ విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

జిల్లా ఎస్పీలు మరియు పోలీస్ కమిషనర్లు తమ యూనిట్లకు నాయకులుగా వ్యవహరించాల్సిన బాధ్యతలను ఆయన వివరించారు. నేర సమీక్ష సమావేశాలు నిర్వహించడం, పోలీస్ స్టేషన్లు మరియు ఇతర యూనిట్లను క్రమం తప్పకుండా సందర్శించి తనిఖీలు చేయడం, రాత్రి గస్తీ వ్యవస్థను సమర్థంగా నిర్వహించడం, డయల్ 112 కాల్స్‌కు వేగవంతంగా స్పందించడం వంటి ప్రాథమిక పోలీసింగ్ విధానాలపై దృష్టి సారించాలని సూచించారు.

సమాజ పోలీసింగ్‌లో భాగంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గం నుంచి సాయంత్రం 5 గం వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అధికారులను కలిసేలా ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని ఆదేశించారు.

తమ యూనిట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తూ అత్యున్నత స్థాయి నిజాయితీ, పారదర్శకత మరియు నైతిక విలువలను కాపాడాలని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు. సమగ్రత (Integrity) లేకపోతే చేసే కృషి ఫలప్రదం కాదని స్పష్టం చేశారు.

పోలీస్ శాఖ విజయాపజయాలను నిర్ణయించే కీలక పాత్రధారులు SHO లని పేర్కొంటూ, వారి విధులు, బాధ్యతలను విపులంగా వివరించారు. అలాగే SHOలు కాని ఎస్‌ఐలు, డీఎస్పీలు, అదనపు ఎస్పీలు వంటి పర్యవేక్షణ అధికారుల బాధ్యతల గురించి కూడా వివరించారు.

రాష్ట్ర పోలీసు బలగమంతటికీ ఒకేసారి తన ఆలోచనలు, లక్ష్యాలు మరియు దిశానిర్దేశాన్ని చేరవేయగలిగినందుకు ఇది తనకు ఎంతో సంతృప్తినిచ్చిన సమావేశమని డీజీపీ పేర్కొన్నారు.

31/05/2026

ఆన్ లైన్ స్నేహాలను నమ్మే ముందు జాగ్రత్త. మంచిగా మాట్లాడుతున్నారు కదా అని అందరినీ నమ్మొద్దు. సోషల్ మీడియా స్నేహితులకు మీ వ్యక్తిగత విషయాలు చెప్పొద్దు.

31/05/2026

డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే సైబర్ మోసాలకు జాగ్రత్త!
వీడియో కాల్స్ ద్వారా బెదిరించి వ్యక్తిగత వివరాలు లేదా డబ్బులు అడిగితే నమ్మవద్దు. అప్రమత్తంగా ఉండండి,
అనుమానాస్పద కాల్స్‌ను వెంటనే 1930కు నివేదించండి.

Want your business to be the top-listed Government Service in Telangana?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address

Director General Of Police
Telangana
500004

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm