Dr. Kadiyam Kavya

Website Contact the organization

Dr. Kadiyam Kavya In Dr. Kavya, Warangal finds not just a candidate, but a compassionate, educated, and dedicated leader committed to fostering positive change.

Dr. Kavya leads impactful projects focused on education and women's health, menstrual hygiene and health initiatives.
Dr. Kavya's Story

Meet Dr. Kavya, an accomplished MD in Pathology, whose vibrant spirit and dedication to community well-being are reshaping Warangal's future. Her journey is a testament to the power of passion and expertise coming together for positive change.

🌿 Local Roots and Political Aspirations 🌿
Hailing from Warangal, Dr. Kavya's roots run deep in the soil of her community. Inspired by her father's political legacy, she aspires to serve as a voice for the people, blending local insight with a forward-thinking vision for progress.

👩‍⚕️ Versatile Leadership and Professional Excellence 👩‍⚕️
Beyond her role as a Lead Pathologist, Dr. Kavya's leadership extends into rural communities, addressing societal challenges with holistic initiatives. Her commitment to uplifting every aspect of the constituency reflects her dedication to making a difference.

📝 Prolific Writing and Advocacy 📝
Dr. Kavya's influence goes beyond the medical field. Her writings and advocacy highlight a deep understanding of societal needs, guiding local governance and championing women's health issues with insight and compassion.

🌐 Chairperson of Kadiyam Foundation 🌐
As Chairperson, Dr. Kavya leads impactful projects focused on education and women's health, leaving a lasting legacy in menstrual hygiene and health initiatives.

🩸 Menstrual Hygiene Activism 🩸
A tireless advocate for menstrual hygiene, Dr. Kavya breaks taboos and empowers adolescent girls through awareness programs and distribution campaigns, ensuring essential hygiene products reach those in need.

🤰 Maternal and Child Health Initiatives 🤰
Dr. Kavya's passion for healthcare extends to pregnant women, providing nutrition awareness and support for healthy deliveries, exemplifying her commitment to maternal and child well-being.

🦸‍♀️ Frontline Warrior during COVID-19 🦸‍♀️
Amid the pandemic, Dr. Kavya emerged as a frontline warrior, collaborating with local administration to provide relief activities and support to COVID-affected individuals, demonstrating her unwavering dedication to community welfare.

📚 Youth Empowerment 📚
Dr. Kavya's support extends to the youth, offering financial aid and educational support programs, ensuring every child has access to quality education and opportunities for success.

💙 Mental Health and Social Welfare 💙
Known for her compassionate initiatives, Dr. Kavya supports mental health facilities and provides aid to vulnerable individuals, spreading warmth and kindness to those in need. Her journey inspires us all to embrace the power of community and compassion, for she truly embodies the spirit of progress Warangal deserves. Wishing you all the best! May your dedication and commitment to the people of Warangal lead you to success in the career path.

హనుమకొండతేది: 03-10-2026హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో మరోసారి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం క...
03/10/2026

హనుమకొండ
తేది: 03-10-2026

హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో మరోసారి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారికి చోటు..

వైద్యురాలిగా, ఎంపీగా ప్రజారోగ్య అంశాలపై మరింత కృషి చేస్తున్న వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య..

క్యాన్సర్ స్క్రీనింగ్, ఆధునిక వైద్య సాంకేతికత, ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న: వరంగల్ఎంపీ డా.కడియం కావ్య..

వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు,డాక్టర్ కడియం కావ్యకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (2026–27)లో సభ్యురాలిగా మరోసారి అవకాశం లభించింది. 2026 సెప్టెంబర్ 26 నుంచి ఈ కమిటీలో ఎంపీ డా.కడియం కావ్య సభ్యురాలిగా నామినేట్ అయినట్లు రాజ్యసభ సెక్రటేరియట్ అధికారికంగా తెలియజేసింది..

ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ డైరెక్టర్ (హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్) భూపేంద్ర భాస్కర్ గారు అక్టోబర్ 3న ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారికి అధికారిక లేఖ పంపారు..

ఇప్పటికే ప్రజారోగ్యానికి సంబంధించిన పలు అంశాలను డాక్టర్ కడియం కావ్య పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ముఖ్యంగా పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందుపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలని 2026 మార్చి 27న లోక్‌సభలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పారాక్వాట్ వినియోగం వల్ల కలుగుతున్న ఆరోగ్య ప్రమాదాలను ప్రస్తావిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు చేశారు. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం గడ్డి మందును పూర్తిగా నిషేధించింది.

అదేవిధంగా క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు స్క్రీనింగ్ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత వైద్య విధానాలను ప్రోత్సహించడం వంటి అంశాలపై కూడా డాక్టర్ కడియం కావ్య ప్రత్యేకంగా దృష్టి సారించారు.

క్యాన్సర్‌ చికిత్స కంటే ముందుగా క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశాలు పెరుగుతాయని, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో కూడా నాణ్యమైన క్యాన్సర్ స్క్రీనింగ్ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ముఖ్యంగా మహిళలు, గ్రామీణ ప్రజలు మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సులభంగా స్క్రీనింగ్ అందేలా జాతీయ స్థాయిలో మరింత బలమైన వ్యవస్థ అవసరమని ఎంపీ కోరుతున్నారు.

క్యాన్సర్ స్క్రీనింగ్‌పై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టాలి..

హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీలో తనకు అవకాశం కల్పించినందుకు డాక్టర్ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

“వైద్యురాలిగా తనకు ఎంతో దగ్గరైన ప్రజారోగ్య రంగంలో పార్లమెంటరీ స్థాయిలో మరింత బాధ్యతగా పనిచేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేలా దేశవ్యాప్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక సాంకేతికత, AI ఆధారిత స్క్రీనింగ్ మరియు డయాగ్నస్టిక్ విధానాలను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను” అని ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు.

ప్రజారోగ్యం, వ్యాధుల నివారణ, క్యాన్సర్ స్క్రీనింగ్, ఆధునిక వైద్య సాంకేతికత, వైద్య సేవల అందుబాటు, ఆరోగ్య మౌలిక వసతుల బలోపేతం వంటి అంశాలను కమిటీ ద్వారా జాతీయ స్థాయిలో మరింత బలంగా ప్రస్తావించేందుకు కృషి చేస్తానని ఎంపీ డా.కడియం కావ్య తెలిపారు.

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరఫున పార్లమెంట్‌లో ఆరోగ్య హక్కు కోసం మరింత బలంగా తన గళం వినిపిస్తానని ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు..


జాతిపిత "మహాత్మా గాంధీ గారి జయంతి" సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం..
02/10/2026

జాతిపిత "మహాత్మా గాంధీ గారి జయంతి" సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం..


పట్టభద్రుల ఏం.ఎల్.సి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం..
02/10/2026

పట్టభద్రుల ఏం.ఎల్.సి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం..


హనుమకొండతేది:01-10-2026అధికారుల తీరుపై వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఆగ్రహం..శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారం లేకుండా ఎందుకు...
01/10/2026

హనుమకొండ
తేది:01-10-2026

అధికారుల తీరుపై వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఆగ్రహం..

శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారం లేకుండా ఎందుకు వచ్చారు?

దిశా సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి..

వచ్చే సమావేశానికి శాఖల పూర్తి సమాచారంతో రావాలి..

అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాలి..

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి:

అధికారుల పనితీరుతోనే ప్రభుత్వ పథకాల ఫలితాలు ప్రజలకు చేరుతాయి..

__డా.కడియం కావ్య
ఎంపీ,వరంగల్

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమగ్ర సమాచారంతో దిశా సమావేశానికి హాజరుకావాల్సిన అధికారులు పూర్తి వివరాలు లేకుండా రావడంపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశా కమిటీ సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, వచ్చే సమావేశానికి తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో రావాలని స్పష్టం చేశారు..

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్. నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, అదనపు కలెక్టర్ ఎన్. రవి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు..

ఈ సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్యగారు వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, విద్య, మహిళా శిశు సంక్షేమం, రహదారులు, పురావస్తు తదితర శాఖల పరిధిలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిని ఎంపీ సమీక్షించారు. పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు..

సమగ్ర సమాచారంతో ఎందుకు రాలేదు?

కొన్ని శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారం లేకుండా అధికారులు సమావేశానికి హాజరుకావడంపై ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. “మీ శాఖకు సంబంధించిన పూర్తి సమాచారం లేకుండా దిశా సమావేశానికి ఎందుకు వచ్చారు?” అని అధికారులను ప్రశ్నించారు. ఇకపై సమావేశానికి వచ్చే ప్రతి అధికారి తన శాఖకు సంబంధించిన పథకాల అమలు, పురోగతి, ఖర్చులు, పెండింగ్ పనులు, సమస్యలు, తదుపరి చర్యలపై పూర్తి సమాచారంతో రావాలని సూచించారు..

దిశా సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారి హాజరుకాకుండా ఇతర అధికారులు రావడంపై కూడా ఎంపీ ఆరా తీశారు. సంబంధిత జిల్లా స్థాయి అధికారి ఎందుకు హాజరుకాలేదో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు..

తదుపరి సమావేశానికి పూర్తి వివరాలతో రావాలి..

“వచ్చే దిశా సమావేశానికి ప్రతి శాఖ అధికారులు తమ శాఖకు సంబంధించిన పూర్తి సమాచారంతో రావాలి. కేంద్ర పథకాలు ఎంతవరకు అమలవుతున్నాయి? ఎంత నిధులు వచ్చాయి? ఎంత ఖర్చు చేశారు? ఏ పనులు పూర్తయ్యాయి? ఏవి పెండింగ్‌లో ఉన్నాయి? సమస్యలు ఏమిటి? వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అనే వివరాలు స్పష్టంగా ఉండాలి” అని ఎంపీ డా.కడియం కావ్య పేర్కొన్నారు..

కేంద్ర పథకాల అమలు పురోగతిపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని, కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా పనులు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. DISHA కమిటీ లక్ష్యాల్లోనే కేంద్ర పథకాల అమలును పర్యవేక్షించడం, క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలు సూచించడం, అమలులో సమయపాలనను నిర్ధారించడం ఉన్నాయి.

ఎంపీ ఫండ్స్ పనులు త్వరగా పూర్తి చేయాలి..

తన ఎంపీ నిధులను వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 90 శాతం కేటాయించినప్పటికీ ఆన్లైన్లో మాత్రం వాటి నమోదు సంఖ్యను తక్కువ చూపడం పట్ల ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ ఫండ్స్ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, పూర్తయిన పనులకు సంబంధించిన చెల్లింపులు కూడా వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు..

రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన..

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు కలిగే ప్రయోజనాలపై వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎంపీ సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు శాస్త్రీయ సూచనలు అందించాలన్నారు..

గర్భిణీల వివరాలు 100 శాతం నమోదు చేయాలి..

వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సందర్భంగా గర్భిణీల వివరాలు 100 శాతం ఎందుకు నమోదు కావడం లేదని డీఎంహెచ్‌వో డాక్టర్ అప్పయ్యను ఎంపీ డా.కడియం కావ్య ప్రశ్నించారు. గర్భిణీల వివరాలను తప్పనిసరిగా వంద శాతం నమోదు చేసి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మధుమేహ బాధితులకు ఇన్సులిన్ అందుబాటులో ఉందా లేదా పరిశీలించాలని సూచించారు. పేద ప్రజలకు ఇన్సులిన్ కొనుగోలు చేయడం భారంగా మారుతున్నందున ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మేరకు మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తాను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని తెలిపారు..

ఓపీ విధానంలో అందుతున్న క్యాన్సర్ వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో వంద శాతం అమలయ్యేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు..

బాల కార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలపై చర్యలు..

ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా బాలల పరిరక్షణకు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధిత శాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని ఎంపీ ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖతో పాటు ఇతర శాఖలు సమన్వయం చేసుకుని బాల్యవివాహాల నిరోధానికి చర్యలు తీసుకోవాలన్నారు..

ప్రమాద ప్రాంతాలను గుర్తించి చర్యలు..

జిల్లాలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను రహదారుల శాఖ, జాతీయ రహదారుల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ప్రమాదాలకు కారణాలను గుర్తించి అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు..

వరంగల్ మ్యూజియం అభివృద్ధిపై ప్రతిపాదనలు..

వరంగల్ మ్యూజియం అభివృద్ధికి సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని పురావస్తు శాఖ అధికారులను ఎంపీ ఆదేశించారు. మ్యూజియం అభివృద్ధికి అవసరమైన చర్యలపై అధికారులు దృష్టి సారించాలన్నారు..

అధికారుల పనితీరుతోనే ప్రభుత్వ పథకాల ఫలితాలు ప్రజలకు చేరుతాయని, అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే క్షేత్రస్థాయిలో అభివృద్ధి, మార్పు కనిపిస్తుందని ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు..

టీబీ బాధితులకు పోషకాహార కిట్ల పంపిణీ..

అనంతరం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య టీబీ బాధితులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. టీబీ బాధితులు వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, పోషకాహారం తీసుకోవాలని ఎంపీ సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు..

ఈ సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి. గిరిరాజు గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు..


హనుమకొండ(స్టేషన్ ఘనపూర్)తేదీ: 01.10.2026కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు...స్టేషన్ ఘనపూర్ మండలం అక్కపల్లి గూడెం నుండి కాంగ్ర...
01/10/2026

హనుమకొండ
(స్టేషన్ ఘనపూర్)

తేదీ: 01.10.2026

కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు...

స్టేషన్ ఘనపూర్ మండలం అక్కపల్లి గూడెం నుండి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు యార కొమురిల్లి గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారి సమక్షంలో కాంగ్రేస్ పార్టీలో చేరారు. గురువారం హన్మకొండ కనకదుర్గ కాలనిలోని నివాసంలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య గారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..

ఈ సందర్బంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడుతూ...
కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అన్ని వర్గాల ప్రజలు ఆకర్షతులు అవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకం పేద ప్రజలకు ఉపయోగపడుతుందని అనడానికి కాంగ్రెస్ పార్టీలోకి జరుగుతున్న చేరికలే నిదర్శనమని పేర్కొన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు మనందరం కలిసి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బొమ్మగాళ్ల పెత్రు, యార్ల మైపాల్, చిన్నోజు జీవన్, కూసరాజు, అనుముల అనిల్, అనుముల అశోక్, బొమ్మగాళ్ల అఖిల్, బొమ్మగాళ్ల సురేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..


హనుమకొండ జిల్లాతేది:01-10-2026హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు ప...
01/10/2026

హనుమకొండ జిల్లా
తేది:01-10-2026

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశా) చైర్‌పర్సన్ డాక్టర్ కడియం కావ్య గారి అధ్యక్షతన ప్రారంభమైన దిశా కమిటీ సమావేశం..

సమావేశానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గారు, కె.ఆర్ నాగరాజు గారు, జిల్లా కలెక్టర్‌ చాహత్ బాజ్ పాయ్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు..

ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, సాగునీరు తదితర రంగాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల అమలు, పురోగతిపై శాఖల వారీగా సమీక్షించనున్నారు..


29/09/2026

AICC ఆదేశాల మేరకు, కేంద్ర ఎన్నికల సంఘంలో SIR లో జరిగిన "ఓటు చోరీ" అక్రమాలకు వ్యతిరేకంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ కడియం కావ్య,ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి పాల్గొన్నారు..


28/09/2026



తేది:28-09-2026హనుమకొండగడ్డి మందుపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పోరాటానికి ఫలితం..పారాక్వాట్ డైక్లోరైడ్‌ రిజిస్ట్రేషన్‌ప...
28/09/2026

తేది:28-09-2026
హనుమకొండ

గడ్డి మందుపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పోరాటానికి ఫలితం..

పారాక్వాట్ డైక్లోరైడ్‌ రిజిస్ట్రేషన్‌పై కేంద్రం నిషేధం.. ఇప్పటికే ఉన్న రిజిస్ట్రేషన్లు రద్దు..

వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య లోక్‌సభలో గళమెత్తిన ఎనిమిది నెలల్లోనే కీలక పరిణామం..

జాతీయ స్థాయిలో నిషేధం కోసం ఎంపీ పట్టుదల..

కేంద్ర వ్యవసాయ శాఖకు ఎంపీ డా. కడియం కావ్య కృతజ్ఞతలు..

రైతులు, గ్రామీణ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన పారాక్వాట్ డైక్లోరైడ్‌ (గడ్డి మందు)పై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య లోక్‌సభ వేదికగా చేసిన పోరాటానికి కీలక ఫలితం లభించింది. పారాక్వాట్ డైక్లోరైడ్ వినియోగంపై ప్రమాదాలను వివరిస్తూ దేశవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య మార్చి 27న లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..

ఆ తర్వాత పరిణామాల్లో తెలంగాణ శాసనసభ కేంద్రాన్ని సంపూర్ణ నిషేధం విధించాలని కోరుతూ తీర్మానం చేయగా, రాష్ట్ర ప్రభుత్వం పారాక్వాట్ విక్రయం, నిల్వ, పంపిణీ, తయారీ, వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించింది..

తాజాగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 22న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పారాక్వాట్ డైక్లోరైడ్‌కు కొత్తగా రిజిస్ట్రేషన్ ఇవ్వడాన్ని నిషేధించింది. ఇప్పటికే కీటకనాశక చట్టం-1968లోని సెక్షన్ 9 కింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసినట్లుగా ప్రకటించింది. రిజిస్ట్రేషన్ కమిటీ ఆ సర్టిఫికెట్లను వెనక్కి తీసుకోవాలని, వాటిని తిరిగి ఇవ్వని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది..

పారాక్వాట్‌ ప్రమాదాలపై గతంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిధులు, వైద్యులు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేసిన ఫలితం లేకుండా పోయింది..

లోక్‌సభలో ప్రాణాంతక గడ్డి మందుపై వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య గళం..

ఈ పరిస్థితుల్లో వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య గడ్డి మందు నిషేధం అంశాన్ని రాష్ట్రానికి పరిమితం చేయకుండా పార్లమెంట్‌ వేదికగా జాతీయ సమస్యగా మార్చారు. పారాక్వాట్ డైక్లోరైడ్ కేవలం కలుపు నివారణ మందు కాదని.. మానవ ఆరోగ్యం, పర్యావరణానికి తీవ్ర ముప్పుగా మారిందని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య లోక్‌సభలో వివరించారు. దీని వినియోగం వల్ల నేల, నీరు కలుషితమవుతున్నాయని, వ్యవసాయ క్షేత్రాల్లో దీని ప్రభావం భూసారంపై పడే ప్రమాదం ఉందని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యలకు ఈ రసాయనం సాధనంగా మారుతోందని ఎంపీ డా.కడియం కావ్య సభ దృష్టికి తీసుకెళ్లారు. పారాక్వాట్ విషప్రయోగానికి నిర్దిష్ట విరుగుడు అందుబాటులో లేకపోవడం, తీవ్రమైన విషతుల్యత కారణంగా ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉండటాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని పలు మార్లు కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ కోరారు. వైద్య వర్గాలు, ఐఎంఏ తదితర సంస్థలు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు.

కేంద్ర స్థాయిలో పారాక్వాట్‌పై చర్యలు తీసుకోవాలని ఎంపీ కావ్య డిమాండ్ చేసిన అనంతరం తెలంగాణలోనూ ఈ అంశంపై చర్చ మరింత తీవ్రతరమైంది. తెలంగాణ శాసనసభ మార్చి 30న పారాక్వాట్ డైక్లోరైడ్‌పై కేంద్రం సంపూర్ణ నిషేధం విధించాలని కోరుతూ తీర్మానం చేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం 60 రోజులపాటు పారాక్వాట్ విక్రయం, నిల్వ, పంపిణీ, తయారీ, వినియోగంపై నిషేధం విధించింది.

కేంద్రం తుది నిర్ణయం..

ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం జూలై 10న పారాక్వాట్ డైక్లోరైడ్ తయారీ, దిగుమతి, రవాణా, పంపిణీ, విక్రయం, వినియోగాన్ని నిషేధించే ఉద్దేశంతో ముసాయిదా ఉత్తర్వును జారీ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు కోరింది. నిపుణుల కమిటీ, రిజిస్ట్రేషన్ కమిటీ సిఫార్సులను పరిశీలించిన అనంతరం సెప్టెంబర్ 22న తుది ఉత్తర్వును జారీ చేసింది.

కేంద్రం తాజా ఉత్తర్వులో పారాక్వాట్ డైక్లోరైడ్ రిజిస్ట్రేషన్‌పై నిషేధం విధించడంతోపాటు, ఇప్పటికే మంజూరైన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేసింది. మానవులు, జంతువులకు ప్రమాదం కలిగించే పరిస్థితి ఉన్నందున తక్షణ చర్య అవసరమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఎంపీ డా.కడియం కావ్య హర్షం..

పారాక్వాట్ డైక్లోరైడ్‌పై లోక్‌సభలో తాను లేవనెత్తిన అంశం కేంద్రం దృష్టిని ఆకర్షించి, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ప్రజల ప్రాణాల రక్షణ దిశగా ముందడుగు కావడంపై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు ఈ ఈ సందర్భంగా ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రమాదకరమైన రసాయనాల వినియోగం వల్ల రైతులు, వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ప్రజలు నష్టపోకుండా సురక్షితమైన, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎంపీ పేర్కొన్నారు. పారాక్వాట్‌ దుష్ప్రభావాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచడంతోపాటు, నిషేధ ఉత్తర్వుల అమలును పకడ్బందీగా పర్యవేక్షించాలని సందర్భంగా వరంగల్ ఎంపీ టట్టు కడియం కావ్య కోరారు..
(File Pic)


హనుమకొండ జిల్లాతేది: 28-09-2026సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను అరెస్టు చేయాలి..ఓటు హక్కును దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదు....
28/09/2026

హనుమకొండ జిల్లా
తేది: 28-09-2026

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను అరెస్టు చేయాలి..

ఓటు హక్కును దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదు..

ఓటు చోరీపై కాంగ్రెస్‌ పోరాటం ఇప్పటితో ఆగదు..

రాహుల్‌గాంధీ రెండున్నరేళ్లుగా ఓటు హక్కు కోసం పోరాడుతున్నారు..

బీజేపీని వరంగల్‌లో అడుగుపెట్టనివ్వం..

బీజేపీ విమర్శలకు కాంగ్రెస్‌ శ్రేణులు సమష్టిగా సమాధానం చెప్పాలి..

వరంగల్‌ అభివృద్ధిపై కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతర పోరాటం..

__డా.కడియం కావ్య గారు
ఎంపీ,వరంగల్

ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య..

ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ.. దిష్టిబొమ్మ దహనం...

AICC ఆదేశాల మేరకు, కేంద్ర ఎన్నికల సంఘంలో SIR లో జరిగిన "ఓటు చోరీ" అక్రమాలకు వ్యతిరేకంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ కడియం కావ్య,ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి పాల్గొన్నారు..
ఓటర్ల జాబితాలో అక్రమ మార్పులకు పాల్పడిన సి ఈ సి జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు..

ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ ఆడిటోరియం నుంచి కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య భారీ ర్యాలీతో హనుమకొండ కలెక్టరేట్‌ వరకు తరలివచ్చారు. కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు..

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ...
ఓటర్ల జాబితా సవరణ పేరుతో ప్రజల ఓటు హక్కును దెబ్బతీసే ప్రయత్నాలను సహించేది లేదని వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య స్పష్టం చేశారు. ‘ఓటు చోరీ’పై కాంగ్రెస్‌ పోరాటం ఇప్పటితో ఆగదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం నిరంతరం కొనసాగుతుందని అన్నారు. బీజేపీ రాజకీయంగా వరంగల్‌లో అడుగుపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్‌ కార్యకర్తలు సమష్టిగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు..

ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిల్లి పిల్లల్లా బయటకు వచ్చి కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నవారిని అడ్డుకుందాం’’ అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండున్నరేళ్లుగా పోరాటం చేస్తున్నారని ఎంపీ డా.కడియం కావ్య పేర్కొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటర్ల జాబితా, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై కాంగ్రెస్‌ ప్రశ్నలు లేవనెత్తుతోందని చెప్పారు.

గతంలో వరంగల్‌ అభివృద్ధికి బీజేపీ చేసిందేమీ లేదని ఎంపీ విమర్శించారు. మామునూరు విమానాశ్రయం, ఓఆర్‌ఆర్‌, కోచ్‌ ఫ్యాక్టరీ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో నిరంతరం పోరాడుతోందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి వరంగల్‌ అభివృద్ధి అంశాలను ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు.

ఓటు హక్కు, రాజ్యాంగం, అంబేడ్కర్‌ ఆశయాలు, పిల్లల భవిష్యత్తును కాపాడటమే కాంగ్రెస్‌ పోరాటమని ఎంపీ డా. కడియం కావ్య అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, అణగారిన వర్గాల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ కార్యకర్తలపై ఉందన్నారు.

మతం, కులం పేరుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు.

2029లో రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా చూడాలంటే ఇప్పటి నుంచే కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎంపీ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు.

‘‘ఇది మొదటి రోజే.. మన పోరాటం ఇలాగే కొనసాగుతుంది’’ అంటూ కడియం కావ్య స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్‌ వ్యవహారంపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకులు, పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, డివిజన్‌, మండల అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ, ఆర్‌జీపీఆర్‌ఎస్‌ నాయకులు, విద్యార్థి, యువజన విభాగాల ప్రతినిధులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..


Address

Warangal

Alerts

Be the first to know and let us send you an email when Dr. Kadiyam Kavya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr. Kadiyam Kavya:

Shortcuts

Share