Collectorntr

Website

Collectorntr Official Administrative handle of Collector and District Magistrate, NTR District

ఎన్‌టీఆర్ జిల్లాకు వివిధ కేటగిరీల్లో 69 జిల్లాస్థాయి స్వచ్ఛాంధ్ర పురస్కారాలు లభించాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ...
06/10/2026

ఎన్‌టీఆర్ జిల్లాకు వివిధ కేటగిరీల్లో 69 జిల్లాస్థాయి స్వచ్ఛాంధ్ర పురస్కారాలు లభించాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఎమ్మెల్సీ వర్ల రామయ్య, జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ IAS, VMC కమిషనర్ ధ్యానచంద్ర IAS విజేతలకు అవార్డులు అందజేసి అభినందించారు.

స్వచ్ఛ ప్రభుత్వ కార్యాలయంగా NTR కలెక్టరేట్, VMC ప్రధాన కార్యాలయం; స్వచ్ఛ మున్సిపాలిటీగా తిరువూరు; స్వచ్ఛ గ్రామపంచాయతీలుగా గండ్రాయి, మైలవరం, గూడవల్లి, జూపూడి అవార్డులు సాధించాయి. స్వచ్ఛతలో ఎన్‌టీఆర్ జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపేందుకు సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు.




Nara Chandrababu Naidu Deputy CMO, Andhra Pradesh Swachha Andhra Corporation Municipal Dept Govt of Ap Commissioner and Director of Municipal Administration Ministry of Panchayati Raj, Government of India Pawan Kalyan Swachh Bharat Urban Swachh Bharat Mission-Grameen Rural Development Vijayawada Municipal Corporation

ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, IAS, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ IAS,  డీఆర్‌వో ఎం. లక్ష్మీనరసింహంతో కలిసి...
05/10/2026

ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, IAS, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ IAS, డీఆర్‌వో ఎం. లక్ష్మీనరసింహంతో కలిసి కలెక్టరేట్‌లో ‘సేవా సేతు అభియాన్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

అక్టోబర్ 6–8 తేదీల్లో జిల్లాలోని 4 సబ్‌ డివిజన్ల పరిధిలో 15 ప్రాంతాల్లో నిర్వహించనున్న క్యాంపుల ద్వారా PM Surya Ghar – Muft Bijli Yojanaపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. రూఫ్‌టాప్ సోలార్ ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవడంతో పాటు స్వచ్ఛమైన పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించవచ్చని కలెక్టర్ తెలిపారు. అర్హులైన గృహ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.



Nara Chandrababu Naidu CMO Andhra Pradesh apcpdcl Srinivasarao Uppu PM Surya Ghar: Muft Bijli Yojana Vijayawada Municipal CorpoVijayawada Municipal CorporationIPress Information Bureau IndiaRPIB in Andhra PradeshI&PR APAP Official News

05/10/2026

Date : 05-10-2026

ఎన్‌టీఆర్ జిల్లా, చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో కళాజాతా బృందం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు.

కళారూపాలు, పాటలు మరియు సందేశాల ద్వారా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత మరియు ప్రజల భాగస్వామ్యంపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.




Nara Chandrababu Naidu Deputy CMO, Andhra Pradesh Swachha Andhra Corporation Municipal Dept Govt of Ap Commissioner and Director of Municipal Administration Ministry of Panchayati Raj, Government of India Pawan Kalyan Swachh Bharat Urban Swachh Bharat Mission-Grameen Rural Development Vijayawada Municipal Corporation

05/10/2026

Date : 05-10-2026

ఎన్‌టీఆర్ జిల్లా, చందర్లపాడు మండలం చందర్లపాడు గ్రామంలో కళాజాతా ద్వారా స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించారు.

పాటలు, కళారూపాల ద్వారా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం మరియు స్వచ్ఛమైన గ్రామాల ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన, అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ సాధ్యమనే సందేశాన్ని అందించారు.




Nara Chandrababu Naidu Deputy CMO, Andhra Pradesh Swachha Andhra Corporation Municipal Dept Govt of Ap Commissioner and Director of Municipal Administration Ministry of Panchayati Raj, Government of India Pawan Kalyan Swachh Bharat Urban Swachh Bharat Mission-Grameen Rural Development Vijayawada Municipal Corporation

ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, IAS, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, డీఆర్‌వో ఎం. లక్ష్మీనరసింహంతో కలిసి కలెక...
05/10/2026

ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, IAS, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, డీఆర్‌వో ఎం. లక్ష్మీనరసింహంతో కలిసి కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి PGRSలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ప్రతి అర్జీని కేవలం ఎండార్స్ చేసి వదిలేయకుండా, నిర్ణీత గడువులోగా నాణ్యమైన, న్యాయబద్ధమైన, శాశ్వత పరిష్కారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సంతృప్తి, IVRS ఫీడ్‌బ్యాక్, రియల్‌టైమ్ గవర్నెన్స్ డేటాను ఆధారంగా చేసుకుని పనితీరును మెరుగుపరచాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.



Nara Chandrababu Naidu CMO Andhra Pradesh I&PR AP AP Official News Press Information Bureau India PIB in Andhra Pradesh Department of Administrative Reforms and Public Grievances, GoI

Date : 04-10-2026విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వేరావల్ (సోమనాథ్)కు ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ ప్రత్యేక FTR రైలు యాత్రను ప...
05/10/2026

Date : 04-10-2026

విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వేరావల్ (సోమనాథ్)కు ‘సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్’ ప్రత్యేక FTR రైలు యాత్రను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, IAS, దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

రాష్ట్రంలోని 21 ప్రముఖ దేవాలయాల నుంచి 1,060 మంది భక్తులు, 100 మంది కళాకారులతో కూడిన సాంస్కృతిక బృందం ఈ 18 బోగీల ప్రత్యేక రైలులో సోమనాథ్ క్షేత్రానికి బయలుదేరింది. భక్తుల సౌకర్యం, భద్రత కోసం IRCTC, రైల్వే, కేంద్ర సాంస్కృతిక శాఖ, గుజరాత్ ప్రభుత్వం, రాష్ట్ర దేవాదాయ–సాంస్కృతిక శాఖల సమన్వయంతో వసతి, భోజనం, వైద్యం, తాగునీరు తదితర ఏర్పాట్లు చేశారు.



Nara Chandrababu Naidu CMO Andhra Pradesh I&PR AP AP Official News Bonda Uma AP Temples Connect, Endowments Minister Of Endowments Govt Of AP PIB in Andhra Pradesh Press Information Bureau India

05/10/2026

NTR District Newspaper Clippings Dated 05-10-2026



Nara Chandrababu Naidu CMO Andhra Pradesh I&PR AP AP Official News

Address

Collectrate, NTR District
Vijayawada
520010

Alerts

Be the first to know and let us send you an email when Collectorntr posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share