CPI Vijayawada

CPI Vijayawada Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CPI Vijayawada, Political Party, Vijayawada.

వామపక్ష పార్టీల  పిలుపుమేరకు  ఈరోజు లెనిన్ సెంటర్ నుంచి రాజభవన్  వరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని కోరుతూ  చల...
10/10/2026

వామపక్ష పార్టీల పిలుపుమేరకు ఈరోజు లెనిన్ సెంటర్ నుంచి రాజభవన్ వరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని కోరుతూ చలో రాజభవన్ కు ఇచ్చిన పిలుపు మేరకు ఆ కార్యక్రమానికి హాజరు కాకుండా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ అక్కినేని వనజ ను పోలీసు లు అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు.





*జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం ఇళ్ళు లబ్దిదారులకు వెంటనే కేటాయించాలి ...జి.కోటేశ్వరరావు డిమాండ్*విద్యాధరపురం కబేళా సెంటర్ వద్ద  క...
09/10/2026

*జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం ఇళ్ళు లబ్దిదారులకు వెంటనే కేటాయించాలి ...జి.కోటేశ్వరరావు డిమాండ్*

విద్యాధరపురం కబేళా సెంటర్ వద్ద కోట్ల రూపాయలు వెచ్చించి దశాబ్ద కాలం క్రితం నిర్మించిన జె.ఎన్.ఎన్.యు.ఎం ఇళ్లను లబ్దిదారులకు వెంటనే కేటాయించాలి అని సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ప్రభత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు ఉదయం స్థానిక సిపిఐ బృందం స్థానిక కబేళా సెంటర్లోని జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో కబేళా సెంటర్ నుండి సితార సెంటర్ వరకు, అలాగే నైనవారం రైల్వేగేటు పరిసర ప్రాంతాల రోడ్డు విస్తరణ సమయంలో అక్కడ నివాసితున్న నిర్వాసితులకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అప్పటి సిపిఐ కార్పొరేటర్ గా నేను ఉన్న సందర్బములో ఈ ప్రాంతంలో తాత్కాలిక ఇళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని. తదనంతరం వారికి సిపిఐగా నిర్వహించిన అనేక పోరాటాల ఫలితంగా జక్కంపూడి కాలనిలో శాశ్వత నివాసాలు కేటాయించి తరలించడం జరిగిందని అన్నారు. నగరపాలక సంస్థ నగరంలోని ఇళ్ళు లేని నిరుపేదలకు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసే ఉద్దేశంతో జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం నిధులతో ఈ ప్రాంతములో ప్రతి బిల్డింగ్ లో 32 ఇళ్ళు ఉండే విధముగా 12 బిల్డింగ్ లతో దాదాపు 384 ఇళ్ల నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణాలు పూర్తి జరిగి దాదాపు 10 సంవత్సరాలు గడుస్తున్న ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చిత్తశుద్ధి లోపంతో నేటికీ వాటిని పూర్తి స్థాయిలో లబ్దిదారులకు కేటాయించడం జరగలేదు. 384 ఇళ్లకు గాను కేవలం 11 ఇళ్లను మాత్రమే లబ్దిదారులకు కేటాయిచడం. 4 ఇళ్లను నగరపాలక సంస్థ శానిటరీ కార్యాలయాలు, కొన్ని సచివాలయాలుగా వినియోగిస్తున్నారు తప్ప దాదాపు 370 ఇళ్ళు నిరుపయాయోగంగా ఉంటూ శిధిలావస్థకు చేరి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన పరిస్థితి నెలకొన్నది అని అన్నారు. ఆనాటి కమ్యూనిస్టులు నగరపాలక సంస్థలో అధికార పక్షంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎంతో మంచి ఉద్దేశంతో జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం నిధులను కేటాయించి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన అధికారుల నిర్లక్ష్యంతో నేటి నగరంలో పూర్తి స్థాయిలో ఇళ్ళు లేని నిరుపేదలను గుర్తించే ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తిచేయకుండా లబ్దిదారులకు ఇళ్ళు కేటాయింపులు జరగకపోవడం పట్ల అయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికైన నగరపాలక సంస్థ అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి చేసి లబ్దిదారులకు ఇళ్ళు కేటాయించాలని డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శివర్గ సభ్యురాలు పంచదార్ల దుర్గంబ, స్థానిక డివిజన్ల కార్యదర్శులు కంచర్ల నాగేశ్వరరావు, టి.పూర్ణయ్య,సహాయ కార్యదర్శిలు యెర్రసాని జోసఫ్ అంజూరి సూరిబాబు,డివిజన్ల నాయకులు నడకుదటి వెంకటేశ్వరరావు,కోటా రాంబాబు,భగవాన్, పడాల తవుడమ్మ, నాగేశ్వరరావు, నక్కా నాగేశ్వరరావు,రత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.





సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జల ఈశ్వరయ్య
08/10/2026

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జల ఈశ్వరయ్య





*విజయవాడ* :దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ సమగ్ర ఓటర్ల సర్వే (SIR) పేరుతో ఓటర్ల తొలగింపు ప్రక్రియకు బాధ్యత వహిస్తూ...
02/10/2026

*విజయవాడ* :దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ సమగ్ర ఓటర్ల సర్వే (SIR) పేరుతో ఓటర్ల తొలగింపు ప్రక్రియకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల అధికారి *జ్ఞానేశ్వర్ కుమార్* తన పదవికి *రాజీనామా* చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల జాతీయ సమితి ల పిలుపులో భాగంగా విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో *తుమ్మలపల్లి కళాక్షేత్రం* నుండి *లెనిన్ సెంటర్* వరకు *నిరసన ప్రదర్శన* నిర్వహించబడినది. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, మరియు ఎన్డీయేతర పక్షాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.





*శ్రద్ధాంజలి:* భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) విజయవాడ నగర సీనియర్ నాయకులు కామ్రేడ్ రెడపొంగు యాకోబు ఈరోజు(30-9-26) ఉదయం ...
30/09/2026

*శ్రద్ధాంజలి:*
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) విజయవాడ నగర సీనియర్ నాయకులు కామ్రేడ్ రెడపొంగు యాకోబు ఈరోజు(30-9-26) ఉదయం మృతి చెందారు.
*జోహార్ కామ్రేడ్ రెడపొంగు యాకోబు*





*రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి!**ప్రధాన ప్రజా రవాణా కూడలిగా ఉన్న విజయవాడ...
24/09/2026

*రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి!*
*ప్రధాన ప్రజా రవాణా కూడలిగా ఉన్న విజయవాడలో మౌలిక వసతుల కల్పనలో రైల్వే, ఆర్టీసీ అధికారులు విఫలం!*
*.....జి.కోటేశ్వరరావు*

నగర వ్యాప్తముగా రెండు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ (తీవ్రవాయుగుండం) ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగర ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారిందని సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అన్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలపై అయన నగరంలో పలు ప్రాంతాలలో పర్యటించి పరిస్థితిని ఆరా తీశారు. ఈ సందర్భముగా అయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ వర్షాల కారణంగా నగరంలో లోతట్టు ప్రాంతాలలో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీటి పారుదలకు సరైన అవకాశం లేక జలమయంగా మారిన పరిస్థితి ఉందని, నగరపాలక సంస్థ అధికారుల ముందు చూపు లేకుండా స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీలను సరైనరీతిలో లేకపోవటం వలన, నీటి ప్రవాహాన్ని మెరుగుపరచకుండా చేయడం వలన నేడు వర్షపు నీళ్లు ఎక్కడిఅక్కడ నిలిచిపోయే పరిస్థితి నెలకొన్నదని అన్నారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని కావున నగరపాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించి కొండచరియలు బలహీనంగా ఉన్న ప్రాంతాలలో ప్రజలకు ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు నీటిని తోడేందుకు ఎక్కడిక్కడ అధికార యంత్రంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భముగా అయన విజయవాడ రైల్వే స్టేషన్, పండిట్ నెహ్రు బస్ స్టేషన్ ను సందర్శించి అక్కడ ప్రయాణికుల మౌలిక వసతులపై ప్రయాణికులను ఆరా తీశారు. ఈ సందర్భముగా నిత్యం అనేక వేలమంది ప్రయాణించే దేశంలోనే రెండవ అతిపెద్ద రైల్వే స్టేషన్ లో వర్షం వలన పైనుండి నీరు కారటం వలన కూర్చునే అరుగులు మొత్తం తడిచి పోవటంతో కూర్చునేందుకు, ప్రయాణికులు వేచి ఉండేందుకు సరైన కనీస వసతులు లేకపోవడం కనీసం ప్రయాణికులు కూర్చోడానికి కూడా అవకాశం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. రైల్వే స్టేషన్ల లో, బస్టాండులో అడ్వర్టైజ్మెంట్ ల ద్వారా అలాగే అనేక ప్రయాణేతర మార్గాల ద్వారా అధిక మొత్తంలో ఆదాయం వస్తున్నప్పటికీ సరైన తాగునీరు, మెరుగైన పారిశుద్ధ్య వసతులు కల్పించడంలో, అదేవిధంగా నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే ఆసియాలోని అతి పెద్ద బస్ స్టేషన్ అయిన పండిట్ నెహ్రు బస్ స్టాండ్ లో స్లాబులపై నుండి నీరు కారడం వలన ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,స్త్రీ పథకం వలన పెరిగిన ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను పెంచడంలోగాని, ఉన్న బస్సులు ఎప్పుడు వస్తాయో అప్పటివరకు ప్రయాణికులు వేచి ఉండేందుకు అనువైన సౌకర్యాల కల్పనలో మాత్రం అధికారులు పూర్తిగా విఫలపయ్యారని రైల్వే స్టేషన్ గాని, ఆర్టీసీ అధికారులు మరింత ద్రుష్టి పెట్టి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేసారు.




#ఆంధ్రప్రదేశ్

*కూటమి పాలనలో "ఏం కొనేటట్లు లేదు ఏం తినేటట్లు లేదు"!* *నిత్యావసరాల ధరలకు అడ్డుకట్టవేయాలి! ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయ...
19/09/2026

*కూటమి పాలనలో "ఏం కొనేటట్లు లేదు ఏం తినేటట్లు లేదు"!*
*నిత్యావసరాల ధరలకు అడ్డుకట్టవేయాలి! ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి...జి.కోటేశ్వరరావు*

"ఏం కొనేటట్లు లేదు ఏం తినేటట్లు లేదు" అని సరిగ్గా 30 సంవత్సరాల క్రితం ప్రజా యుద్ధనౌక ప్రజా గాయకుడు గద్దర్ రాసి పాడిన ఒక చలనచిత్రంలోని పాట నేటి కూటమి పాలనకు అద్దంపడుతుందని సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఎద్దేవా చేసారు.రాష్ట్రంలో నానాటికి పెరుగుతున్న నిత్యావసరాల ధరలను అదుపుచేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ స్థానిక డివిజన్ల ఆధ్వర్యంలో వన్ టౌన్, చిట్టినగర్ సెంటర్ లో నగర కార్యవర్గ సభ్యులు డి.వి.రమణ బాబు అధ్యక్షతన నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఈ సందర్భముగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజురోజుకి పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్య ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని, ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుంటే, సామాన్యుడు మాత్రం పండగపూట కూడా పస్తులుండే పరిస్థితులు దాపురించాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యావసరాల ధరలు అమాంతంగా రెండు నుండి మూడు రేట్లు పెరగడం జరిగింది అని అందుకు తగిన విధంగా సామాన్య ప్రజల ఆదాయం పెరగక పోవడం,సామాన్యునికి సరైన ఉపాధి అవకాశాలు లేక ప్రజలు ఆకలిని చంపుకొని బతకాల్సిన పరిస్థితులు నెలకోన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కూటమి నాయకులు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యవసరాల ధరలు తగ్గించి పేదవానికి అందుబాటులోకి తీసుకువస్తామని,మార్కెట్ హెచ్చు తగ్గులకు అనువుగా ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి నిత్యావరలను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ధరల తగ్గించడం పక్కకు పెట్టి గతంలో అంటే 2024 నాటికీ ఉన్న ధరలను అమాంతం పైకి ఎగబాయించి సమస్య ప్రజలకు కనీసం ఆకలి తీర్చుకునే అవకాశం కూడా లేకుండా చేసే విధంగా ధరల పెరుగుతున్నప్పటికీ కూటమికి ప్రభుత్వం ధరల నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపట్టకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుందని.మరో పక్క రాష్ట్రంలో ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేక ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు మరి పెరిగిన ఈ ధరల వ్యత్యాసం ఎవరి జేబులలోకి చేరుతుందని ప్రశించారు.గిట్టుబాటు ధరల కల్పనకు పటిష్ట చర్యలు చేపట్టకుండా,దళారీ, బ్లాక్ మార్కెట్ వ్యవస్థకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో ప్రజల ఆహార అవసరాలు తీర్చే బియ్యం ధర కేవలం రెండు నెలల వ్యవధిలో బస్తాకు 500 రూపాయలు పెరగడం,వంట నూనె,చక్కెర,ఉల్లిపాయలు, పప్పులు ఇలా ఏది కొనాలన్న సామాన్యుడు భయపడే పరిస్థితి నెలకొన్నదని,పెరుగుతున్న నిత్యవసరాల కొరత ఆసరాగా చేసుకొని దళారులు నిత్యవసరాలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ ప్రజల అవసరాలను వారి ఆదాయవనరులుగా మారుస్తుంటే పాలకులు బ్లాక్ మార్కెట్ దళారులకు,పెట్టుబడి దారులకు సంపద సృష్టిస్తూ సామాన్యునికి వెన్నుపోటు పొడుస్తోందని,మరో పక్క కేంద్ర ప్రభుత్వం యుద్ధాల పేరుతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను రికార్డు స్థాయికి పెంచి వారి రికార్డులను వారే అధికమించే దిశగా పాలనా సాగించడంతో ధరల పెరుగుదలకు ఈ రోజు రవాణా వ్యయం పెరగటం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు అని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా నిత్యవసరాలైన బియ్యంతో పాటు,చక్కర, వంటనూనె,పప్పులు వంటి 14 రకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని,అదేవిధంగా ధరల స్థిరీకరణకు,బ్లాక్ మార్కెట్ నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. లేని పక్షంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు అనే ఆయుధం ద్వారా పాలక ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు తాడి పైడయ్య,పంచదార్ల దుర్గాంబ, కొట్టు రమణారావు,నగర కార్యవర్గ సభ్యులు ఎస్.కె.నజీర్, స్థానిక డివిజన్ పార్టీ కార్యదర్శులు కరోతి వెంకటేశ్వరరావు, రేడపొంగు ప్రభుదాస్, కుర్ర శివయ్య, బోరా రామకృష్ణ, మోకా దుర్గారావు, రాయన గుర్నాధం,నగర నాయకులు బెవర శ్రీనివాసరావు,చీర్ల రామస్వామి, ఎస్.వి.రమణ,గూడేల జనార్దనరావు,వి.రామారావు, ఆర్.మైఖేల్, పి.సోమేశ్వరరావు,తిప్పబత్తుల వెంకటేశ్వరరరావు, శాంసన్, నడకుదుటి సూర్యనారాయణ రాజు, ఎస్ వెంకట్ నారాయణ, ఎం.సూరిబాబు, షేక్ అమీర్, అల్లా బక్షు, రత్న శేఖర్, మహిళ సమాఖ్య నాయకురాళ్లు దుర్గాసి రమణమ్మ, చింతాడ పార్వతి,ఆర్.అనసూయ,
రెడపుంగు ఉమా,షైనీ ఏఐవైఎఫ్ నాయకులు కంచర్ల భార్గవ్, సింగంశెట్టి మోహనప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



#ఆంధ్రప్రదేశ్

*కూటమి ప్రభుత్వని ప్రజా సంక్షేమం కంటే రాజకియ లబ్దే ప్రదానం!**సంక్షేమ పథకాల క్రింద ఇచ్చే పెన్షన్ దరఖాస్తు గడువును పెంచాలి...
17/09/2026

*కూటమి ప్రభుత్వని ప్రజా సంక్షేమం కంటే రాజకియ లబ్దే ప్రదానం!*
*సంక్షేమ పథకాల క్రింద ఇచ్చే పెన్షన్ దరఖాస్తు గడువును పెంచాలి ...జి.కోటేశ్వరరావు*

ప్రభుత్వం వృద్దాప్య, వితంతు, దివ్యంగుల తదితరులకు ఇచ్చే పెన్షన్లకు కొత్తగా అర్హులైన వారికి దరఖాస్తు గడువును మరొక 7 రోజులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ, విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అనంతరం సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం మున్సిపల్ కమిషనర్ గారిని కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భముగా కోటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల తరువాత ఎన్నిక నేపథ్యంలో ప్రజా సంక్షేమం గుర్తుకు వచ్చి హడావిడిగా వివిధ వర్గాలకు ఇచ్చే పెన్షన్ లకు అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసునేందుకు దరఖాస్తు చేసుకోవాలని తొలుత ఈ నెల 6వ తేదీన నుండి 16వ తేదీ వరకు గడువు ఇవ్వడం జరిగింది తదుపరి గడువును రెండు రోజులు సడలించి 18వ తేదీవరకు అని ప్రకటించడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల తరువాత రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వారి రాజకీయ లబ్ది కోసం హడావిడిగా కొత్త పెన్షన్ లకు అర్హులు దరకాస్తు చేసుకోవచ్చు అని ప్రకటించారు. ఇది పూర్తిగా వారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఎంతోకొంత రాజకీయ లబ్ది పొందేందుకు అయినప్పటికీ ఇది ప్రజా సంక్షేమానికి సంబందించిన అంశంకావడంతో ఈ ప్రకటనను పూర్తిగా స్వాగతిస్తున్నాము. అయితే కేవలం 12 రోజులు మాత్రమే కాలవ్యవధి ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ప్రశించారు. ఈ కాలవ్యవధిలో కూడా దాదాపు 4-5 రోజులు పండుగలు , సాధారణ సెలవుల రూపంలో వృధాగా పోవడం జరిగింది. మిగిలిన పని దినాలలో అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసేందుకుగాను ప్రభుత్వం కుల, ఆదాయ, నివాస, సదరన్ తదితర ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉండగా ఆ ధ్రువపత్రాల కోసం వృద్దులు, దివ్యంగులు సచివాలయాలు చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ సమయం చాల తక్కువ ఉండటం వలన సంబంధిత పత్రాలు పొందలేక సరైన సమయంలో దరఖాస్తు చేసుకోలేక అనేక మంది అర్హులైన లబ్ధిదారులు వారి దరఖాస్తు చేసుకొనే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉన్నది అని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉన్నట్లయితే అర్హులైన అందరికి న్యాయం చేసేందుకు మరొక 7 రోజుల గడువు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ గారిని కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది

​ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శులు లంకా దుర్గారావు, నక్కా వీరభద్రరావు, కార్యదర్శి వర్గ సభ్యులు మూలి సాంబశివరావు,తాడి పైడియ్య, పంచదార్ల దుర్గాంబ,కొట్టు రమణారావు, సంగుల పేరయ్య, కార్యవర్గ సభ్యులు DV.రమణబాబు,దోనెపూడి సూరిబాబు, నగర నాయకులు KR. ఆంజనేయులు ,బొర్రా రామకృష్ణ, పడాల కనకారావు, మూలి శివ, మోకా దుర్గారావు, ఆకుల ఏసు, టి.పూర్ణయ్య, బెవర శ్రీనివాసరావు, కంచర్ల భార్గవ్, నడికుదిటి వెంకటేశ్వరరావు, తిమోహన్,డి.రమణమ్మ, చింతాడ పార్వతి, ch.అనిత, షైనీ,J. మురళీ సాయి మణి తదితరులు పాల్గొన్నారు.



#ఆంధ్రప్రదేశ్

*ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసరాల ధరలకు నిరసనగా సిపిఐ "వినూత్న నిరసన" !**దళారులకు పండగ, సామాన్యునికి దండగగా మారిన కూటమి పా...
11/09/2026

*ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసరాల ధరలకు నిరసనగా సిపిఐ "వినూత్న నిరసన" !*
*దళారులకు పండగ, సామాన్యునికి దండగగా మారిన కూటమి పాలన !*

రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుంటే, సామాన్యుడు మాత్రం పండగ పూట కూడా పస్తులుండే పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వ పాలనలో దాపురించాయని సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేసారు.ఈ రోజు స్థానిక విద్యాధరపురం సితార సెంటర్లో సిపిఐ స్థానిక డివిజన్ల ఆధ్వర్యంలో నగర కార్యదర్శివర్గ సభ్యురాలు పంచదార్ల దుర్గాంబ అధ్యక్షతన వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిత్యావసరాల ధరలు అమాంతంగా రెండు నుండి మూడు రేట్లు పెరగడం జరిగింది అని అందుకు తగిన విధంగా సామాన్య ప్రజల ఆదాయం పెరగక పోవడంతో పేద, మధ్యతరగతి రానున్న పండగ రోజులని కూడా దండగ రోజులుగా భావిస్తు ప్రజలు ఆకలిని,ఆశలను చంపుకొని బతకాల్సిన పరిస్థితులు నెలకోన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు.రాష్ట్రంలో కూటమి నాయకులు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యవసరాల ధరలు తగ్గించి పేదవానికి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ధరల తగ్గించడం పక్కకు పెట్టి గతంలో అంటే 2024 నాటికీ ఉన్న ధరలను అమాంతం పైకి ఎగబాయించి సమస్య ప్రజలకు కనీసం ఆకలి తీర్చుకునే అవకాశం కూడా లేకుండా చేసే విధంగా ధరల పెరుగుతున్నప్పటికీ కూటమికి ప్రభుత్వం ధరల నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపట్టకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని.మరో పక్క రాష్ట్రంలో ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేక ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు మరి పెరిగిన ఈ ధరల వ్యత్యాసం ఎవరి జేబుల లోకి చేరుతుందని ప్రశించారు. గిట్టుబాటు ధరల కల్పనకు పటిష్ట చర్యలు చేపట్టకుండా, దళారీ, బ్లాక్ మార్కెట్ వ్యవస్థకు కొమ్ముకాస్తూ పెట్టుబడి దారులకు సంపద సృష్టే ప్రధాన ఏజెండగా పాలనా సాగిస్తుందని ఎద్దేవా చేసారు.మరి ఈ అధిక ధరలను అందుకునే స్థాయిలో సామాన్యుని ఆదాయం పెరిగిందా అని ప్రభుత్వాన్ని ప్రశించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా నిత్యవసరాలైన బియ్యంతో పాటు,చక్కర,వంటనూనె, పప్పులు వంటి 14 రకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని,అదేవిధంగా ధరల స్థిరీకరణకు,బ్లాక్ మార్కెట్ నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

నగర సహాయ కార్యదర్సులు లంక దుర్గారావు,నక్క వీరభద్రరావులు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో ప్రజల ఆహార అవసరాలు తీర్చే బియ్యం ధర కేవలం రెండు నెలల వ్యవధిలో బస్తాకు 500 రూపాయలు పెరగడం,వంట నూనె,చక్కెర, ఉల్లిపాయలు,పప్పులు ఇలా ఏది కొనాలన్న సామాన్యుడు భయపడే పరిస్థితి నెలకొన్నదని, పెరుగుతున్న నిత్యవసరాల కొరత ఆసరాగా చేసుకొని దళారులు నిత్యవసరాలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ ప్రజల అవసరాలను వారి ఆదాయవనరులుగా మారుస్తుంటే పాలకులు బ్లాక్ మార్కెట్ దళారులకు,పెట్టుబడి దారులకు సంపద సృష్టిస్తూ సామాన్యునికి వెన్నుపోటు పొడుస్తోందని, మరో పక్క కేంద్ర ప్రభుత్వం యుద్ధాల పేరుతో పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలను రికార్డు స్థాయికి పెంచి వారి రికార్డులను వారే అధికమించే దిశగా పాలనా సాగించడంతో ధరల పెరుగుదలకు ఈ రోజు రవాణా వ్యయం పెరగటం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు అని అన్నారు. ప్రజలకు నిత్యవసరాలను అందుబాటులోకి తెచ్చేందుకు తక్షణం చర్య క్రింద చౌకధరల దుకాణాల ద్వారా 14 రకాల నిత్యవసరాలను అందిచాలని లేని పక్షంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు అనే ఆయుధం ద్వారా పాలక ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. నగర కార్యవర్గ సభ్యులు బుద్దే రాజా కార్యక్రమానికి వందన సమర్పణ చేసి నిరసన కార్యక్రమాన్ని ముగించారు

ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి వర్గ సభ్యులు తాడి పైడియ్య, కొట్టు రమణారావు, డివిజన్ కార్యదర్శులు ఉప్పలపాటి శివ ప్రసాద్ రాజు, టి. పూర్ణయ్య, డివిజన్ నాయకులు అంజూరి సూరిబాబు, ఎ.వి.రంగారావు, నడికుదిటి వెంకటేశ్వరరావు, దోమతోటి రాంబాబు, కోటా రాంబాబు, భగవాన్, నక్కా నాగేశ్వరరావు,దాసరి రంగారావు,పి.అప్పారావు , ఎఐవైఎఫ్ నగర అధ్యకులు కంచర్ల భార్గవ్, నాయకులు లంకే సాయి,పి.విశాల్,అభి, టి.అవినాష్,మహిళా సమాఖ్య నాయకులు అండిమాని నాగమణి,పడాల తవుడమ్మ, అప్పికొండ లక్ష్మీ,మురళి సాయి మణి తదితరులు పాల్గొన్నారు.



#ఆంధ్రప్రదేశ్

Address

Vijayawada

Website

Alerts

Be the first to know and let us send you an email when CPI Vijayawada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share