Dr Boga Shravani

Dr Boga Shravani

Share

Jagtial, Telangana

02/06/2026

ఆరు దశాబ్దాల కలను నిజం చేసిన ఉద్యమకారులకు, తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు అశ్రునివాళులు. 🙏

మన భాష, మన యాస గర్వంగా తలెత్తుకున్న ఈ శుభదినాన, రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

జై తెలంగాణ! జై హింద్! 🇮🇳

Photos from Dr Boga Shravani's post 01/06/2026

జగిత్యాల్ పట్టణం మరియు జగిత్యాల అర్బన్ లో పలు ఆత్మీయ కుటుంబ సభ్యులు ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఈ రోజు వారి కుటుంబ సభ్యులను స్వగృహంలో కలిసి పరామర్శించడం జరిగింది.

వెంట నాయకులు ఆముద రాజు,పాత రమేష్, మ్యాదరి అశోక్, దశరథ్ రెడ్డి, మర్రిపల్లి సాగర్,గడ్డల లక్ష్మి, కాశిట్టి తిరుపతి మరియు తదితరులు వున్నారు.

Photos from Dr Boga Shravani's post 31/05/2026

ఈరోజు జగిత్యాల పట్టణంలోని స్థానిక విరూపాక్షి గార్డెన్లో నిర్వహించిన జగిత్యాల్ పట్టణ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం సభ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జగిత్యాల్ నియోజకవర్గం ఇంచార్జ్ Dr.బోగ శ్రావణి

ఈ కార్యక్రమంలో బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్, 42వ కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, సిరిపురపు శ్రీనివాస్, గట్టి పెళ్లి జ్ఞానేశ్వర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Photos from Dr Boga Shravani's post 31/05/2026

కులవృత్తుల అభివృద్ధికి కేంద్రం అండగా నిలుస్తోంది
– బీజేపీ నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి
- ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనతో మహిళలు, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు

జగిత్యాల : కులవృత్తులను ప్రోత్సహిస్తూ సంప్రదాయ వృత్తిదారులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి అన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన మేరు సంఘం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద అర్హులైన వారికి ఉచిత శిక్షణ అందించడంతో పాటు శిక్షణ పూర్తయిన అనంతరం అవసరమైన కుట్టు మిషన్లు వంటి పనిముట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలాగే శిక్షణ కాలంలో లబ్ధిదారులకు స్టైఫండ్ కూడా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

శిక్షణ పొందిన వారు స్వయం ఉపాధి కోసం షాపులు లేదా ఇతర వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వమే రుణ సదుపాయం కల్పించి వారికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందన్నారు.

ముఖ్యంగా మహిళలు, యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలనే ఆసక్తి చూపుతున్నప్పటికీ ఈ పథకం గురించి ఇంకా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. అర్హులైన వారిని గుర్తించి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తన వంతు సహకారం కూడా అందిస్తానని తెలిపారు.

ప్రజలకు ఉపాధి కల్పించడమే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన లక్ష్యమని, ఇప్పటికే ఎంతోమంది నిరుద్యోగులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరిందని డాక్టర్ భోగ శ్రావణి వివరించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్,42వ వార్డ్ కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, ఆముదరాజు, కాశెట్టి తిరుపతి, సిరిపురం శ్రీనివాస్, రాగిళ్ళ సత్యనారాయణ, రాజుల నారాయణ, శ్రీనివాస్, బోగ నరేష్ మేరు సంఘం నూతన కార్యవర్గ సభ్యులు, సంఘ నాయకులు, బీజేపీ నాయకులు, మహిళలు, యువత మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Photos from Dr Boga Shravani's post 31/05/2026

ఈరోజు జగిత్యాల పట్టణంలో ఆద్రి హాస్పిటల్ పునః ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని యజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్,42వ వార్డ్ కౌన్సిలర్ నిమ్మల నాగరాజు, ఆముదరాజు, కాశెట్టి తిరుపతి, సిరిపురం శ్రీనివాస్,బోగ నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Photos from Dr Boga Shravani's post 30/05/2026

జగిత్యాల్ పట్టణంలో పలు ఆత్మీయ కుటుంబ సభ్యులు ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఈరోజు వారి కుటుంబ సభ్యులను స్వగృహంలో కలిసి పరామర్శించడం జరిగింది.

వెంట నాయకులు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, ఆముదరాజు, మ్యాదరి అశోక్, సుంకేట దశరథ్ రెడ్డి, గదాసు రాజేందర్,మరిపల్లి సాగర్, కాసెట్టి తిరుపతి, సిరిపురం శ్రీనివాస్ మరియు తదితరులు వున్నారు.

29/05/2026

జగిత్యాలలో అభివృద్ధా, అవినీతా? పార్టీలు మారిన MLA సంజయ్ కుమార్… మేము చర్చకు సిద్ధంగా ఉన్నం !

చర్చకు వచ్చేటప్పుడు ఇంకో పోస్టరు పట్టుకొని రా!! పేద పిల్లల కేంద్రీయ విద్యాలయానికి ఎందుకు జాగ ఇస్తలేవో రాస్కొని తీస్కరా!!

29/05/2026

జగిత్యాల రాజకీయాల్లో పోస్టర్ వార్ హాట్ టాపిక్..

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి పోస్టర్లు అంటించిన బీజేపీ నేతలు..

ఎమ్మెల్యే డా. సంజయ్‌కు బీజేపీ ఓపెన్ ఛాలెంజ్..

“అవినీతిపై బహిరంగ చర్చకు రావాలి” అంటూ పోస్టర్లలో డిమాండ్..

రేపు తహసీల్ చౌరస్తా వద్ద చర్చకు రావాలని సవాల్..

28/05/2026

స్వాతంత్ర్యవీర వినాయక్ దామోదర్ సావర్కర్ గారి జయంతి సందర్భంగా, భారత స్వాతంత్ర్య సమరంలో నిర్భయ యోధుడిగా నిలిచి, తన జీవితమంతా మాతృభూమి సేవకు అంకితం చేసిన మహనీయుడికి నివాళులు అర్పిస్తున్నాను.

27/05/2026
Want your business to be the top-listed Government Service in Jagtial?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address

Jagtial